వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్తత | tension situation in gudivaada ysrcp office | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్తత

Published Mon, Nov 16 2015 11:38 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్తత - Sakshi

వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్తత

కృష్ణా: కృష్ణాజిల్లా గుడివాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద సోమవారం మరోసారి ఉద్రిక్త వాతావరణ నెలకొంది. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.  పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.

కృష్ణాజిల్లా గుడివాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని పోలీసులు ఆదివారం బలవంతంగా ఖాళీ చేయించి, అడ్డుకున్న ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)ను అరెస్టు చేశారు. అనంతరం ఎమ్మెల్యేని నాటకీయ పరిణామాల మధ్య కైకలూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలనే సివిల్ వ్యవహారంలో దాదాపు 200 మంది పోలీసులు ఈ దాడికి పూనుకోవటం కలకలం సృష్టిం చింది. ఈ వ్యవహారం వెనుక సీఎం చంద్రబాబు హస్తం ఉందని వైఎస్సార్ సీపీ నేతలు విమర్శిస్తున్నారు.పోలీసులు ఎమ్మెల్యేను సాయంత్రం గుడివాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి సొంత పూచీకత్తు మీద విడుదల చేశారు. కానీ సోమవారం టీడీపీ నేతలు హడావిడి సృష్టించడంతో అక్కబ మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement