Lakshma reddy
-
బయటకు వచ్చేద్దామనుకున్నాం.. అంతలోనే దుర్ఘటన
మద్దిలపాలెం: ‘అప్పటి వరకు ఇద్దరం కలిసి క్యూలో జాగ్రత్తగా ఉన్నాం. రద్దీగా ఉండటంతో లైనులో నుంచి బయటకు వెళ్లిపోదాం అనుకున్నాం. అదే సమయంలో రద్దీ అధికమవడంతో గేట్లు తెరిచారని చెప్పారు. ఒక్కసారిగా భక్తులు ముందుకు కదలడంతో తొక్కిసలాట జరిగింది. క్షణాల్లో నా భార్య రజనీ ప్రాణాలు కోల్పోయింది..’ అని గుడ్ల లక్ష్మారెడ్డి విలపించారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో విశాఖపట్నంలోని మద్దిలపాలేనికి చెందిన గుడ్ల లక్ష్మారెడ్డి భార్య రజనీ మరణించిన విషయం తెలిసిందే. మద్దిలపాలెంలోని వారి ఇంటి వద్ద రజనీ మృతదేహానికి శుక్రవారం పలువురు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి తిరుపతి క్యూలైనులో జరిగిన ఘోరం గురించి వివరిస్తూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘క్యూలో ఉన్న ప్రతి ఒక్కరు 10వ తేదీన దర్శనం టికెట్ల కోసమే ఆరాటపడ్డారు. ఆ ఆరాటమే తొక్కిసలాటకు కారణమై భక్తుల ప్రాణాల మీదకు తీసుకొచి్చంది. మేం ఇద్దరం కలిసి జాగ్రత్తగా లైనులో వెళుతున్న సమయంలో ఒక్కసారిగా తోపులాట జరగడంతో విడిపోయాం. ఇంతలో రజనీ కోసం చూసే సరికి కనిపించలేదు. ఆ క్షణంలో అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాలేదు. తేరుకుని చూసేసరికి రజనీ కనిపించకుండాపోయింది. తొక్కిసలాటలో తప్పిపోయిన రజనీ కోసం తీవ్రంగా వెతికా. ఎక్కడా జాడలేదు. నా ఫోన్ కూడా రజనీ బ్యాగులో ఉండిపోయింది. దీంతో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి కాల్ చేస్తున్నా పనిచేయలేదు. ఏం జరిగిందో తెలియదు... రెండు గంటల తర్వాత రజనీని ఆస్పత్రిలో చేరి్పంచారని సమాచారం అందింది. ఆ ఆస్పత్రి ఎక్కడుందో తెలియదు. చివరకు ఆటోలో అక్కడి చేరుకున్నా. వెళ్లి చూసే సరికి నా భార్య విగతజీవిగా పడి ఉంది. రజనీ ఒంటిపై ఒక్క గాయం కూడా లేదు. తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయిందనుకుంటున్నా...’ అని ఆవేదన వ్యక్తంచేశారు. అమ్మా... వద్దన్నా వినలేదు... ‘అమ్మా ఇప్పుడు వద్దు.. మరోసారి వెళ్లొద్దాం..’ అని కొడుకు హర్షవర్థన్ ఫోన్లో చెప్పినా రజనీ వినలేదని లక్ష్మారెడ్డి చెప్పారు. ‘చుట్టుపక్కలవారికి సుమారు పదిసార్లు వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్లిన అనుభవం ఉండడంతో వారితో కలిసి మేం తొలిసారి వెళ్లాం. పది మంది గ్రూపుగా వెళ్లగా, ఆదిలక్ష్మి అనే మహిళకు తొక్కిసలాటలో గాయాలయ్యాయి. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది..’ అని ఆయన తెలిపారు. అమెరికా నుంచి వచ్చి.. అమ్మ వద్ద సొమ్మసిల్లి..అమెరికా నుంచి హుటాహుటిన వచి్చన రజనీ కుమారుడు హర్షవర్థన్ రెడ్డి... తల్లి భౌతికకాయాన్ని చూసి సొమ్మసిల్లిపోయాడు. బంధువులు సపర్యలు చేయడంతో కొద్దిసేపటి తర్వాత తేరున్నాడు. తల్లి మృతదేహం వద్ద విలపిస్తూ హర్షవర్ధన్ కూర్చున్న తీరు అందరినీ కలచివేసింది. కాగా, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కాంగ్రెస్ నాయకులు దండి ప్రియాంక తదితరులు రజనీ మృతదేహం వద్ద నివాళులర్పించారు. రజనీ తమ్ముడు అమెరికా నుంచి శనివారం విశాఖ వస్తారని, అతను రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు. ఊహించుకుంటేనే భయమేస్తోంది» మాకు పీడకలను మిగిల్చింది »మా ప్రాణాలను మేమే కాపాడుకోవాల్సి వచ్చిoది » తొక్కిసలాటలో క్షతగాత్రుల మనోగతంతిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం వేచి ఉండగా జరిగిన తొక్కిసలాటను ఊహించుకుంటేనే భయమేస్తోందని క్షతగాత్రులు తెలిపారు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులు మాట్లాడుతూ.. తొక్కిసలాట సందర్భంగా భక్తుల అరుపులు, కేకలు, ఆర్తనాదాలు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతున్నాయని చెప్పారు. అక్కడ తొక్కిసలాటకు గల కారణం, సహాయక చర్యలు, ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై వారు ఏమన్నారంటే.. – తిరుపతి తుడా/తిరుపతి కల్చరల్తొక్కిసలాటకు ఆ తాడే కారణంవైకుంఠ ద్వారదర్శనం కోసం మా ఊరి నుంచి 450మంది ఇంటిల్లిపాది బుధవారం తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలోని కౌంటర్ వద్దకు చేరుకున్నాం. క్యూలైన్లలోనికి భక్తులను వదలకుండా పద్మావతి పార్క్‌లోకి పంపించేశారు. భక్తులతో పార్క్ నిండిపోయింది. రాత్రి 8గంటల సమయంలో టోకెన్లను జారీ చేస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించారు. పార్క్ గేట్లను ఒక్కసారిగా తీయడంతో వేలాది మంది పరుగులు పెడుతూ గేటు వద్దకు దూసుకొచ్చారు. అయితే గేటుకు రెండువైపులా రెండడుగుల ఎత్తులో కట్టి ఉన్న తాడును తొలగించకుండానే గేటును తెరిచారు. దీంతో ముందు వరుసలో ఉన్న మహిళలు తాడుకు తగులుకుని బోర్లా పడిపోయారు. వెనుక నుంచి వచ్చిన వందలాది మంది భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో అంతమంది ప్రాణాలు కోల్పోయారు. తాడు లేకుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదు. – వెంకటేశ్, క్షతగాత్రుడు, రామసముద్రం, అన్నమయ్య జిల్లా మా వాళ్లను మేమే కాపాడుకున్నాం క్యూలైన్లలోకి వెళ్లేందుకు పార్క్ గేటు తెరవడంతో భక్తులు గుంపులుగా పరుగులు పెడుతూ దూసుకొచ్చారు. ముందుగా విశాఖ ప్రాంతానికి చెందిన భక్తులు తాడుకు తగులుకుని కింద పడిపోయారు. ఆ వెనుకే∙ఉన్న మాపైకి వందలాది మంది దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. కిందపడ్డ మా వాళ్లను కాపాడుకునేందుకు 20 నిమిషాలు పట్టింది. సకాలంలో 108 రాకపోవడంతో ఆటోల్లో ఆస్పత్రులకు తీసుకెళ్లాం. – చిన్నరాజు, క్షతగాత్రురాలి భర్త, నరసాపురం, అన్నమయ్య జిల్లానా జీవితంలో అదో పీడకల కళ్ల ముందే భక్తులు కుప్పకూలిపోయారు. ముందు వరుసలో ఉన్న మహిళా భక్తులు కిందపడిపోయారు. వారిపై పదుల సంఖ్యలో భక్తులు పడ్డారు. కిందపడిన వారిలో నేనూ ఒకడిని. నా పై సుమారు 20మంది పడిపోయారు.వారిని పట్టించుకోకుండా వెనక నుంచి వచ్చే వారు తొక్కుకుంటూ వెళ్లిపోవడంతో 50మందికిపైగా గాయాలయ్యాయి. ఆరుగురు చనిపోవడానికి కూడా ఇదే కారణం. స్వయంగా అనుభవించిన ఈఘటన పీడకలగా మిగిలిపోతుంది. – చిన్న అబ్బయ్య, క్షతగాత్రుడు, రామసముద్రం, అన్నమయ్యజిల్లాభక్తులను నమ్మించి దగా చేశారు సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని టీటీడీ యాజమాన్యం నమ్మించి వారిని మోసం చేసింది. టికెట్ ఉన్నవారికే తిరుమలకు ప్రవేశం, స్వామిదర్శనం అంటూ నమ్మపలికారు. ఫలితంగా భక్తులు స్వామి దర్శన భాగ్యం కోసం అధిక సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు. ప్రచారానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది. – ఎ.మధు, జై హిందూస్థాన్ పార్టీ,రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు.వైకుంఠానికే పంపారు వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిoచాలని కోరిన భక్తులను టీటీడీ వారిని నేరుగా వైకుంఠానికి పంపింది. టీటీడీలో ఏటా వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తున్నా అదే అనుభవంతో ఏర్పాట్లు, పర్యవేక్షణ కొరవడడంతో భక్తులకు తీవ్ర కష్టాలు ఎదురయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే భక్తులు మరణించారు. –ఎం.నీలకంఠ, హిందూ చైతన్య సమితి అధ్యక్షుడు. నేరుగా దేవుని దగ్గరకే పంపిన టీటీడీ శ్రీవారిని చూపాలని కోరిన భక్తులకు టీటీడీ నేరుగా దేవుని దగ్గరకు పంపడం అమానుషం. వైకుంఠ దర్శన టోకన్ల జారీలో భక్తుల పట్ల టీటీడీ, పోలీసులు చులకనగా మాట్లాడడం విడ్డూరం. తొక్కిసలాట సందర్భంగా భక్తులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడమేకాక ఎవరు రమ్మన్నారంటూ వ్యాఖ్యానించడం దుర్మార్గం. – తుమ్మ ఓంకార్, తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆరుగురు భక్తులు మృతి చెందారు. భక్తులు తిరుమలకు రావాలంటే భయపడే పరిస్థితిని టీటీడీ యాజమాన్యం తీసుకొచ్చిoది. టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యమే ఇందుకు కారణం. – దిలీప్‌కుమార్, తిరుమల, తిరుపతి సంరక్షణ సంఘం అధ్యక్షుడు -
నర్రెడ్డి లక్ష్మారెడ్డిని ఫోన్ లో పరామర్శించిన వైఎస్ జగన్
-
నగరంలో ఐటీ దాడుల కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులు, వారి బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు గురువారం విస్తృత సోదాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో జరిగిన తనిఖీలు నగరంలో కలకలం రేపుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక బృందాలు దాడులు ప్రారంభించాయి. కోకాపేటలోని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు, రియల్ ఎస్టేల్ వ్యాపారి గిరిధర్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేశాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)కి చెందిన ఇళ్లు, విల్లా, ఫామ్‌హౌసుల్లో తనిఖీలు చేపట్టాయి. బాలాపూర్‌లోని బడంగ్పేట్ మేయర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, వారి బంధువులు, అనుచరుల ఇళ్లలో, బాలాపూర్ గణపతి లడ్డూను వేలంలో కొనుగోలు చేసిన వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. సీఆర్పిఎఫ్ బలగాల బందోబస్తు మధ్య దాదాపు 14 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి. ఇవి శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏకకాలంలో ఇద్దరి ఇళ్లపై దాడి తుక్కుగూడ సమీపంలో కేఎల్ఆర్ అక్బర్ ఫాం హౌస్‌లోని ఇంట్లో, ఆయన సొంత గ్రామమైన రంగారెడ్డి జిల్లా మాసానిగూడ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో, చర్లపల్లి, మొయినాబాద్ ఫామ్ హౌసుల్లో, గచ్చిబౌలి ఎన్సీసీలోని విల్లాలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం ఐదు గంటలకు మూడు ప్రైవేటు వాహనాల్లో ఐటీ అధికారులు కేఎల్ఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. కొద్దిపాటి నగదు సహా కీలక డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది. కేఎల్ఆర్ పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం అందడంతో పాటు, ఆదాయం, పన్ను చెల్లింపుల్లో భారీ వ్యత్యాసం కనిపించడం, ఆయన వ్యాపార లావాదేవీలకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. ఆ సమయంలో పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి ఇంట్లో లేరు. పారిజాత తిరుపతికి వెళ్లగా, నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నట్టు తెలిసింది. ఇంట్లో ఉన్న కుమార్తె నుంచి మొబైల్ ఫోన్‌ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. పారిజాత, నర్సింహారెడ్డికి సమాచారం ఇచ్చారు. ఇంట్లో లభించిన బ్యాంక్ పాస్‌బుక్కులు, డాక్యుమెంట్లను పరిశీలించారు. మరోవైపు కొందరు అధికారులు మేయర్‌ను తిరుపతిలో అదుపులోకి తీసుకుని చెన్నై మీదుగా సాయంత్రానికి నగరానికి తీసుకొచ్చారు. సాయంత్రం 4.56కు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన నర్సింహారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని ఇంటికి తీసుకువచ్చి విచారణ మొదలుపెట్టారు. గత కొంతకాలంగా వారు చేసిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంత నగదుతో పాటు కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్లు సమాచారం. కాగా మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారిలో పారిజాత కూడా ఉన్నారు. మహేశ్వరం టికెట్ కోసం భారీ ఎత్తున లాబీయింగ్ జరగడంతో కేఎల్ఆర్, పారిజాతల ఆర్థిక లావాదేవీలపై ఐటీ నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కోకాపేట హిడెన్ గార్డెన్లో.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీపీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ గిరిధర్‌రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. హైదరాబాద్ కోకాపేటలోని హిడెన్ గార్డెన్లో ఆయన నివాసం ఉంటున్నారు. గిరిధర్ రెడ్డి గత కొంతకాలంగా చేసిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలిసింది. మరోవైపు బాలాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు కొనసాగాయి. ఈ సమయంలో లక్ష్మారెడ్డితో పాటు కుటుంబసభ్యులు.. లక్ష్మారెడ్డి అన్న కొడుకు 3 రోజుల క్రితం మరణించడంతో అస్తికలు గంగలో కలిపేందుకు బయలుదేరుతున్నారు. దీంతో లక్ష్మారెడ్డితో కొద్దిసేపు మాట్లాడిన అధికారులు ఓ కాగితంపై సంతకం తీసుకుని ఆయన బయటకు వెళ్లేందుకు అనుమతించినట్లు తెలిసింది. రాజకీయ కక్షలో భాగంగానే..: కేఎల్ఆర్ ♦ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన ఇల్లు, కార్యాలయాలు, తన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని కేఎల్ఆర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి కుట్రపన్ని ఐటీ దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ తనకు కేటాయించిన తరువాత, ఉద్దేశపూర్వకంగా ఈ సోదాలు చేస్తున్నారని చెప్పారు. మంత్రి సబిత ప్రోద్బలంతోనే..: మేయర్ పారిజాత కాంగ్రెస్ పార్టీ బీ ఫాం కోసం ఎదురు చూస్తున్నా. ఈ సమయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ఐటీ రైడ్స్ చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోంది. మంత్రిగా ఆమె వేల కోట్లు సంపాదించారు. ఎన్నో ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. ఆమె ఇంటిపై దాడులు చేయకుండా కేవలం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నాపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం?. -
చంద్రబాబు మద్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదం
-
ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల టౌన్: ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదని జడ్చర్ల ఎమ్మెల్యే డా.లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం జడ్చర్ల మండలం శంకరాయపల్లి సమీపంలో నిర్మించిన పీఆర్టీయూ సంఘ భవనాన్ని ఎమ్మెల్సీ కె.జనార్దన్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో లక్ష్మారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటే కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయని, ఏ పథకం పెడితే ఎన్ని ఓట్లు వస్తాయో అని ఆలోచించటం సరైంది కాదన్నారు. వెనుకబడిన దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచించి దళితబంధు ప్రవేశపెడితే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని పేర్కొన్నారు. -
‘మంచి పాలనకు నిదర్శనాలు ఇవే’
సాక్షి, విశాఖపట్నం: మద్య సేవనం మనిషిలో పశుత్వాన్ని నిద్రలేపుతుందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గాంధీసెంటర్, జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో విశాఖ ద్వారకానగర్ గ్రంథాలయంలో శుక్రవారం మద్య విమోచన ప్రచార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ మద్య విమోచన కమిటీ ఛైర్మన్ వి.లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ‘మద్యం వద్దు.. కుటుంబం ముద్దు పోస్టర్’ను ఈ సందర్భంగా మంత్రి అవంతి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మద్య నిషేధం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పడిపోయినా లెక్క చేసేది లేదని.. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని సృష్టం చేశారు. మద్యపాన నిషేధానికి అంతా సహకరించాలి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మద్యపాన నిషేధానికి అందరూ సహకరించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎన్ శర్మ పిలుపునిచ్చారు. నగరంలో మద్యం బ్లాక్ విక్రయాలపై దృష్టి సారించాలని అధికారులను కోరారు. మద్యం విక్రయాలకు ఆధార్‌తో అనుసంధానం చేస్తే మైనర్లకు మద్యం అందే అవకాశం ఉండదని సూచించారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ప్రస్తుతించారు. మహోద్యమం కావాలి.. విశ్రాంత డీజీపీ వాసుదేవరావు మాట్లాడుతూ.. మద్య విమోచన ఉద్యమం మహోద్యమం కావాలని పిలుపునిచ్చారు. అవినీతి నిర్మూలన, మద్యపాన నిషేధం వంటి నిర్ణయాలు వైఎస్ జగన్ చేస్తోన్న మంచి పాలనకు నిదర్శనమన్నారు. వీటినే సామాన్యులు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, గాంధీ సెంటర్ అధ్యక్షులు ప్రొఫెసర్ బలమొహన్ దాస్, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి, మత్స్యకార నేత జానకి రామ్, ఎక్సైజ్ డీసీ శ్రీనివాసరావు, న్యాయ సలహాదారు రామకృష్ణ రావు, సమన్వయ కర్త సురేష్ బేత తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో అందుబాటులోకి ఎయిమ్స్ సేవలు
సాక్షి, హైదరాబాద్: సాధ్యమైనంత వరకు నిర్ణీత గడువు కంటే ముందే ఎయిమ్స్ వైద్య సేవలు రాష్ట్ర ప్రజలకు అందుతాయని వైద్య, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మా రెడ్డి పేర్కొన్నారు. ఎయిమ్స్ సేవలను వేగంగా అందించేందుకే దాదాపు నిర్మాణం పూర్తయిన బీబీ నగర్ నిమ్స్ ఆçస్పత్రిని ఎయిమ్స్‌కి అప్పగించామని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించిందని, సీఎం కేసీఆర్, ఎంపీలు, నాడు మంత్రిగా తాను అనేక సందర్భాల్లో చేసిన ప్రయత్నాల ఫలితం గా ఎయిమ్స్ వచ్చిందని గుర్తుచేశారు. ఎయి మ్స్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కేంద్రానికి, ప్రధానిని కలసి తీవ్రంగా ప్రయత్నించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఎయిమ్స్ని ప్రకటించిన కేంద్రం తెలంగాణను విస్మరించిందని పేర్కొన్నారు. దీంతో అప్పుడు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా తాను ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, జేపీ నడ్డాలను కలిశానని గుర్తు చేశారు. నడ్డా ఇక్కడకు వచ్చిన సమయంలోనూ ఎయిమ్స్ కోసం లేఖలు ఇచ్చామని తెలిపారు. ఇదే సమయంలో కేసీఆర్ ప్రధాని మోదీని కలిసి తెలంగాణ ఎయిమ్స్ కోసం విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు ఎయిమ్స్ ఇవ్వాలని అనేక సందర్భాలలో పట్టుబట్టారని గుర్తుచే శారు. కేంద్ర మంత్రివర్గం సోమవారం బీబీనగర్ నిమ్స్ ఉన్న చోటే ఎయిమ్స్‌కి పచ్చజెండా ఊపడంపై సంతోషం వ్యక్తం చేశారు. తొలిదశ పనులు ఈ ఏడాదిలోపే ప్రారంభమవుతాయని, ఈ లోగా ఎంబీబీఎస్, నర్సింగ్ కోర్సులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. దీని కోసం నోటిఫికేషన్ వేశారని, ఓపీనీ త్వరగా ప్రారంభించాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. -
అభివృద్ధే అండగా..
జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన లక్ష్మారెడ్డి కేసీఆర్ కేబినెట్లో కీలకమైన మంత్రి పదవి చేపట్టారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దాదాపు రూ.1000 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ముఖ్యంగా వైద్యశాఖ మంత్రి కావడంతో ఆ శాఖకు చెందిన పలు ఆస్పత్రుల భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల కొత్తవి ఏర్పాటయ్యాయి. జిల్లాలోని పేదలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందేలా మంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇక 2014 ఎన్నికల్లో జడ్చర్లలో లక్ష్మారెడ్డి పోటీకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిపై గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి పైనే పోటీ ఆయన పడుతున్నారు. ఇద్దరు హేమాహేమీలే కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ చరిష్మా, అభివృద్ధి పనులు, పాలమూరులో చేపట్టిన పలు పథకాలు తనను గెలిపిస్తాయని మంత్రి లక్ష్మారెడ్డి ధీమాతో ఉన్నారు. నాగర్‌కర్నూలు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందిన మల్లు రవి 2008లో జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. చంద్రశేఖర్‌పై విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖర్‌పైనే ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ తొలి జాబితాలోనే పేరు ప్రకటించడంతో ఈసారి మల్లు రవి ప్రచారం వెంటనే చేపట్టారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రత్యేకతలు - పోలేపల్లి సెజ్ ఈ ప్రాంతానికి తలమానికం - జడ్చర్లలో ప్రత్యేకంగా మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు - ఆస్పత్రులు, పీహెచ్‌సీల భవన నిర్మాణంపై ప్రత్యేక దృష్టి - జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆస్పత్రి - పట్టణంలో రహదారుల విస్తరణ, డివైడర్, బటర్ ఫ్లై లైట్లు - రూ.5 కోట్ల వ్యయంతో మినీ ట్యాంక్‌బండ్‌గా జడ్చర్ల చెరువు - బాదేపల్లిలో రైతుబజార్ ఏర్పాటుతో పాటు మండలాల్లో వ్యవసాయ గోదాముల నిర్మాణం - అన్ని గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణం, ఫైర్ స్టేషన్ ఏర్పాటు - బాలానగర్ మండల కేంద్రంలోనూ 30 పడకల ఆస్పత్రి భవనం ప్రధాన సమస్యలు - జడ్చర్లకు కరువు ప్రాంతంగా గుర్తింపు ఉంది. - సాగు నీటి సమస్య రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే దాదాపు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉంది. - స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. - జడ్చర్ల పట్టణంలో డ్రెయినేజీ సమస్య అలాగే ఉంది. సిట్టింగ్ ప్రొఫైల్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా (ప్రస్తుత నాగర్‌కర్నూల్ జిల్లా) తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన చర్లకోల లక్ష్మారెడ్డి వైద్య విద్య (బీహెచ్ఎంఎస్) పూర్తిచేశాక జడ్చర్లలో కొద్ది రోజులు ప్రజలకు వైద్య సేవలందించారు. 1988లో ఆవంచ గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరి తిమ్మాజీపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. 1995లో తిమ్మాజీపేట సింగిల్‌విండో అధ్యక్షుడిగా, 1996లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా పదవులు నిర్వర్తించారు. 1999లో జడ్చర్ల అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడారు. 2001లో టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతర క్రమంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ పిలుపు మేరకు 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఓటమి పాలయ్యారు. ఇక 2009 ఎన్నికల్లో మిత్రపక్షాల కలయికలో భాగంగా టీడీపీ నేతకు సీటు కేటాయించడంతో లక్ష్మారెడ్డి పోటీ చేసే అవకాశం దక్కలేదు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలో 14,734 ఓట్ల మెజార్టీతో జడ్చర్ల ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కేసీఆర్ మంత్రివర్గంలో మొదటగా విద్యుత్ శాఖ మంత్రిగా.. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో జడ్చర్ల స్థానం నుండి లక్ష్మారెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి సిద్ధమయ్యారు. ఇన్పుట్స్ : మేడిపల్లి శశిధర్‌రెడ్డి, జడ్చర్ల -
ఆరోగ్యశ్రీనే మిన్న
హైదరాబాద్: ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా మెరుగైన వైద్య సేవలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలోని 80 లక్షల కుటుంబాలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. దీనిపై బీజేపీ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. యూనివర్సల్ హెల్త్ కవరేజీ (యూహెచ్‌సీ)ని అమలుపరుస్తూ దేశానికి రాష్ట్రం ఓ రోల్ మోడల్‌గా నిలిచిందని కితాబిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశామని వెల్లడించారు. రూ.2 లక్షలకు మించిన వైద్యసేవలను కూడా ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. అవయవ మార్పిడి, డయాలసిస్, కీమోథెరపీ వంటి ఖరీదైన వైద్యాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. లైఫ్ సేవింగ్ మెడిసిన్ పేరుతో అవయవ మార్పిడులు చేసుకున్న వారికి జీవితాంతం మందులు, పరీక్షలు కూడా ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. మిగిలిన 20 లక్షల మంది కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వ వివిధ పథకాలైన ఆరోగ్య భద్రత, ఆర్టీసీ, సింగరేణి, ఈఎస్ఐ వంటి పథకాలతోపాటు మిగతా కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. 25 లక్షల కుటుంబాలకే బీమా.. ఆయుష్మాన్ భారత్ పథకానికి తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాలుగా తోడ్పాటు అందిస్తుందని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా 25 లక్షల కుటుంబాలకు మాత్రమే ఆరోగ్య బీమా లభించే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 80 లక్షల కుటుంబాలకు ఆరోగ్య బీమా అమలులో ఉందన్నారు. ఈ 80 లక్షల కుటుంబాలలో 25 లక్షల కుటుంబాలను గుర్తించి వారికి ఆయుష్మాన్ భారత్ ద్వారా బీమా అమలు చేసి, మిగతా 55 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ద్వారా బీమా కల్పించడమన్నది ఆచరణలో ఇబ్బంది కలిగించే విషయమన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభించిన తర్వాత సాధ్యాసాధ్యాలను చూసి అమలు చేయడానికి నిర్ణయించామని తెలిపారు. ఈ నిర్ణయం ప్రజలకు మేలు చేసేదే తప్ప ఎటువంటి హాని తలపెట్టదని స్పష్టం చేశారు. దీని వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని వెల్లడించారు. -
మంత్రి వర్సెస్ ముఖ్యకార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి మధ్య అధికార పోరు కొనసాగుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఆమెకు ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించింది. సీఎం కార్యాలయంలోనూ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో ముఖ్యకార్యదర్శిగా ఆమె కొనసాగుతున్నారు.ఎక్కువ మంది ఉద్యోగులు, విస్తృతమైన నెట్వర్క్ ఉండే వైద్య, ఆరోగ్య శాఖపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించట్లేరని, దీంతో సాధారణ వ్యవహారాలపై ప్రభావం పడుతోందని మంత్రి పేషీ అధికారులు చెబుతున్నారు. పట్టని మంత్రి హామీలు! లక్ష్మారెడ్డి తీసుకున్న నిర్ణయాలు, ప్రకటనల అమలు విషయంలో ముఖ్యకార్యదర్శి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల నీట్లో ఉత్తీర్ణత సాధించిన కొందరు రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. అక్కడ జరిగిన కౌన్సెలింగ్‌లో సీటు పొంది ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారు మన రాష్ట్రంలోని కౌన్సెలింగ్‌కూ హాజరయ్యారు. ఆ సందర్భంగా కస్టోడియన్ సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుందనే విషయంలో కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అంగీకరించలేదు. ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి సి.లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. అయితే ముఖ్యకార్యదర్శి దీన్ని పట్టించుకోలేదని తెలిసింది. సీఎం ప్రకటన అమల్లోనూ జాప్యం సీఎం కేసీఆర్ ఇటీవల జోగుళాంబ గద్వాల జిల్లా వెళ్లారు. గట్టు మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకలకు పెంచుతామని, వెంటనే ఉత్తర్వులు ఇస్తామని ప్రకటించారు. ఈ హామీ ఉత్తర్వుల ప్రక్రి య వెంటనే చేపట్టలేదు. కాస్త ఆలస్యంగా జూలై 19న ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చేందుకూ సీఎం ఇచ్చిన హామీ అమలు కాలేదని మంత్రి పేషీ అధికారులు చెబుతున్నారు. మరో 10 ఆస్పత్రుల అప్‌గ్రేడ్ అంశం లోనూ ఇలాగే జరుగుతోందని సమాచారం. కాగా, శాంతికుమారికి సచివాలయంలోనీ సీ బ్లాక్‌లో ఒక పేషీ, డీ బ్లాక్‌లో మరో పేషీ కేటాయించారు. సీఎంవో కార్యాలయ అధికారి హోదాలో ప్రగతిభవన్‌లోనూ ఒక పేషీ ఉంది. వైద్య, ఆరోగ్య శాఖ పరిపాలనా వ్యవహారాలపై వెంటనే నిర్ణయాలు తీసుకునేందుకు డీ బ్లాక్‌లోని పేషీలో అందుబాటులో ఉండాలి. అయితే చాలా తక్కువ సమయమే ఈ పేషీలో ఉంటున్నారని, దాంతో వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉంటున్నాయని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సీ బ్లాక్‌కు అనుమతి తీసుకున్న వారినే అనుమతిస్తారు. ఈ పరిస్థితితో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సైతం శాంతికుమారిని కలిసే పరిస్థితి ఉండట్లేదు. వైద్య, ఆరోగ్య శాఖ సమస్యలపై సచివాలయానికి వచ్చే ప్రతి ఒక్కరు మంత్రి పేషీకి వస్తున్నారు. ఇలా వచ్చే వారి సమస్యలను పరిష్కరించే ఉన్నతాధికారి అందుబాటులో లేకపోవడంతో మళ్లీ సచివాలయానికి రావాల్సి వస్తోంది. ఇలా ఎన్నిసార్లు వచ్చినా తాము ఏమీ చేయలేకపోతున్నామని మంత్రి పేషీ వర్గాలు చెబుతున్నాయి. -
ఇంగ్లండ్‌లో ప్రైవేటు వైద్యమే లేదు
సాక్షి, హైదరాబాద్ : ఇంగ్లండ్‌లో ప్రైవేటు వైద్యమే లేదని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. వారంరోజులుగా ఆ దేశంలో పర్యటిస్తున్న ఆయన, బుధవారం పలు ఆసుపత్రులను అధ్యయనం చేశారు. లండన్‌లోని జార్జ్ ఎలియట్ హాస్పిటల్, లండన్ యూనివర్సిటీ హాస్పిటల్, ఎన్హెచ్ఎస్ ట్రస్ట్ యూనివర్సిటీ హాస్పిటల్, కాన్వెంటీ అండ్ వార్విక్ షైర్ హాస్పిటళ్లని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రుల్లో ప్రజలకు అందిస్తున్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. చికిత్స పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి వైద్య ప్రముఖులతో చర్చించారు. క్యాన్సర్ వంటి వ్యాధుల మీద అక్కడి వైద్యులు కనబరుస్తున్న శ్రద్ధను పరికించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, వైద్యం విశ్వవ్యాప్తం అయిందన్నారు. రోగాలు, వైద్య చికిత్సలలో కొన్ని తేడాలు ఉన్నాయన్నారు. అయితే, మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రపంచంలో ఎక్కడ మెరుగైన పద్ధతులు ఉన్నా వాటిని అనుసరించడం మంచిదే అన్నారు. అందుకే తాము లండన్‌లో ఆసుపత్రులను సందర్శించామన్నారు. ఆ దేశంలో ప్రతి ఐదు వేల మందికి ఒక ప్రభుత్వ వైద్యుడు ఉన్నారన్నారు. తెలంగాణని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ తపన పడుతున్నారన్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి వైద్యాన్ని మన రాష్ట్రంలో అందిస్తున్నామని, ఇంకా మెరుగైన, సమర్థ వంతమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులు అధికారిక విదేశీ పర్యటనలు చేసి సొంత పనులు చూసుకునే వారని, తాను సొంత పనుల మీద, సొంత ఖర్చులతో విదేశాలకు వెళ్లి ఆసుపత్రులను పరిశీలించానని అన్నారు. కుమారుడి డిగ్రీ స్నాతకోత్సవానికి హాజరు మంత్రి లక్ష్మారెడ్డి కుమారుడు స్వరణ్‌కుమార్‌రెడ్డి గ్రాడ్యుయేషన్ స్నాతకోత్సవం లండన్‌లో జరిగింది. దీనికి లక్ష్మారెడ్డి, ఆయన సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. కాగా స్వరణ్ లండన్‌లోని వార్విక్షైర్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివారు. ఆ వర్సిటీ స్నాత కోత్సవ ఉత్సవంలో స్వరణ్‌కు డిగ్రీ ప్రదానం చేశారు. -
ఎయిమ్స్ సాధించాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను సాధించామని వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. 108 అంబులెన్స్ సేవలను అందించే 145 కొత్త వాహనాలను మంత్రి మంగళవారం ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్య, ఆరోగ్య శాఖ బలోపేతం అయ్యిందన్నారు. మొబైల్ వాహనాలతో సేవ లను మెరుగుపరిచామని పేర్కొన్నారు. అత్యవసర వైద్య సేవలకు 108, అమ్మ ఒడి సేవలకు 102, పార్థివ శరీరాలను తరలించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. 108 ద్విచక్ర వాహన సేవలను కూడా ప్రారంభించామన్నారు. రాష్ట్రానికి ఎయిమ్స్‌ను సాధించామని, సాధ్యమైనంత త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు చర్యలు దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రపంచ ఆరో గ్య సంస్థ ప్రతినిధులతో సచివాలయంలో దీర్ఘకాలిక వ్యాధుల నివారణ చర్యలపై చర్చించారు. రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. -
కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలి
జడ్చర్ల: కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టిన తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని.. అదే తరహాలో తెలంగాణ నుం డి శాశ్వతంగా ఆ పార్టీని తరిమేస్తేనే అభివృద్ధి ఉరకలేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలో రూ.1.25 కోట్లతో నిర్మించిన రైతుబజార్‌ను శుక్రవారం ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ నేతలు నేడు పనిలేక బస్సు యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తు న్న ఘనత తమకే దక్కుతుందని.. ఏటా సంక్షేమ పథకాల కోసం రూ.40వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులను తలదన్నేలా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దామని చెప్పారు. అభివృద్ధికి సంబందించి ప్రజల్లో చర్చ జరగాలని, గత పాలన.. టీఆర్ఎస్ పాలనను పోల్చిచూడాల ని కోరారు. కాగా, రోడ్ల వెంట ఇబ్బంది పడకుండా చిరువ్యాపారుల కోసం రైతు బజార్ ఏర్పాటుచేశామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కూరగాయలు కొనుగోలు చేసి తన సతీమణి శ్వేతకు అందజేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం బాదేపల్లి మార్కెట్లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి లక్ష్మారెడ్డి లాంఛనంగా ప్రారంబించారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. జడ్చర్ల మార్కెట్ చైర్పర్సన్ శోభ, జెడ్పీటీసీ సభ్యురాలు జయప్రద, ఎంపీపీలు లక్ష్మి, దీప, వైస్ చైర్మన్ శ్రీశైలం, డీఎంఓ భాస్కరయ్య, డైరెక్టర్లు గోవర్దన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, జగన్, డీసీఓ అరుణ, ఏడీఏ నిర్మల, సింగిల్ విండో వైస్‌చైర్మన్ శివకుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్యతో పాటు రమేశ్‌రెడ్డి, ఇమ్ము పాల్గొన్నారు. మద్దతు ధర కోసమే మిడ్జిల్(జడ్చర్ల): రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయిస్తూ నష్టపోకుండా ఉండడమే కోసమే తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తోందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. సింగిల్ విండో కార్యాలయం వద్ద కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకొస్తే ఏ గ్రేడ్ క్వింటాకు రూ.1,590, బీ గ్రేడ్‌కు రూ.1,550 చెల్లిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ హైమావతి, ఎంపీపీ దీప, తహసీల్దార్ పాండునాయక్, వైస్ ఎంపీపీ సుదర్శన్, సింగిల్ విండో చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు బోయిన్పల్లి శ్యాంసుందర్‌రెడ్డి, కార్యదర్శి నారణ్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గిరినాయక్, నాయకులు బాల్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కాడయ్య, వెంకట్, కృష్ణ, సరోజ, ఆచారి, దేవరాజు పాల్గొన్నారు. -
'కేసీఆర్ కిట్లు' అమలు కోసమే..
