
హెచ్ఎండీఏ కమిషనర్ జనార్దన్ రెడ్డి(పాత చిత్రం)
విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని జనార్ధన్ రెడ్డిని ప్రభుత్వం ఆదేశించింది.
సాక్షి, హైదరాబాద్ : హెచ్ఎండీఏ కమిషనర్ బి. జనార్ధన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. సోమవారం ఉదయం జనార్ధన్‌రెడ్డిని హెచ్‌ఎండీఏ కమిషనర్ బాధ్యతలనుంచి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోస్టింగ్ ఇవ్వకుండా ప్రస్తుతానికి వెయిటింగ్‌లో పెట్టింది ప్రభుత్వం. హెచ్ఎండీఏ కమిషనర్‌గా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.
విదేశీ పర్యటనలో ఉండగానే జనార్ధన్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని జనార్ధన్ రెడ్డిని ప్రభుత్వం ఆదేశించింది.