Chevella constituency
-
బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి
సాక్షి, హైదరాబాద్: చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ కొండా విశ్వేశ్వరరెడ్డి చేయి పట్టుకుని కార్యకర్తలకు అభివాదం చేయించారు. కాగా, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడైన కొండా విశ్వేశ్వరరెడ్డి.. టీఆర్ఎస్ తరపున 16వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటు సభ్యునిగా పనిచేస్తున్నప్పుడు యూఎస్ పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ ఈయనే కావడం విశేషం. అంతేకాదు 2014, 2018 తెలంగాణ ఎన్నికల టైంలో.. అఫిడవిట్ ఆధారంగా రిచ్చెస్ట్ పొలిటీషియన్‌గా నిలిచారు కూడా. 2013లో కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి.. 2018లో టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. కిందటి ఏడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. చదవండి: (హిందువులకు మాత్రమే కాదు.. అన్ని మతాలకు చేరువకావాలి: ప్రధాని మోదీ) -
చేవెళ్ల లోక్‌సభ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉత్కంఠ రేపుతున్న చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. కౌంటింగ్‌కు ఒక్క రోజే గడువు ఉండటంతో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు భద్రత పరంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో చేవెళ్ల, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,785 పోలింగ్ కేంద్రాల్లో గతనెల 11న జరిగిన పోలింగ్‌లో 12.99 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను శంషాబాద్ మండలం పాల్మాకులలోని బీసీ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థ భవనానికి తరలించారు. దాదాపు 43 రోజుల పాటు ఈవీఎంలను అక్కడే భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు అక్కడే జరగనుంది. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. పోస్టల్ బ్యాలెట్ విధానంలో సుమారు 1,700 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లెక్కింపు ఇలా.. ప్రతి నియోజకవర్గానికి 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్‌తోపాటు మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ బ్యాలెట్‌కు కేటాయించిన ఒక టేబుల్ని కలుపుకుంటే మొత్తం 15 టేబుళ్లు నియోజకవర్గానికి ఉంటాయి. మొత్తం 1,700 మంది కౌంటింగ్ సిబ్బంది విధుల్లో ఉంటారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో రిటర్నింగ్ అధికారితోపాటు ఇద్దరు పరిశీలకులు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. అత్యధికంగా శేరిలింగంపల్లి సెగ్మెంట్లో 43 రౌండ్లు, అత్యల్పంగా తాండూరు నియోజకవర్గంలో 19 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. లోక్‌సభ బరిలో 23 మంది అభ్యర్థులు నిలవగా.. ప్రతి అభ్యర్థి ఒక్కో టేబుల్‌కు ఒకరి చొప్పున ఏజెంటుని నియమించుకునే వెసులుబాటు కల్పించారు. మొత్తం 368 మంది ఏజెంట్లు ఉంటారు. ఈవీఎంలు మొరాయిస్తే ఎలా? ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఈవీఎంలు మొరాయించినా, సాంకేతిక సమస్యలు తలెత్తినా ప్రత్యామ్నాయ మార్గాలను పాటించనున్నారు. సదరు ఈవీఎంకు చెందిన వీవీ ప్యాట్లోని ఓటరు స్లిప్పులను లెక్కిస్తారు. ఈ స్లిప్పులనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ ప్రక్రియకు అధిక సమయం పట్టినా ఇదే పద్ధతిని అనుసరించక తప్పదని అధి కారులు పేర్కొంటున్నారు. అయితే విధానాన్ని అనుసరించడానికి ముందుకు కేంద్ర ఎన్నికల సం ఘం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఐదు వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు కోర్టు ఆదేశాల మేరకు ఈవీఎంల పనితీరులో పారదర్శకతను చాటేలా కొన్ని వీవీ ప్యాట్లలోని ఓటరు స్లిప్పులను రాండమ్‌గా లెక్కిస్తారు. ప్రతి నియోజకవర్గానికి ఐదు చొప్పున ఈవీఎంను లాటరీ ద్వారా తీస్తారు. ఈ వీవీ ప్యాట్లలోని ఓట రు స్లిప్పులను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈ స్లిప్పుల ఆధారంగా అభ్యర్థుల వారీగా దక్కిన ఓట్లను.. ఈవీఎంలో అభ్యర్థుల ఓట్లను సరిపోల్చుతారు. మూడంచెల భద్రత ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. పోలింగ్ కేంద్ర వద్ద మూడంచెల విధానంలో పోలీసులను మోహరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర బలగాలను ఇందుకు వినియోగించుకుంటున్నారు. సుమారు వెయ్యి మంది పోలీసులు పహారా కాస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్, జిల్లావ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుంది. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదు. పోలింగ్ కేంద్రంలోకి పాస్‌లు ఉన్న వ్యక్తులను అనుమతిస్తారు. సెల్ఫోన్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు తీసుకెళ్లడం నిషేధం. సిబ్బంది నియామకంలో జాగ్రత్తలు ఓట్ల లెక్కింపునకు విధుల్లో పాల్గొనే సిబ్బంది నియామకంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని సిబ్బంది అదే నియోజకవర్గంలో విధులు నిర్వహించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వారికి ఏ సెగ్మెంట్ పరిధిలో ఏ టేబుల్‌పై విధులు కేటాయిస్తారో అనేది అప్పుడే వెల్లడించకుండా పారదర్శకతను పాటిస్తున్నారు. లెక్కింపు రోజున సిబ్బందికి విధులు ఎక్కడో చెప్పనున్నారు. ఒకవేళ విధులు కేటాయించిన ఉద్యోగులకు రాకపోతే మరికొంతమందిని రిజర్వులో ఉంచుతూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితాన్ని ఇలా తెలుసుకోవచ్చు.. రౌండ్స్ వారీగా ఫలితాలు అందరికీ తెలిసేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎప్పటికప్పుడు అభ్యర్థులకు దక్కిన ఓట్ల వివరాలను సువిధ, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌లలో అప్లోడ్ చేయనుంది. ఒక్కో రౌండ్ పూర్తికాగానే.. వెంటనే యాప్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. బరిలో ఉన్న అభ్యర్థులు: 23 మొత్తం ఈవీఎంలు: 2,785 లెక్కించాల్సిన ఓట్లు: 12,99,956 లెక్కింపు సిబ్బంది: 1,700 బందోబస్తులో పోలీసులు: 1,000 అభ్యర్థుల ఏజెంట్లు: 368 -
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్ : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తైనట్లు పేర్కొన్నారు. చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. మొత్తంగా పోటీలో 23 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంలో 24 లక్షల 15 వేల 598 మంది ఓటర్లు ఉండగా.. మహిళలు 11 లక్షల 64 వేల 93 , పురుషులు 12 లక్షల 51 వేల 210 ఉన్నారు. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 6 లక్షల 17 వేల 169 మంది ఓటర్లున్నారు. మొత్తం 2,078 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 176 ప్రాంతాల్లో 490 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవని పేర్కొన్నారు. మొత్తం 13 వేలమంది పోలింగ్ సిబ్బంది కాగా.. 3 వేల మంది పోలీసులు, 1000 వాహనాలు.. మొత్తంగా 14 వేల మందికిపైగా సిబ్బందితో ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 5.75 కోట్ల నగదు, 5 వేల లీటర్ల మద్యం స్వాధీనపరుచుకున్నట్లు పేర్కొన్నారు. -
అధినేతల అడుగులు
సాక్షి, వికారాబాద్ : చేవెళ్ల లోక్‌సభ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఈక్రమంలో ఈనెల 7న యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ జిల్లాకు రానున్నారు. పూడూరు మండలం మిర్జాపూర్‌లో భారీ బహి రంగ సభ ఏర్పాటు చేసేందుకు హస్తం శ్రేణులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు చేవెళ్ల గడ్డపై మరోమారు గులాబీ జెండాను రెపరెపలాడించాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి గెలుపుకోసం ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించారు. తాజాగా గులాబీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. 8వ తేదీన వికారాబాద్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆయన హాజరై ప్రసంగించనున్నారు. రెండుపార్టీల అధినేతలు జిల్లాకు రానుండటంతో ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోనియా,కేసీఆర్ రాకతో రాజకీయం మరింత వేడెక్కనుంది. మిర్జాపూర్‌లో ఏర్పాట్లు ఈనెల 7న పూడూరు మండలంలోని మిర్జాపూర్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు హస్తం పార్టీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అసెంబ్లీలో ప్రతిపక్షనేత బట్టి విక్రమార్కతోపాటు రాష్ట్రంలోని ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. ఇప్పటికే సభావేదిక వద్ద పనులు పూర్తయ్యాయి. చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి గడ్డం ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిరుపేదలకు రూ.72 వేలు, సంక్షేమ పథకాలపై ఆమె ప్రసంగించనున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్, కేసీఆర్‌పైనా విమర్శల బాణాలు ఎక్కుపెట్టే అవకాశాలు లేకపోలేదు. 2 లక్షల మందితో సీఎం సభ సీఎం కేసీఆర్ సభ జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా గులాబీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈనెల 8న కేసీఆర్ వికారాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఏర్పాట్లపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలతో సమీక్షించారు. సుమారు 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేలా ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రచించారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని గులాబీ దళపతి గట్టి పట్టుదలతో ఉన్నారు. అదేవిధంగా వికారాబాద్, పరిగి, తాండూరుతోపాటు ఉమ్మడి రంగారెడ్డిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీ జన సమీకరణ చేసే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో భారీ బహిరంగ సభల్లో తన ప్రసంగంతో కేసీఆర్ జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈ సభలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనేపథ్యంలో ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజకీయ భవితవ్యంపై కేసీఆర్ ఎలాంటి భరోసా ఇస్తారోనని ఆందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్టీల ప్రధాన ఎజెండా చేవెళ్ల పార్లమెంట్ పట్టణ, పల్లె ఓటర్ల కలబోత. రెండు ప్రాంతాల్లోని ఓటర్లను ఆకట్టుకనేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి రానుందని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, మిషన్ భగీరథ తదితర పథకాలు తమ అభ్యర్థిని గెలిపిస్తాయనే భరోసాలో టీఆర్ఎస్ ఉంది. జిల్లాలోని ప్రధాన సమస్యలను ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకొని ముందుకు సాగుతున్నారు. సాగు, తాగునీరు, నిరుద్యోగ సమస్యలతోపాటు అభివృద్ధి విషయమై హామీలు ఇవ్వనున్నారు. జోన్ అంశం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అధినేతల ప్రసంగంలో ప్రధానంగా ఉండబోతుంది. ఇక్కడి ప్రధాన సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి ఓట్లను దండిగా రాబట్టుకోవాలని నేతలు భావిస్తున్నారు. -
అందరి బంధువు
ప్రజాభిమానం చూరగొని వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితికే ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ మద్దతు పలుకుతున్నారు జనం. కేసీఆర్ పేదోళ్ల గురించి ఆలోచన చేసే నాయకుడని, ఐదేళ్ల కాలంలో ఆయన అందరి అభివృద్ధికి, అన్ని వర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి కృషి చేశారని కితాబునిచ్చారు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పింఛన్ లబ్ధిదారులు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. నిరంతర కరెంట్ సరఫరాపై ప్రజలు.. ముఖ్యంగా రైతులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కరెంటు సరఫరా మంచిగా ఉండడంతో వ్యాపారాలు, పరిశ్రమలు బాగున్నాయని చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులు చెప్పారు. రైతుల్లో కరెంట్ సరఫరా, రైతుబంధు పథకాలు బలంగా నాటుకుపోయాయి. రైతులతో పాటు మహిళలు కూడా టీఆర్ఎస్పై అభిమానాన్ని చాటుకున్నారు. పింఛన్లు పెంచారని, తాము టీఆర్ఎస్కే ఓటు వేస్తామని పలువురు వృద్ధులు చెప్పారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ‘సాక్షి’ రోడ్‌షో నిర్వహించింది. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారుల వెంట నిర్వహించిన ఈ రోడ్ షోలో వివిధ వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ‘కేసీఆర్ పథకాలు బాగున్నాయి.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కే ఓటు వేస్తామ’ని కొందరు చెప్పగా.. మరికొందరు ‘మోదీ దేశానికి సేవ చేశారని, మళ్లీ ఆయనే అధికారంలోకి రావాల’ని ఆకాంక్షించారు. కొందరు కేంద్రంలో మూడో ఫ్రంట్ రావాలని కూడా ఆకాంక్షించారు. రోడ్డు షోలో ఎవరెలా స్పందించారంటే..- సాక్షి, నెట్వర్క్ రోడ్డు షోలో ఎదురుపడిన పలువురిని పలకరించినప్పుడు టీఆర్ఎస్ సర్కారు పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా రైతుబంధు, బీమా, ఆసరా పింఛన్ల పథకాలపై జనం నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు వచ్చాక తమ కష్టాలు తీరిపోయాయని చిన్న పరిశ్రమల నిర్వహకులు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ‘గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. ఒక్కోసారి రోజంతా కూడా చీకట్లోనే మగ్గిపోయే వాళ్లం. ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ ఉంటోంది. సాగు సమస్య లేదు.. పరిశ్రమలు ఎలా నడపాలన్న చింతే లేదు’ అని పెద్దసంఖ్యలో స్పందించారు. ‘కేసీఆర్ ఒక సమాజంలో ఎవరెవరికి ఏం కావాలో అన్నీ సమకూర్చి పెట్టారు. ప్రతి ఇంటికి ఆయన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి చేకూరుతోంది. అటువంటప్పుడు ఇంకెవరికి ఓటు వేస్తారన్న ప్రశ్నే లేదు’ అని ధారూర్‌కు చెందిన విద్యార్థి అజయ్ చెప్పారు. మొత్తం 165 కిలోమీటర్ల మేర సాగిన రోడ్డు షోలో అత్యధికులు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సంతృప్తినే వ్యక్తం చేశారు. మరోసారి మోదీ.. నరేంద్రమోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని, ఆయన వస్తేనే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని కొందరు పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం పనితీరు బాగుందని, దేశ రక్షణ విషయంలో బీజేపీ ఎంతో శ్రద్ధ తీసుకుంటోందని చెప్పారు. ‘ఐదేళ్లలో బీజేపీ మంచిపనులు చేసింది. పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్‌మనీకి అడ్డుకట్ట వేసింద’ని కూడా అన్నారు. బీజేపీ హయాంలో ప్రపంచ దేశాల్లో భారత్ ఖ్యాతి పెరుగుతోందన్నారు. కొందరు మాత్రం ‘ఇక్కడ ఓటు టీఆర్ఎస్కు వేస్తాం.. కానీ కేంద్రంలో బీజేపీ రావాలని కోరుకుంటున్నాం’ అని చెప్పడం విశేషం. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరని, ఎప్పుడూ ఏదో ఒక లీడర్ ఏదో ఒక కుంభకోణంలో ఇరుక్కుంటూనే ఉంటారని కొందరు స్పందించారు. రియల్ వెంచర్లుగామారుతున్న పొలాలు ధరలు పెరిగాయి ఇందిరమ్మ రాజ్యం మళ్లీ రావాలని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం జరిగిందని కొందరు అభిప్రాయపడ్డారు. బీజేపీ హయాంలో నిత్యావసర సరుకులు, డీజిల్, పెట్రోల్ రేట్లు పెరిగాయనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. దేశ రక్షణ విషయాలను బీజేపీ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటోం దని కొందరు విమర్శించారు. రాహుల్‌గాంధీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో.. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు కనీస ఆదాయ పథకం (న్యాయ్) అమలైతే చాలా పేద కుటుంబాలు బాగు పడతాయనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. గతంలో ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, ఇప్పుడు కనీస ఆదాయ పథకం ద్వారా కేంద్రంలో ఆ పార్టీ అధికారం హస్తగతం చేసుకుంటుందని ఒకరిద్దరు విశ్వాసం వ్యక్తం చేశారు. పరిశ్రమలు రావాలి.. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో హైదరాబాద్–బీజాపూర్ రహదారి వెంట ముడిమ్యాల నుంచి చేవెళ్ల వరకు పది కిలోమీటర్ల పరిధిలో దాదాపు ఏడు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది. దాదాపు 1,500 ఎకరాల ఈ అటవీ ప్రాంతం కేంద్రం పరిధిలో ఉంది. దీనిని ఏదైనా పరిశ్రమలకు ఉపయోగిస్తే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని స్థానికులు కోరుతున్నారు. సుస్థిర పాలనకే మద్దతు బీజేపీ పెద్ద నోట్లను రద్దుచేసి నెట్ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రోత్సహించింది. నెట్‌బ్యాంకింగ్ లావాదేవీలతో దొంగల భయం ఉండదు. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుంది. మోదీనే మళ్లీ సుస్థిర పాలన అందిస్తారు.– కె.రాములు,కేరెళ్లి, ధారూరు మండలం మోదీ వస్తేనే.. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాన మంత్రిగా వస్తేనే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది. ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆగిపోతుంది. మోదీ పాలనలో అభివృద్ధి స్పష్టంగా కన్పిస్తోంది. – రవీందర్‌గుప్తా, వ్యాపారి,దెబ్బడగూడ, కందుకూరు మండలం రోడ్‌షో సాగిందిలా.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వెళ్లే హైదరాబాద్–బీజాపూర్, హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారులపై ‘సాక్షి’ బృందం ప్రయాణించింది. అలాగే, హైదరాబాద్–శ్రీశైలం రాష్ట్ర రహదారిపై కూడా ప్రయాణించి.. దారిలో ఎదురుపడిన వారి నుంచి వివిధ అంశాలపై స్పందన కోరింది. మరో రెండు రాష్ట్ర రహదారులను కూడా కలిపి మొత్తం 165 కిలోమీటర్లు పర్యటించి వివిధ వర్గాల ప్రజలను పలకరించి వారి అభిప్రాయాలను సేకరించింది. -
మళ్ళీ మోదీనే ప్రధాని అవుతారు: జనార్ధన్ రెడ్డి
సాక్షి, రంగారెడ్డి: భారతీయ జనతా పార్టీ తనపై నమ్మకంతోనే చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా తనను ప్రకటించిందని బీజేపీ నేత జనార్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాకు అనేక అవకాశాలు కల్పించిందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అభివృద్థి కోసం పాటు పడుతున్నారు. అదే రీతిలో నేను కూడా చేవెళ్ల అభివృద్థి కోసం పని చేస్తాని అన్నారు. చేవెళ్ల ప్రజలు తమ గెలుపు కోసం కృషి చేస్తామని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తున్నారు. కానీ ఇవన్నీ పోవాలంటే బీజేపీ గెలవాలని ప్రజలకు కోరారు. నాకు చేవెళ్ల అన్న, చేవెళ్ల ప్రజలన్నా చాలా ఇష్టమని చెప్పారు. దేశంలో విద్యార్థులకు, పేదల కోసం మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని చెప్పారు. నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్లలో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. -
చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థికి ఓవైసీ మద్దతు
సాక్షి, హైదరాబాద్ : మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీని శనివారం టీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి జీ రంజిత్ రెడ్డి, టీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్ఐఎమ్ పార్టీ తెలంగాణలోని 16 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తుందని ట్విట్టర్లో అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. చేవెళ్లలో రంజిత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ కూటమిగా ఏర్పడకపోయినా స్నేహపూర్వకంగా ఉంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మజ్లిస్ టీఆర్ఎస్కు మద్దతు పలికిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ కూడా పాత బస్తీలో అలాగే వ్యవహరించింది. MIM party will support TRS candidates in 16 Parliament constituencies of Telangana,I assured G Ranjit reddy TRS Candidate Of CHEVELLA constituency pic.twitter.com/cHugzswnrR — Asaduddin Owaisi (@asadowaisi) March 23, 2019 -
‘కొండా’ మాస్టర్ స్కెచ్!
రెండోసారి పక్కాగా విజయం సాధించేందుకు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాస్టర్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇందుకు తన ఎన్జీఓలను వినియోగించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో ప్రభావం చూపించే కొందరిని ఎంపిక చేసుకొని తమ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. అదేవిధంగా తటస్థ సర్పంచ్‌లకు ఎంపీ కోటా నిధుల పేరుతో గాలం వేస్తూ అక్కున చేర్చుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందడి ప్రారంభం కాకముందే.. ఇంకా ఇతర పార్టీలు హడావుడి ఆరంభం చేయకముందే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దూసుకుపోతున్నారు. పరిగి: చేవెళ్ల పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఇప్పటికే జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ అధికార పార్టీని తూర్పార పడుతున్నారు. జోన్ విషయంలో నిరుద్యోగులకు, యువతకు తీవ్ర అన్యాయం చేశారని మాజీ మంత్రి మహేందర్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో విశ్వేశ్వర్‌రెడ్డి కొంతకాలం క్రితం ‘కారు’ దిగి ‘చేతి’ని అందుకున్న విషయం తెలిసిందే. రెండోసారి ఎంపీగా విజయం సాధించాలని పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా తన మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. ప్రధాన పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించకపోవడం, ఎన్నికల నోటిఫికేషన్ సైతం రాకముందే ఆయన పాచికలు కదుపుతున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రణాళికలు అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా టికెట్ల కేటాయింపులో నాన్చుడు ధోరణిని పాటించే కాంగ్రెస్ అధిష్టానం చేవెళ్ల సీటుపై కొండాకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన మినహా ఆ పార్టీ తరఫున కొండాకు పోటీగా టికెట్ ఆశించే వారు కూడా లేకపోవడం ఎంపీకి సానుకూలంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన ప్రచారాన్ని చాపకింది నీరులా ముందుకు తీసుకెళ్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. సర్పంచ్‌లకు గాలం.. ప్రస్తుతం ఎంపీ హోదాలో కొనసాగుతున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తమ పార్టీ సర్పంచులకు చేరువవుతూనే తటస్తంగా ఉన్న సర్పంచుల జాబితాను తెప్పించుకున్నారు. తమ ఎన్జీఓ సభ్యుల సాయంతో సదరు సర్పంచులు తనను కలిసేలా చూస్తున్నారు. వారికి ఎంపీ కోటా నిధులు మంజూరు చేస్తూ వేసి వారిని పార్టీలకు అతీతంగా తనకు అనుచరులుగా మలుచుకుంటున్నారు. తద్వారా రోబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పక్కాగా ప్లాన్ అమలు చేస్తున్నారు. అయితే, చాలామంది సర్పంచ్‌లు పార్టీలకు అతీతంగా ఆయనను కలుస్తుండగా.. మీడియాలో ఫోకస్ కాకుండా, ఇతర పార్టీలకు ఎత్తుగడలకు దొరకకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. క్షేత్రస్థాయిలో క్రియాశీలక వ్యక్తులు ఎవరికీ తెలియకుండా తమ పనులు చక్కదిద్దడం లో దిట్టలైన వ్యక్తులను తయారు చేయడంలో ప్రస్తుతం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీం నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇలా తమ ఎన్జీఓ సభ్యులు గ్రామాల్లో క్రియాశీలకంగా పని చేస్తూనే మరింత మందిని తయారు చేసేందుకు సర్వేలు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో పదిమంది ప్రభావిత వ్యక్తులను గుర్తించి వారిని ఎంపీకి దగ్గర చేస్తున్నారు. వారిని తమకు అనుకూలంగా మార్చుకు ని ఎన్నికల్లో గెలుపుకు బాటలు వేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అధికార పార్టీ బిత్తర చూపులు అధికార పార్టీ టీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుండగా.. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో పాటు మరికొందరి నేతల పేర్లు సైతం తెరమీదికి వస్తున్నాయి. ఈ తరుణంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు తమ పార్టీ ఎంపీ అభ్యర్థి ఫలానా వ్యక్తి అని ప్రచారం చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ వైపు కొండా తన మాస్టర్ ప్లాన్‌తో పక్కాగా ముందుకు దూసుకుపోతుండగా అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు బిత్తరచూపులు చూడాల్సి వస్తోంది. ఒక్కొక్కరుగా తమ కేడర్ సైతం అవతలి గడప తొక్కితే పరిస్థితి ఏంటని ఆలోచనతో ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ బలోపేతం పైనా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. రంగంలోకి ఎన్జీఓలు.. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తాను రాజకీయాల్లోకి వచ్చే ముందు సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కేవీఆర్ ట్రస్టు, ప్రొగ్రెసివ్ తెలంగాణ వంటి స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చే సుకున్నారు. ప్రస్తుతం వాటిని పూర్తిస్థాయిలో ఎన్నికల కోసం వినియోగించుకుంటున్నారు. ఎన్టీఓల్లో ఆర్గనైజర్లు, కో ఆర్డినేటర్లుగా పనిచేస్తున్న వారు ప్రస్తుతం విశ్వేశ్వర్‌రెడ్డికి క్షేత్రస్థాయిలో సహకరిస్తున్నారు. ఈమేరకు ప్రతి గ్రామంలో సర్వేలు నిర్వహిస్తూ పార్టీ పరిస్థితిపై, బలాబలాలపై అంచనా వేస్తున్నారు. -
చేవెళ్ల పార్లమెంట్ సీటుపై హేమాహేమీల గురి
చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనేది దాదాపుగా ఖరారైంది. టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఇక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై అన్ని పార్టీలు గురిపెట్టాయి. ఈ స్థానం నుంచి పోటీచేసేందుకు అర్థబలం, అంగబలం ఉన్న అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తిచేశాయి. ప్రధానంగా అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో హేమాహేమీలు ఈసారి బరిలోకి దిగనుండడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంత సమ్మిళితమైన ఈ గడ్డపై పాగా వేసేందుకు ఆయా పార్టీలు రంగం సిద్ధంచేసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను దాదాపుగా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక అధికార ప్రకటనే తరువాయి. ‘పట్నా’నికి లైన్ క్లియర్ అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున పట్నం మహేందర్‌రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈ స్థానానికి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ సైతం పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఆయనకు మల్కాజిగిరి టికెట్ ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని స్వామిగౌడ్‌కు ఇప్పటికే సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల మీద ఆశలు పెట్టుకున్నప్పటికీ.. పార్టీ ఆదేశాల మేరకు ఎక్కడి నుంచైనా పోటీచేస్తానని స్వామిగౌడ్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలకుతోడు టికెట్‌పై మహేందర్‌రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పట్నంకు టికెట్ దాదాపు ఖరారైందనడానికి బలం చేకూరుతోంది. కాంగ్రెస్ నుంచి ‘కొండా’నే.. ఇక కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు ఫైనల్ అయింది. మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈయన అప్పటి మంత్రి మహేందర్‌రెడ్డితో విభేదాలు తలెత్తడం, ఆధిపత్యం పోరు తదితర కారణాల వల్ల కాంగ్రెస్‌లో చేరారని ప్రచారం జరిగింది. అయితే కారణం ఏదైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేవెళ్ల టికెట్ ఆయనకు ఖరారు చేసిన తర్వాతే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని వినికిడి. ఈ నేపథ్యంలో ఆయనకు కాకుండా మరొకరిని బరిలోకి దించే అవకాశం లేదు. పైగా జిల్లాలో విస్తృత క్యాడర్ ఉన్న మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిని ఢీకొట్టాలంటే సమఉజ్జీ కావాలి. ఆర్థికంగా బలంగా ఉండటమేగాక పార్టీ శ్రేణుల్లోనూ కొండాకు మంచి పేరుంది. దీంతో విశ్వేశ్వర్ రెడ్డి వైపు కాంగ్రెస్ మొగ్గుచూపిందని సమాచారం. మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నప్పటికీ కొండా పేరే ఖరారు కానుంది. ఇప్పటికే పీసీసీ కూడా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరును కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి సూచించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డికి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈయన సికింద్రాబాద్ టికెట్‌ను ఆశిస్తున్నా.. పార్టీ ఆదేశాల మేరకు చేవెళ్ల నుంచి బరిలో దిగుతారని తాజా పరిణామాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. ఈయన ఆశలు పెట్టుకున్న సికింద్రాబాద్ స్థానంపై కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వెనక్కి తగ్గడం లేదు. ఈ స్థానం నుంచి వీరిద్దరిలో ఒకరికి ఫైనల్ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ క్రమంలో కిషన్‌రెడ్డికి ప్రత్యామ్నాయం చేవెళ్ల స్థానమే. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేగా గెలవడం, రాష్ట్ర పార్టీ బాధ్యతలు నిర్వహించడం ఈయనకు కలిసివచ్చే అంశాలు. పైగా పార్టీ శ్రేణుల్లోనూ మాస్ లీడర్‌గా పేరు సంపాదించారు. దీనికితోడు కిషన్‌రెడ్డి సొంతూరు ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకే వస్తోంది. ఈ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి బెక్కరి జనార్దన్‌రెడ్డి కూడా టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే పలు సమీకరణనల నేపథ్యంలో కిషన్‌రెడ్డి వైపే పార్టీ మొగ్గుచూపుతోందని తెలుస్తోంది. -
చేవెళ్ల టికెట్ ఎవరికో..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై ముఖ్య నేతలు దృష్టి పెట్టారు. రాజకీయ ఉద్ధండులు ఈ స్థానం నుంచి పోటీకి సై అంటున్నారు. హాట్‌సీట్‌గా మారిన ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీచేసేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆసక్తి కనబరుస్తున్నారు. పార్టీ అధినేత గ్రీన్‌సిగ్నల్ ఇస్తే కదనరంగంలోకి దిగేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధంచేసుకున్నారు. వీరే కాకుండా మరికొందరు కూడా చేవెళ్ల టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ స్థానాల్లో మెజార్టీ సీట్లు గులాబీ ఖాతాలో ఉండడంతో ముఖ్యనేతలు ఈ సీటుపై దృష్టిసారించారు. మొన్నటి వరకు మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి టికెట్ దాదాపు ఖరారు అని విస్తృత ప్రచారం జరిగింది. ఇప్పటికే ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక్కడి నుంచి మరో అభ్యర్థి తెర మీదకు రావడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమ నేత, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధిష్టానం అవకాశమిస్తే చేవెళ్ల నుంచి బరిలో దిగుతానని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే, మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆయనకు తీవ్ర నిరాశ ఎదురైంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కోసం ప్రయత్నించినా ఆయనకు దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు ఆ స్థానాన్ని ఖరారు చేయడంతో స్వామిగౌడ్ వెనక్కితగ్గారు. ఈ సమయంలో ‘భవిష్యత్‌లో చూద్దాం’ అని స్వామిగౌడ్‌కు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇదే ధీమాతో చేవెళ్ల పార్లమెంట్ టికెట్ కోసం ఆయన గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ‘పట్నం’కు దక్కేనా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో దిగి ఓటమి పాలైన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ స్థానం తనకేనని సంకేతాలిస్తున్న ఆయన.. కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరోపక్క గులాబీ గూటి నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొండా కూడా బలమైన నేత కావడంతో టీఆర్ఎస్ నుంచి పటిష్ట క్యాడర్ ఉన్న మహేందర్‌రెడ్డినే బరిలోకి దించాలన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతలో స్వామిగౌడ్ పేరు తెరమీదకు రావడంతో టికెట్ కోసం పోటీ తప్పేలా లేదు. టికెట్ కేటాయింపుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ నేతకు హామీ ఇచ్చినట్లు మహేందర్‌రెడ్డి అనుచరులు ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద చేవెళ్ల టికెట్ అధికార పార్టీ నుంచి ఎవరికి దక్కుతుందో అన్న అంశం సస్పెన్స్‌గా మారింది. -
కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్
సాక్షి, చేవెళ్ల: ‘దొరా.. కేసీఆర్.. ఇదేంది అన్నా.. తెలంగాణ వస్తే ఏమో చేస్తావని అనుకున్నాం కానీ, ఏమి చేయాలేదు’ అని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎస్ రత్నం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వస్తే ఏదో చేస్తావని నమ్మిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. దళితబిడ్డను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పావా లేదా అన్నా... గుర్తు తెచ్చుకోండి అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాళ్ల మీద కుటుంబ సభ్యులంతా పడి అమ్మా నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని కేసీఆర్ అడిగారన్నారు. ప్రజలకు దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి.. లోపల తననే ముఖ్యమంత్రి చేయమని అడగటంపై సోనియా ఆశ్చర్యపోయారని, దీంతో సోనియా.. దళితబిడ్డనే ముఖ్యమంత్రిని చేయాలి నేను మిమల్ని ముఖ్యమంత్రి చేయను, నీవు నా పార్టీలో చేరవద్దు అని పంపించారని విజయశాంతి చెప్పారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని, అలాంటి దేవతను విమర్శించే హక్కు, స్థాయి కేసీఆర్‌కు, కేటీఆర్‌కు, కవితకు లేదన్నారు. ఇంటింటికో ఉద్యోగం, దళితులకు భూమి, డబుల్బెడ్రూం ఇళ్లు అన్ని ఇచ్చి హామీలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు ఆశీర్వదించాలని సభలు పెడుతున్నారని, మళ్లీ ప్రజలు ఓటు వేస్తారనే భ్రమలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాపీ, డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వడ్డీలేని రుణాలు అందిస్తుందని, ఏడాదికి పేదలకు ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుందన్నారు. 5లక్షల వరకు ఆరోగ్యశ్రీ సౌకర్యం కల్పిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎస్ రత్నంను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వస్తే ప్రజలకు అంతా మంచి జరుగుతుందని అనుకున్నామని, జిల్లాకు ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా రాలేదన్నారు. అప్పుడు ఓట్లు కోసం వచ్చాడు, ఇప్పుడు ఓట్ల కోసం వస్తాడని విమర్శించారు. ఈ ప్రాంతానికి ప్రాణహితను అడ్డుకున్నాడు.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల తీసుకొస్తామని చెప్పాడు. ఇప్పుడు దానిని పాలమూరు ఎత్తిపోతల అని మార్చాడన్నారు.ఆ నీళ్లు వస్తాయో రావో తెలియదన్నారు. యువతకు ఉద్యోగాలు రాలేదని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ.. తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. కేస్ రత్నంను అప్పుడు కొన్ని దుష్టశక్తులు కలిసి ఓడించాయని, ఈసారి భారీ మోజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సభలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి పి.వెంకటస్వామి, ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ రత్నం, తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి, నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, గోవర్దన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, డైరెక్టర్ అగిరెడ్డి, మహిళా నాయకురాలు సదాలక్ష్మీ, నాయకులు గోపాల్‌రెడ్డి, వెంకటేశంగుప్తా, వసంతం, మధుసూదన్‌గుప్తా, రవికాంత్‌రెడ్డి, శర్వలింగం, శ్రీనివాస్‌గౌడ్, టేకులపల్లి శ్రీను, శ్రీదర్‌రెడ్డి, కె.రామస్వామి, వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి, రఘువీర్‌రెడ్డి, విఠలయ్య, శివానందం, ప్రకాశ్‌గౌడ్, శంకర్, ప్రభాకర్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేతల అడ్డా.. చేవెళ్ల గడ్డ
చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. నగరానికి ఆనుకొని ఉన్న ఈ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రసిద్ధి గాంచింది. ఓటర్లలో చైతన్యంలోనూ, జిల్లా వ్యాప్తంగా రాజకీయ నాయకులను అందించడంలోనూ విశిష్టమైన గుర్తింపు పొందింది. ఒక నియోజకవర్గం నుంచి ఒక్కరో ఇద్దరో ఎమ్మెల్యేలు ఇతర నియోజకవర్గాలకు ఎన్నికవుతుండడం అక్కడక్కడ కనిపిస్తుంటుంది. కానీ చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని పలు మండలాలకు చెందిన వ్యక్తులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో సబితారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి మంత్రులుగా కూడా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారు. అంతేకాకుండా జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్సీలు పట్నం నరేందర్‌రెడ్డి, యాదవ్‌రెడ్డిలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి కూడా ఈ నియోజకవర్గానికి చెందిన వారే. చేవెళ్ల గడ్డ రాజకీయ నాయకుల అడ్డాగా ప్రత్యేకత చాటుకుంటోంది. సాక్షి, చెవెళ్ల : పట్లోళ్ల సబితారెడ్డి నియోజకవర్గ పరిధిలోని చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి చెం దినవారు. ప్రస్తు తం మహేశ్వరం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. దివంగత మాజీ హోంమంత్రి పి. ఇంద్రారెడ్డి సతీమణి ఈమె. 2000 ఏప్రిల్ 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంద్రారెడ్డి మృతి చెందడంతో ఆయన రాజకీయ వారసురాలిగా అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాలలోకి అడుగుపెట్టారు. చేవెళ్ల నియోజకవర్గ చరిత్రలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీచేసి మొదటి సారిగా శాసనసభలో అడుగుపెట్టారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొంది వైఎస్సార్ మంత్రి వర్గంలో భూగర్భజలవనరుల శాఖమంత్రిగా పనిచేశారు. అనంతరం 2009లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీలకు చేవెళ్ల రిజర్వు అయ్యింది. దీంతో ఈ నియోజకవర్గాన్ని తప్పని పరిస్థితులలో వదిపెట్టాల్సి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ సూచనమేరకు జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంనుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆయన మంత్రివర్గంలో దేశంలోనే మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో పోటీ చేయలేదు. మళ్లీ ఇప్పుడు 2018లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. పట్నం మహేందర్‌రెడ్డి స్వగ్రామం షాబాద్ మండలం గొల్లూరుగూడ. మేనమామ దివంగత ఇంద్రారెడ్డి ప్రోత్సాహంతో 1994లో టీడీపీ నుంచి తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి అనూహ్య రీతిలో గెలుపొందారు. ఆ తరువాత 1999లో వరుసగా రెండోసారి గెలిచారు. 2004లో ఓటమి చెందారు. తిరిగి 2009లో 2014లో విజయం సాధించారు. తెలంగా ణ రాష్ట్రంలో తొలి రవాణశాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి జిల్లాను శాసించే నాయకునిగా ఎదిగారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా, జిల్లా రాజకీయల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యాపారవేత్త అయిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి స్వగ్రామం శంకర్పల్లి మండలం మాసానిగూడ గ్రామం. ఈయన సికింద్రాబాద్ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత వ్యాపారవేత్తగా మారి బోర్‌వెల్స్ పరికరాలు తయారుచేసే ఫ్యాక్టరీని స్థాపించారు. స్నేహితుడిగా ఉన్న అప్పటి ఎమ్మెల్యే పి.ఇంద్రారెడ్డితో విభేదించి రాజకీయాలలో చేరారు. తెలుగుదేశం పార్టీనుంచి చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి 1999లో మొదటిసారి పోటీచేసి ఓడిపోయారు. ఇంద్రారెడ్డి మరణంతో 2000లో జరిగిన ఉప ఎన్నికలలో సబితారెడ్డిపై కూడా ఓటమిపాలయ్యారు. హైదరాబాద్ పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటిచేసి ఓడిపోయారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైఎస్సాఆర్ సూచనమేరకు మేడ్చల్ నియోజకవర్గంనుంచి 2009లో పోటీచేసి మొదటిసారిగా విజయం సాధించారు. 2014లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కొరగాని సాయన్న రత్నం మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. 1995లో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజ ర్వు కావడంతో టీడీపీలోకి వచ్చారు. ఇంద్రారెడ్డి అనుచరుడిగా ఉండడంతో శంషాబాద్ జెడ్పీటీసీగా పోటీచేయించి జిల్లా పరిషత్ పదవిని కట్టబెట్టారు. 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు, 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలం చించల్‌పేట గ్రామానికి చెందిన వ్యక్తి కాలె యాదయ్య. స్థానిక సంస్థల్లో ఎంపీపీ. జెడ్పీటీసీ స్థాయినుంచి వచ్చిన ఆయన చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు కావటంతో 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి రత్నంపై గెలుపొంది టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పట్నం మహేందర్‌రెడ్డి స్వయాన సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి. ఎమ్మెల్సీగా ఉన్న నరేందర్‌రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నుంచి కొండగల్ ఎమ్మెల్యేగా రంగంలో ఉన్నారు. 2010లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీచేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. టీఆర్ఎస్ నుంచి మరోసారి అవకాశం వచ్చింది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా కలిసిన కొండగల్‌లో కూడా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ విధంగా ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు. రాజేంద్రనగర్ నుంచి కాంగ్రెస్ టికెట్ అశించినా టికెట్ రాక రెబల్‌గా పోటీ చేస్తున్న పీ. కార్తీక్‌రెడ్డి కూడా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన వ్యక్తియే. -
చుక్క నీటికీ చిక్కే!
⇒తాగునీటికి అల్లాడుతున్న గిరిజన తండాలు ⇒వర్షాలు లేక అడుగంటిన భూగర్భ జలాలు ⇒వేసవికి ముందే తాగునీటికి కటకట కుల్కచర్ల: తండాల్లో అప్పుడే తాగునీటి ఎద్దడి మొదలైంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గిరిజనులు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. కిలోమీటర్లకొద్దీ నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.కోట్లు విడుదల చేస్తున్నా.. సమస్య మాత్రం అపరిష్కృతంగానే ఉంటోంది. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో సుమారు పది గిరిజన తండాలు ఉండగా అందులో సగానికి పైగా తండాల్లో నీటి సమస్య ఉంది. పరిగి నియోజకవర్గం పరిధిలో 150 వరకు గిరిజన తండాలు ఉండగా 100కు పైగా తండాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. ఈ నియోజకవర్గంలోని కుల్కచర్ల మండలంలో సుమారు 105కుపైగా తండాలున్నాయి. దాదాపు అన్ని తండాల్లో నీటి సమస్య ఉంది. తాండూరు పరిధిలో సుమారు 58 తండాలు ఉండగా 25 తండాల్లో తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో 11 తండాలు ఉండగా నాలుగు తండాలు, మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో సుమారు 50 తండాలు ఉండగా 15 తండాలు, ఇబ్రహీంపట్నం నియోజక వర్గం పరిధిలో 29 తండాలు ఉండగా 12 తండాలు, వికారాబాద్ నియోజక వర్గం పరిధిలోని 65 తండాల్లో 19 తండాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. గుక్కెడు నీటికి ఎన్ని కష్టాలో..! కుల్కచర్ల మండలంలో 29 గ్రామ పంచాయతీలు, 10 అనుబంధ గ్రామాలు, గుర్తింపు పొందిన తండాలు సుమారు 75, అధికారుల రికార్డుల్లో లేనివి 30 తండాల వరకు ఉన్నాయి. తాగునీటి కోసం వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. పదేళ్లుగా స్వజల ధార పథకం కింద మినీ ట్యాంకులు, ఓవర్‌హెడ్ ట్యాంకులను ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. ఒక్కో తండాలో రూ.3లక్షల నుంచి రూ. 6లక్షల వరకు వెచ్చించి ట్యాంకులను ఏర్పాటు చేసి, బోర్లు కూడా వేశారు. పైపులైన్లు లేకపోవడంతో ఈ ట్యాంకులు వృథాగా మారాయి. ట్యాంకులకు కనెక్షన్లు ఇవ్వాలని గిరిజనులు అధికారుల చుట్టూ ఏళ్లతరబడి తిరుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మరికొన్ని తండాల్లో బోర్లు వెసి సింగల్ ఫేజ్ మోటార్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యుత్ ఉంటేనే నీళ్లు.. లేదంటే అంతే సంగతులు. ఎక్కడా చేతిపంపులు పనిచేయడం లేదు. నీటి కోసం వ్యవసాయ బావులు, చెరువులను ఆశ్రయించాల్సి వస్తోంది. కలుషిత నీరు తాగి ఇటీవల అడివి వెంకటాపూర్, చిన్నరామయ్య తండా, బింద్యంగడ్డ, చెరుముందలి తండా, గొరిగడ్డ, వెంకటాపూర్ తండా, నేర్లేల కుంట తండాల్లో ప్రజలు రోగాల బారిన పడ్డారు. చాలా తండాల్లో డెరైక్ట్ పంపింగ్ ఏర్పాటు చేశారు. పగలు విద్యుత్ లేక పోవడం రాత్రుళ్లు తాగునీటి కోసం బోర్ల దగ్గరకు వెళ్లి విద్యుదాఘాతానికి గురవుతున్నారు. ఇటీవల కుస్మసముద్రం పంచాయితీ పరిధిలోని నాగమ్మగడ్డ తండాలో దేవేందర్ అనే విద్యార్థి విద్యుత్ షాక్‌కు గురై మృత్యువాత పడ్డాడు. వేసవి కాలం రానేలేదు.. ఇప్పుడే ఇలా ఉంటే ముందుముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కట్టాలా.. వద్దా!
