ఎంపీ, ఎంఎల్‌ఏలుగా పోటీ చేసి ఓటమి పాలైన వారికి కాకుండా పార్టీని నమ్ముకుని పని చేస్తున్న విధేయులకు శాసన
సిటీబ్యూరో: ఎంపీ, ఎంఎల్‌ఏలుగా పోటీ చేసి ఓటమి పాలైన వారికి కాకుండా పార్టీని నమ్ముకుని పని చేస్తున్న విధేయులకు శాసన మండలి ఎన్నికల్లో అవకాశం కల్పించాలని పీసీసీ సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్దన్ రెడ్డి పార్టీ అధినేత సోనియాగాంధీకి విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఢిల్లీలో సోనియాగాంధీని కలిసి వచ్చిన ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.
పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అవకాశం కల్పించాలని సోనియాగాంధీని కోరినట్లు తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైన వారికంటే పార్టీ కోసం పనిచేస్తున్న వారికి పెద్దపీట వేయటం వల్ల కార్యకర్తల్లో మనోధైర్యం పెరుగుతుందని సోనియాకు వివరించినట్లు జనార్దన్‌రెడ్డి తెలిపారు.