Narendrapuram
-
రైఫిల్ షూటింగ్లో రాకెట్లా..
దూసుకుపోతున్న చాగల్నాడు కుర్రాడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు కైవసం నరేంద్రపురం (రాజానగరం) : ఫ్రీ నేషనల్స్ పాయింట్ 22 స్మాల్ బోర్ రైఫిల్ షూటింగ్స్ (50 మీటర్లు) సీనియర్, జూనియర్ స్థాయి పోటీల్లో రాజానగరం మండలం నరేంద్రపురానికి చెందిన వడ్డి శ్రీనా«థ్ ముత్యాలురావు థర్డ్ ప్లేస్‌లో నిలిచి రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకున్నాడు. ది నేషనల్ రైఫిల్ అసోసియేష¯ŒS ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ముంబయ్‌లో జరిగిన 26వ ఆల్ ఇండియా జీవీ మావలంకర్ షూటింగ్ చాంపియ¯ŒS షిప్ రైఫిల్ ఈవెంట్స్‌లో పాల్గొన్న శ్రీనాథ్ స్మాల్ బోర్ ఫ్రీ రైఫిల్ ఫ్రో¯ŒS (ఎ¯ŒSఆర్) చాంపియ¯ŒS షిప్, 50 మీటర్లు(మె¯ŒS) సీనియర్స్, జూనియర్స్ విభాగాలలో 600 స్కోర్‌కిగాను 574 స్కోర్‌తో వీటిని సొంతం చేసుకున్నాడు. అలాగే గత అక్టోబర్ 20 నుంచి 25 వరకు మధురైలో జరిగిన సౌత్ జో¯ŒS ఈవెంట్స్‌లో పాయింట్ 22 ఫ్రో¯ŒSలో సిల్వర్ మెడల్ అందుకున్నాడు. డిసెంబర్ 12 నుంచి 18 వరకు పూణెలో జరిగే నేషనల్ లెవెల్స్ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో తన కుమారుడు ఇండియ¯ŒS టీమ్ (టాప్–8)కి అర్హత సాధిస్తాడనే ఆశాభావాన్ని ఆయన తండ్రి వడ్డి సూర్యప్రకాశరావు వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధిండమే లక్ష్యం 2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ పోటీలలో పాల్గొని, బంగారు పతకాన్ని సాధిండమే తన ప్రధాన లక్ష్యమని శ్రీనాథ్ ముత్యాలురావు చెబుతున్నాడు. తన తండ్రి సూర్యప్రకాశరావు ప్రోత్సాహంతోనే తాను రైఫిల్ షూటింగ్లో రాణిస్తున్నానని పేర్కొన్నాడు. -
‘ఆట’ముత్యం
రోలర్ స్కేటింగ్ హాకీ నుంచి ఎయిర్ రైఫిల్ షూటింగ్ వరకు సత్తాచాటుతున్న నరేంద్రపురం కుర్రాడు రోలర్ స్కేటింగ్ హాకీ, ఎయిర్ రైఫిల్ షూటింగ్ క్రీడ ఏదైనా.. అతను బరిలోకి దిగాడంటే పతకం కొట్టాల్సిందే. పదో ఏటనే తనకు ఇష్టమైన రోలర్‌స్కేటింగ్ హాకీ, స్విమ్మింగ్ విభాగాల్లో శిక్షణ పొంది ఆయా రంగాల్లో రాణించిన అతడు.. తన వ్యక్తిగత గుర్తింపు కోసం ఎయిర్ రైఫిల్ షూటింగ్‌పై ఆసక్తి కనబరిచాడు. ఆ రంగంలోనూ ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయి క్రీడాకారుడిగా తన సత్తాను చాటుతున్నాడు రాజానగరం మండలం నరేంద్రపురానికి చెందిన ఈ కుర్రాడు. – రాజానగరం వడ్డి శ్రీనాథ్ ముత్యాలరావు. ఇతడికి చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఎంతో ఆసక్తి. వ్యవసాయదారుడైన తండ్రి సూర్యప్రకాష్ ఇతడి ఆసక్తిని గమనించి క్రీడల్లో ప్రోత్సహించారు. నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు స్థానిక కాన్వెంట్లో చదివిన ముత్యాలరావు ఆపై పెద్దాపురంలోని ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. అక్కడ ఇతర విద్యార్థులకు కోచ్‌లు ఇచ్చే శిక్షణను చూసి.. తాను కూడా రోలర్‌స్కేటింగ్, స్విమ్మింగ్ విభాగాల్లో శిక్షణ పొందాడు. 