పేదోడి గూడు అయోమయంలో పడింది. అధికారంలోకి వస్తే రూ.మూడు లక్షలతో బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తామని చెప్పిన టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఇళ్ల నిర్మాణంపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే జిల్లాలో పేదలకు మంజూరైన ‘ఇందిరమ్మ’ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేయాలా? వద్దా? అన్న మీమాంస లబ్ధిదారుల్లో ఉంది. ఒక వేళ పూర్తి చేస్తే వాటికి బిల్లులు వస్తాయో రావో తెలియదు. అలాగే వదిలేస్తే.. కొత్త పథకంలో పాత లబ్ధిదారులకు చోటు దక్కుతుందో లేదో తెలియదు.. అప్పుచేసి చాలామంది ఇళ్లు ప్రారంభించారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి కూడా బిల్లులు అందాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఈ అంశాలపై ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో ఇళ్ల పనులు ప్రారంభించిన వాళ్లకు ఎటూ పాలుపోవడం లేదు. - చేవెళ్ల, మొయినాబాద్ అయోమయంలో ఇందిరమ్మ లబ్ధిదారులు జిల్లాలో మంజూరైన మొత్తం ఇళ్లు: 2,09,194 ఇప్పటికీ ప్రారంభించనివి: 46,058 వివిధ దశల్లో ఉన్నవి: 43,914 * ఎనిమిది నెలలుగా అందని బిల్లులు * నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు * కొత్తవి మంజూరుకావు.. కట్టినవాటికి బిల్లులివ్వరు * అసలే మొదలుకాని ఇళ్ల పరిస్థితేంటి.. చేవెళ్ల/ మొయినాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. ఎనిమిది నెలలుగా బిల్లులు అందకపోవడంతో ప్రారంభించిన నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులు వాటిని నిర్మించాలా? వద్దా? అనే మీమాంసలో ఉండిపోయారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు దాటిపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మంజూరు, నిర్మాణంలో ఉన్న పాతవాటి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే రూ.3 లక్షల వ్యయంతో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తానని పార్టీ అధ్యక్షుని హోదాలో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడడంతో చాలా మంది డబుల్ బెడ్రూం ఇళ్లపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితి జిల్లా అంతటా ఉండడంతో లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మార్చి నెల నుంచి బిల్లుల నిలిపివేతతో లబ్ధిదారుల ఇబ్బందులు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కోడ్‌లో భాగంగా ఎన్నికల కమీషన్ మార్చి నుంచి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లించడాన్ని నిలిపేసింది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఐదునెలలు దాటినా బిల్లుల చెల్లింపు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అప్పటి నుంచి చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, నవాబ్‌పేట మండలాల్లో 2065 మంది లబ్ధిదారులకు పలు దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్ల బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దాంతో అప్పోసప్పో చేసి నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల చెల్లింపులు లేక మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తిచేయలేక అసంపూర్తిగానే మిగిలాయి. కొన్ని ఇళ్లకు ఒక బిల్లు, ఇంకొన్ని ఇళ్లకు రెండు బిల్లులు, మరి కొన్ని ఇళ్లకు మూడు బిల్లులు వచ్చి ఆగిపోయాయి. ఇంకొంత మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకున్నా ఒక్క బిల్లుకూడా రాలేదు. అర్ధాంతరంగా ఆగిన నిర్మాణాలు గత ఎనిమిది నెలలుగా ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం బిల్లుల చెల్లింపు నిలిపివేసింది. ఎన్నికలు పూరై ్తనా ఇంకా బిల్లులు మాత్రం చెల్లించడంలేదు. ఇటు బిల్లులు రాక అటు ప్రైవేటుగా అప్పులు చేయలేక లబ్ధిదారులు ఇళ్లు నిర్మాణాలను వివిధ దశల్లో నిలిపేశారు. వాటిని పూర్తి చేస్తే ఇందిరమ్మ పథకం ప్రకారమే బిల్లులు చెల్లిస్తారా...? కొత్తగా ప్రవేశపెట్టబోయే పథకం ప్రకారం డబ్బులు చెల్లిస్తారా అనే విషయంలో ప్రభుత్వంనుంచి ఇంకా ఎలాంటి స్పష్టతలేకపోవడంతో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. నిర్మాణాలు మొదలుకాని వాటి పరిస్థితేంటి..? ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన నియోజకవర్గం పరిధిలో సుమారు 3వేలకు పైగా లబ్ధిదారులు ఇప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఆ ఇళ్లకు ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూం పథకాన్ని అమలు చేస్తుందో, లేదోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అప్పట్లో మంజూరైన ఇళ్లను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తుందా అనే అనుమానం సైతం కలుగుతోంది. కొత్త ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఉత్కంఠగా ఎదిరి చూస్తున్నారు. మరి కొత్త ప్రభుత్వం పేదల సొంతింటి కలను ఎలా నిజంచేస్తుందో వేచిచూడాలి. అప్పుచేసి కట్టాం సంవత్సరం కింద ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యింది. అప్పు చేసి రూప్‌లెవల్ వరకు గోడలు కట్టాం. బేస్మిట్ బిల్లు ఒక్కటే వచ్చింది. ఇంకా రెండు బిల్లులు రావాలి. ఆ బిల్లులు వస్తే స్లాబ్ వేద్దామని చూస్తున్నాం. ఎనిమిది నెలలుగా బిల్లులు వస్తలేవు. అప్పుచేసి కొంతవరకు కట్టుకోగలిగాం. ఇళ్లులేక అద్దె ఇంట్లో ఉంటున్నాం. - జాహెదాబేగం, మొయినాబాద్ ఇళ్లు పూరై్తనా ఒక్క బిల్లు కూడా రాలేదు సంవత్సరం కింద ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. వెంటనే పనులు మొదలు పెట్టాం. మూడు నెలల క్రితమే ఇంటి నిర్మాణం పూర్తియింది. ఇప్పటి వరకు ఒక్కసారికూడా బిల్లు రాలేదు. హౌసింగ్ అధికారులను ఎప్పుడడిగినా ఆన్లైన్లో ఉంది. త్వరలోనే వస్తాయని చెబుతున్నారు. కాని బిల్లు ఎప్పుడు వస్తుందో తెలియడంలేదు. - కమ్మరి పద్మమ్మ, సురంగల్ రెండువారాల్లో బిల్లులు వస్తాయి ఎన్నికల ముందు నుంచి ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులను ప్రభుత్వం నిలిపేసింది. అప్పుటి నుంచి ఎవరికీ బిల్లులు రాలేదు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలను మరోసారి పరిశీలిస్తున్నాము. నిర్మాణాలను బట్టి బిల్లులు వస్తాయి. రెండు వారాల్లో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు వచ్చే అవకాశం ఉంది. - ప్రేంసాగర్, గృహనిర్మాణ శాఖ డీఈఈ, చేవెళ్ల -
‘మార్కెట్’ పదవులపై కన్ను
రిజర్వేషన్ విధానం యోచనతో సామాజికవర్గాల నేతల సందడి చేవెళ్ల: చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకమండళ్ల చైర్మన్ పదవులకోసం అధికార పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రస్తుతమున్న కమిటీల పదవీకాలం ముగియకున్నా ఆర్డినెన్స్ద్వారా ఈ పాలకమండళ్లను రద్దుచేసింది. ఈస్థానాల్లో తమ పార్టీవారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు ఓపెన్కెటగిరీ కింద మార్కెట్ కమిటీ పాలకమండళ్లను గత ప్రభుత్వాలు నియమించేవి. అలా కాకుండా వీటిలో కూడా రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనప్రాయంగా తెలియజేశారు. దీంతో పలు సామాజిక వర్గాల టీఆర్ఎస్ నేతలు ఈ పదవులకోసం పోటాపోటీగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో మూడు కమిటీలు చేవెళ్ల నియోజకవర్గంలో చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్, నవాబుపేట మండలాలున్నాయి. నియోజకవర్గ పరిధిలో చేవెళ్ల, శంకర్పల్లి, సర్దార్‌నగర్ మార్కెట్కమిటీలున్నాయి. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి చేవెళ్ల మండలం, శంకర్పల్లి మార్కెట్పరిధిలోని శంకర్పల్లి మండలం, సర్దార్‌నగర్ మార్కెట్ పరిధిలోకి షాబాద్, మొయినాబాద్ మండలాలు వస్తాయి. నవాబుపేట మండలం మాత్రం వికారాబాద్ మార్కెట్ పరిధిలోకి వస్తుంది. ఈ పాలకమండళ్లకు కోసం ఆయా మండలాల టీఆర్ఎస్ నేతలు పోటీపడుతున్నారు. ఇదిలాఉండగా సర్దార్‌నగర్ నుంచి మొయినాబాద్ మండలాన్ని, వికారాబాద్ మార్కెట్‌నుంచి నవాబుపేటను వేరుచేసి కొత్త కమిటీలను ఏర్పాటుచేయాలన్న డిమాండ్ కూడా ఎప్పటినుంచో ఉంది. నేతల ఉత్కంఠ మార్కెట్ పదవులలో ప్రవేశపెట్టనున్న రిజర్వేషన్ విధానం ఇంకా నిర్ణయించకపోవడంతో ఏ మార్కెట్‌కమిటీ ఏ కేటగిరీకి చెందుతుందోనని ఆశావహులు ఉత్కంఠతో ఉన్నప్పటికీ తమవంతు ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉన్నారు. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గిరీ కోసం మండల టీఆర్ఎస్ అధ్యక్షులు సామ మాణిక్‌రెడ్డి పోటీపడుతున్నారు. రిజర్వేషన్ విధానం అమలై ఎస్సీ అయితే మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్.వసంతం, గంగియాదయ్య, బీసీ అయితే రావులపల్లి మాజీ సర్పంచ్ రాంచంద్రయ్య, కె.పాండు, సత్యనారాయణగౌడ్ తదితరులు పోటీలో ఉంటారు. అదే విధంగా సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి వస్తే షాబాద్ మండలం చందనవెళ్లికి చెందిన కొలన్ ప్రభాకర్‌రెడ్డి, కక్కులూరుకు చెందిన మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ జీవన్‌రెడ్డి పోటీలో ఉన్నారు. బీసీకి కేటాయిస్తే నాగరకుంటకు చెందిన వెంకటయ్యకే అవకాశాలున్నాయి. అదే విధంగా శంకర్పల్లి మార్కెట్‌కమిటీ చైర్మన్ పదవిని జనరల్‌కు కేటాయిస్తే సంకెపల్లికి చెందిన చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దేవుని పరమేశ్వర్‌రెడ్డి, మహాలింగపురం గ్రామానికి చెందిన బల్వంత్‌రెడ్డి పోటీపడుతున్నారు. బీసీలకు కేటాయిస్తే శంకర్‌పల్లికి చెందిన బొమ్మనగారి కృష్ణ, మోకిలకు చెందిన లింగం, ఎస్సీలకు రిజర్వు చేస్తే మహారాజ్‌పేటకు చెందిన సామయ్య, జన్వాడకు చెందిన యాదయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మంత్రిపైనే భారం మంత్రి మహేందర్‌రెడ్డిపైనే మార్కెట్‌కమిటీ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవుల ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఆశీస్సుల కోసం చక్కర్లు కొడుతున్నారు. మంత్రి సోదరుడు , ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి ద్వారా సిఫార్సు చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ద్వారా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నీటిపారుదల, మార్కెటింగ్ మంత్రి హరీష్‌రావు సోమవారం చేవెళ్ల, వికారాబాద్‌లలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయనను ప్రసన్నం చేసుకునేం దుకు కూడా ఆశావహ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. -
సమస్యాత్మక గ్రామాల్లో గట్టి నిఘా
చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో గట్టి నిఘా ఏర్పాటుచేస్తున్నట్లు చేవెళ్ల నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి, విజయనగరం అడిషనల్ ఎస్పీ సుందర్రావు తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చిన పోలీసులకు పలు గ్రామాల బాధ్యతలు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలను గుమ్మిగూడకుండా చూడాలన్నారు. ఓటు వేయగానే వారు అక్కడినుంచి వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎప్పటికప్పుడు పోలీంగ్ స్టేషన్ల పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. అనుమానాస్పదంగా ఎవరైన కనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకోవాలని పేర్కొన్నారు. పోలింగ్ సమయంలో ప్రచారం జరగకూడదని, తమకే ఓటు వేయాలని ఎవరైన ఒత్తిడి చేసినా, ప్రలోభాలకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ మినహా చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, నవాబుపేట మండలాల్లో ఉన్న 189 పోలింగ్ స్టేషన్లకు 500ల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఓ ఏఎస్పీ, నలుగురు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఓటర్లు, నాయకులు సహకరించాలని కోరారు. సమావేశంలో చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్, హర్ష, సీఐ నాగేశ్వర్రావు, ఎస్ఐలు లక్ష్మీరెడ్డి, ఖలీల్, చైతన్యకుమార్, నాగరాజు తదితరులున్నారు. -
‘చేవెళ్ల’ చిక్కుముడి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చేవెళ్ల రాజకీయం రసకందాయంలో పడింది. కాంగ్రెస్‌లో గ్రూపుల అధిపత్య పోరుకు ఈ నియోజకవర్గం కేంద్ర బిందువైంది. స్థానిక పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి, రాజకీయ ఉద్దండుడు సూదిని జైపాల్‌రెడ్డి మార్క్ రాజకీయం నాయకుల మధ్య కొత్త పంచాయితీకి తెరలేపింది. ఈసారి ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీకి దిగనని స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆశావహుల మధ్య పోటీని మరింత పెంచింది. వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ పార్లమెంటరీ స్థానానికి పోటీచేయాలని జైపాల్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలో సంప్రదింపులు జరుపుతున్న ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి కూడా తెలియజేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాను ఖాళీ చేసే సీటును తాను సూచించిన వారికేఇవ్వాలన్న ఆయన ప్రతిపాదన జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతికి ఆజ్యం పోసింది. తన ముఖ్య అనుచరుడు, సీనియర్ నేత ఉద్దెమర్రి నరసింహారెడ్డికి మేడ్చల్ అసెంబ్లీ టికెట్ ఇప్పించేందుకు జైపాల్‌రెడ్డి పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. 2009లో కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి చివరి నిమిషంలో ఇక్కడి నుంచి టికెట్ ఖరారుకావడంతో ఉద్దెమర్రికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఉద్దెమర్రికి సీటిప్పించాలని జైపాల్‌రెడ్డి దృఢనిశ్చయంతో ఉన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి మారుతున్నందున.. తన స్థానంలో చేవెళ్ల నుంచి బరిలోకి దిగాలని కేఎల్లార్‌కు జైపాల్ సూచిస్తున్నారు. తద్వారా ఉద్దెమర్రికి లైన్‌క్లియర్ చేయడంతోపాటు కేఎల్లార్‌కు ప్రత్యామ్నాయం కూడా చూపినట్లవుతుందని భావిస్తున్నారు. ఈ తరుణంలోనే కేఎల్లార్‌ను ఒప్పించేందుకు మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ను జైపాల్‌రెడ్డి రంగంలోకి దించారు. తన ప్రతిపాదనను అంగీకరించేలా కే ఎల్లార్కు నచ్చజెప్పాలని సూచించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ప్రసాద్.. కేఎల్లార్‌తో సంప్రదింపులు జరిపినా ఆశించిన ఫలితం కనిపించడం లేదని సమాచారం. జైపాల్ ప్రతిపాదనకు ససేమిరా అయితే, జైపాల్ రాజీ ఫార్ములాకు కేఎల్లార్ ససేమిరా అన్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లోనూ తాను మేడ్చల్ శాసనసభా స్థానం నుంచే బరిలో ఉంటానని స్పష్టం చేసినట్లు తెలిసింది. రెండు నెలల క్రితమే తాను అడిగినప్పుడు ఇక్కడి నుంచే(చేవెళ్ల) పోటీచేస్తానని చెప్పి.. ఇప్పుడు పాలమూరు ఫిఫ్ట్ అవుతున్నానని చెప్పడం ఎంతవరకు సబబని నిలదీసినట్లు తెలిసింది. ప్రచారానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో జైపాల్ ప్రతిపాదనకు అంగీకరించేదిలేదని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా మేడ్చల్ నుంచే పోటీచేస్తాను తప్ప.. ఒకరి కోసం సిట్టింగ్ సీటును వదులుకునే ప్రసక్తేలేదని ఘాటుగా బదులిచ్చినట్లు తెలిసింది. డైలమాలో చెల్లెమ్మవర్గం! చేవెళ్ల లోక్‌సభ టికెట్ రేసులో ఉన్న మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి కుటుంబానికీ జైపాల్‌రెడ్డి వ్యవహారశైలి మింగుడుపడడంలేదు. 2009లో తమకు దాదాపు గా ఖరారైన టికెట్‌ను ఎగురేసుకుపోయిన జైపాల్.. ఇ ప్పుడు తన శిష్యుడి కోసం కేఎల్లార్‌ను తెరమీదకు తేవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మహబూబ్‌నగర్ నుంచి పోటీకి సన్నాహాలు చేసుకుంటుండడంతో తమ కు లైన్‌క్లియరైందని భావించిన సబిత, తనయుడు కార్తీక్‌రెడ్డికి తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.