రైతుబజార్‌ను ప్రారంభించి కూరగాయలు కొనుగోలు చేస్తున్న మంత్రి
జడ్చర్ల: కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టిన తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని.. అదే తరహాలో తెలంగాణ నుం డి శాశ్వతంగా ఆ పార్టీని తరిమేస్తేనే అభివృద్ధి ఉరకలేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలో రూ.1.25 కోట్లతో నిర్మించిన రైతుబజార్‌ను శుక్రవారం ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ నేతలు నేడు పనిలేక బస్సు యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తు న్న ఘనత తమకే దక్కుతుందని.. ఏటా సంక్షేమ పథకాల కోసం రూ.40వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులను తలదన్నేలా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దామని చెప్పారు. అభివృద్ధికి సంబందించి ప్రజల్లో చర్చ జరగాలని, గత పాలన.. టీఆర్‌ఎస్ పాలనను పోల్చిచూడాల ని కోరారు. కాగా, రోడ్ల వెంట ఇబ్బంది పడకుండా చిరువ్యాపారుల కోసం రైతు బజార్ ఏర్పాటుచేశామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కూరగాయలు కొనుగోలు చేసి తన సతీమణి శ్వేతకు అందజేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం
బాదేపల్లి మార్కెట్‌లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి లక్ష్మారెడ్డి లాంఛనంగా ప్రారంబించారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. జడ్చర్ల మార్కెట్ చైర్‌పర్సన్ శోభ, జెడ్పీటీసీ సభ్యురాలు జయప్రద, ఎంపీపీలు లక్ష్మి, దీప, వైస్ చైర్మన్ శ్రీశైలం, డీఎంఓ భాస్కరయ్య, డైరెక్టర్లు గోవర్దన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, జగన్, డీసీఓ అరుణ, ఏడీఏ నిర్మల, సింగిల్ విండో వైస్‌చైర్మన్ శివకుమార్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్యతో పాటు రమేశ్‌రెడ్డి, ఇమ్ము పాల్గొన్నారు.
మద్దతు ధర కోసమే
మిడ్జిల్(జడ్చర్ల): రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయిస్తూ నష్టపోకుండా ఉండడమే కోసమే తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తోందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. సింగిల్ విండో కార్యాలయం వద్ద కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకొస్తే ఏ గ్రేడ్ క్వింటాకు రూ.1,590, బీ గ్రేడ్‌కు రూ.1,550 చెల్లిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ హైమావతి, ఎంపీపీ దీప, తహసీల్దార్ పాండునాయక్, వైస్ ఎంపీపీ సుదర్శన్, సింగిల్ విండో చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు బోయిన్‌పల్లి శ్యాంసుందర్‌రెడ్డి, కార్యదర్శి నారణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గిరినాయక్, నాయకులు బాల్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కాడయ్య, వెంకట్, కృష్ణ, సరోజ, ఆచారి, దేవరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment