హైదరాబాద్‌లో ఇండో యూకే ఆసుపత్రి | Indo-UK hospital in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఇండో యూకే ఆసుపత్రి

Apr 26 2016 4:51 AM | Updated on Aug 14 2018 10:54 AM

హైదరాబాద్‌లో ఇండో యూకే ఆసుపత్రి - Sakshi

హైదరాబాద్‌లో ఇండో యూకే ఆసుపత్రి

హైదరాబాద్‌లో వెయ్యి పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ముందుకొచ్చింది.

♦ సహకరిస్తామన్న సీఎం కేసీఆర్
♦ ఔటర్ రింగ్‌రోడ్ సమీపంలో స్థలం కేటాయిస్తామని హామీ
♦ ముఖ్యమంత్రిని కలసిన ప్రతినిధి బృందం
 
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో వెయ్యి పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ముందుకొచ్చింది. ఆసుపత్రి ఏర్పాటుకు కావాల్సిన సహకారం అందించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంగీకరించారు. ఆసుపత్రికి కావాల్సిన స్థలం సమకూర్చడంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు అందిస్తామని చెప్పారు. ఈ మేరకు ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చైర్మన్ మైక్ పార్కర్, గ్రూప్ సీఈవో డాక్టర్ అజయ్ రంజన్ గుప్తా, భారత్‌లో బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ మైక్ నితా రికాన్సిస్, భారత ప్రభుత్వ ఇన్వెస్ట్ ఇండియా గ్రూప్ మేనేజర్ ఉదయ్ మంజుల్ తదితరులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని హంగులతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నెలకొల్పుతామని... పూర్తిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో నిర్మించే ఆసుపత్రికి కావాల్సిన స్థలం ఇవ్వాలని కోరారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిం చారు. నగర శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో స్థలం ఇవ్వడానికి అంగీకరించారు. ఈ సమావేశంలో మంత్రులు లక్ష్మారెడ్డి, హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి తివారీ, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement