మిస్టరీ వీడేది నేడే.. | Old iron box today | Sakshi
Sakshi News home page

మిస్టరీ వీడేది నేడే..

Published Fri, Dec 19 2014 12:53 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM

మిస్టరీ వీడేది నేడే.. - Sakshi

మిస్టరీ వీడేది నేడే..

నరేంద్రపురం (పి.గన్నవరం) : గ్రామంలో నెల రోజుల క్రితం పాడుబడ్డ ఇంటి శిథిలాలను తొలగిస్తున్న సమయంలో బయటపడిన పాత ఇనుప పెట్టెను శుక్రవారం తెరిచేందుకు కలెక్టర్ నీతూ ప్రసాద్ అనుమతి ఇచ్చారని తహశీల్దార్ ఎల్.జోసెఫ్  గురువారం విలేకరులకు తెలిపారు. స్థానిక శివాలయం వీధిలో భూస్వామి ఈమని రామగోపాలానికి చెందిన ఇల్లు శిథిలమైంది. గత నెల 17న ఆ ఇంటి శిథిలాలను జేసీబీతో తొలగిస్తుండగా పాత ఇనుప పెట్టె బయట పడిన విషయం విదితమే. ఆ పెట్టెలో నిధి నిక్షేపాలున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో దీనిపై తీవ్ర ఉత్కంఠ రేగింది. ఆ పెట్టెపై అందరి దృష్టి పడింది. దానిని అధికారులు స్వాధీనం చేసుకుని, పోలీసు కస్టడీ ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఉదయం 9 గంటలకు ఆ పెట్టెను తెరవనున్నట్టు తహశీల్దార్ చెప్పారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఆ పెట్టెలో ఏముందో మరో కొద్ది గంటల్లో తేలనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement