రైఫిల్ షూటింగ్‌లో రాకెట్‌లా..
-
దూసుకుపోతున్న చాగల్నాడు కుర్రాడు
-
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు కైవసం
నరేంద్రపురం (రాజానగరం) :
ఫ్రీ నేషనల్స్ పాయింట్ 22 స్మాల్ బోర్ రైఫిల్ షూటింగ్స్ (50 మీటర్లు) సీనియర్, జూనియర్ స్థాయి పోటీల్లో రాజానగరం మండలం నరేంద్రపురానికి చెందిన వడ్డి శ్రీనా«థ్ ముత్యాలురావు థర్డ్ ప్లేస్‌లో నిలిచి రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకున్నాడు. ది నేషనల్ రైఫిల్ అసోసియేష¯ŒS ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ముంబయ్‌లో జరిగిన 26వ ఆల్ ఇండియా జీవీ మావలంకర్ షూటింగ్ చాంపియ¯ŒS షిప్ రైఫిల్ ఈవెంట్స్‌లో పాల్గొన్న శ్రీనాథ్ స్మాల్ బోర్ ఫ్రీ రైఫిల్ ఫ్రో¯ŒS (ఎ¯ŒSఆర్) చాంపియ¯ŒS షిప్, 50 మీటర్లు(మె¯ŒS) సీనియర్స్, జూనియర్స్ విభాగాలలో 600 స్కోర్‌కిగాను 574 స్కోర్‌తో వీటిని సొంతం చేసుకున్నాడు. అలాగే గత అక్టోబర్ 20 నుంచి 25 వరకు మధురైలో జరిగిన సౌత్ జో¯ŒS ఈవెంట్స్‌లో పాయింట్ 22 ఫ్రో¯ŒSలో సిల్వర్ మెడల్ అందుకున్నాడు. డిసెంబర్ 12 నుంచి 18 వరకు పూణెలో జరిగే నేషనల్ లెవెల్స్ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో తన కుమారుడు ఇండియ¯ŒS టీమ్ (టాప్–8)కి అర్హత సాధిస్తాడనే ఆశాభావాన్ని ఆయన తండ్రి వడ్డి సూర్యప్రకాశరావు వ్యక్తం చేస్తున్నారు.
ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధిండమే లక్ష్యం
2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ పోటీలలో పాల్గొని, బంగారు పతకాన్ని సాధిండమే తన ప్రధాన లక్ష్యమని శ్రీనాథ్ ముత్యాలురావు చెబుతున్నాడు. తన తండ్రి సూర్యప్రకాశరావు ప్రోత్సాహంతోనే తాను రైఫిల్ షూటింగ్‌లో రాణిస్తున్నానని పేర్కొన్నాడు.