ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి  | MLA Lakshma Reddy Commented That Home Based Jobs Is Not Possible | Sakshi
Sakshi News home page

ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 

Published Mon, Aug 30 2021 2:30 AM | Last Updated on Mon, Aug 30 2021 2:30 AM

MLA Lakshma Reddy Commented That Home Based Jobs Is Not Possible - Sakshi

జడ్చర్ల టౌన్‌: ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదని జడ్చర్ల ఎమ్మెల్యే డా.లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం జడ్చర్ల మండలం శంకరాయపల్లి సమీపంలో నిర్మించిన పీఆర్‌టీయూ సంఘ భవనాన్ని ఎమ్మెల్సీ కె.జనార్దన్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో లక్ష్మారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటే కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ఓటు బ్యాంక్‌ రాజకీయాలు నడుస్తున్నాయని, ఏ పథకం పెడితే ఎన్ని ఓట్లు వస్తాయో అని ఆలోచించటం సరైంది కాదన్నారు. వెనుకబడిన దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ఎంతో ఆలోచించి దళితబంధు ప్రవేశపెడితే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement