![Ex MP Konda Vishweshwar Reddy Joins in BJP - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/3/8899.jpg.webp?itok=MPvUJykW)
సాక్షి, హైదరాబాద్: చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ కొండా విశ్వేశ్వరరెడ్డి చేయి పట్టుకుని కార్యకర్తలకు అభివాదం చేయించారు.
కాగా, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడైన కొండా విశ్వేశ్వరరెడ్డి.. టీఆర్‌ఎస్ తరపున 16వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటు సభ్యునిగా పనిచేస్తున్నప్పుడు యూఎస్ పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ ఈయనే కావడం విశేషం. అంతేకాదు 2014, 2018 తెలంగాణ ఎన్నికల టైంలో.. అఫిడవిట్ ఆధారంగా రిచ్చెస్ట్ పొలిటీషియన్‌గా నిలిచారు కూడా.
2013లో కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి.. 2018లో టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. కిందటి ఏడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
చదవండి: (హిందువులకు మాత్రమే కాదు.. అన్ని మతాలకు చేరువకావాలి: ప్రధాని మోదీ)
Comments
Please login to add a commentAdd a comment