12వ ఏట నుంచి వరుసగా ఐదేళ్లపాటు రోలర్ స్కేటింగ్ హాకీలో రాష్ట్ర స్థాయిలో విజేతగా మెడల్స్ అందుకున్నాడు. ఈ పోటీలన్నీ టీమ్ గేమ్స్ కావడంతో ఇండివిడ్యువల్‌గా 2015లో స్టేట్ మీట్‌కి వెళ్లి గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఆ సమయంలో అంతర్జాతీయ స్థాయిలో చైనాలో జరిగే పోటీలకు వెళ్లేందుకు అవకాశం వచ్చినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెళ్లలేకపోయాడు. వ్యక్తిగత గుర్తింపు కోసం.. 2015 ఫిబ్రవరి వరకు రోలర్ స్కేటింగ్ హాకీలో జాతీయ స్థాయి ప్లేయర్‌గా ఉన్నాడు. వ్యక్తిగత గుర్తింపు లేదని నిరాశకు గురై రైఫిల్ షూటింగ్‌పై ఆసక్తి చూపాడు. ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని గగననారాయణ అకాడమీలో చేరాడు. మొదటిసారిగా ఆగస్టులో జరిగిన స్టేట్ ఈవెంట్స్‌లో పాల్గొని జూనియర్, సీనియర్ విభాగాల్లో రెండు గోల్డ్ మెడల్స్ అందుకున్నాడు. అలాగే 2015,16లో రాష్ట్ర స్థాయి ఈవెంట్స్‌లో టాపర్‌గా నిలిచాడు. ఇటీవల గుంటూరులో జరిగిన ఎయిర్ రైఫిల్ రెనౌండ్ షూటింగ్ పోటీల్లో చాంపియన్‌గా నిలిచాడు. రెండు బంగారు పతకాలను విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్, రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సలాలిత్ల ద్వారా అందుకున్నాడు. ఎయిర్ రైఫిల్ రెనౌండ్ షూటర్‌గా ఇండియాలో టాప్ 50కి ఎంపికై ప్రస్తుతం ప్రాక్టీసు చేస్తున్నాడు. అలాగే పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో దేశంలో 11వ ర్యాంకును, ఏపీలో మొదటి ర్యాంకును సాధించాడు. ఆగస్టు రెండోతేదీ నుంచి గచ్చిబౌలిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో, 22, 23 తేదీల్లో ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లోనూ పాల్గొననున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బీబీఎంలో చేరిన ముత్యాలరావు తన లక్ష్యం 2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ పోటీలేనని అంటున్నాడు. -
మిస్టరీ వీడేది నేడే..
నరేంద్రపురం (పి.గన్నవరం) : గ్రామంలో నెల రోజుల క్రితం పాడుబడ్డ ఇంటి శిథిలాలను తొలగిస్తున్న సమయంలో బయటపడిన పాత ఇనుప పెట్టెను శుక్రవారం తెరిచేందుకు కలెక్టర్ నీతూ ప్రసాద్ అనుమతి ఇచ్చారని తహశీల్దార్ ఎల్.జోసెఫ్ గురువారం విలేకరులకు తెలిపారు. స్థానిక శివాలయం వీధిలో భూస్వామి ఈమని రామగోపాలానికి చెందిన ఇల్లు శిథిలమైంది. గత నెల 17న ఆ ఇంటి శిథిలాలను జేసీబీతో తొలగిస్తుండగా పాత ఇనుప పెట్టె బయట పడిన విషయం విదితమే. ఆ పెట్టెలో నిధి నిక్షేపాలున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో దీనిపై తీవ్ర ఉత్కంఠ రేగింది. ఆ పెట్టెపై అందరి దృష్టి పడింది. దానిని అధికారులు స్వాధీనం చేసుకుని, పోలీసు కస్టడీ ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఉదయం 9 గంటలకు ఆ పెట్టెను తెరవనున్నట్టు తహశీల్దార్ చెప్పారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఆ పెట్టెలో ఏముందో మరో కొద్ది గంటల్లో తేలనుంది. -
ఈ పెట్టెలో పెన్నిధి ఉందా?
నరేంద్రపురం (పి.గన్నవరం) : మండలంలోని నరేంద్రపురంలో పాడుబడ్డ ఓ గృహం ఇప్పుడు ఆ ఊళ్లోనే కాక పరిసర గ్రామాల్లోనూ ఊహాగానాలకు కేంద్రబిందువైంది. శిథిలమైన ఆ ఇంటిని తొలగిస్తుం డగా సోమవారం బయటపడ్డ ఓ ఇనుపపెట్టె అందుకు కారణం. ‘ఆ పెట్టెలో ఏముంది? మేలిమి బంగారమా? నవరత్నాలు పొదిగిన నగలా?’ అన్న కుతూహలం ప్రతి వారి మదిలో చెలరేగుతోంది. అది తేలాలంటే మంగళవారం వరకూ ఆగాల్సిందే. స్థానిక శివాలయం వీధిలో భూస్వామి ఈమని రామగోపాలానికి చెందిన పెంకుటింటిలో సుమారు 40 ఏళ్ల నుంచి ఎవరూ నివసించడం లేదు. పిల్లలు లేని రామగోపాలం, అచ్యుతమ్మ దంపతులు పశ్చిమ గోదావరి జిల్లాలోని కవిటం వెళ్లిపోయి బంధువుల కుమారుడు వెంకట జగన్నాథశాస్త్రిని దత్తత తీసుకున్నారు. 25 ఏళ్ల క్రితం అచ్యుతమ్మ, 20 ఏళ్ల క్రితం రామగోపాలం మరణించారు. ఇన్నేళ్లలో ఆ ఇల్లు పాడుబడి, శిథిలమై పాములకు నెలవుగా మారింది. దీంతో ఆందోళన చెందిన స్థానికులు ఇంటిని తొలగించాలని శాస్త్రిని కోరారు. ఆదివారం వచ్చిన ఆయన కొబ్బరికాయ కొట్టి తొలగింపు పనులకు శ్రీకారం చుట్టి వెళ్లిపోయారు. సోమవారం జేసీబీతో ఇంటి శిథిలాలను తొలగిస్తుండగా తాళం వేసి ఉన్న పెద్ద ఇనుప పెట్టె బయటపడింది. దాంతో ఆ ఇంట్లో గుప్తనిధులు బయటపడ్డాయని, లంకెబిందెలు లభించాయని క్షణాల్లో ఊరంతా ప్రచారం జరిగింది. ఇంటి యజమానులు భూస్వాములు కావడం ఆ ప్రచారానికి ఊతమిచ్చింది. విషయం తెలిసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు రాత్రి 8.30 గంటలకు గ్రామానికి చేరుకుని ఇనుప పెట్టెను స్వాధీనం చేసుకున్నారు. పి.గన్నవరం ఏఎస్సై ఎన్.సత్యనారాయణ, ఆర్ఐ బొరుసు లక్ష్మణరావు, వీఆర్వో తటవర్తి కృష్ణ పెట్టెను పరిశీలించారు. శాస్త్రి వచ్చాక ఆయన సమక్షంలో మంగళవారం పెట్టెను తెరవాలని నిర్ణయించారు. అంతవరకూ పోలీసులకు కాపలాగా ఉంచారు. అంటే.. పెట్టె తెరిచే వరకూ పట్టరాని కుతూహలం తప్పదన్న మాట.