
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను సాధించామని వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. 108 అంబులెన్స్ సేవలను అందించే 145 కొత్త వాహనాలను మంత్రి మంగళవారం ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్య, ఆరోగ్య శాఖ బలోపేతం అయ్యిందన్నారు. మొబైల్ వాహనాలతో సేవ లను మెరుగుపరిచామని పేర్కొన్నారు.
అత్యవసర వైద్య సేవలకు 108, అమ్మ ఒడి సేవలకు 102, పార్థివ శరీరాలను తరలించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. 108 ద్విచక్ర వాహన సేవలను కూడా ప్రారంభించామన్నారు. రాష్ట్రానికి ఎయిమ్స్‌ను సాధించామని, సాధ్యమైనంత త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.
దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు చర్యలు
దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రపంచ ఆరో గ్య సంస్థ ప్రతినిధులతో సచివాలయంలో దీర్ఘకాలిక వ్యాధుల నివారణ చర్యలపై చర్చించారు. రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment