డెంగీ మరణాలు రెండే..
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బోనకల్ మండలంలోని మరణాలు వివిధ కారణాలతో జరిగినవే తప్ప డెంగీతో కాదని పేర్కొన్నారు. పాజిటివ్ కేసులు చాలా తక్కువనే ఉన్నాయన్నారు. గోవిందాపురం, రావినూతల, బోనకల్‌లో మందులు, కిట్స్, డాక్టర్లను అదనంగా నియమించామన్నారు. ఈ గ్రామాల్లో 104, 108 వాహనాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని తెలి పారు. అంతేకాకుండా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖతోపాటు రాజధాని నుంచి వైద్యాధికారుల బృందాన్ని పంపించామని వివరించారు. పీహెచ్‌సీ, గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అదనంగా డాక్టర్లు, బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యాన్ని, ఇతర వసతులను మెరుగు పరచాలని జిల్లా యం త్రాంగానికి సూచించామన్నారు. రోడ్లు భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో విషజ్వరాల తీవ్రత ఉన్న నాలుగైదు గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం, మంచి నీటికి ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ డెరైక్టర్ లలితకుమారి, అడిషనల్ డెరైక్టర్లు ప్రభావతి, శంకర్, జిల్లా కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ పాల్గొన్నారు.
రావినూతలను పరామర్శించలేదు..
రావినూతలలో మంగళవారం నాటితో కలుపుకొని మొత్తం 9 మంది డెంగీ జ్వరంతో మృతి చెందారు. అయితే, జీపీలో ఏర్పాటు చేసిన వైద్యశిబి రంలో చికిత్స పొందుతున్న వారిని మంత్రులు లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారే తప్ప.. ఒక్క మృతుల కుటుం బాన్ని కూడా పరామర్శించలేదు.
ప్రతిపక్షాలది అబద్ధ్దపు ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా బోనకల్‌లో డెంగీ కారణంగా 22 మంది చనిపోయారంటూ ప్రచారం చేయడంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షాలు అబద్ధ్దాలను ప్రచా రం చేస్తున్నాయన్నారు. బోనకల్ మండలంలో మంగళవారం హుటాహుటిన పర్యటించిన మంత్రి లక్ష్మారెడ్డి ఫోన్‌లో ‘సాక్షి’తో మాట్లాడారు. తాను మూడు గ్రామాల్లో పర్యటించానన్నారు. ప్రస్తుతం పరిస్థితి అంతా నియంత్రణలో ఉందన్నా రు. డెంగీపై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన పనిలేదని విజ్ఞప్తి చేశారు.