ఇక కోరుకున్న మొక్కలు మన చెంతకు
సాక్షి,సిటీబ్యూరో: వచ్చే సంవత్సరం వర్షాకాల సీజన్‌లో హరిత హారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ప్రజలు తమకు ఏ మొక్కలు కావాలో తెలియజేస్తే వాటినే అందజేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 85 లక్షల మొక్కలకు పైగా నాటినట్లు పేర్కొన్నారు. చాలామంది తాము కోరుకునే మొక్కలు లభించడం లేవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో తమకెలాంటి మొక్కలు కావాలో green hyderabad.cgg.gov.in వెబ్‌సైట్‌లో పేర్కొంటే వాటినే అందజేయగలమని పేర్కొన్నారు. ఫలాల మొక్కలు, సామాజిక వనాలు, ఇళ్లలో పెంచుకునే మొక్కలు ఏవైనా ఆ వివరాలను పేర్కొంటూ తమ చిరునామా, ఫోన్‌నెంబర్, ఈమెయిల్ లను వెబ్‌సైట్‌లో పొందుపరచాలని కోరారు.