సాక్షి, జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి సందర్శించారు. కేసీఆర్ కిట్ల పథకంలో భాగంగా 102 వాహనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్‌లోని అదనపు ప్రసూతి గదులు, ఆయుష్ వంటి వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కిట్ల పథకం అమలు కోసమే 102 వాహనాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ వాహనాల ద్వారా గర్భిణీలను ఆస్పత్రికి తీసుకురావడం, ప్రసూతి తర్వాత తిరిగి వారిని ఇళ్లకు చేర్చడం జరుగుతుందన్నారు. 102 వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాధ్యమైనంత వరకు ఆపరేషన్లు లేని ప్రసూతిలు జరిగేటట్టు చూడాలన్నారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించడానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చడానికి త్వరలోనే నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. -
కొత్తగా 8 కేన్సర్ చికిత్స కేంద్రాలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 8 కేన్సర్ స్క్రీనింగ్, చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం అవసరమైన సాంకేతికత, పరికరాలు, ఇతర సహకారాలను టాటా ట్రస్ట్‌తో తీసుకోవాలని భావిస్తోంది. వైద్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డితో టాటా ట్రస్ట్ ప్రతినిధులు బుధవారం సమావేశమయ్యారు. వైద్యరంగంలో విశేష కృషి చేస్తోన్న టాటా ట్రస్ట్ తెలంగాణలోనూ తమ సేవ లు అందించడానికి ముందుకు వచ్చింది. కేన్సర్ వైద్య పరీక్షలు, చికిత్సకు సంబంధించి తమ సహకారం అందించడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. సాంకేతికంగా, ఇతరత్రా అవసరమైన సహా య సహకారాలను అందిస్తామని టాటా ట్రస్టు ప్రతినిధులు మంత్రికి తెలిపారు. ఎంఎన్‌జే హాస్పిటల్ కేంద్రంగా.. ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్ కేంద్రంగా రాష్ట్రంలో 8 కేన్సర్ స్క్రీనింగ్, చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్, వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ, మహబూబ్‌నగర్‌లోని మెడికల్ కాలేజీ, నిజామాబాద్‌లోని మెడికల్ కాలేజీల పరిధులలో ఒక్కొక్కటి.. ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో ఎంఎన్‌జే హాస్పిటల్లోనే కేన్సర్ పరీక్షలు, చికిత్సలు జరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, ఎన్హెచ్ఎం సీపీవో జి.శ్రీనివాస్, టాటా ట్రస్ట్ ప్రతినిధులు శ్రీనివాస్, అభిషేక్, మృణాళిని తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
రోడ్లకు మహర్దశ వచ్చింది: లక్ష్మారెడ్డి
సాక్షి, జడ్చర్ల: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రోడ్లకు మహర్దశ పట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రూ. 4 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్లకు ఈ రోజు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక రోడ్లు నిర్మాణం చురుకుగా జరుగుతోంది. గతంలో ఒక్క రోడ్డుకు నిధులు మంజూరు కావాలంటే ఆ ఎమ్మెల్యే పదవీకాలం పూర్తయ్యేది కానీ ఇప్పడు అలాంటి పరిస్థితి లేదు. ప్రతి గ్రామానికి రోడ్లు వేయడమే టీఆర్ఎస్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. -
నేరెళ్ల బాధితులతో కాంగ్రెస్ రాజకీయం
మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: నేరెళ్ల బాధితులను ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి విమర్శించారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్న నిమ్స్ ఆస్పత్రిపైనా రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆరుగురు నేరెళ్ల బాధితులకు నిమ్స్‌లో చికిత్స అందించలేదనే ఆరోపణలు అబద్ధమన్నారు. ప్రభుత్వంపై మాట్లాడేందుకు ఏమీ లేక కాంగ్రెస్ నాయకులు ఇలాంటి విమర్శలకు దిగుతున్నారన్నారు. నేరెళ్ల బాధితులకు నిమ్స్‌లో అన్ని పరీక్షలూ చేశారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. వారు ఇన్‌పేషెంట్స్‌గా ఉండాల్సిన అవసరం లేదని వైద్యులు ధ్రువీకరించారన్నారు. ఒకవేళ నిమ్స్ పరీక్షలు తప్పయితే, వారు చికిత్స చేయించుకున్న ప్రైవేటు ఆస్పత్రి కూడా ఇన్పేషెంట్లుగా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎంత ఖర్చయినా వారికి వైద్యం చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ధర్నా చేసినందు వల్లే పోలీసులు నిమ్స్‌కు వచ్చారన్నారు. చికిత్స ప్రక్రియలో పోలీసులది గానీ, మరొకరి జోక్యంగానీ లేదని చెప్పారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి.. పక్క రాష్ట్రానికి తీసుకెళ్లి వారికి చికిత్స ఇప్పిస్తామని మాట్లాడుతున్నారని, ఆ అవసరం లేదని మంత్రి చెప్పారు. నిమ్స్‌లో అన్ని వైద్య సదుపాయాలూ ఉన్నాయని తెలిపారు. వారికి అన్ని రకాల చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. -
ఆన్లైన్లో డ్రగ్స్ లైసెన్స్: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం ముందువరుసలో ఉందని వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. సరళతర వాణిజ్య విధానంలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలో సేవలను ఆన్లైన్ ద్వారా అందించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటికే ఈ–ఔషధి, ఈహెచ్ఎస్, ఆరోగ్యశ్రీ వంటిని ప్రారంభిం చామని, తాజాగా డ్రగ్ లైసెన్స్‌ల జారీ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానాన్ని లక్ష్మారెడ్డి శుక్రవారం సచివాలయంలో ప్రారంభించారు. ఆన్లైన్ డ్రగ్ లైసెన్స్ విధానంతో ఎన్నో ఉపయోగాలున్నా యని, జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఔషధాల తయారీ దారులు, రిటైల్, హోల్‌సేల్ డీలర్లు ఇక నుంచి ఆన్లైన్లోనే అనుమతులు పొందొచ్చని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో తొలి సారిగా వైద్య విద్య పరిశోధన కోసం ప్రభుత్వం రూ.12 కోట్లు కేటాయించిందన్నారు. దీనికోసం ప్రత్యేకంగా మెరిట్(మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఇన్ తెలంగాణ) పేరుతో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో 165 పడకలతో ఐసీయూ, అత్యాధునిక ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వెరికోస్ వీన్స్ (నరాలు ముడత పడటం) వ్యాధికి ఇకపై ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తామని తెలిపారు. -
మంత్రి లక్ష్మారెడ్డిని కలసిన రాష్ట్రపతి పురస్కార గ్రహీత
హైదరాబాద్: రాష్ట్రపతి పురస్కార గ్రహీత నల్లగొండ జిల్లా చింతపల్లి పీహెచ్సీ ఏఎన్ఎం గున్న జయ గురువారం వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలిశారు. 2017 సంవత్సరానికి కుటుంబ నియంత్రణ, ఇమ్యూనైజేషన్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు... తదితర అంశాల్లో ఆమె పనితీరుకు పురస్కారం దక్కింది. ఈమేరకు ఆమె మంత్రిని కలసి పురస్కారం గురించి వివరించారు. -
ఆస్పత్రుల్లో ప్రసూతికి ప్రోత్సాహకాలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల పెంపునకు చర్యలు: లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేం దుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోందని వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ‘అమ్మ ఒడి’ వాహనాల గురించి టీఆర్ఎస్ సభ్యులు గొంగిడి సునీత, అజ్మీరా రేఖ, కోవా లక్ష్మి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధా నమిచ్చారు. గిరిజన ప్రాంతాలలో ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు ‘అమ్మ ఒడి’ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ పథకం కింద గర్భిణులకు వైద్యసాయం అందించేందుకు 41 వాహనాలను ఏర్పాటు చేశామని.. కార్యక్రమాన్ని త్వరలో రాష్ట్ర మంతటా విస్తరిస్తామన్నారు. తమిళనాడు తరహాలో మన రాష్ట్రంలోనూ ప్రసూతి ప్రోత్సాహకాలను ఇచ్చే యోచన ఉందని.. వచ్చే బడ్జెట్లో మంచి పథకంతో ముందు కొస్తామని చెప్పారు. అవసరం లేకున్నా సిజేరియన్లు చేస్తున్నారన్న అంశం ప్రభుత్వ దృష్టిలో ఉందని.. దాన్ని నివారించేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఆశ వర్కర్లకు చేయూతనివ్వండి: కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గర్భిణులకు సేవల అంశంపై కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి (కాంగ్రెస్) మాట్లాడు తూ.. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులకు ఆశ వర్కర్లు మంచి సేవలు అందిస్తున్నా రని, వారు కోరినట్లుగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. -
డెంగీ మరణాలు రెండే..
సాక్షి, ఖమ్మం: ‘ఏ ఫీవర్ అరుునా ప్లేట్లెట్స్ కొంత మేర తగ్గుతారుు. అది డెంగీ కాదు. ఐజీఎం పాజిటివ్ వస్తేనే డెంగీ. ఈ లక్షణాలతో ఇక్కడ చనిపోరుుంది ఇద్దరు మాత్రమే. వారు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని మరణించిన వారే. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న వారిలో ఎవరూ చనిపోలేదు.’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని గోవిందాపురం, రావినూతలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ఆయన పరిశీలించారు. గోవిందాపురం(ఎల్)లో డెంగీతో మృతి చెందిన ఏసుపోగు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శిం చారు. బోనకల్ పీహెచ్సీలో విషజ్వరాలతో చికిత్స పొందుతున్న వారిని వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బోనకల్ మండలంలోని మరణాలు వివిధ కారణాలతో జరిగినవే తప్ప డెంగీతో కాదని పేర్కొన్నారు. పాజిటివ్ కేసులు చాలా తక్కువనే ఉన్నాయన్నారు. గోవిందాపురం, రావినూతల, బోనకల్లో మందులు, కిట్స్, డాక్టర్లను అదనంగా నియమించామన్నారు. ఈ గ్రామాల్లో 104, 108 వాహనాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని తెలి పారు. అంతేకాకుండా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖతోపాటు రాజధాని నుంచి వైద్యాధికారుల బృందాన్ని పంపించామని వివరించారు. పీహెచ్సీ, గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అదనంగా డాక్టర్లు, బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యాన్ని, ఇతర వసతులను మెరుగు పరచాలని జిల్లా యం త్రాంగానికి సూచించామన్నారు. రోడ్లు భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో విషజ్వరాల తీవ్రత ఉన్న నాలుగైదు గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం, మంచి నీటికి ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ డెరైక్టర్ లలితకుమారి, అడిషనల్ డెరైక్టర్లు ప్రభావతి, శంకర్, జిల్లా కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ పాల్గొన్నారు. రావినూతలను పరామర్శించలేదు.. రావినూతలలో మంగళవారం నాటితో కలుపుకొని మొత్తం 9 మంది డెంగీ జ్వరంతో మృతి చెందారు. అయితే, జీపీలో ఏర్పాటు చేసిన వైద్యశిబి రంలో చికిత్స పొందుతున్న వారిని మంత్రులు లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారే తప్ప.. ఒక్క మృతుల కుటుం బాన్ని కూడా పరామర్శించలేదు. ప్రతిపక్షాలది అబద్ధ్దపు ప్రచారం సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా బోనకల్లో డెంగీ కారణంగా 22 మంది చనిపోయారంటూ ప్రచారం చేయడంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షాలు అబద్ధ్దాలను ప్రచా రం చేస్తున్నాయన్నారు. బోనకల్ మండలంలో మంగళవారం హుటాహుటిన పర్యటించిన మంత్రి లక్ష్మారెడ్డి ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడారు. తాను మూడు గ్రామాల్లో పర్యటించానన్నారు. ప్రస్తుతం పరిస్థితి అంతా నియంత్రణలో ఉందన్నా రు. డెంగీపై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన పనిలేదని విజ్ఞప్తి చేశారు. -
సగం ధరకే కార్పొరేట్ వైద్యం
► ఉద్యోగులు, జర్నలిస్టుల వైద్యసేవలపై ప్రభుత్వం కొత్త ప్రతిపాదన ► అంగీకరించిన కార్పొరేట్ ఆసుపత్రులు! ► వచ్చే నెలలో జర్నలిస్టులందరికీ ఆరోగ్య కార్డులు: మంత్రి లక్ష్మారెడ్డి ► హైదరాబాద్‌లో 6 చోట్ల, పాత జిల్లా కేంద్రాల్లో రిఫరల్ ఆసుపత్రులు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడనుంది. రాష్ట్రంలోని కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులన్నింట్లోనూ ఉద్యోగులు, జర్నలిస్టులకు సగం ధరకే వైద్య చికిత్సలు అందుబాటులోకి తీసుకురావాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. సాధారణంగా వివిధ వైద్య చికిత్సలకు ఆయా ఆసుపత్రులు వసూలు చేసే సొమ్ములో సగం చెల్లించేలా అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రస్తుత ప్యాకేజీ సరిపోవడం లేదని, దాన్ని 60 శాతం వరకు పెంచాలని కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వాన్ని కోరాయి. ప్యాకేజీ పెంపు, ఉచిత ఓపీ సేవల విషయంలోనే ఏడాదిన్నరగా సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రులు వివిధ వైద్య సేవలకు వసూలు చేసే సొమ్ములో సగమే చెల్లిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇలా చేసినా ప్రస్తుత ప్యాకేజీని 30 నుంచి 40 శాతం వరకు పెంచినట్లే అవుతుందని అంచనా. సరికొత్త ప్రతిపాదనను కార్పొరేట్ యాజమాన్యాలు కూడా అంగీకరించాయని అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి శనివారం సాయంత్రం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ మనోహర్, ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం(ఈజేహెచ్ఎస్) సీఈవో డాక్టర్ పద్మ తదితర ఉన్నతాధికారులతో సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల రెండో తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో ప్రత్యేకంగా సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం ఐదారు తేదీల నుంచి ఈ పథకాన్ని సమగ్రంగా అమలు చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు కూడా అన్ని వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. వచ్చే నెలాఖరులోగా అందరికీ నగదు రహిత ఆరోగ్య కార్డులు అందజేస్తామన్నారు. హైదరాబాద్‌లో ఆరు చోట్ల, పాత జిల్లా కేంద్రాలన్నింటా రిఫరల్ ఆసుపత్రులు ఇక నుంచి ఉద్యోగులు, జర్నలిస్టులు నేరుగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లే అవకాశం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే రిఫరల్ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకున్నాక అవసరమని డాక్టర్లు రిఫర్ చేస్తేనే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుతాయి. హైదరాబాద్‌లో ఖైరతాబాద్, కూకట్పల్లి, వనస్థలిపురం ప్రాంతాల్లో... గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రుల్లో ఉద్యోగుల రిఫరల్ కేంద్రాలు నెలకొల్పుతారు. పాత జిల్లా కేంద్రాలన్నింటిలోనూ ఈ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తారు. వీటిలో అత్యాధునిక డయాగ్నస్టిక్ పరికరాలను అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య అత్యవసర వైద్యం చేయించుకోవాల్సి వస్తే నేరుగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లడానికి అవకాశమిస్తారు. ఏ సమయంలోనైనా గుండెపోటు వంటివి వస్తే కూడా కార్పొరేట్ లేదా ఇతర నెట్వర్క్ ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా వెళ్లవచ్చు. రిఫరల్ ఆసుపత్రుల్లో బ్రాండెడ్ మందులనే సరఫరా చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబీకులకు ఏడాదికోసారి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎగ్జిక్యూటివ్ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని విడతల వారీగా అమలు చేస్తామని ైవె ద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
1 నుంచి క్యాష్‌లెస్ కార్పొరేట్ వైద్యం
ప్రభుత్వోద్యోగులకు పక్కాగా అమలుకు సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు నగదురహిత కార్పొరేట్ వైద్యాన్ని పక్కాగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటివరకు ప్రభుత్వం వద్దకు వచ్చిన ప్రతి పాదనలపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ప్యాకేజీ సొమ్మును పెంచాలన్న కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల విజ్ఞప్తి మేరకు శస్త్రచికిత్సల ప్యాకేజీని దాదాపు 40 శాతం పెంచడానికి సర్కారు సుముఖంగా ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ సర్కారు ప్రభుతోద్యోగులకు నగదురహిత ఆరోగ్య కార్డులను ఇచ్చింది. అయితే ఆరోగ్య కార్డుల కింద కేవలం ఆరోగ్యశ్రీ పరిధిలోని నెట్వర్క్, ఇతర ప్రైవేటు ఆస్పత్రులే ఉద్యోగులకు వైద్యం చేస్తున్నాయి. కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఈ కార్డుల ద్వారా వైద్యం చేయడంలేదు. ఆరోగ్యశ్రీలో వివిధ వ్యాధులకు ప్రభుత్వం చెల్లించే ప్యాకేజీ సొమ్ము ప్రకారం ప్రభుత్వోద్యోగులకు వైద్యం చేయడం తమకు గిట్టుబాటు కాదని... కాబట్టి నగదు రహిత ఆరోగ్య కార్డుల కింద వైద్యం చేయబోమని కార్పొరేట్ యాజమాన్యాలు తెగేసి చెప్పాయి. దీంతో ఈ అంశం ఏడాదిన్నరగా అపరిష్కృతంగా మిగిలింది. మరోవైపు ఆరోగ్యశ్రీ కింద పేదలకు అందుతున్న సేవలతోపాటు ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులు తరచూ ఆరోగ్యశ్రీ రోగులకు వైద్య సేవలను నిలిపివేయడంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్లు తెలిసిం ది. దీంతో ఈ రెండు అంశాలపై మంత్రి లక్ష్మారెడ్డి శనివారం ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. ప్రభుత్వోద్యోగులకు నగదు రహిత కార్పొరేట్ వైద్యం అమలు, ఆరోగ్యశ్రీ సేవల్లో అవాంతరాల తొలగింపుపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారని తెలిసింది. ఉద్యోగుల నుంచి నెలవారీ ప్రీమియం! రాష్ట్రంలో 3.5లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, 2.4 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తంగా 20 లక్షల మందికిపైగా ఆరోగ్య కార్డుల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. శస్త్రచికిత్సల ప్యాకజీని 40శాతం పెంచేట్లయితే ప్రభుత్వంపై భారం పడకుండా ఉండేందుకు తమ వంతుగా నెలకు రూ.75కోట్లను ప్రీమియంగా చెల్లిస్తామని ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఉద్యోగుల నుంచి ప్రీమియాన్ని వసూలు చేయాలా వద్దా అనే అంశంపై సర్కారు వారంలో నిర్ణయం తీసుకోనుంది. కాగా, ప్రభుత్వోద్యోగులకు వైద్య సేవల అంశంపై శనివారం వివిధ కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చించిన మంత్రి లకా్ష్మరెడ్డి దీనిపై ఈ నెల 25న మరోసారి వారితో చర్చించనున్నారు. -
హైదరాబాద్‌లో ఇండో యూకే ఆసుపత్రి
♦ సహకరిస్తామన్న సీఎం కేసీఆర్ ♦ ఔటర్ రింగ్‌రోడ్ సమీపంలో స్థలం కేటాయిస్తామని హామీ ♦ ముఖ్యమంత్రిని కలసిన ప్రతినిధి బృందం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో వెయ్యి పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ఇండో-యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ముందుకొచ్చింది. ఆసుపత్రి ఏర్పాటుకు కావాల్సిన సహకారం అందించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంగీకరించారు. ఆసుపత్రికి కావాల్సిన స్థలం సమకూర్చడంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు అందిస్తామని చెప్పారు. ఈ మేరకు ఇండో-యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చైర్మన్ మైక్ పార్కర్, గ్రూప్ సీఈవో డాక్టర్ అజయ్ రంజన్ గుప్తా, భారత్‌లో బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ మైక్ నితా రికాన్సిస్, భారత ప్రభుత్వ ఇన్వెస్ట్ ఇండియా గ్రూప్ మేనేజర్ ఉదయ్ మంజుల్ తదితరులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని హంగులతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నెలకొల్పుతామని... పూర్తిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో నిర్మించే ఆసుపత్రికి కావాల్సిన స్థలం ఇవ్వాలని కోరారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిం చారు. నగర శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో స్థలం ఇవ్వడానికి అంగీకరించారు. ఈ సమావేశంలో మంత్రులు లక్ష్మారెడ్డి, హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి తివారీ, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఇద్దరిలో మొదలైన దడ
♦ ‘పంచాంగం’లో అవినీతి ప్రస్తావన మర్మమేంటి? ♦ సహచర మంత్రులతో లక్ష్మారెడ్డి, కడియం వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: మామూలుగా ప్రభు త్వ యంత్రాంగానికి అవినీతి అన్న చెడ్డ పేరు ఉంది. ఇదేదో ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు.. రేపో మాపో అంతమయ్యేది అంతకంటే కాదు! ఏ పని జర గాలన్నా అంతో ఇంతో ముట్టజెప్పుకోవాల్సిందేనన్న భావన ప్రజల్లో నెలకొంది. ఏ శాఖలో అవినీతి ఎక్కువ అంటే ప్రజలు మొదటగా చెప్పేది రెవెన్యూ, రెండోది మున్సిపల్ శాఖ! మరి దుర్ముఖి నామ సంవత్సర పంచాంగ పఠనంలో పండితుడు బాచంపల్లి సంతోష్‌కుమార్ విద్య, వైద్య శాఖల్లో అవినీతి పెచ్చరిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పంచాంగ పఠనంలో చెప్పడంతో అక్కడే ఉన్న ఆ శాఖల మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి నివ్వెరపోయారు. పైకి నవ్వు తూ కనిపించినా తమ రెండు శాఖల పేర్లే ఎందుకు వచ్చాయో అంటూ సహచర మంత్రుల వద్ద వ్యాఖ్యలు చేశారు. పంచాంగ పండితుడు ఈ విషయాలు చెప్పడాన్ని మంత్రులు తేలిగ్గా తీసుకున్నట్లు బయటకు కనిపిస్తున్నా దీని వెనుక మరేదైనా మర్మం ఉందా అని ఆరా తీస్తున్నారు. ఒక మంత్రి అయితే పంచాంగ పఠనం తర్వాత పండితుడి దగ్గరకు వెళ్లి ఆ రెండు శాఖల్లోనే అవినీతి ఉంటుందని ఎలా చెప్పగలిగారని అడిగారు. దానికి ఆయన మౌనంగా ఉన్నారట. పంచాంగ పఠనంలో పాల్గొన్న మంత్రులందరిలోనూ దీని పైనే చర్చ జరిగింది. ఆ తర్వాత మాట్లాడిన సీఎం కేసీఆర్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి నవ్వుతూనే జాగ్రత్తగా ఉండాలని ఆ ఇద్దరు మంత్రులకు సూచించారు!