సాక్షి, జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి సందర్శించారు. కేసీఆర్ కిట్ల పథకంలో భాగంగా 102 వాహనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్‌లోని అదనపు ప్రసూతి గదులు, ఆయుష్ వంటి వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కిట్ల పథకం అమలు కోసమే 102 వాహనాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ వాహనాల ద్వారా గర్భిణీలను ఆస్పత్రికి తీసుకురావడం, ప్రసూతి తర్వాత తిరిగి వారిని ఇళ్లకు చేర్చడం జరుగుతుందన్నారు. 102 వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాధ్యమైనంత వరకు ఆపరేషన్లు లేని ప్రసూతిలు జరిగేటట్టు చూడాలన్నారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించడానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చడానికి త్వరలోనే నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment