సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరుతో రూ.26 లక్షలకు కుచ్చుటోపీ | Software Company Cheating With Name of Jobs | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరుతో రూ.26 లక్షలకు కుచ్చుటోపీ

Published Sat, Oct 19 2024 12:43 PM | Last Updated on Sat, Oct 19 2024 12:43 PM

Software Company Cheating With Name of Jobs

బంజారాహిల్స్‌: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.26 లక్షలు వసూలు చేసి ముఖం చాటేసిన భార్యాభర్తలపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–10లోని వెంకటగిరి స్రవంతినగర్‌లో నివసించే ఆరెవరపు వాసు టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గత ఏడాది జనవరిలో అక్కడే పనిచేస్తున్న చల్లా శ్రీరామ్‌ కిరణ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వాసుకు పరిచయం అయ్యాడు. 

తనకు పెద్ద పెద్ద కంపెనీల్లో పరిచయాలు ఉన్నాయని, ఐబీఎం కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో వాసు తన స్నేహితులను సంప్రదించి ఒక్కొక్కరి నుంచి రూ.2– 2.5 లక్షల వరకు 17 మంది దగ్గర రూ.26 లక్షలు వసూలు చేసి చల్లా శ్రీరామ్‌కిరణ్‌కు ఇచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ 17 మందికి ఆఫర్‌ లెటర్లు ఇవ్వగా వీరంతా ఆయా కంపెనీల్లో జాయిన్‌ కావడానికి వెళ్లినప్పుడు అవి బోగస్‌ ఆఫర్‌ లెటర్లు అని తేలింది. లబోదిబోమంటూ బాధితులు చల్లా శ్రీరామ్‌కిరణ్, ఆయన భార్య సంధ్యారాణిని సంప్రదించారు. 

అయితే మరో కంపెనీలో జాబ్‌లు ఇప్పిస్తానని, తనను నమ్మాలని చెప్పాడు. నెలలు గడుస్తున్నా వీరికి జాబ్‌లు ఇవ్వకపోగా డబ్బులు తిరిగి ఇవ్వమంటే ముఖం చాటేశాడని బాధితుడు వాసు పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాక్‌డోర్‌ జాబ్స్‌ పేరుతో ఉద్దేశపూర్వకంగా తమ వద్ద నుంచి రూ.26 లక్షలు వసూలు చేసి మోసగించిన శ్రీరామ్‌కిరణ్, ఆయన భార్య సంధ్యారాణిలపై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరి పైనా ఐపీసీ సెక్షన్‌ 406, 420 కింద చీటింగ్‌ కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement