
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ హాస్టల్స్ వెల్ఫేర్ ఆఫీసర్ (TSPSC Hostel Welfare Officer) ఫలితాలు విడులయ్యాయి. కొద్ది సేపటి క్రితమే టీఎస్‌పీఎస్సీ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్‌ను విడుదల చేసింది. 581 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌ఈ పరీక్ష నిర్వహించింది.
581 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన కమిషన్, 2024 జూన్‌లో రాత పరీక్ష నిర్వహించింది. ఇప్పటికే జీఆర్‌ఎల్ విడుదల చేసి నాలుగు విడుతల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తిచేసింది. ఇవాళ విడుదల చేసిన ఫలితాల్లో ఉద్యోగాలు పొందినవారికి శాఖల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇస్తారు