Ramakant
-
నాలుగుసార్లు ఎంపీ.. ఐదుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్
బీహార్: కొందరు రాజకీయ నేతలు అక్రమ దందాలు సాగిస్తున్నారనే వార్తలను మనం అప్పుడప్పుడు వింటుంటాం. అయితే నాలుగు సార్లు ఎంపీ, ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ప్రజాప్రతినిధి ఇప్పుడు గ్యాంగ్‌స్టర్‌గా మారాడంటే ఒక పట్టాన నమ్మలేం. కానీ ఇది నిజం. యూపీకి చెందిన ఒక నేత ప్రజాప్రతినిధి అనే పదానికే మచ్చతెచ్చేలా ప్రవర్తించాడు.రాజకీయాల్లో విజయంకల్తీ మద్యం కేసులో నిందితుడైన యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రమాకాంత్ యాదవ్ రాజకీయాల్లో పలు విజయాలను అందుకున్నారు. అజంగఢ్ నుంచి నాలుగు సార్లు ఎంపీ, ఫూల్పూర్ పొవై అసెంబ్లీ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2022లో మహూల్లో చోటుచేసుకున్న విషపూరిత మద్యం కుంభకోణం కేసులో చిక్కుకున్న ఆయన రెండేళ్లకు పైగా జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు రమాకాంత్ యాదవ్ ఐఆర్-42 గ్యాంగ్‌గా జాబితాలో చేరారు.1985లో రాజకీయ ప్రవేశంఫుల్పూర్ ప్రాంతంలోని అంబారి నివాసి రమాకాంత్ యాదవ్ 1985లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆఫుల్పూర్ పొవై అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో అజంగఢ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నాలుగు సార్లు ఎంపీ అయ్యారు. 2019లో బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీలో చేరి 2022లో ఫూల్పూర్ పోవై అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.బీఎస్పీ అభ్యర్థిపై దాడి1998 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపునకు ముందు రమాకాంత్ యాదవ్ బీఎస్పీ అభ్యర్థి అక్బర్ అహ్మద్ డంపీపై దాడి చేసినందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 2022లో మహుల్‌లో విషపూరిత మద్యం ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ కేసులో రమాకాంత్ యాదవ్ హస్తమున్నట్లు దర్యాప్తులో తేలింది. అప్పటి నుంచి ఆయన జైలులో ఉన్నారు.ఐఆర్ -42 ముఠా జాబితాలో..వారణాసి జోన్ ఏడీజీ హత్య, కల్తీ మద్యం తయారు చేయడం, లైసెన్స్ పొందిన దేశీయ మద్యం షాపులో దానిని విక్రయించడం లాంటి నేరాలకు పాల్పడి, జైలుకెళ్లిన ఎమ్మెల్యే రమాకాంత్ యాదవ్, అతనితో సంబంధం ఉన్న 15 మంది సభ్యులను ఐఆర్ -42 ముఠా జాబితాలో పోలీసులు చేర్చారు. ఇతనితో పాటు ఇతని ముఠా సభ్యులపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద పోలీసులు చర్యలు చేపడుతున్నారు.ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం -
ముగ్గురి ప్రాణాలను కాపాడిన ఈఎన్టీ
ఆదిలాబాద్: 108 అంబులెన్స్‌లో ఓ నిండు గర్భిణికి ఈఎన్టీ ప్రసూతి చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడారు. వివరాలు.. కెరమెరి మండలం పెద్ద సాకడ గ్రామానికి చెందిన ఆత్రం గంగుబాయికి పురిటి నొప్పులు రాగా శుక్రవారం కుటుంబీకులు ఆమెను కెరమెరి పీహెచ్సీలో చేర్పించారు. కవల పిల్లలున్నారని, బీపీ కూడా అధికంగా ఉందని గుర్తించిన వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం ఆమెను ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్చేశారు. 108 అంబులెన్స్‌లో ఉట్నూర్‌కు తరలిస్తున్న క్రమంలో జైనూర్ మండలం ఉశేగాం సమీపంలో ఆమెకు నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్‌లోనే ఈఎన్టీ శ్రీనాథ్ డెలివరీ చేయగా కవలలకు జన్మనిచ్చింది. బీపీ అధికంగా ఉన్నప్పటికీ ధైర్యంగా డెలివరీ చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఈఎన్టీ శ్రీనాథ్‌ను పలువురు అభినందించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. కాగా, గంగుబాయికి ఇది రెండో కాన్పు. ఈఎన్టీ శ్రీనాథ్‌తో పాటు పైలెట్ రమాకాంత్ ఉన్నారు. -
ఆచార్య దేవోభవ
ముంబైలో నేడు టెండూల్కర్ మిడిలెసెక్స్ గ్లోబల్ అకాడమీ (టీఎంజీఏ)ని సచిన్ టెండూల్కర్ ప్రారంభించబోతున్నాడు. ఈ నేపథ్యంలో తనకు ఆటలో ఓనమాలు నేర్పిన గురువు రమాకాంత్ అచ్రేకర్‌ను బుధవారం కలిసిన సచిన్ పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నాడు. అచ్రేకర్ మరో శిష్యుడు, ముంబై టీఎంజీఏలో కోచ్‌గా వ్యవహరించబోతున్న వినోద్ కాంబ్లీ కూడా సచిన్‌తో పాటు ఉన్నాడు. -
ఒక మార్పు... ఒక నిర్ణయం...
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్... భారత క్రికెట్ నుంచి విడదీయరాని పేరు. అలాంటి వ్యక్తి జీవితంలో చోటుచేసుకున్న ఓ మార్పు... తీసుకున్న ఓ నిర్ణయం... అతడి జీవితాన్ని ఎక్కడో నిలబెట్టింది. ఈ విషయాన్ని ‘విన్నింగ్ లైక్ సచిన్–థింక్ అండ్ సక్సీడ్ లైక్ టెండూల్కర్’ పేరిట తాను రాసిన పుస్తకంలో దేవేంద్ర ప్రభుదేశాయ్ వివరించాడు. ఇంతకీ ఆ విశేషాలేమంటే... 1984లో సచిన్ బాంద్రా ఐఈఎస్ పాఠశాల విద్యార్థిగా ఉండగా అతడి అన్న అజిత్ క్రికెట్ శిక్షణ కోసం రమాకాంత్ ఆచ్రేకర్ వద్దకు తీసుకెళ్లాడు. బాంద్రా పాఠశాలకు ప్రత్యేకించి జట్టు లేనందున చిన్నారి సచిన్‌ను తాను కోచింగ్ ఇస్తున్న దాదర్‌లోని శారదాశ్రమం విద్యా మందిర్‌లో చేర్పించమని ఆచ్రేకర్ సలహా ఇచ్చారు. కానీ, వారు నివాసం ఉండే బాంద్రా నుంచి ఆ పాఠశాల చాలా దూరం. రాకపోకలకు నేరుగా బస్సు సౌకర్యం కూడా లేదు. పాఠశాల ఉదయం 7 గంటలకే ప్రారంభమవుతుంది. రోజంతా రాకపోకలకే సరిపోతుంది. దీంతో సచిన్ తండ్రి ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్... ‘ముందు చదువుపై దృష్టి పెట్టు. సెలవుల్లో క్రికెట్ ఆడుకో’ అంటూ తేల్చి చెప్పేశారు. సచిన్ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. చివరకు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటాం అంటూ కుటుంబ సభ్యులు చెప్పారు. ఎంతో ప్రేమించే ఆట కోసం ఎంత కష్టమైనా భరిస్తూ పాఠశాల మారేందుకే సచిన్ మొగ్గు చూపాడు. అలా ఆచ్రేకర్ దగ్గర ఓనమాలు నేర్చిన అతడు... క్రికెట్లో ఎంత ఎత్తుకు ఎదిగాడో ఇప్పుడు అందరికీ తెలిసిన చరిత్రే. -
బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
పెద్దశంకరంపేట : బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జోగిపేట జూనియర్ సివిల్ జడ్జి రమాకాంత్ అన్నారు. శుక్రవారం పేట పోలీస్‌స్టేషన్‌లో బాలల సహాయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. సమాజంలో బాల నేరస్తులు ఉండరాదన్నారు. బాలలను నేరస్తులుగా చూడొద్దని, వారిపై నేరస్తులన్న ముద్ర వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి : డిసెంబర్ 6న దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని జడ్జి రమాకాంత్ పిలుపునిచ్చారు. అన్ని కోర్టుల్లో ఈ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను రాజీ చేసుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జోగిపేట సీఐ రఘు, పేట ఎస్ఐ మహేష్ గౌడ్, న్యాయవాదులు భాస్కర్, లింగం, ఎస్హెచ్ఓ లక్ష్మణ్, చిరంజీవి, విఠల్ గౌడ్, ప్రేమ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులున్నారు.