సాక్షి, న్యూఢిల్లీ: ఎయిమ్స్ ఆస్పత్రిలో వెలుగు చూసిన న్యుమోనియా కేసులను చైనాలో వ్యాప్తిస్తున్న చిన్న పిల్లల న్యుమోనియా కేసులతో మూడిపేడుతూ ప్రచురించిన మీడియా కథనాలపై కేంద్రం సీరియస్ అయింది. ఆ కథనాలు తప్పుదోవ పట్టించే అసత్యాలని స్పష్టం చేసింది.
ఎయిమ్స్ వెలుగులోకి వచ్చిన కేసులు సాధారణమైన బ్యాక్టీరియల్ న్యుమోనియా కేసులని తెలిపింది. ఎయిమ్స్‌లో బయటపడ్డ న్యూమోనియా కేసులకు చైనాలోని కేసులకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది.
Media reports claiming detection of bacterial cases in AIIMS Delhi linked to the recent surge in Pneumonia cases in China are misleading and inaccurate. Mycoplasma pneumonia is the commonest bacterial cause of community-acquired pneumonia. Pneumonia Cases in AIIMS Delhi have no… pic.twitter.com/rZkpgPEwv1
— ANI (@ANI) December 7, 2023
అదీ కాగా ప్రస్తుతం వెలుగు చూసిన న్యుమోనియా కేసులు ఎయిమ్స్‌లో గత ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు నిర్వహించిన అధ్యయనంలో భాగమని తెలిపింది. ఈ కేసులను చైనా కేసులుగా భావించి.. ఎవరు భయాందోళనకు గురికావొద్దని స్పష్టం చేసింది. న్యుమోనియాపై మీడియాలో ప్రచురించే నివేదికలు అసత్యమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment