బీహార్: కొందరు రాజకీయ నేతలు అక్రమ దందాలు సాగిస్తున్నారనే వార్తలను మనం అప్పుడప్పుడు వింటుంటాం. అయితే నాలుగు సార్లు ఎంపీ, ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ప్రజాప్రతినిధి ఇప్పుడు గ్యాంగ్‌స్టర్‌గా మారాడంటే ఒక పట్టాన నమ్మలేం. కానీ ఇది నిజం. యూపీకి చెందిన ఒక నేత ప్రజాప్రతినిధి అనే పదానికే మచ్చతెచ్చేలా ప్రవర్తించాడు.
రాజకీయాల్లో విజయం
కల్తీ మద్యం కేసులో నిందితుడైన యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రమాకాంత్ యాదవ్ రాజకీయాల్లో పలు విజయాలను అందుకున్నారు. అజంగఢ్ నుంచి నాలుగు సార్లు ఎంపీ, ఫూల్పూర్ పొవై అసెంబ్లీ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2022లో మహూల్‌లో చోటుచేసుకున్న విషపూరిత మద్యం కుంభకోణం కేసులో చిక్కుకున్న ఆయన రెండేళ్లకు పైగా జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు రమాకాంత్ యాదవ్ ఐఆర్-42 గ్యాంగ్‌గా జాబితాలో చేరారు.
1985లో రాజకీయ ప్రవేశం
ఫుల్పూర్ ప్రాంతంలోని అంబారి నివాసి రమాకాంత్ యాదవ్ 1985లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆఫుల్పూర్ పొవై అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో అజంగఢ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నాలుగు సార్లు ఎంపీ అయ్యారు. 2019లో బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీలో చేరి 2022లో ఫూల్పూర్ పోవై అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.
బీఎస్పీ అభ్యర్థిపై దాడి
1998 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపునకు ముందు రమాకాంత్ యాదవ్ బీఎస్పీ అభ్యర్థి అక్బర్ అహ్మద్ డంపీపై దాడి చేసినందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 2022లో మహుల్‌లో విషపూరిత మద్యం ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ కేసులో రమాకాంత్ యాదవ్ హస్తమున్నట్లు దర్యాప్తులో తేలింది. అప్పటి నుంచి ఆయన జైలులో ఉన్నారు.
ఐఆర్ -42 ముఠా జాబితాలో..
వారణాసి జోన్ ఏడీజీ హత్య, కల్తీ మద్యం తయారు చేయడం, లైసెన్స్ పొందిన దేశీయ మద్యం షాపులో దానిని విక్రయించడం లాంటి నేరాలకు పాల్పడి, జైలుకెళ్లిన ఎమ్మెల్యే రమాకాంత్ యాదవ్, అతనితో సంబంధం ఉన్న 15 మంది సభ్యులను ఐఆర్ -42 ముఠా జాబితాలో పోలీసులు చేర్చారు. ఇతనితో పాటు ఇతని ముఠా సభ్యులపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment