
సాక్షి, గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్డులో విషాదం చోటు చేసుకుంది. భవనం మొదటి అంతస్తులో నిద్రిస్తున్న కుటుంబంపై ప్రమాదవశాత్తూ స్లాబ్ పెచ్చులు ఊడి పడటంతో భార్య లక్ష్మి మృతి చెందగా, భర్త నాగేశ్వరరావు, కుమారులు సాయిచంద్, సూర్యతేజ గాయపడ్డారు. నీటి పారుదల శాఖలో ఏఈగా పని చేస్తున్న నాగేశ్వరరావు కుటుంబం గత కొన్నాళ్లుగా మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. గతరాత్రి పిల్లలతో సహా గదిలో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులు ఊడి పడ్డాయి. దీంతో మహిళకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన ముగ్గురు కుటుంబ సభ్యులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment