Asian Games 2023: భారత్‌ ఖాతాలో మరో పతకం | Asian Games 2023: India Women Team Wins Silver Medal In 50m Rifle 3 Positions Team Event - Sakshi
Sakshi News home page

Asian Games 2023: భారత్‌ ఖాతాలో మరో పతకం

Published Wed, Sep 27 2023 8:27 AM | Last Updated on Wed, Sep 27 2023 10:44 AM

Asian Games 2023: India Women Team Wins Silver In 50m Rifle 3P Event - Sakshi

భారత్‌ ఖాతాలో మరో రజతం (PC: SAI)

Sift Kaur Samra-Ashi Chouksey - Manini Kaushik: ఆసియా క్రీడలు-2023లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. 50 మీటర్ల రైఫిల్‌ విభాగం(3 పొజిషన్స్‌)లో భారత మహిళా జట్టు సిల్వర్‌ మెడల్‌ సాధించింది. షూటింగ్‌  త్రయం సిఫ్ట్‌కౌర్‌ సమ్రా, మనిని కౌశిక్‌, ఆషి చోక్సీ తమ అద్భుత ప్రదర్శనతో భారత్‌కు రజతం అందించారు.

చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో బుధవారం నాటి 50 మీటర్ల రైఫిల్‌ విభాగంలో ఆతిథ్య జట్టు స్వర్ణ పతకం సాధించింది. చైనా కంటే 9 పాయింట్లు వెనుకబడిన భారత జట్టు 1764 స్కోరు చేసి వెండి పతకం గెలవగా.. . పబ్లిక్‌ ఆఫ్‌ కొరియా 1756 స్కోరు సాధించి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇక తాజా విజయంతో  భారత్‌ పతకాల సంఖ్య 15కు చేరింది. భారత క్రీడాకారులు ఇప్పటి వరకు మూడు స్వర్ణాలు, ఐదు సిల్వర్‌, ఏడు కాంస్యాలు సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement