gudivaada
-
కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం
సాక్షి, గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్డులో విషాదం చోటు చేసుకుంది. భవనం మొదటి అంతస్తులో నిద్రిస్తున్న కుటుంబంపై ప్రమాదవశాత్తూ స్లాబ్ పెచ్చులు ఊడి పడటంతో భార్య లక్ష్మి మృతి చెందగా, భర్త నాగేశ్వరరావు, కుమారులు సాయిచంద్, సూర్యతేజ గాయపడ్డారు. నీటి పారుదల శాఖలో ఏఈగా పని చేస్తున్న నాగేశ్వరరావు కుటుంబం గత కొన్నాళ్లుగా మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. గతరాత్రి పిల్లలతో సహా గదిలో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులు ఊడి పడ్డాయి. దీంతో మహిళకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన ముగ్గురు కుటుంబ సభ్యులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సాగరతీరంలో తప్పిన పెనుప్రమాదం
సాక్షి, కోడూరు(అవనిగడ్డ): కార్తీకమాసాన్ని పురస్కరించుకుని హంసలదీవి సాగరతీరంలో పుణ్యస్నానం చేసేందుకు వచ్చిన ఇద్దరు పర్యాటకులకు శనివారం పెనుప్రమాదమే తప్పింది. సముద్ర అలల ఉధృతికి కొట్టుకుపోతున్న యువతి, చిన్నారిని పాలకాయతిప్ప మెరైన్ హోంగార్డు ప్రాణాలకు తెగించి కాపాడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన మెరుగుమాల శీరిష, వీరిశెట్టి అంజలి, చిట్టిమొతు నందిని, మెరుగుమాల గీతాశ్రీ హంసలదీవి సాగర సంగమం వద్ద కార్తీకస్నానం చేసేందుకు అదే మండలానికి చెందిన లోమ వసంతరావు ఆటోలో వచ్చారు. వీరంతా సముద్రంలో స్నానాలు చేసేందుకు దిగారు. ఉదయం 11.45గంటల సమయంలో సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసి పడడంతో వాటి ఉధృతికి యువతి నందినితో పాటు చిన్నారి గీతాశ్రీ సముద్రం లోపలికి కొట్టుకుపోయారు. ఇది గమనించిన అంజలి, శీరిష కేకలు వేయడంతో అక్కడే ఉన్న పాలకాయతిప్ప మెరైన్ స్టేషన్ హోంగార్డు ఆనంద్‌రాజు లైఫ్‌జాకెట్, రింగులు ధరించి హుటాహుటినా సముద్రంలోకి పరుగులు పెట్టాడు. తన ప్రాణాలకు తెగించి అలల మధ్య కొట్టుకుపోతున్న నందిని, గీతాశ్రీని ఒడ్డుకు చేర్చాడు. అయితే అప్పటికే సముద్ర నీరు తాగేయడంతో ఇద్దరు స్పృహ కోల్పోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే వారిని ఇసుకతిన్నెలపై పడుకోబెట్టి కడుపు నొక్కడంతో తాగిన నీరు మొత్తం కక్కేశారు. పది నిమిషాల తరువాత నందిని, గీతాశ్రీ లేచి కూర్చోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రథమ చికిత్స నిమిత్తం యువతి, చిన్నారిని కోడూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. హోంగార్డు ఆనంద్‌రాజు -
దొరికిన గుడివాడ హత్య నిందితులు!
గుడివాడ : గుడివాడ రాజేంద్రనగర్‌లో దంపతుల హత్య కేసులో నిందితులు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. నలుగురు నిందితులతో పాటు వాళ్లు దొంగిలించిన కారును తమిళనాడు రాష్ట్రంలోని వేలేరు సమీపంలో పట్టుకున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. శుక్రవారం రాత్రి జరిగిన బొప్పన సాయిచౌదరి దంపతుల హత్య కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. కేసును ఛేదించేందుకు అన్ని రకాల మార్గాలలో విచారణ ప్రారంభించారు. హత్య జరిగిన చోట వేలిముద్రలు దొరికిపోవటంతో పాటు ప్రధాన రహదారిలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజి ఆధారంగా వాళ్లు వెళ్లిన మార్గాన్ని గుర్తించి పట్టుకున్నట్లు తెలుస్తోంది. బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై సమీక్షించేందుకు డీజీపీ మాలకొండయ్య, జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి గుడివాడ పోలీసులతో రాజేంద్రనగర్‌లోని అగ్రోస్ భవనంలో శనివారం రాత్రి సమావేశం అయ్యారని తెలిసింది. నిందితులను పట్టుకునేందుకు ఏఏ బృందాలు ఎలా వెళ్లాలి అనే అంశాలపై సమీక్షించినట్లు సమాచారం. గుడివాడ డీఎస్పీ ఆధ్వర్యంలో తమిళనాడు వెళ్లిన పోలీసు బృందానికి నిందితులు చిక్కినట్లు తెలుస్తోంది. పాత నేరస్తులేనా?.. దంపతుల హత్య ఘటనలో పాల్గొన్న వారిలో గుడివాడకు చెందిన మాజీ రౌడీషీటర్ గిన్నెల సురేష్ ఉన్నట్లు సమాచారం. ఇతను కొంతకాలంగా గుంటూరులో ఉంటున్నాడని తెలిసింది. తమిళనాడులో పోలీసులకు చిక్కిన వారిలో గుడివాడకు చెందిన వారితోపాటు అతను కూడా ఉన్నట్లు వినికిడి. వేలిముద్రలు, సీసీ కెమెరా ఫుటేజీలే పట్టించాయా?.. హత్య జరిగిన చోట నిందితుల వేలిముద్రలు క్లూస్ టీం నిపుణులు కనుగొన్నారు. దీనికి తోడు గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజిలు నిందితులను పట్టుకోవటంలో సహకరించినట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున మరో నాలుగు రోజుల్లో కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల నుంచి వినికిడి. అయితే హత్య ఎందుకు చేశారనే అంశాలు ఇంకా వెలుగు చూడలేదు. ఆర్థికపరమైన లావాదేవీలే కారణమని తెలుస్తోంది. -
వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్తత
కృష్ణా: కృష్ణాజిల్లా గుడివాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద సోమవారం మరోసారి ఉద్రిక్త వాతావరణ నెలకొంది. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కృష్ణాజిల్లా గుడివాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని పోలీసులు ఆదివారం బలవంతంగా ఖాళీ చేయించి, అడ్డుకున్న ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)ను అరెస్టు చేశారు. అనంతరం ఎమ్మెల్యేని నాటకీయ పరిణామాల మధ్య కైకలూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలనే సివిల్ వ్యవహారంలో దాదాపు 200 మంది పోలీసులు ఈ దాడికి పూనుకోవటం కలకలం సృష్టిం చింది. ఈ వ్యవహారం వెనుక సీఎం చంద్రబాబు హస్తం ఉందని వైఎస్సార్ సీపీ నేతలు విమర్శిస్తున్నారు.పోలీసులు ఎమ్మెల్యేను సాయంత్రం గుడివాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి సొంత పూచీకత్తు మీద విడుదల చేశారు. కానీ సోమవారం టీడీపీ నేతలు హడావిడి సృష్టించడంతో అక్కబ మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.