108 Ambulance EMT Srinath Who Saved Three Lives in Adilabad - Sakshi
Sakshi News home page

ముగ్గురి ప్రాణాలను కాపాడిన ఈఎన్టీ

Published Sat, Jul 22 2023 12:41 PM | Last Updated on Sat, Jul 22 2023 2:04 PM

ENT That Saved Three Lives - Sakshi

ఆదిలాబాద్‌: 108 అంబులెన్స్‌లో ఓ నిండు గర్భిణికి ఈఎన్టీ ప్రసూతి చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడారు. వివరాలు.. కెరమెరి మండలం పెద్ద సాకడ గ్రామానికి చెందిన ఆత్రం గంగుబాయికి పురిటి నొప్పులు రాగా శుక్రవారం కుటుంబీకులు ఆమెను కెరమెరి పీహెచ్‌సీలో చేర్పించారు. కవల పిల్లలున్నారని, బీపీ కూడా అధికంగా ఉందని గుర్తించిన వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం ఆమెను ఉట్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్‌చేశారు.

108 అంబులెన్స్‌లో ఉట్నూర్‌కు తరలిస్తున్న  క్రమంలో జైనూర్‌ మండలం ఉశేగాం సమీపంలో ఆమెకు నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్‌లోనే ఈఎన్టీ శ్రీనాథ్‌ డెలివరీ చేయగా కవలలకు జన్మనిచ్చింది. బీపీ అధికంగా ఉన్నప్పటికీ ధైర్యంగా డెలివరీ చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఈఎన్టీ శ్రీనాథ్‌ను పలువురు అభినందించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. కాగా, గంగుబాయికి ఇది రెండో కాన్పు. ఈఎన్టీ శ్రీనాథ్‌తో పాటు పైలెట్‌ రమాకాంత్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement