చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి | Arrangements For Election Polling In Chevella Is Completed | Sakshi
Sakshi News home page

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

Published Tue, Apr 9 2019 8:39 PM | Last Updated on Tue, Apr 9 2019 9:13 PM

Arrangements For Election Polling In Chevella Is Completed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తైనట్లు పేర్కొన్నారు. చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో పోలింగ్  జరుగనుంది. మొత్తంగా పోటీలో 23 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంలో 24 లక్షల 15 వేల 598 మంది ఓటర్లు  ఉండగా..  మహిళలు 11 లక్షల 64 వేల 93 , పురుషులు 12 లక్షల 51 వేల 210  ఉన్నారు. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 6 లక్షల 17 వేల 169 మంది ఓటర్లున్నారు.  మొత్తం 2,078 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 176 ప్రాంతాల్లో 490 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవని పేర్కొన్నారు. మొత్తం 13 వేలమంది పోలింగ్‌ సిబ్బంది కాగా.. 3 వేల మంది పోలీసులు, 1000 వాహనాలు.. మొత్తంగా 14 వేల మందికిపైగా సిబ్బందితో ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 5.75 కోట్ల నగదు, 5 వేల లీటర్ల మద్యం స్వాధీనపరుచుకున్నట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement