శ్రద్ధ లేకనే సమస్యలు | please reduce the Drop-outs of students | Sakshi
Sakshi News home page

శ్రద్ధ లేకనే సమస్యలు

Published Tue, Jul 22 2014 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

శ్రద్ధ లేకనే సమస్యలు

శ్రద్ధ లేకనే సమస్యలు

నిజామాబాద్ అర్బన్: పనులు చేయడంలో సరైన శ్రద్ధ చూపకపోవడంతోనే సమస్యలు పేరుకుపోతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్, ‘మన ఊరు-మన ప్రణాళిక’ జిల్లా ప్రత్యేకాధికారి జనార్దన్‌రెడ్డి అన్నారు. పోటీ ప్రపంచం లో బాగా శ్రమిస్తేనే మంచి ఫలితాలు సాధించగలుగుతామని పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ప్రగతిభవన్‌లో జరిగిన మండల ప్రత్యేకాధికారులు, అభివృద్ధి అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పాఠశాలలలో విద్యార్థుల డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడానికి కృషి చేయాలని కోరారు. 365 రోజులలో 220 రోజులు మాత్రమే పాఠశాలలు పనిచేస్తున్నాయని, అందులో 110 రోజులు మాత్రమే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకొరినొకరు కలుసుకుం టు న్నారన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందన్నారు. విద్యపై 71 దేశాల లో సర్వే నిర్వహిస్తే, మన దేశం చివరి స్థానంలో నిలి చిందన్నారు.
 
అవసరాలు చాలా ఉంటాయి
ప్రతి గ్రామంలో అవసరాలు చాలా ఉంటాయని, ప్రజ లతో చర్చించి, ప్రాధాన్యత క్రమంలో వాటికి పరిష్కా  రం చూపాలని జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇజ్రాయిల్ దేశంలో మన కంటే మూడవ వంతు వర్షపాతంతోనే మంచి దిగుబడులు సాధిస్తున్నారని, ఆస్ట్రేలియాలాం  టి దేశాలలో హెక్టారుకు కేవలం నాలుగు కిలోల ఎరువును ఉప యోగిస్తే మన వద్ద 300 కిలోల ఎరువును వినియోగిస్తున్నారన్నారు. మట్టి నమూనాలను పరీ క్షించకపోవడమే ఇందుకు కారణమన్నారు. దీంతో ఖర్చు పెరగడమే కాకుండా దిగుబడి కూడా తక్కువ  గా వస్తుందన్నారు. రైతులతో చర్చించి ఈ విషయంలో సరైన దిశా నిర్దేశం చేయాలని సూచించారు. సక్రమంగా వనరులను సమకూర్చుకొని, పన్నులు వసూ  లు చేస్తే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ఆదాయం పెంచుకోవచ్చన్నారు.
 
విద్యుత్‌ను సక్రమంగా వినియోగించుకుంటే రాష్ట్రంలో 12 కోట్ల రూపాయల ఆదాతో పాటు విద్యుత్ ఉపయోగమూ తగ్గుతుందన్నారు. మేజర్ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో డంపింగ్ యార్డులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నా రు. ఇన్‌చార్జి కలెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 36 మండలాలలో గ్రామసభలు నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ రాజశేఖర్, జడ్‌పీ సీఈఓ రాజారాం, డీపీఓ సురేశ్‌బాబు  తదితరులు పాల్గొన్నారు.
 
ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి
బోధన్ : ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా లేనందున అదను దాటిన పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ కమిషనర్ జనార్దన్ రెడ్డి రైతులకు సూచించారు. ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, కందులు, ఆముదం పంటల సాగుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
 
సోమవారం సా యంత్రం  బోధన్ మండలంలోని నాగన్‌పల్లి శివారులో ఆయన సోయా పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరెంట్ సమస్య, భూగ ర్భజలాలను దృష్టిలో పెట్టుకుని ఐదు ఆపై ఎకరాలలో వరి పండించే రైతులు సాగు విస్తీర్ణాన్ని సగానికి తగ్గించుకోవాలన్నారు. పుష్కలంగా వర్షాలు కురిస్తే రైతులకు సమస్య ఉండ దన్నారు. రాయితీపై కందులు, పొద్దు తిరుగుడు విత్తనాలను అందిస్తామన్నారు. ఈ నెల 25 నుంచి గ్రామాలలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటిస్తారన్నారు. తెలిపారు.
 
సోలార్ మోటార్లు సబ్సిడీపై అందించాలి
కరెంట్ కోతలు, లోవోల్టేజి సమస్యలు ఉన్నందున రాయితీపై సోలార్ మోటార్లు అందించాలని పలువురు రైతులు కమిషనర్‌ను కోరారు. బోరుబావి కరెంట్ కనెక్షన్ తొలగించుకుంటేనే సోలార్ మోటార్లు అందిస్తామని అధికారులంటున్నారని, ఈ నిబంధన ఉంచవద్దని విన్నవించారు. కమిషనర్ వెంట జేడిఏ నర్సింహా ఆర్‌డీఓ శ్యాంప్రసాద్‌లాల్, ఏడిఏ గంగారెడ్డి, తహాసీల్దార్ సుదర్శన్, బోధన్, రెంజల్, ఎడపల్లి మండలాల ఏవోలు వెంకటేశ్వర్లు, సిద్ధి రామేశ్వర్, శ్రీనివాస్‌రావు. ఏఈఓ సత్తార్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement