వ్యక్తి దారుణ హత్య | crucial murder attempted | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Published Tue, Jun 3 2014 11:54 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

వ్యక్తి దారుణ హత్య - Sakshi

వ్యక్తి దారుణ హత్య

ఆర్థిక లావాదేవీలే కారణం...?
 సంగారెడ్డి క్రైం / మున్సిపాలిటీ,
 న్యూస్‌లైన్ : గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన సోమవారం అర్ధరాత్రి సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన  సంకరి జనార్దనరెడ్డి (45) సోమవారం రాత్రి తన ఇంటిపైన పడుకునేందుకు వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇంట్లో నిద్రిస్తున్నారు. అయితే రాత్రి 10:30 గంటల ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు వర్షపు చినుకులు పడుతున్నాయని గుర్తించిన కుటుంబ సభ్యులు ఇంటిపై నిద్రిస్తున్న జనార్దనరెడ్డిని నిద్రలోంచి లేపేందుకు గాను ఫోన్ చేయగా ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పైకి వెళ్లి చూసే సరికి రక్తం మడుగులో పడిపోయి ఉన్నాడని, అదే సమయంలో ప్రహరీ పైనుంచి గుర్తు తెలియని వ్యక్తులు పారిపోవడాన్ని చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి దవడ కింద కత్తితో పొడవంతో రక్తపు మడుగులో పడిఉన్నాడు.
 
 ఇదిలా ఉంటే మృతుడు జనార ్దనరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు కాంట్రాక్టు పనులు చేసేవారని ఇందులో వచ్చే వాటాల కోసం నిలదీయడం వలనే ఈ సంఘటన చోటు చేసుకుందని అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వెంకటేష్‌తో పాటు సీఐ వెంకటేష్, ఎస్‌ఐ రాజశేఖర్‌లు సందర్శించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement