ముజ్రా పార్టీ ఎఫెక్ట్
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో జరిగిన ముజ్రా పార్టీలో పోలీసులకు పట్టుబడ్డ 8 మంది జీహెచ్‌ఎంసీ ఉద్యోగులను క మిషనర్ జనార్దన్‌రెడ్డి సస్పెండ్ చేశారు. వీరిలో శేరిలింగంపల్లి సర్కిల్-11 ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ సంజయ్‌కుమార్(53), సర్కిల్-12 ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ సాయినాథ్ అలియాస్ పద్మభూషణ్ రాజు(48), సర్కిల్-14 ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్(54), సర్కిల్-11 బిల్ కలెక్టర్లు ఆర్.జా‘నేశ్వర్(30), వై.నరహరి(30), కె.కృష్ణ(26) రణవీర్ భూపాల్(40), సర్కిల్-12 బిల్ కలెక్టర్ వై.బాబురావు ఉన్నారు.
ఈ ఉద్యోగులందరినీ సస్పెండ్ చేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు వెస్ట్ జోనల్ కమిషనర్ బి.వి.గంగాధర్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై ఆయన విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. శనివారం రాత్రి మాదాపూర్ ఖానామెట్‌లోని ఫాతిమా గెస్ట్‌హౌస్‌లో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీపై సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. మద్యం సేవిస్తూ యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తుండగా అక్కడున్న 24 మందిని అరెస్ట్ చేశారు. వీరిపై ఐపీసీ 188, 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
8 మంది జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల సస్పెన్షన్
Published Mon, Feb 8 2016 3:31 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement