సాక్షి,వైఎస్‌ఆర్‌జిల్లా:జిల్లాలోని వేంపల్లిలో టీడీపీ రౌడీల అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త లోకేష్‌పై టీడీపీ అల్లరిమూకలు దాడి చేశాయి. మాట్లాడాలని పిలిపించి లోకేష్‌ను పిడిగుద్దులు గుద్దారు.టీడీపీ రౌడీలు అల్తాఫ్ ,నాసిర్,ఇమ్రాన్,ఫయాజ్‌లు కలిసి తనను కొట్టారని బాధితుడు లోకేష్ తెలిపారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ సోషల్‌మీడియా కార్యకర్తలపై దాడులు,వేధింపులు ఎక్కువయ్యాయి. టీడీపీ అల్లరిమూకలు సోషల్‌మీడియా కార్యకర్తలపై నేరుగా దాడులు చేయడంతో పాటు వారిపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారు. ఒక్కొక్కరిని నెలల తరబడి జైలులో ఉంచేందుకు ఒక కేసు తర్వాత మరో కేసు పెట్టి బెయిల్ రాకుండా చేస్తున్నారు.
కొందరు సోషల్‌మీడియా కార్యకర్తల అదృశ్యం కేసుల్లో అయితే ఏకంగా వారి కుటుంబ సభ్యులు ఏకంగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు కూడా వేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. సోషల్‌మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: లోకేష్ అవన్నీ నీ కళ్లకు కనిపించడం లేదా..?
Comments
Please login to add a commentAdd a comment