కేఎస్సీఏ నుంచి కుంబ్లే, శ్రీనాథ్ వాకౌట్ | Kumble, Srinath stage walkout from KSCA AGM | Sakshi
Sakshi News home page

కేఎస్సీఏ నుంచి కుంబ్లే, శ్రీనాథ్ వాకౌట్

Published Sun, Aug 17 2014 10:12 PM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

Kumble, Srinath stage walkout from KSCA AGM

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) వార్షిక సభ్య సమావేశం గందరగోళంగా మారింది. ఆదివారం జరిగిన ఈ సమావేశం నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ వాకౌట్ చేశారు. నిధులు దుర్వినియోగం చేశారని వారు మండిపడ్డారు.

 క్రికెట్ కోసం ఖర్చు చేయాల్సిన వంద కోట్ల రూపాయిల నిధులను క్లబ్ హౌస్ల కోసం వినియోగించాలని క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకుందని కుంబ్లే ఆరోపించాడు. క్రికెట్ అభివృద్ధి కోసం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించాడు. 2010లో మూడేళ్లకాలానికి గాను కేఎస్సీఏ అధ్యక్షుడిగా కుంబ్లే ఎన్నికయ్యాడు. మాజీ పేసర్లు వెంకటేశ్ ప్రసాద్, శ్రీనాథ్ కూడా కేఎస్సీఏ పాలక మండలికి ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement