దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో పలు ఆసక్తికర వైనాలు వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి ఉదంతం గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారని గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎంపీ ఆరోపించిన నేపధ్యంలో ఈ ఇద్దరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
వీరిద్దరూ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో భరూచ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. నర్మదా జిల్లాలోని దేడియాపాడలో బీజేపీకి చెందిన భరూచ్ ఎంపీ మన్సుఖ్ వాసవా, ఆప్ ఎమ్మెల్యే చైత్ర వాసవా మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జనం మధ్యలో ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం జరగడాన్ని వీడియోలో చూడవచ్చు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం ఇద్దరు నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లోకేష్ యాదవ్ తెలిపారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. బీజేపీ ఎంపీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో ఆప్ ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పించిన దరిమిలా ఈ వివాదం చోటుచేసుకుంది.
મારી ગેર હાજરી ના 6 માસમાં થયેલ કામગીરી મનરેગા માં 22 cr, વિકાસશીલ તાલુકા જોગવાઈ 4 cr, આદિ આદર્શગામ 68 cr,નલ સે જલ યોજનામાં 40 cr, SBM 2 cr,
F. R.A માં 3.90 cr ના આયોજન બાબતે ડેડીયાપાડા TDO સાથે ચર્ચા કરતાની સાથે જ મનસુખ વસાવા અને ભાજપ ના હોદ્દેદારો ને 420 વોલ્ટનો કરંટ લાગતા
1/2 pic.twitter.com/FRPFFmbRWN— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) May 18, 2024
Comments
Please login to add a commentAdd a comment