Drop-outs
-
మళ్లీ బడిబాట పట్టిస్తాం
డ్రాపవుట్లపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముంబై: చదువు మధ్యలోనే మానేసిన వారు తిరిగి బడికి వెళ్లేవిధంగా చేస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది చివరిలోగా ఓ కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు. వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర ్భంగా ప్రసంగించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు స్వస్తి పలికి ఉద్యోగం వైపు మళ్లినవారిని మళ్లీ బడిబాట పట్టిస్తామని అన్నారు. వీరు పీహెచ్డీ వరకూ చదువుకునేవిధంగా అన్నివసతులు కల్పిస్తామన్నారు. విద్యలో స్పెషలైజేషన్‌కు సంబంధించినంతవరకు గిరిజనులు, మహిళలు, షెడ్యూల్ కులాలకు చెందిన చిన్నారులు, ఇతర వెనుకబడిన కులాలకు చెందినవారికి ఉన్నత విద్యాభ్యాసానికి తగినన్ని ఆర్థిక వనరులు అందుబాటులో ఉండవన్నారు. దీంతో వారు మధ్యలోనే చదువుకు స్వస్తి పలుకుతారన్నారు. ఇందుకు కారణం వారికి చదువుకంటే ఉద్యోగమే ముఖ్యం కావడమన్నారు. చివరికి తానుకూడా తగినంత ఆర్థిక వెసులుబాటు లేని కారణంగానే మధ్యలోనే చదువుకు స్వస్తి పలికానన్నారు. పరిశోధకులు, శాస్త్రవేత్తలుగా ఎదగగల సామర్థ్యమున్న వారికోసమే ‘ఇషన్ వికాస్’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఇటువ ంటి విద్యార్థులు దేశంలోని ప్రముఖ సంస్థలను సందర్శించేందుకు అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. 2,200 మంది విద్యార్థులను ఇందుకు ఎంపిక చేస్తామన్నారు. వారికోసం అవగాహనా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం దేశవాసులందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రోత్సాహమందిస్తామన్నారు. ప్రతిరోజూ పిల్లలు బడికి వెళుతున్నారా? అక్కడ వారు ఏమిచేస్తున్నారు? ఇచ్చిన హోంవర్క్ చేస్తున్నారా? లేదా? తదితరాలకు సంబంధించిన సమాచారం వారి తల్లిదండ్రులకు ప్రతిరోజూఅందేవిధంగా చేస్తామని, ఇది వచ్చే ఏడాదినుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. -
శ్రద్ధ లేకనే సమస్యలు
నిజామాబాద్ అర్బన్: పనులు చేయడంలో సరైన శ్రద్ధ చూపకపోవడంతోనే సమస్యలు పేరుకుపోతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్, ‘మన ఊరు-మన ప్రణాళిక’ జిల్లా ప్రత్యేకాధికారి జనార్దన్‌రెడ్డి అన్నారు. పోటీ ప్రపంచం లో బాగా శ్రమిస్తేనే మంచి ఫలితాలు సాధించగలుగుతామని పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ప్రగతిభవన్‌లో జరిగిన మండల ప్రత్యేకాధికారులు, అభివృద్ధి అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలలో విద్యార్థుల డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడానికి కృషి చేయాలని కోరారు. 365 రోజులలో 220 రోజులు మాత్రమే పాఠశాలలు పనిచేస్తున్నాయని, అందులో 110 రోజులు మాత్రమే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకొరినొకరు కలుసుకుం టు న్నారన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందన్నారు. విద్యపై 71 దేశాల లో సర్వే నిర్వహిస్తే, మన దేశం చివరి స్థానంలో నిలి చిందన్నారు. అవసరాలు చాలా ఉంటాయి ప్రతి గ్రామంలో అవసరాలు చాలా ఉంటాయని, ప్రజ లతో చర్చించి, ప్రాధాన్యత క్రమంలో వాటికి పరిష్కా రం చూపాలని జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇజ్రాయిల్ దేశంలో మన కంటే మూడవ వంతు వర్షపాతంతోనే మంచి దిగుబడులు సాధిస్తున్నారని, ఆస్ట్రేలియాలాం టి దేశాలలో హెక్టారుకు కేవలం నాలుగు కిలోల ఎరువును ఉప యోగిస్తే మన వద్ద 300 కిలోల ఎరువును వినియోగిస్తున్నారన్నారు. మట్టి నమూనాలను పరీ క్షించకపోవడమే ఇందుకు కారణమన్నారు. దీంతో ఖర్చు పెరగడమే కాకుండా దిగుబడి కూడా తక్కువ గా వస్తుందన్నారు. రైతులతో చర్చించి ఈ విషయంలో సరైన దిశా నిర్దేశం చేయాలని సూచించారు. సక్రమంగా వనరులను సమకూర్చుకొని, పన్నులు వసూ లు చేస్తే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ఆదాయం పెంచుకోవచ్చన్నారు. విద్యుత్‌ను సక్రమంగా వినియోగించుకుంటే రాష్ట్రంలో 12 కోట్ల రూపాయల ఆదాతో పాటు విద్యుత్ ఉపయోగమూ తగ్గుతుందన్నారు. మేజర్ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో డంపింగ్ యార్డులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నా రు. ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 36 మండలాలలో గ్రామసభలు నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో డీఆర్ఓ రాజశేఖర్, జడ్పీ సీఈఓ రాజారాం, డీపీఓ సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి బోధన్ : ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా లేనందున అదను దాటిన పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ కమిషనర్ జనార్దన్ రెడ్డి రైతులకు సూచించారు. ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, కందులు, ఆముదం పంటల సాగుకు అవకాశం ఉంటుందని తెలిపారు. సోమవారం సా యంత్రం బోధన్ మండలంలోని నాగన్‌పల్లి శివారులో ఆయన సోయా పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరెంట్ సమస్య, భూగ ర్భజలాలను దృష్టిలో పెట్టుకుని ఐదు ఆపై ఎకరాలలో వరి పండించే రైతులు సాగు విస్తీర్ణాన్ని సగానికి తగ్గించుకోవాలన్నారు. పుష్కలంగా వర్షాలు కురిస్తే రైతులకు సమస్య ఉండ దన్నారు. రాయితీపై కందులు, పొద్దు తిరుగుడు విత్తనాలను అందిస్తామన్నారు. ఈ నెల 25 నుంచి గ్రామాలలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటిస్తారన్నారు. తెలిపారు. సోలార్ మోటార్లు సబ్సిడీపై అందించాలి కరెంట్ కోతలు, లోవోల్టేజి సమస్యలు ఉన్నందున రాయితీపై సోలార్ మోటార్లు అందించాలని పలువురు రైతులు కమిషనర్‌ను కోరారు. బోరుబావి కరెంట్ కనెక్షన్ తొలగించుకుంటేనే సోలార్ మోటార్లు అందిస్తామని అధికారులంటున్నారని, ఈ నిబంధన ఉంచవద్దని విన్నవించారు. కమిషనర్ వెంట జేడిఏ నర్సింహా ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్, ఏడిఏ గంగారెడ్డి, తహాసీల్దార్ సుదర్శన్, బోధన్, రెంజల్, ఎడపల్లి మండలాల ఏవోలు వెంకటేశ్వర్లు, సిద్ధి రామేశ్వర్, శ్రీనివాస్‌రావు. ఏఈఓ సత్తార్ ఉన్నారు. -
రుచించని మధ్యాహ్న భోజనం
పథకంపై పర్యవేక్షణ లోపం చైల్డ్‌రైట్స్ సెల్‌కు ఫిర్యాదుల వెల్లువ డీఈవోపై విద్యాశాఖ డెరైక్టర్ ఫైర్ విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో ఎక్కువుగా డ్రాప్ఔట్స్ ఎందుకు ఉంటున్నారు? మధ్యాహ్న భోజన పథకంపై ఎందుకు పర్యవేక్షణ చేపట్టడం లేదు? పాఠశాలల తనిఖీలు ఎందుకు నిర్వహించడం లేదు? చైల్డ్‌రైట్స్ సెల్‌కు ఎక్కువుగా ఈ జిల్లా నుంచే ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయంటూ రాష్ట్ర విద్యాశాఖ డెరైక్టర్, ఎస్ఎస్ఏ పి.డి.ఉషారాణి విశాఖ డీఈఓ వెంకటకృష్ణారెడ్డిని ప్రశ్నించారు. మధ్యాహ్నభోజన పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని, భోజనంలో నాణ్యత లేదని వచ్చిన ఫిర్యాదులపై ఆమె డీఈఓను ప్రశ్నించారు. విజయనగరం, విశాఖ జిల్లాల్లో మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు ఎక్కువగా జరుగుతున్నాయని చైల్డ్‌రైట్స్ సెల్‌కు ఆయా జిల్లాల విద్యార్థులే ఫిర్యాదులు చేశారని ఆమె తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉత్తరాంధ్ర విద్యాశాఖాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. అవకతవకలకు పాల్పడిన మండల విద్యాశాఖాధికారులతో పాటు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు త్వరలోనే షోకాజ్ నోటీసులివ్వనున్నట్లు ఉషారాణి వెల్లడించారు. మధ్యాహ్నభోజన పథకంలో సమస్యలున్న వారు చైల్డ్‌రైట్స్ సెల్ 18004253525 నెంబరుకు సంప్రదించాలన్నారు. విద్యారంగంలో విశాఖ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో అన్ని మండలాల ఎంఈఓలకు నెట్ సదుపాయం కల్పించామన్నారు. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ ప్రతిపాఠశాలలోనూ మరుగుదొడ్లు నిర్వహణ సరిగా జరగడంలేదని మరుగుదొడ్ల నిర్వహణపై మూడు వారాల్లో సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాలన్నారు. సమస్యలు ఏకరువు పెట్టిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ పాఠశాలల్లో పనితీరు, మౌలిక వసతులు లేకపోవడంపై ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా మాట్లాడారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ విద్యాహక్కు చట్టాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడం లేదన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో డొనేషన్లు నియంత్రించాలన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే వి. అనిత ప్రసంగిస్తూ మధ్యాహ్న భోజన పథకం వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ గాజువాకలో ఉన్న జెడ్పీ హైస్కూళ్లను మున్సిపల్ పరిధిలోకి తేవాలన్నారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేవాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో చాలా పాఠశాలల్లో మంచినీటి సదుపాయం లేదన్నారు. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యావిధానాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ విద్యా విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీతో పాటు మూడు జిల్లాల విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, డిప్యూటీ డీఈవోలు, సర్వశిక్షా అభియాన్ పీవోలు పాల్గొన్నారు. ఏజెన్సీలో టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు విశాఖ ఏజెన్సీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను స్థానికంగా ఉంటున్న బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులతో భర్తీ చేయాలని ఐటీడీఏ పీఓకు సూచించినట్లు ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డెరైక్టర్ ఉషారాణి తెలిపారు. సమీక్షా సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వీరి నియామానికి సంబంధించిన నిధులను ఐటీడీఏ పీవోకు ఇచ్చినట్లు తెలిపారు. విద్యుత్ శాఖ సీఎండీపై గంటా గరంగరం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ శేషగిరిబాబుపై రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉత్తరాంధ్ర జిల్లాల విద్యాశాఖా అధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడుతున్న సమయంలో కరెంట్ పోయింది. పదినిమిషాలు పవర్ రాకపోవడంతో మంత్రి గంటాతో పాటు నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు కొంత ఇబ్బందికి గురయ్యారు. దీంతో మంత్రి గంటా విద్యుత్ సంస్థ సీఎండీకి ఫోన్ చేసి వేళాపాళా లేకుండా కరెంట్ ఎలా తీస్తారని ప్రశ్నించారు. ఈ రోజు జిల్లా పరిషత్‌లో సమీక్షా సమావేశం జరుగుతోందని తెలియదా.. రోజూ పత్రికలు చదవరా ..అంటూ శేషగిరిబాబుపై మండిపడ్డారు.