Srinath
-
Hyderabad: మ్యాట్రిమోనీని అడ్డుపెట్టుకొని మోసాలు..! అసలేం చేశాడంటే?
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి: మాట్రిమోనీలో పెళ్లిళ్ల కోసం నమోదు చేసుకున్న మహిళలను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 27 తులాల బంగారు ఆభరణాలు స్వాదీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. గురువారం ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో మహంకాళి ఏసీపీ రవీందర్, మార్కెట్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, డీఐ వెంకటరమణలతో కలిసి వివరాలు వెల్లడించారు. జిల్లా కందుకూరు మండలం నెడనూర్ గ్రామానికి చెందిన తుమ్మ మోహన్‌రెడ్డి (38) 2011లో కల్వకుర్తికి చెందిన మహిళతో వివాహం జరిగి గొడవలు రావడంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. మ్యాట్రిమోనీలో శ్రీనాథ్ అనే పేరుతో పేరు నమోదు చేసికున్నాడు. భారత్ మాట్రిమోనీలో విడాకులు తీసుకున్న ఓ మహిళ రెండవ పెళ్లి కోసం నమోదు చేసుకోగా ఆమె ప్రొఫైల్‌ను సేకరించాడు. ఆమెకు ఫోన్ చేసి తాను పెళ్లి చేసుకుంటానని అయితే ఒక సారి నేరుగా కలుద్దామని చెప్పాడు. వచ్చే సమయంలో నగలతో పాటు వస్తే ఫొటో తీసుకుని తన తల్లిదండ్రులకు చూపించి పెళ్లి చేసికుంటానని నమ్మించాడు. దీన్ని నమ్మిన ఆ మహిళ ఈ నెల 7న సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాత్రి ఇన్ హోటల్‌కు వచ్చారు. రెడీ అయ్యే ముందు వాష్ రూమ్‌కు వెళ్లి ఫ్రెష్అప్ కావాలని చెప్పాడు. దీంతో ఆమె వాష్ రూమ్‌కు వెళ్లి వచ్చే లోపు ఆమెకు చెందిన 27 తులాల బంగారు ఆభరణాలున్న బ్యాగును తీసుకుని హోటల్ నుంచి పరారయ్యాడు. నిందితున్ని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివిధ కేసుల్లో నిందితుడు.. ► ఇదే విదంగా నిందితుడు మోహన్‌రెడ్డి షాదీ డాట్ కామ్‌లో గౌతమ్‌రెడ్డి పేరుతో పేరు నమోదు చేసికుని ఓ మహిళను నమ్మించాడు. ఆమెకు నమ్మకం కలిగిన తర్వాత ఆమె క్రెడిట్ కార్డు ద్వారా రూ.6.20 లక్షలతో బంగారు నగలు కొనుగోలు చేసి పరారయ్యాడు. ► మరో మాట్రిమోనీలో విజయరెడ్డి పేరుతో పేరు నమోదు చేసికుని రూ.9లక్షలు తన అకౌంట్లో వేసుకున్నాడు. ► కల్వకుర్తిలో ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తూ 10వ తరగతి చదువుతున్న బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించి 3 నెలలు జైలుకు వెళ్లివచ్చాడు. ► కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తన బంధువుకే కారు పేరుతో రూ.4.50లక్షలు మోసం చేశాడు. మాదాపూర్‌లోని హాస్టల్లో ఉంటూ రూ.70వేల విలువ చేసే ల్యాప్‌టాప్ తదితర వస్తువులను దొంగతనం చేశాడు. ► చైతన్యపురిలో మరో హాస్టల్లో రూ.40వేల విలువ చేసే ల్యాప్‌టాప్ దొంగతనం చేశాడు. ఇలా పలు కేసుల్లో నిందితుడు పరారీలో ఉన్నాడు. -
విశ్వ జనుల విశ్వశాంతి గీతమే ‘ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్’
సృజనాత్మక రంగం, తనకు సంబంధించిన అంశాలలో సరికొత్త విజయాలు సాధిస్తూ, అనేక అంతర్జాతీయ అవార్డులు సాధించిన డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేని ఆంగ్లాచార్యులు, కవి, రచయిత. 2010 లో ఇంగ్లిష్ జాతీయాలు, సామెతలపై ఆయన రాసిన 'హ్యాండీ క్రిస్టల్స్...’ అనే పుస్తకాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డు వరించింది. జాతీయసేవ, మానవీయ నైపుణ్యాల విభాగాల్లో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్‌గా ఆయన కీర్తి పొందారు. ఆంగ్ల భాషకు సంబంధించి ఆసియా, లిమ్కా, ఇండియా, తెలుగు బుక్ రికార్డులు ఎప్పుడో ఆయనను అలంకరించాయి. ఇన్ని ఘనతలు సొంతం చేసుకున్న శ్రీనాథాచారి ఇప్పుడు ఓ అద్వితీయ సామాజిక కార్యక్రమాన్ని తలపెట్టారు. రికార్డులకోసం కాకుండా, వసుధైవ కుటుంబ భావనను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు ప్రపంచ శాంతి ఆవశ్యకతను ఎలుగెత్తి చాటడం కోసం 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్' పేరుతో ఓ మానవీయ మహాకావ్యాన్ని ఆవిష్కరించారు. ‘హ్యుమానిటీ ఎక్స్ పెరిమెంట్’ అనే వినూత్న భావనతో రూపుదిద్దిన ఈ మహాకావ్యం ద్వారా వచ్చే ప్రయోజనం మొత్తాన్ని సమాజానికే ధారాదత్తం చేస్తానని ప్రకటించడం ఎందరికో స్ఫూర్తిదాయకం. డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఇంగ్లిష్ లో పీహెచ్డీ చేసి, పాలమూరు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో సహాయ ఆచార్యులుగా నియమితులై, అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, ఆంగ్ల విభాగాధిపతిగా వివిధ హోదాలలో సమర్థవంతంగా సేవలందించారు. అలాగే ఆయన సైకాలజీ, బిజినెస్ మేనేజ్ మెంట్ లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అభ్యసించారు. 'ఫర్సేక్ మీ నాట్' అనే టైటిల్ తో డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఆంగ్లంలో ఓ కవితా సంపుటి వెలువరించారు. అది అమెజాన్ ఆన్ లైన్ లో ‘ఈ-బుక్’ గా అందుబాటులో ఉంది. ఆంగ్లంలో ఆయన రాసిన కవితలు ఎన్నో పత్రికలలో అచ్చయ్యాయి. ప్రస్తుతం ఆంగ్లభాష, వ్యక్తిత్వ వికాసం, మానవీయ నైపుణ్యాల శిక్షకులుగా, ‘ఫ్రీలాన్స్' సేవలు అందిస్తూ పలు విద్యా సంస్థలు, ఐటీ సంస్థల్లో ప్రభావవంతమైన ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రపంచ సాహిత్యంలోనే ఎప్పటికీ నిలిచిపోయేలా డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఇటీవల 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్' ( An Invaluable Invocation ) పేరుతో ఆంగ్లంలో ఓ సంబోధనాత్మక భావగీతాన్ని రచించారు. విశ్వ శాంతి-ప్రపంచ దేశాల సమన్వయం తక్షణ అవసరమనే ఇతివృత్తం తీసుకొని సాహితీ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఓ సుదీర్ఘమైన ‘ఓడ్’ (సంబోధనాత్మక భావగీతం) ఈ విశ్వానికందించారు. ఈ శాంతిగీతం ఆంగ్ల సాహిత్యంలోనే అత్యంత సుదీర్ఘ భావగీతం కావడం విశేషం. ఇలాంటి భావగీతాన్ని ప్రపంచ సాహిత్యంలోనే ఇప్పటివరకు ఏ ఒక్కరూ రాయలేదు. దైవం, దైవస్వరూపులైన మానవాళిని అత్యంత ఆర్ద్రతతో ప్రార్థిస్తూ, ‘ఈ ప్రపంచాన్ని భూతలస్వర్గంగా మార్చుకోవాల్సిన బాధ్యత మనదే, దానికి ఈ భూమిపై ఉండే ప్రతిఒక్కరమూ సమర్థులమే, అందుచేత మనమంతా బృందంగా ఏర్పడి ఓ వసుధైవ కుటుంబాన్ని నిర్మించుకుందాం, అందరూ కదలిరండి’ అనే పిలుపుతో సమస్త విశ్వజనులకు కవి ఇచ్చిన శాంతి మంత్రమే ఈ భావగీతం. ఆ డబ్బును కూడా సమాజ సేవకే ప్రపంచ దేశాల్లో కోట్ల సంఖ్యలో నిస్సహాయ స్థితిలో అభాగ్యులుగా ఉన్న సామాన్య ప్రజల ధర్మాగ్రహ ఆవేదనే ఈ ఆధునిక పద్యకావ్యం! సామాన్య మానవుని ఆవేదన, ఆవేశం, ఆగ్రహం, ఆక్రందనలను అత్యంత వినయ విధేయతలతో ఆలపించే అద్వితీయ శాంతిగీతం ‘ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్’. కవి తన విశ్వశాంతి భావనను అక్షర శిల్పిగా చెక్కడం ఒక ఎత్తైతే, ఆ అక్షరాల వెనుకనున్న భావనను చిత్రకారుడు మహేశ్ తన గీతల్లో సజీవంగా చిత్రీకరించడం మరో ఎత్తు. ఈ మహాకావ్యం ద్వారా వచ్చే నూరు శాతం డబ్బును తిరిగి సమాజ ప్రయోజనాలకే అందజేయడం జరుగుతుంది కాబట్టి, దాని ధరను కూడా ప్రపంచ స్థాయిలోనే నిర్ణయించారు కవి. ఈ ఏకైక ప్రతి ధర రూ. 5 కోట్లు. దీన్ని అమ్మడం ద్వారా వచ్చే మొత్తంలో 50 శాతం ఐక్యరాజ్యసమితికి, 25 శాతం భారతదేశానికి, 25 శాతం తెలంగాణ రాష్ట్రానికి లోకోపకార కార్యక్రమాలకు వినియోగించేలా అందజేయడమనేది ఈ పుస్తకం ప్రత్యేకతలలోనే మరింత ప్రత్యేకమైనది. ఐక్యరాజ్యసమితి దినోత్సవం (24-10-2023) నాడు ఈ పుస్తకాన్ని ఆయన హైదరాబాద్‌లో తల్లిదండ్రులు, గురువులు, ప్రముఖులు, మేధావుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి ఐక్యరాజ్యసమితికి అంకితం చేయడం వంటి అంశాలన్నీ ఈ పుస్తకం విశిష్టతలను తెలియజేస్తున్నాయి. ఈ భావగీత రచన నిర్మాణ క్రమాన్ని పరిశీలిస్తే, రామాయణం కాండలుగా, మహాభారతం పర్వాలుగా రచించినట్టు, ఈ మహా కావ్యాన్ని కవి పది కాంటో (Canto) లుగా విభజించారు. (కవి డాక్టర్ శ్రీనాథాచారి తల్లిదండ్రులు శ్రీమతి నీలావతమ్మ, శ్రీ రామానుజాచారి) ఈ పది కాంటోలు వరుసగా శాంతి పీఠిక, ప్రార్థన, మానవజాతి-ఐక్యత, దుఃఖమయ ప్రపంచం, ప్రపంచ శాంతి- ఐక్యత, ఐక్య రాజ్యాలు-ఐక్య కార్యాచరణ, భూమాత పరిరక్షణ, మానవ శక్తిసామర్థ్యాల గుర్తింపు, అంతిమ పద్యకృతి-ప్రపంచ శాంతి ప్రయాణ సారాంశం, కృతజ్ఞతాంజలి. ఈ పది కాంటోలు మొత్తం 237 ఉపశీర్షికలతో విశ్వ శాంతి- సమన్వయం ప్రాధాన్యతను నొక్కి చెప్పే స్వతంత్ర పద్యాలుగా తీర్చిదిద్దారు కవి. ఈ కావ్య రచనలో కవి పాటించిన సాహితీ నియమాలు, కచ్చితత్వం అత్యంత ప్రశంసనీయం. ఐక్యరాజ్యసమితిలో ఉన్న 193 సభ్య దేశాలు, 2 సభ్యేతర దేశాలు మొత్తంగా 195 దేశాలకు సంబంధించి ‘ఐక్య రాజ్యాలు-ఐక్య కార్యాచరణ’ పేరుతో ఉన్న సుదీర్ఘమైన కాంటో ఈ కావ్యానికే ప్రత్యేకం. ప్రతి దేశానికి ఆరు పంక్తులు కేటాయించి, వాటి పక్కనే ఆ దేశ జాతీయ జెండా ముద్రించి కవి తన పరిశోధనాత్మక సామర్థ్యాలు ఎంతో ప్రశంసనీయంగా నిరూపించుకున్నారు. మొదటి రెండు పంక్తులు ఆ దేశ గతవైభవం, తర్వాతి రెండు పంక్తులు కవి ఈ పుస్తకాన్ని రాసే సమయంలో తన పరిశోధనలో తేలిన ఆ దేశంలోని ఒకటి లేదా రెండు ప్రధాన సమస్యలు, చిట్టచివరి రెండు పంక్తులు ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రామాణిక పద్ధతిలో సూచించడం కవి ప్రతిభాపాటవాలకు నిదర్శనం. ఈ మహాకావ్యంలో కవి ఏయే సమస్యలు ప్రస్తావించారని ప్రశ్నించే బదులు ఏయే సమస్యలు ప్రస్తావించలేదని ప్రశ్నించుకోవాలి. యద్ధం, నిరుద్యోగం, ఆకలి, అవినీతి, పేదరికం, తీవ్రవాదం, ఆహార భద్రత, ఆర్థిక అసమానత, లింగ వివక్ష, ప్రభుత్వ ధర్మాలు, పర్యావరణ విపత్తులు, చిన్నబోతున్న చిన్నారుల బాల్యం, వ్యధతో నిండిన వృద్ధుల జీవనం, భూమాత పరిరక్షణ, సామాజిక పతనం, మానసిక సంఘర్షణలు, సాంకేతిక వ్యసనాలు, యువత తీరుతెన్నులు, జీవకారుణ్యం,... ఇలా మానవాళి ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యలకు అద్దం పట్టి, వాటికి పరిష్కార మార్గాలతో కూడిన కార్యాచరణ తయారుచేసి, దాని అమలుకై ‘కడలి రండి విశ్వ శాంతికి చైతన్యవంతులై, క్రియాశూరులై, కార్యసాధకులై...’ అంటూ విశ్వజనులకు కవి ఇచ్చిన ఘనమైన పిలుపే ఈ పద్యకావ్యం. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచాన్ని ఓ భూతల స్వర్గంగా, శాంతిసౌధంగా మార్చగల సమర్థులు. కావలసిందల్లా సమాజాన్ని ప్రేమించాలనే దృక్పథం, సహృదయం. ఇది ఏమాత్రం ఖర్చుతో కూడుకున్నది కానేకాదు. ఎవరికి వారు తమదగ్గర ఉన్నది పంచితే చాలు. లేనిది ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ప్రపంచ శాంతి, సామరస్యం పట్ల మక్కువ ఉన్న కవిత్వ ప్రియులు, పండితులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ చైతన్యవంతులుగా, కార్యదక్షులుగా ప్రేరేపించే ఓ విశిష్ట సాహితీ కళాఖండమే 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్'. ఈ శాంతి గీత రూపకల్పన కవికి ముప్పై సంవత్సరాల కల. అంతేకాదు, మూడేళ్ల కఠోర రచనా పరిశ్రమ వల్లనే ఈ కావ్య రచన సుసాధ్యమైందని డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ పుస్తకాన్ని కొనేదెవరని కవిని ప్రశ్నిస్తే ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. “ప్రపంచంలో నాలుగు రకాల మనుషులుంటారు. ఒకటి, చాలా సంపదకలిగి సమాజ అవసరాల కోసం దాతృత్వం చూపే లోకోపకారులు; రెండు, చాలా సంపదకలిగి సమాజ అవసరాల కోసం దాతృత్వం చూపలేని సామాన్య మానవులు; మూడు, సమాజం పట్ల దాతృత్వపు భావాలున్నా డబ్బు లేని మానవమాత్రులు, నాలుగు, పేదరికంవల్ల లోకోపకార పనులు చేయలేని నిస్సహాయులు. వీరే కాకుండా అయిదో రకం మనుషులుంటారు; సమాజం పట్ల అమితంగా దాతృత్వపు భావాలుండి, డబ్బు లేకున్నా, అందరూ బృందంగా ఏర్పడి, వితరణ చూపి సమాజాన్ని గెలిపించే సజ్జనులు. ఈ భూమ్మీద ప్రపంచాన్ని ప్రేమించే దైవస్వరూపులు ఎంతోమంది ఉన్నారని నిరూపించే ఓ ‘హ్యుమానిటీ ఎక్స్ పెరిమెంట్’ నా ఈ ప్రయత్నం” అంటారు శ్రీనాథాచారి. చరిత్రను గమనిస్తే, ప్రఖ్యాత చిత్రకారుల పెయింటింగ్స్ కొన్ని వందల కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. కొందరు హాలీవుడ్ తారల వస్త్రాలను ఎన్నో కోట్లకు కొనుగోలు చేసిన దాఖలాలున్నాయి. దైవ ప్రసాదాలైన లడ్డూలు కొన్ని కోట్ల రూపాయలకు వేలంపాటల్లో విక్రయమౌతున్నాయి. వాటి నుంచి వచ్చిన డబ్బు సమాజానికి చెందితే అంతకన్నా సంతోషం మరొకటి లేదు. ఇదే తరహాలో, 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్' పద్యకావ్య తొలిప్రతి ద్వారా వచ్చే నూరు శాతం డబ్బు సమాజానికే అందించడం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అసాధారణమైన సృజనాత్మకత, సమాజంపట్ల ప్రేమ కలిస్తే దాని ధర వెలకట్టలేనిది. అలా చూస్తే, ఐదు కోట్లూ తక్కువే. ఓ పది అంతస్తుల భవనాన్ని నేల మీదినుంచి చూస్తే ఎంతో పెద్దగా కనబడుతుంది. అదే భవనాన్ని విమానంలోంచి కిందకు చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది. అట్లే, ఈ పుస్తకం ధర సామాన్యుడి దృష్టికోణంలో చూస్తే అసాధ్యమైన ధరలా అనిపించినా, విశాల హృదయంగల సంపన్న లోకోపకారికి చాలా చిన్న విషయం. 'ఒక చెట్టు నుంచి లక్ష అగ్గిపుల్లలు తయారుచేయెుచ్చు. కానీ లక్ష చెట్లను నాశనం చేయడానికి ఒకే ఒక్క అగ్గి పుల్ల చాలు. అలాగే, లక్ష మంచి ఆలోచనల్ని ఒక దురాలోచన నాశనం చేయగలదు. (ఎడమ నుంచి కుడికి... కవి డాక్టర్ శ్రీనాథాచారి తల్లిదండ్రులు శ్రీమతి నీలావతమ్మ, శ్రీ రామానుజాచారి, డీఐజీ శ్రీమతి సుమతి బడుగుల ఐపీఎస్, కవి డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి, గుంతా లక్ష్మణ్ జీ, ఆచార్య వెన్నెలకంటి ప్రకాశం, కవి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ ఎస్. కె.నిజాముద్దీన్, ప్రముఖ సినీ దర్శకులు జె.కె. భారవి) దాన్ని ఆపే శక్తి పుస్తకానికుంది' అంటారు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి. నా దగ్గర సమాజానికి పంచడానికి డబ్బు లేకున్నా, ఓ గొప్ప దాతను నేననుకున్న లక్ష్యం వైపు ప్రేరేపించేందుకు ఈ సుదీర్ఘ కావ్యం ఉపయోగపడితే అంతకన్నా ఆనందం మరొకటుండదని అంటారాయన. ఈ పుస్తకంలో రియా (RIA) అనే అద్భుతమైన ‘గ్లోబల్ పీస్ మంత్ర’ ఉపదేశిస్తారు కవి. Reflection, Introspection, Action అనే ఆంగ్ల పదాల ప్రారంభపు అక్షరాల కూర్పే రియా. ప్రతి ఒక్కరు స్వార్థపు పరిధులు దాటి, వసుదైవ కుటుంబకంగా మారి పదుగురికి ఉపయోగపడే ఆలోచన చేయడమే Reflection; ఆ మంచి ఆలోచన విషయంలో సహేతుకమైన లోతైన అధ్యయనం చేయడమే Introspection; చేసిన మంచి ఆలోచనను ఆచరించడమే Action. Reflection ఓ మంచి విత్తనాన్ని నాటడమైతే, Action ఆ చెట్టు ఫలాలు పొందడం. ఆది నుంచి అంతం వరకు ఈ రియా ఆసాంతం సానుకూల ఫలితాన్నిచ్చే ప్రక్రియ. విశ్వశాంతి వ్యక్తిగత ప్రశాంతతతో మొదలౌతుంది. మనందరి సమష్టి ప్రశాంతతే గ్లోబల్ పీస్. వ్యక్తిగత ప్రశాంతతకు మూలం ‘ఇవ్వడం’. ప్రతిఒక్కరు రియా అనే మంత్రాన్ని పాటిస్తూ, ఎవరికి వారు తమ వద్ద ఉన్నది ఉదారంగా ఈ ప్రపంచానికి ఇస్తే చాలు, భూతల స్వర్గం కళ్ళముందు సాక్షాత్కరిస్తుందంటారు కవి. అక్షరాల అయిదు కోట్ల రూపాయల ధరగల ఈ సుదీర్ఘ భావగీత పుస్తకం వెల కట్టలేనంత సామాజిక స్పృహ, దాని ధరను మించిన ప్రయోజనాన్ని చేకూర్చుతుందని, ఈ అమూల్య ఆంగ్ల కావ్యాన్ని ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరిస్తాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. నోబుల్ ఆలోచనలతో, నోబెల్ బహుమతికి సైతం తీసిపోని విశ్వజనుల శాంతిగీతమీ మహాకావ్యం. రవీంద్రుని ‘గీతాంజలి’ తర్వాత అంతటి స్థాయిని, సార్వజనీన వసుధైవ కుటుంబ భావనను విశ్వవ్యాప్తం చేయగలిగే సత్తా ఉన్న భారతీయ కవి మానస పుత్రిక 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్'. సమాజం ముందుకువెళ్లేలా నిర్మాణాత్మకంగా సమస్యలను ఎత్తి చూపుతూ, వాటికి సాధ్యపడే పరిష్కార మార్గాలు చూపే వాడే నిజమైన కవి. ఈ విషయంలో డాక్టర్ శ్రీనాథాచారి ఘనవిజయం సాధించారనే చెప్పవచ్చు. ఈ పద్యకావ్యం చదువుతున్నంతసేపూ మనం కోల్పోతున్న ఉపయుక్త అంశాల పట్ల బాధ, తర్వాతి తరాలకు మనం చూపాల్సిన బాధ్యత కళ్ళకు కట్టినట్టు బోధపడుతుంది. ఈ రచన మొదటి నుంచి చివరి దాకా ప్రతి విషయం పట్ల కవి ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం అనన్య సామాన్యం. సాహితీ రంగంలో నోబెల్ భారత్ కు అందుతుందనే నమ్మకాన్ని నమ్మకంగా అందించే విశిష్ట రచన ఈ కావ్యకృతి. ఎంతోమంది ప్రపంచవ్యాప్త సాహితీ విద్యార్థులకు ఇదో పరిశోధనా గ్రంథంగా ఉపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, విశ్వం వినితీరాల్సిన వినూత్న విశ్వశాంతి గీతం 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్'. పలురకాలుగా ఎందరికో ప్రేరణనిస్తున్న డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి సృజనాత్మక సాహితీ రంగంలో మరింతగా రాణించి ఎన్నో అత్యున్నత అవార్డులు, గౌరవాలు పొందాలని ఆకాంక్షిద్దాం. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం!) -
ముగ్గురి ప్రాణాలను కాపాడిన ఈఎన్టీ
ఆదిలాబాద్: 108 అంబులెన్స్‌లో ఓ నిండు గర్భిణికి ఈఎన్టీ ప్రసూతి చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడారు. వివరాలు.. కెరమెరి మండలం పెద్ద సాకడ గ్రామానికి చెందిన ఆత్రం గంగుబాయికి పురిటి నొప్పులు రాగా శుక్రవారం కుటుంబీకులు ఆమెను కెరమెరి పీహెచ్సీలో చేర్పించారు. కవల పిల్లలున్నారని, బీపీ కూడా అధికంగా ఉందని గుర్తించిన వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం ఆమెను ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్చేశారు. 108 అంబులెన్స్‌లో ఉట్నూర్‌కు తరలిస్తున్న క్రమంలో జైనూర్ మండలం ఉశేగాం సమీపంలో ఆమెకు నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్‌లోనే ఈఎన్టీ శ్రీనాథ్ డెలివరీ చేయగా కవలలకు జన్మనిచ్చింది. బీపీ అధికంగా ఉన్నప్పటికీ ధైర్యంగా డెలివరీ చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఈఎన్టీ శ్రీనాథ్‌ను పలువురు అభినందించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. కాగా, గంగుబాయికి ఇది రెండో కాన్పు. ఈఎన్టీ శ్రీనాథ్‌తో పాటు పైలెట్ రమాకాంత్ ఉన్నారు. -
ప్లాస్టిక్ కవర్లలో వేడి ఛాయ్! పొట్ట కింద ‘టైర్లు’! అలారం మోగుతోంది.. వినబడుతోందా?
ఎన్నో సందేహాలు, సమాధానాలు దొరకని చిక్కు ప్రశ్నలు.. ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? మార్కెట్‌కు వెళ్లి చికెన్ కొందామనుకున్నాం. కోడి కాస్తా చికెన్‌గా మారే ప్రక్రియలో 30% వేస్ట్‌గా మారుతుంది. ఈ వ్యర్థాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? కోటికి పైగా జనాభా ఉండే హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలాంటి నగరాల్లో ఎన్ని టన్నుల చికెన్ వేస్టేజ్‌ను ఏం చేస్తున్నారు? వేడి వేడి చాయ్‌ని ప్లాస్టిక్ కవర్లలో మనకు నీట్‌గా ప్లాస్టిక్ కవర్లలో చికెన్ ప్యాక్ చేసిస్తారు సరే, వేస్టేజ్ అంతా ఎక్కడికి పంపుతున్నారు? స్టేషన్ దగ్గర హోటల్ ఉంది. కర్రీ ప్యాకింగ్ కోసం వస్తున్నారు. అందరికీ వేడి కర్రీలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేస్తున్నారు. అంతెందుకు గిన్నెలో మరిగే వేడి వేడి చాయ్‌ని ప్లాస్టిక్ కవర్లలో కట్టిస్తున్నారు. ఒక్క చుక్క కూడా కారదట. అది సరే, కవర్లలో అంత వేడి పదార్థాలను పోస్తుంటే దాన్నుంచి ఏమీ వెలువడవా? అందులోని పదార్థాలను తిన్నా, తాగినా ఏమీ కాదా? తెలిసిన వాళ్లలో బాగా ఉన్న వాళ్లొకరున్నారు. చాలాసార్లు పిలిస్తే వాళ్లింటికి వెళ్లాను. ఆశ్చర్యం.. ఇల్లంతా ఏసీ. బాత్రూంలో కూడా చల్లదనమే. అడిగితే ఇదే మాకు అలవాటన్నారు. ఏడాదంతా వాళ్లు ఏసీలోనే ఉంటారు. ఎండ ఉన్నా, వేడి నీళ్లతోనే స్నానం మరో విషయం. ఎంత ఎండ ఉన్నా, వాళ్లు వేడి నీళ్లతోనే స్నానం చేస్తారు. ప్రకృతికి విరుద్ధంగా వీళ్లు మారిపోయారా? చలికాలంలో వేడి నీళ్లు సరే, ఎండాకాలంలో కూడా చన్నీళ్లను భరించలేని స్థితికి మారిపోయారా? ప్రతిరోజూ సీల్ విప్పిన ప్లాస్టిక్ బాటిల్ నీళ్లను మాత్రమే ఎందుకు తాగుతారు? స్టేటస్ సింబల్ సరే, ఇలాంటి వాళ్లు చేసే పని వల్ల పుడమిపై ఎంత భారం పడుతుంది? కడుపులో కుక్కేయాలా? మా ఊరి నుంచి పెద్దాయన కబురు పెట్టాడు. సిటీలోనే ఆయన కూతురు పెళ్లి. తప్పదు కాబట్టి వెళ్లాం. పేద్ద కన్వెన్షన్ హాల్. వేలల్లో అతిథులు ఉంటారు. భోజనాల దగ్గర జాతరలా ఉంది. తిన్నా, తినకపోయినా ప్లేట్ల నిండా అక్కరకు మించి మాంసం ముక్కలు వేసేసుకుంటున్నారు. అందులో సగం కూడా తినట్లేదు. అడ్డంగా పారేస్తున్నారు. మళ్లీ మళ్లీ వేసుకుంటున్నారు. మళ్లీ మళ్లీ పారేస్తున్నారు. ఇలా చెత్తబుట్టల్లో వేసిన విలువైన ఆహారం సంగతేంటీ? భూమిలో వేస్తారా? లేక ఇంకేమైనా చేస్తారా? మనది కాదు కాబట్టి.. మళ్లీ మళ్లీ దొరకదు కాబట్టి కడుపులో కుక్కేయాలా? మిగిలిపోతోంది చిన్న కుటుంబం. సగటు జీవితం. అయినా తేడా కొడుతోంది. నిజానికి మంచి శాలరీనే వస్తోంది. అయినా సరిపోవట్లేదు, పైగా అప్పులు. నలుగురి కోసం లెక్క వేసుకుంటున్నాం కానీ.. భోజనం పూర్తయ్యేసరికి ఇంకా ఇద్దరు తినాల్సినంత మిగిలిపోతోంది. తెల్లవారికల్లా చద్దన్నం. ఆకలి తగ్గిందా? లేదు లేదు మరింత పెరిగింది. అందుకే ఆర్డర్ల మీద ఆర్డర్లు. యాప్ నొక్కగానే వస్తున్నాయి. పొట్ట కింద టైర్లు పెరుగుతున్నాయి జంక్‌ఫుడ్ కమ్మగా ఉంటే ఇంట్లో వండింది ఎందుకు తింటాం? ఎందుకు బయటి తిండే రుచికరంగా అనిపిస్తోంది? అవును.. పొట్ట కింద టైర్లు పెరుగుతున్నాయి. తెలియకుండానే దుస్తులు టైట్ అవుతున్నాయి. ఇలాంటి ప్రశ్నలు వంద. మనిషి ఆలోచనల్లో ఎక్కడో తేడా కొడుతుంది. బతికే పద్ధతి పక్కదారి పడుతోంది. నేను బతకాలి నుంచి నేనే బతకాలి అన్నంత వరకు వచ్చింది. ఉన్నది ఒక్కటే జిందగీ కాబట్టి దొరికినంత తినాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి. ఉన్న ఒక్క జీవితం అనుభవించడానికేనా? దొరికిందంతా మనమే అనుభవిస్తే.. వచ్చే తరానికి మిగిలేదేంటీ? అప్పటి నుంచి విప్లవం మన సైన్స్ లెక్కల ప్రకారం భూమి 450 కోట్ల సంవత్సరాల కింద పుట్టింది. సకల ప్రాణుల్లో ఒకరిగా మనిషి అనే రూపం కూడా వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న మనిషి రూపం– అంటే రెండు కాళ్లు, రెండు చేతులు, 2 లక్షల ఏళ్ల కింద అవతరించింది. 6 వేల ఏళ్ల నుంచి నాగరికత మొదలయింది. ఎప్పుడయితే మనిషి నిప్పును కనుగొన్నాడో అప్పటి నుంచి విప్లవం వచ్చింది. 200 ఏళ్ల కింద పూర్తి స్థాయి పారిశ్రామికీకరణ వచ్చింది. అంటే 450 కోట్ల పుడమిని అంతకు ముందెన్నడూ లేని రీతిలో 200 ఏళ్లలో మనిషి దెబ్బతీస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మనిషి ధాటికి సర్వం కాలుష్యం. భూమిపై నివసిస్తున్న 800 కోట్ల మంది.. ఇష్టానుసారంగా తమకు కావాల్సిన వస్తువులను పుడమి నుంచి తయారు చేసుకుని వాటిని వ్యర్థాలుగా మార్చి మళ్లీ భూమిలో కలిపేస్తున్నారు. ఇంకెన్నాళ్లో ఉండదు ఒక్క భూమి మాత్రమేనా? ఇప్పటికే సముద్రాలన్నింటిలో చెత్త, రసాయనాలు నింపేసి విషపూరితంగా మార్చేస్తున్నాడు. పైగా అహంకారం ఒకటి. ఇంకొకడు వాడింది నేను ముట్టుకోనంతే అంటాడు. ఏంటో మరి. నాకన్నీ కొత్తవి, బ్రాండ్ న్యూ వస్తువులు కావాలంటున్నారు. ఇలా ఎవరికి వాళ్లు నచ్చినవన్నీ వాడేసుకుంటూ పోతే.. వ్యర్థాలన్నీ నింపుకుంటూ వెళ్తే.. ఈ భూమి ఇంకెన్నాళ్లో ఉండదు. అందుకే రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ చేయాలి. ఎవరు చేయాలి? ప్రతి ఒక్కరూ చేయాలి? చెత్త కుప్పలు కాదు కొండలు లేని దేశంగా, పుడమిగా మారాలి. పర్యావరణాన్ని తద్వారా మన భవిష్యత్తును కాపాడుకోవాలి. ఇవ్వాళ మీరు తీసుకునే జాగ్రత్తలు, వేసే చిన్న చిన్న అడుగులే అందమైన భవిష్యత్తుకు దారిస్తాయి, పుడమిని కాపాడతాయి. -శ్రీనాథ్ గొల్లపల్లి చదవండి: Wat Pa Maha Chedi Kaew: 15 లక్షల ఖాళీ బీరు సీసాలతో ఆలయం అమెరికాలో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియెంట్!! మనమెందుకు పట్టించుకోవాలంటే? -
ఈనెల 30న పాలిసెట్
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30న అర్హత పరీక్ష నిర్వహించ నున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ శాఖ కార్యదర్శి సి.శ్రీనాథ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలిసెట్–2022 దరఖాస్తు గడువును ఈనెల 6వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడిం చారు. అలాగే రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 7 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. పరీక్ష నిర్వహించిన పన్నెండు రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
తానా ప్రపంచ సాహిత్య వేదిక.. మహాకవి శ్రీనాధ సాహిత్య వైభవంపై చర్చ
అట్లాంటా: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 20 వ నెల నెలా తెలుగు వెలుగు సాహిత్య కార్యక్రమం వర్చువల్‌గా జరిగింది. ఈ సందర్భంగా శ్రీనాథుడి సాహిత్యంలోని గొప్పతనం, ఆయన జీవితంలోని విశేషాలపై వక్తలు ప్రసంగించారు. ఎంతో విలువైన వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య సంపదను భావితరానికి భద్రంగా అందించే కృషిలో తానా ఎల్లప్పుడూ ముందుంటుందని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తన స్వాగతోపన్యాసంలో పేర్కొన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రాచీన సాహిత్యంపై సదస్సు నిర్వహించడం మంచి విషయమన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ జెర్సీ రాష్ట్ర యుటిలిటీస్ బోర్డు కమీషనర్ ఉపేంద్ర చివుకుల, కెనడా దేశంలోని అల్బర్టా రాష్ట్ర మౌలిక వసతుల శాఖామంత్రిగా కీలక భాద్యతలు నిర్వహిస్తున్న ప్రసాద్ పండాలు పాల్గొన్నారు. శ్రీనాథుడి రచనల విశిష్టతలను పంచ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ వివరించారు. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక తరపున నిర్వాహకులు తోటకూర ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. -
డబ్బు కోసమే శ్రీనాథ్ హత్య?
అనంతపురం,ధర్మవరం టౌన్: సీకేపల్లి మండలం బసినేపల్లి రైల్వేగేట్ వద్ద అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన యువకుడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మృతదేహానికి సంబంధించి బంధువులు ఆచూకీ గుర్తించడంతో తహసీల్దార్ సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహించారు. గత యేడాది డిసెంబర్ 19న సీకేపల్లి మండలం బసినేపల్లి రైల్వేగేట్ వద్ద అనుమానాస్పదస్థితిలో పడివున్న యువకుడి మృతదేహాన్ని కీ మ్యాన్ దస్తగిరి గుర్తించారు. అయితే మృతుని ఆచూకీ లభించకపోవడంతో ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో పంచనామా నిర్వహించి పోలీసులు ఖననం చేశారు. ఇటీవల మీడియా ముఖంగా మృతుని ఫొటోలను పోలీసులు పలు పోలీస్స్టేషన్లలో ప్రదర్శించడంతో మృతుని ఆచూకీ లభించింది. మృతుని తల్లి సుజాత బంధువులు ఫొటోలో ఉన్నది తమ కుమారుడేనని పోలీసులకు తెలిపారు. మృతుని పేరు శ్రీనాథ్ (29) అని పెనుకొండలో ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడని పోలీసులకు తెలిపారు. తహసీల్దార్ సమక్షంలో రీ పోస్ట్‌మార్టం ధర్మవరం తహసీల్దార్ హరిప్రసాద్ సమక్షంలో మృతదేహానికి ప్రభుత్వ వైద్యురాలు శ్రీలత ఆధ్వర్యంలో గురువారం రీ పోస్ట్‌మార్టం నిర్వహించారు. ధర్మవరం శ్మశానంలో ఖననం చేసిన శవాన్ని వెలికితీసి రీ పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం డీఎన్ఏ పరీక్షల కోసం శ్యాంపుల్స్ను సేకరించారు. రూ.9 లక్షల కోసమే హత్య యువకుడు శ్రీనాథ్ డిసెంబర్ 18న ప్రభుత్వ మద్యం దుకాణంలో వసూలైన రూ.9 లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వెళ్తున్నానని తల్లితో చెప్పి వెళ్ళాడని బంధువులు చెబుతున్నారు. అయితే అప్పటి నుండి ఫోన్ స్విచ్ఛాప్ చేశాడని, డబ్బుల కోసమే దుండగులు హత్య చేసి ఉంటారని మృతుని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు నిగ్గు తేలనున్నాయి. -
శ్రీనాథ్ ఏమయ్యాడు?
సోమందేపల్లి: పట్టణానికి చెందిన మద్యం షాపు సూపర్వైజర్ శ్రీనాథ్ అదృశ్యం మిస్టరీగా మారింది. ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి డబ్బు ఎత్తుకెళ్లారా అన్నది చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకెళితే.. శ్రీనాథ్ ఇటీవల ప్రభుత్వ షాపులో సూపర్వైజర్గా నియమితుడయ్యారు. తోటి సిబ్బందితో కలసి వ్యాపార లావాదేవీలు చూసుకునే వాడు. మద్యం షాపులో (సీఆర్ఓ నంబర్11146) రోజు వసూలైన కలెక్షన్‌ను బ్యాంకులో చెల్లించి సంబంధిత రశీదులను ఎక్సైజ్ అదికారులకు అప్పగించేవాడు. గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు మద్యం షాపునకు సంబంధించిన డబ్బును తన వద్దే ఉంచుకున్న శ్రీనాథ్, సోమవారం షాపు తనిఖీ నిమిత్తం వచ్చిన ఎక్సైజ్ పోలీసులు తనిఖీ అనంతరం రూ. 9 లక్షల పైచిలుకు మొత్తాన్ని బ్యాంకుల్లో కట్టి రశీదు అప్పగించాలని సూచించారు. దీంతో డబ్బు చెల్లించి రశీదు అప్పగించి వస్తానని చెప్పి షాపు నుంచి బయటకు వెళ్ళిపోయిన శ్రీనాథ్ అనంతరం కనిపించకుండా పోయాడు. సాయంత్రం వరకు ఎదురు చూసిన సిబ్బంది ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వగా పూర్తీ స్థాయిలో పరిశీలించి, కుటుంబసభ్యులతో విచారించి అనంతరం ఎక్సైజ్ పోలీసులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య చేసుకున్నాడా? శ్రీనాథ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాలధారణలో వున్న వ్యక్తి గత 4 రోజుల క్రితం పెనుకొండ మండలానికి ఆనుకుని వున్న కొత్తచెరువు మండలంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో శ్రీనాథ్ సైతం మాలధరించి ఉండడం వల్ల చనిపోయింది శ్రీనాథ్ అని, శవం కుళ్లిపోయి ఉండటంతో పోలీసులు ప్రాథమికంగా శ్రీనాథ్ అని నిర్ధారించినా డీఎన్ఏ రిపోర్టు కోసం నమూనాలు ల్యాబ్‌కు పంపారు. రిపోర్టు వచ్చే వరకు చనిపోయింది ఎవరన్నది చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. బెట్టింగ్ ప్రభావమేనా? శ్రీనాథ్‌కు ఆన్లైన్ బెట్టింగే ఆడే అలవాటు ఉందని పలువురు సన్నిహితుల ద్వారా తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న మద్యంషాపు డబ్బును ఆన్లైన్ బెట్టింగ్‌లో పొగొట్టుకుని బ్యాంకులో డబ్బు కట్టలేక, అధికారులకు సమాధానం చెప్పలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే శ్రీనాథ్ సన్నిహితులు అనుమానిస్తున్నారు. బెట్టింగ్ లావాదేవీలు సెల్ఫోన్లోనే జరిపే వాడని,. ఈ క్రమంలో అతడి సెల్‌ఫోన్ సైతం మాయం కావడం అంతుబట్టని రహస్యంగా మారింది. అయితే సెల్పోన్లో జరిపిన లావాదేవీలు, అతడు ఫోన్లో అదృశ్యమయిన రోజు జరిపిన సంభాషణలను పోలీçసులు బయటకు తీయగలిగితే కొంత వరకు వాస్తవాలు బయటపడుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పలువురు సన్నిహితుల సెల్ఫోన్లు పోలీసుల వద్ద వున్నాయి. వీటిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. బ్యాంక్‌లో కట్టమని చెప్పాం సోమవారం మద్యం షాపును తనిఖీ చేసిన అనంతరం 3 రోజులకు సంబంధించిన మొత్తం రూ. 9 లక్షల పైచిలుకు మొత్తాన్ని బ్యాంకులో చెల్లించి రశీదు ఇవ్వమని సూపర్ వైజర్ శ్రీనాథ్‌కు సూచించాం. అయినా ఇప్పటి వరకు అతని ఆచూకీ లేదు. డబ్బుతో తమకు సంబంధం ఉండదు. సూపర్వైజర్లే బ్యాంకులో చెల్లించాలి. ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేసాం. విచారణ చేస్తున్నారు.– జబీవుల్లా, ఎక్సైజ్ ఎస్ఐ, పెనుకొండ లోతుగా విచారిస్తున్నాం మద్యం షాపు సూపర్వైజర్ శ్రీనాథ్ అదృశ్యంపై పూర్తీ స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. 4 రోజుల క్రితం కొత్తచెరువు పరిధిలో అయ్యప్ప మాలధారణలో వున్న వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనాథ్ సైతం మాలధరించి వుండడంతో అతనేమైనా ఉండొచ్చు అనే కోణంలో విచారిస్తున్నాం. అదృశ్యమైన రోజు ఏ టవర్ల కింద ఫోన్ సంభాషణలు జరిపాడన్న విషయమై కాల్ డేటా సేకరిస్తున్నాం. – శ్రీహరి, సీఐ, పెనుకొండ -
మూటలు మోస్తూ.. పాఠాలు వింటూ!
న్యూఢిల్లీ: ఇతర కూలీల మాదిరిగానే తానూ మూటలు మోస్తాడు. చెవిలో ఉన్న ఇయర్ ఫోన్లను చూసి అతను పాటలు వింటున్నాడని అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న అతను స్టడీ మెటీరియల్‌ను వింటుంటాడు. అందుకోసం రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్న ఉచిత వైఫై సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. కేరళలోని ఎర్నాకులం రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేస్తున్న కె.శ్రీనాథ్ గురించే ఈ ఉపోద్ఘాతమంతా. సహచర కూలీలకు భిన్నంగా శ్రీనాథ్ ఓ వైపు లగేజీని బ్యాలెన్స్ చేస్తూనే మొబైల్ ఫోన్ లో పాఠాలను నేర్చుకుంటున్నాడు. అంటే పని చేస్తూనే నేర్చుకుంటున్నాడన్న మాట. 20 – 40 ఎంబీపీఎస్ స్పీడు కలిగిన ఉచిత వైఫై సాయంతో తాను మెటీరియల్‌ను డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు, ఆన్లైన్ పరీక్షలూ రాస్తూ ఉంటా నని చెబుతున్నాడు. హైస్కూల్ వరకే చదివిన శ్రీనాథ్ ఇప్పటికే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఓ రాత పరీక్షలో అర్హత సాధించాడు. -
డిఫరెంట్ దెయ్యం కథ!
మాగంటి శ్రీనాథ్‌ను హీరోగా పరిచయం చేస్తూ, వి. రవివర్మ దర్శకత్వంలో ఎస్. సరిత నిర్మించిన ‘ఇదేం దెయ్యం’ శుక్రవారం రిలీజ్ కానుంది. ‘‘సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ‘ఇదేం దెయ్యంరా బాబు’ అనేంత డిఫరెంట్ కథతో తీశాం. హారర్ సీన్లు థ్రిల్‌కి గురి చేస్తాయి’’ అన్నారు దర్శక– నిర్మాతలు. సాక్షి కక్కర్, రచనా స్మిత్, రుచీ పాండే నాయికలుగా నటించిన ఈ సినిమాకు సహ–నిర్మాతలు: ఎమ్. రత్నశేఖర్రావు, ఎమ్. మధుసూధన్‌రెడ్డి, వి. రామ్కిశోర్రెడ్డి, ఎమ్. సౌజన్య. -
టెక్కీని కాపాడింది కానీ జయను...
బెంగళూరు : కార్డియాక్ అరెస్టుకు గురై అసువులు బాసిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చివరి ఘడియల్లో అందించిన ఎక్మో చికిత్స, ఓ టెక్కీ ప్రాణాలను కాపాడగలిగింది. అకస్మాత్తుగా తీవ్ర జ్వరంతో ఐసీయూ చేరిన 43 ఏళ్ల శ్రీనాథ్‌కు ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఎంతో ఆరోగ్యంగా ఉండే వ్యక్తికి ఇలా అయ్యే సరికి కుటుంబసభ్యులకు ఒక్కసారిగా షాకయ్యారు. కానీ వెంటనే స్పందించిన డాక్టర్లు, ఇటీవలే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అందించిన ఎక్మో చికిత్సను టెక్కీకి అందించారు. దీంతో శ్రీనాథ్ గుండెను 24 గంటల లోపల తిరిగి మామూలు స్థాయికి చేరుకునేలా చేశారు. జయలలితకు, ఇప్పుడు శ్రీనాథ్‌కు అందించిన ఎక్మో చికిత్సలో ఓ యంత్ర పరికరం ద్వారా రక్తాన్ని పేమెంట్ శరీరంలోకి ప్రవహించేలా చేశారు. కార్బన్‌డయాక్సైడ్‌ను బయటికి తీస్తూ... ఆక్సిజన్‌ను ఎర్ర రక్తకణాల్లోకి పంపిస్తూ గుండెను మామూలు స్థితికి చేరుకునేలా కృషిచేశారు. కానీ ఈ చికిత్సలో టెక్కీ తిరిగి మామూలు స్థాయికి చేరుకోగా, జయలలిత ఆరోగ్య పరిస్థితి ఆ చికిత్సకు సపోర్టు చేయక ఆమె ప్రాణాలు వదిలారు. భారత్‌లో ఈ చికిత్సపై అవగాహన తక్కువ. చాలామంది పేషెంట్లు గుండె కొట్టుకోవడం ఆగిపోయి మరణిస్తున్నప్పటికీ, వారికి ఈ ట్రీట్ మెంట్ అందుబాటులో ఉండటం లేదు. విషమ పరిస్థితికి చేరుకున్న గుండెను సైతం ఈ చికిత్స ద్వారా సాధారణ పరిస్థితికి తీసుకురావచ్చు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు హార్ట్ అటాక్‌కు గురైనప్పుడూ ఈ చికిత్స ఎంతో ఉపయోగపడుతోంది. ఈ చికిత్స గురించి దేశంలో అవగాహన కల్పించాల్సినవసరం ఉందని కార్డియాక్ సర్జన్ డాక్టర్ దేవీ శెట్టి చెప్పారు. శ్రీనాథ్‌తో పాటు 500 మందికి పైగా పేషెంట్లకు నారాయణ హృదయాలయ ఈ ఎక్మో చికిత్సను అందించింది. ఈ చికిత్సకు మొత్తం మూడు నుంచి ఎనిమిది లక్షల వరకు ఖర్చవుతుంది. ఎక్మో చికిత్స ద్వారా తనకు పునర్జన్మ కలిగినట్టు శ్రీనాథ్ పేర్కొన్నారు. ఎక్మో చికిత్సను ఎప్పుడు ఎక్కువగా వాడతారు? ఎక్మో చికిత్సను ఎక్కువగా రెండు క్లిష్టమైన పరిస్థితుల్లో వాడతారు. ఒకటి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు(జయలలితకు జరిగిన మాదిరి), న్యూమోనియా లేదా గాయాలు వంటి ఇన్ఫెక్షన్ల వల్ల ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేనప్పుడు ఈ చికిత్సను అందిస్తారు. -
రైఫిల్ షూటింగ్లో రాకెట్లా..
దూసుకుపోతున్న చాగల్నాడు కుర్రాడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు కైవసం నరేంద్రపురం (రాజానగరం) : ఫ్రీ నేషనల్స్ పాయింట్ 22 స్మాల్ బోర్ రైఫిల్ షూటింగ్స్ (50 మీటర్లు) సీనియర్, జూనియర్ స్థాయి పోటీల్లో రాజానగరం మండలం నరేంద్రపురానికి చెందిన వడ్డి శ్రీనా«థ్ ముత్యాలురావు థర్డ్ ప్లేస్‌లో నిలిచి రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకున్నాడు. ది నేషనల్ రైఫిల్ అసోసియేష¯ŒS ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ముంబయ్‌లో జరిగిన 26వ ఆల్ ఇండియా జీవీ మావలంకర్ షూటింగ్ చాంపియ¯ŒS షిప్ రైఫిల్ ఈవెంట్స్‌లో పాల్గొన్న శ్రీనాథ్ స్మాల్ బోర్ ఫ్రీ రైఫిల్ ఫ్రో¯ŒS (ఎ¯ŒSఆర్) చాంపియ¯ŒS షిప్, 50 మీటర్లు(మె¯ŒS) సీనియర్స్, జూనియర్స్ విభాగాలలో 600 స్కోర్‌కిగాను 574 స్కోర్‌తో వీటిని సొంతం చేసుకున్నాడు. అలాగే గత అక్టోబర్ 20 నుంచి 25 వరకు మధురైలో జరిగిన సౌత్ జో¯ŒS ఈవెంట్స్‌లో పాయింట్ 22 ఫ్రో¯ŒSలో సిల్వర్ మెడల్ అందుకున్నాడు. డిసెంబర్ 12 నుంచి 18 వరకు పూణెలో జరిగే నేషనల్ లెవెల్స్ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో తన కుమారుడు ఇండియ¯ŒS టీమ్ (టాప్–8)కి అర్హత సాధిస్తాడనే ఆశాభావాన్ని ఆయన తండ్రి వడ్డి సూర్యప్రకాశరావు వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధిండమే లక్ష్యం 2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ పోటీలలో పాల్గొని, బంగారు పతకాన్ని సాధిండమే తన ప్రధాన లక్ష్యమని శ్రీనాథ్ ముత్యాలురావు చెబుతున్నాడు. తన తండ్రి సూర్యప్రకాశరావు ప్రోత్సాహంతోనే తాను రైఫిల్ షూటింగ్లో రాణిస్తున్నానని పేర్కొన్నాడు. -
మహిళలకు ఉచిత శిక్షణ
సంగారెడ్డి మున్సిపాలిటీ: గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఈనెల 3వ తేది నుంచి 30 రోజుల పాటు బ్యూటీపార్లర్ మేనేజ్మెంట్పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు స్టేట్‌బ్యాంక్ గ్రామీణ ఉపాధి కల్పన శిక్షణ కేంద్రం డైరెక్టర్ శ్రీనాథ్ సోమవారం తెలిపారు. ఆసక్తి గలవారు విద్యార్హత ధ్రువపత్రాలు, తెల్లరేషన్ కార్డు కలిగినవారు సంగారెడ్డిలోని పాత వెలుగు కార్యాలయం ఆవరణలో ఉన్న ఉపాధి శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతితో రవాణా చార్జీలు సైతం చెల్లిస్తామన్నారు. -
కన్నీరే మిగిలింది...
కారణం ఏంటో తెలీదు..ఓ తల్లి పిల్లల కళ్లెదుటే కాలిపోయింది..‘అమ్మ’ ఎందుకు కాలిపోతోందో తెలీదు...అమ్మను పట్టుకుంటే తాము కాలిపోతామనే సంగతీ అసలే తెలీదు... అల్లారుముద్దుగా పెంచిన ‘అమ్మ’ అగ్నికి ఆహుతి అవుతుండటంతో ఇద్దరు పిల్లలు అమ్మను కౌగిలించుకున్నారు. వారూ మంటల్లో చిక్కుకున్నారు. ఆర్తనాదాలు చేయడం మినహా చావు నుంచి బయటపడలేకపోయారు. అందరూ అగ్నికి ఆహుతయ్యారు. మనస్పర్థలతో భార్యను పుట్టింటికి పంపిన భర్త, శాశ్వతంగా భార్యతో పాటు ఇద్దరు పిల్లలను కోల్పోయాడు. కదిరిలో జరిగిన ఈ సంఘటన అందరినీ కన్నీరు పెట్టించింది. కారణం ఏదైనా... కారకులెవరైనా : బంగారులాంటి పిల్లలను అల్లారుముద్దగా పెంచాల్సిన తల్లి ఆత్మహత్య చేసుకునేందుకు కారకులెవరైనా బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు.. తల్లితో కలిసి కానరాని లోకాలకు వెళ్లారు. గోరంట్ల : ఎస్ఏపీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ నియామాకంపై కళాశాల యాజమాన్యంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదంలో కళాశాల కరస్పాండెంట్ కెంపుల లక్ష్మన్న ఇంటి వద్ద కిరోసిన్ పోసి నిప్పటించారని హిందూపురం పార్లమెంటు సభ్యులు నిమ్మల కిష్టప్ప సోదరుడు కుమారుడు, ఎంపీటీసీ సభ్యుడు నిమ్మల యువశేఖర్, కళాశాల సివిక్స్ లెక్చరర్ శ్రీనాథ్ మరికొంత మందిపై కళాశాల కరస్పాండెంట్ లక్ష్మన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాల మేరకు ....కళాశాలలో ప్రిన్సిపాల్ నియామకంపై నెలకొన్న వివాదంలో కరస్పాండెంట్‌పై కక్ష్య కట్టిన పైన పేర్కొన్న నిందితులు గురువారం సాయంత్రం లక్ష్మన్న ఇంటి వద్దకు వెళ్లి ఘర్షణ పడేందుకు గాను గలాట చేశారు. ఆ సమయంలో లక్ష్మన్న తమ్ముడు శ్రీనివాసులు రాకను గమనించిన వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. శ్రీనివాసులు కొంత సేపు ఉండి వెళ్లిపోయారు. ఆ తర్వాత రాత్రి 10.45 ప్రాంతంలో ఇంటి వద్ద గ్రిల్స్‌లో నుంచి కిరోసిన్ పోసి నిప్పంటించారు. నవారు మంచం నుంచి మంటలు వ్యాపిస్తుండటంతో లక్ష్మన్న బయటకు వచ్చి చూశారు. బయట వాహనాల్లో నిమ్మల యువశేఖర్, శ్రీనాథ్ తన అనుచరులు మహేష్, నరేష్ తదితరులు లక్ష్మన్నను దూషిస్తూ ఇంటిని కిరోసిన్ పోసి తగల బెట్టండి... ఎవరు అడ్డు వస్తారో చూద్దాం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంటలు తీవ్రం కాకుండా లక్ష్మన్న కుటుంబసభ్యులు ఆర్పివేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. అయితే ఈ ఘటనకు కారణం ప్రిన్సిపాల్ నియామకంలో నెలకొన్న వివాదమే. నిమ్మల యువశేఖర్ గత నెల 11, 19 తేదీల్లో గొడవలు పడి దౌర్జన్యంతో ప్రిన్సిపాల్‌గా శ్రీనాథ్‌ను నియమించారు. దీంతో ఆ నియామకం చెల్లదని కోర్టు ద్వారా స్టే తేవడంతో శ్రీనాథ్‌ను తప్పించి, నిబంధనల మేరకు డాక్టర్ సూర్యనారాయణను నియమించారు. నిందితుల నుంచి నాకు, కళాశాలలో పని చేస్తున్న లెక్చరర్లకు ప్రాణహాని ఉందని కళాశాల కరస్పాండెంట్ లక్ష్మన్న పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తాం : ఎంపీటీసీ సభ్యుడు నిమ్మల యువశేఖర్, సివిక్స్ లెక్చరర్ శ్రీనాథ్, మహేష్, నరేష్‌తో పాటు మరి కొంత మందిపై ఎస్పీఎస్ కళాశాల కరస్పాండెంట్ కెంపుల లక్ష్మన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. -
సబ్ కాంట్రాక్టర్లు ఇకపై కాంట్రాక్టర్లు
గుర్తింపు ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు సబ్ కాంట్రాక్టర్లుగా పనిచేసిన వారిని కాంట్రాక్టర్లుగా గుర్తించి పనులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ, వాటర్ గ్రిడ్, రహదారుల పనులు చేపడుతున్నందున సబ్ కాంట్రాక్టర్లను, కాంట్రాక్టర్లుగా గుర్తించి పనులు అప్పగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లను ప్రోత్సహించే అవకాశాలను పరిశీలించాలని చీఫ్ ఇంజనీర్ల బోర్డు (బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్) ప్రభుత్వానికి గతంలో సిఫార్సుచేసింది. క్లిష్టమైన కాంట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ విధానాన్ని సరళీకరించడంతో పాటు తెలంగాణకు చెందిన సబ్ కాంట్రాక్టర్ల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని వారికి కాంట్రాక్టర్లుగా అవకాశం కల్పించాలని ప్రతిపాదించింది. సబ్ కాంట్రాక్టర్లు నేరుగా టెండర్లు దాఖలు చేయడానికి వీలుగా, గతంలోని జీవోలను మార్పు చేయాల్సి ఉందని, గడచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఏ ఒక్క ఏడాదైనా రూ. 2.5 కోట్ల టర్నోవర్ ఉంటే ఆ సబ్ కాంట్రాక్టర్లకు ప్రత్యేక తరగతి కాంట్రాక్టర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అర్హత కల్పించాలని బోర్డు సూచించింది. స్థానిక సంస్థల పరిధిలో నిర్మాణ రంగంలో ఉన్న సబ్ కాంట్రాక్టర్లకు అన్ని ఇంజనీరింగ్ పనుల్లో అర్హత కల్పించాలని సిఫార్సు చేసింది. సీఎంను కలసిన సబ్ కాంట్రాక్టర్ల బృందం.. సోమవారం సబ్ కాంట్రాక్టర్ల బృందం ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వివరించింది. ప్రధాన కాంట్రాక్టర్ల నుంచి కోట్లలో రావాల్సిన బకాయిలు, తమను కాంట్రాక్టర్లుగా గుర్తించే విషయంలో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ సబ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు విశ్వరాజ్పాల్, ఇతర నాయకులు హరినాథ్, శ్రీనాథ్, గౌతమ్‌రెడ్డి తదితరులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం వారి సమస్యలను పరిష్కరించడానికి హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్లులు చెల్లింపు అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సబ్ కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు రూ.3 కోట్ల వరకు టెండర్ వేసేందుకు ఉన్న అర్హతను రూ.10 కోట్లకు పెంచేందుకు సీఎం సానుకూలత తెలిపినట్లు సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. -
కేఎస్‌సీఏ నుంచి కుంబ్లే, శ్రీనాథ్ వాకౌట్
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) వార్షిక సభ్య సమావేశం గందరగోళంగా మారింది. ఆదివారం జరిగిన ఈ సమావేశం నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ వాకౌట్ చేశారు. నిధులు దుర్వినియోగం చేశారని వారు మండిపడ్డారు. క్రికెట్ కోసం ఖర్చు చేయాల్సిన వంద కోట్ల రూపాయిల నిధులను క్లబ్ హౌస్‌ల కోసం వినియోగించాలని క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకుందని కుంబ్లే ఆరోపించాడు. క్రికెట్ అభివృద్ధి కోసం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించాడు. 2010లో మూడేళ్లకాలానికి గాను కేఎస్‌సీఏ అధ్యక్షుడిగా కుంబ్లే ఎన్నికయ్యాడు. మాజీ పేసర్లు వెంకటేశ్ ప్రసాద్, శ్రీనాథ్ కూడా కేఎస్‌సీఏ పాలక మండలికి ఎన్నికయ్యారు. -
కాంగ్రెస్‌కు అభ్యర్థి దొరికాడోచ్..
బందరు లోక్‌సభకు శ్రీనాథ్ బాడిగ స్వతంత్ర బాట? మారుతున్న సమీకరణలు సాక్షి, మచిలీపట్నం : ఆర్థిక తోడ్పాటు అందిస్తామన్నా అభ్యర్థి దొరకని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరికాడని సంబరపడాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజాగ్రహ జ్వాలల్లో కాంగ్రెస్, టీడీపీలు మాడి మసైపోతాయన్న భయం ఆ పార్టీ నేతలను ఆవరించింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన టీడీపీ జిల్లాలో కాంగ్రెస్ నకలుగా మారిపోయింది. జిల్లాలో వైఎస్సార్సీపీ గాలి పెరగడంతో టీడీపీ అభ్యర్థుల ఎంపికపై ముందు నుంచి కసరత్తు చేసింది. అంతకు ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం వెదుకులాట చేపట్టినా ఫలితం దక్కలేదు. ఖర్చులకు ఎదురు డబ్బులు ఇస్తామన్నా.. ఓడిపోయేదానికి ఎందుకొచ్చిన ప్రయత్నం అంటూ అభ్యర్థులు ముందుకు రాలేదు. దీంతో ఈసారికి చిత్తుగా ఓడిపోయినా పోటీ పెట్టినట్టు పరువు దక్కించుకునేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలూ చేసింది. గత నెలలో హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో జరిగిన డీసీసీ అధ్యక్షుల సమావేశానికి వెళ్లిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు జిల్లా అభ్యర్థుల జాబితాను సేకరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైదరాబాద్ సమావేశంలో ప్రతి నియోజకవర్గానికి ఏదో ఒక పేరును ప్రకటించేలా నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేపడుతున్నారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ను ప్రకటించడం, ఆయన ప్రచారం ప్రారంభించడం జరిగింది. మచిలీ పట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలుత ఐలాపురం వెంకయ్య కుమారుడు రాజా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణకు టీడీపీ సీటు దక్కకుంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఇవేమి కాదని ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ సోదరుడు బూరగడ్డ శ్రీనాథ్ పేరును పీసీసీ ఆమోదం కోసం పంపించినట్టు సమాచారం. వైద్య వృత్తిలో కొనసాగుతున్న శ్రీనాథ్ హైదరాబాద్‌లో ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌లో పలు పదవులు నిర్వహించిన శ్రీనాథ్ తన తండ్రి బూరగడ్డ నిరంజన్‌రావు, సోదరుడు వ్యాస్ పోటీచేసిన ఎన్నికల్లో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా వ్యవహరించేవారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన్ను ఖరారు చేస్తే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్టు అవుతుంది. ఇదే విషయమై శ్రీనాథ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా తనకు కాంగ్రెస్ బందరు ఎంపీ టిక్కెట్ దాదాపు ఖరారైనట్టేనని స్పష్టం చేశారు. రాజకీయంగా పట్టు నిలుపుకొనేందుకు వ్యాస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టే శ్రీనాథ్ పోటీ ఆధారపడి ఉంటుందని ఆంతరంగికులు చెబుతున్నారు. బాడిగ స్వతంత్ర బాట.. అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్ పార్టీల్లో అవకాశం దక్కని మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే యోచనలో ఉన్నట్టు పలువురు చెబుతున్నారు. కాంగ్రెస్ ఎంపీగా పనిచేసి బాడిగ ఇటీవల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారవడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసే సాహసం చేయలేకపోతున్నారు. ఇదే క్రమంలో ఆయన టీడీపీ ఎంపీ టిక్కెట్ కోసం విఫలయత్నం చేసినట్టు సమాచారం. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మచిలీపట్నం కదిలేందుకు ససేమిరా అనడంతో బాడిగ ప్రయత్నాలు నెరవేరలేదని చెబుతున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొనకళ్ల నారాయణరావును చంద్రబాబు బుధవారం ప్రకటించారు. దీంతో టీడీపీ సీటు కోసం బాడిగ ప్రయత్నాలకు తెరపడినట్టేనని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఆయన పోటీకి సుముఖంగా లేకపోవడంతో శ్రీనాథ్ పేరు తెరమీదకు తెచ్చారు. దీంతో బాడిగ రాజకీయంగా పట్టు కోసం స్వతంత్ర బాట పడతారని ఆయన అనుయాయులు చెబుతుండటం కొసమెరుపు. -
వ్యవసాయశాఖలో బదిలీల కలకలం
అధికారుల సామూహిక సెలవు బదిలీలపై ట్రిబ్యునల్ స్టే? కమిషనర్‌ను కలిసిన ప్రతినిధులు వరంగల్, న్యూస్‌లైన్:సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల బదిలీలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. తొలిసారి ఈ శాఖలోని ఐదవజోన్ పరిధిలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో 61 మందిని బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 9 మంది ఏడీఎలు, 52 మంది ఏవోలు ఉన్నారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ జిల్లాలోని వ్యవసాయశాఖ అధికారులు శుక్రవారం సామూహిక సెలవుపెట్టారు. సంఘాల ప్రతినిధులు వ్యవసాయశాఖ కమిషనర్‌ను కలిసేందుకు హెదరాబాద్కు వెళ్లారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఎన్నికల కమిషన్ నిబంధనలను వ్యవసాయశాఖకు వర్తింపచేయడం చర్చనీయాంశంగా మారింది. ట్రిబ్యునల్ స్టే? సీమాంధ్ర అధికారుల తీరు వల్లనే తెలంగాణ ప్రాంతంలోనే ఈ బదిలీలు జరిగినట్లు భావిస్తున్నారు. దీనిపై కొందరు అధికారులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో శుక్రవారం బదిలీలను నిలిపివేస్తూ స్టే ఇచ్చినట్లు సమాచారం. కాగా, ఈ బదిలీలపై వ్యవసాయశాఖకు సంబంధించిన మూడు సంఘాల ప్రతినిధులు హైదరాబాద్‌కు వెళ్లి వ్యవశాయశాఖ కమిషనర్ మధుసూదన్‌రావును శుక్రవారం కలిశారు. బదిలీల తీరుపై కమిషనర్‌కు వివరించారు. తెలంగాణ పరిధిలోని ఒక్క ఐదవజోన్ పరిధిలోనే బదిలీలు చేయడం ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చి బదిలీల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు వివరించారు. కమిషనర్ మధుసూదన్‌రావును కలిసిన వారిలో తెలంగాణ వ్యవసాయశాఖ డాక్టర్ల సంఘం ప్రతినిధులు నర్సింగం, శ్రీనాథ్, ప్రదీప్, తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం ప్రతినిధులు సురేష్, శ్రీనివాస్, తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం ప్రతినిధులు అనురాధ, కృష్ణారెడ్డి, భద్రయ్యతో పాటు పలువురు అధికారులు ఉన్నారు.