మీడియాతో మాట్లాడుతున్న జనార్ధన్ రెడ్డి
సాక్షి, రంగారెడ్డి: భారతీయ జనతా పార్టీ తనపై నమ్మకంతోనే చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా తనను ప్రకటించిందని బీజేపీ నేత జనార్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాకు అనేక అవకాశాలు కల్పించిందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అభివృద్థి కోసం పాటు పడుతున్నారు. అదే రీతిలో నేను కూడా చేవెళ్ల అభివృద్థి కోసం పని చేస్తాని అన్నారు. చేవెళ్ల ప్రజలు తమ గెలుపు కోసం కృషి చేస్తామని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తున్నారు. కానీ ఇవన్నీ పోవాలంటే బీజేపీ గెలవాలని ప్రజలకు కోరారు. నాకు చేవెళ్ల అన్న, చేవెళ్ల ప్రజలన్నా చాలా ఇష్టమని చెప్పారు. దేశంలో విద్యార్థులకు, పేదల కోసం మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని చెప్పారు. నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్లలో బీజేపీ గెలవడం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment