Kumble
-
కుంబ్లే మాజీ ఆటగాడు మాత్రమేనా!
మంగళవారం భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే 47వ పుట్టిన రోజు. చాలా మంది భారత క్రికెటర్లలాగే బీసీసీఐ కూడా ట్విట్టర్ ద్వారా కుంబ్లేకు శుభాకాంక్షలు తెలిపింది. ‘భారత మాజీ బౌలర్ కుంబ్లే’ అని మాత్రమే ఇందులో ప్రస్తావించింది. అంతే...సోషల్ మీడియాలో అభిమానులు చెలరేగిపోయారు. కుంబ్లే మాజీ ఆటగాడు మాత్రమేనా, అతనికి ఎలాంటి ప్రత్యేకత లేదా, భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అని కూడా మరిచారా అంటూ వారంతా విమర్శించారు. దాంతో కొద్దిసేపటికే బీసీసీఐ తమ తప్పును సరిదిద్దుకుంది. ఈ సారి కుంబ్లే ఫొటోను కూడా మార్చి ‘భారత మాజీ కెప్టెన్, దిగ్గజం అనిల్ కుంబ్లేకు జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేయడం విశేషం. -
ద్రవిడ్, జహీర్లకు కుంబ్లే పరిస్థితే..
ముంబై: భారత క్రికెట్ మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తరహాలోనే బీసీసీఐ ద్రవిడ్, జహీర్‌లను ఘోరంగా అవమానిస్తోందని సీఓఏ మాజీ సభ్యుడు రామ చంద్రగుహా ఆగ్రహాం వ్యక్తం చేశాడు. రామచంద్ర గుహా గత జూన్‌లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పరిపాలక కమిటీ (సీఓఏ) అభ్యర్థిత్వానికి రాజీనామ చేశారు. డ్రామను తలపిస్తూ సాగిన భారత్ హెడ్ కోచ్ ఎంపికను రామచంద్రగుహా తప్పుబట్టాడు. కుంబ్లే, ద్రవిడ్, జహీర్ గొప్ప ఆటగాళ్లని, ఎన్నోవిజయాలు అందించారని వారిని అవమానాలకు గురిచేయవద్దని పేర్కొన్నారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) రవిశాస్త్రీ హెడ్ కోచ్‌గా, ద్రవిడ్, జహీర్‌ను విదేశీ పర్యటనలకు బౌలింగ్, బ్యాటింగ్ కన్సల్టెంట్లుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. పరిపాలక కమిటీ (సీఓఏ) హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికపైనే ఆమోద ముద్ర వేసింది. అయితే బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్, బ్యాటింగ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ల నియామకంపై కమిటీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. జట్టు సహాయక సిబ్బందిని ఈనెల 22న రవిశాస్త్రిని సంప్రదించాకే నియమించే అవకాశం ఉంది. అయితే బోర్డు చెబుతున్నట్టుగా విదేశీ పర్యటనలోనైనా జహీర్, ద్రవిడ్ జట్టుతో పాటు ఉంటారా? అనే విషయంలో కమిటీ స్పష్టతనివ్వడం లేదు. ఈ విషయంపై స్పందించిన రామచంద్ర గుహా కోచ్ ఎంపికలో రాజకీయలు చేయడం బాధించిందని, కుంబ్లేకు ఎదురైన పరిస్థితే ద్రవిడ్, జహీర్‌కు ఎదురవుతుందని వరుస ట్వీట్లు పోస్టు చేశాడు. గతంలో కూడా రామచంద్ర గుహా బీసీసీఐని ఉద్దేశించి తన రాజీనామాలో ప్రశ్నించారు. క్రికెటర్లు కోచ్, కామెంటేటర్ల ఎంపికలో భాగస్వామ్యులవుతున్నారని హార్షబోగ్లేను తప్పించడంలో కోహ్లీ పాత్రను గుర్తు చేశారు. Kumble, Dravid and Zaheer were true greats of the game who gave it all on the field. They did not deserve this public humiliation. — Ramachandra Guha (@Ram_Guha) 16 July 2017 The shameful treatment of Anil Kumble has now been compounded by the cavalier treatment of Zaheer Khan and Rahul Dravid. — Ramachandra Guha (@Ram_Guha) 16 July 2017 -
‘అది కుంబ్లే వ్యక్తిగత నిర్ణయం’
కోల్‌కతా: భారత కోచ్ పదవి నుంచి తప్పుకోవడం అనిల్ కుంబ్లే వ్యక్తిగతమని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ‘చివరి నిమిషంలో ఆయన రాజీనామా చేశారు. అది తన వ్యక్తిగత నిర్ణయం. ఈ విషయంలో నేను మాట్లాడాల్సిందేమీ లేదు’ అని దాదా తేల్చి చెప్పారు. కోహ్లి, కుంబ్లే విభేదాల గురించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. -
చెప్పను బ్రదర్!
కుంబ్లేతో వివాదంపై నోరు విప్పని కోహ్లి పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా, అందుకు దారి తీసిన కారణాల గురించి చర్చ జరగడంతో ఈ వివాదంలో రెండో కోణంపై అందరికీ ఆసక్తి నెలకొంది. కోహ్లి కూడా తన వాదనలు వినిపిస్తాడని అనిపించింది. అయితే దీనిపై కోహ్లి మౌనాన్నే ఆశ్రయించాడు. కుంబ్లే రాజీనామా అనంతరం గురువారం కోహ్లి తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. కుంబ్లే అంటే తనకు ‘గౌరవం’ ఉందని చెప్పిన కోహ్లి... ఆటగాళ్ల మధ్య జరిగిన విషయాలను తాను బయటకు చెప్పబోనన్నాడు. ‘అనిల్ భాయ్ తన అభిప్రాయాలు వెల్లడించారు. కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. క్రికెటర్‌గా దేశానికి ఎనలేని సేవలందించిన ఆయనంటే మాకు చాలా గౌరవం ఉంది. ఆ విషయంలో కుంబ్లేను తక్కువ చేయలేం’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్ ‘పవిత్రత’ను తాను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నాడు. ‘చాంపియన్స్ ట్రోఫీ సమయంలో నేను 11 సార్లు మీడియా సమావేశాల్లో పాల్గొన్నాను. గత 3–4 నాలుగేళ్లుగా భారత జట్టులో ఒక సంస్కృతి నెలకొంది. మా మధ్య అంతర్గతంగా ఏం జరిగినా దానిని బయటకు చెప్పకూడదని మేం గట్టిగా నిర్ణయించుకున్నాం. అదంతా వ్యక్తిగత వ్యవహారం. డ్రెస్సింగ్ రూమ్ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మాకుంది. అన్నింటికంటే మాకు అదే ముఖ్యం. దాని గురించి బహిరంగంగా మాట్లాడను. కుంబ్లే తాను చెప్పదల్చుకున్నది చెప్పారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తాం’ అని అన్నాడు. -
కోహ్లి మదిలో ఎవరు?
కోచ్ కోసం మళ్లీ దరఖాస్తులు కోరనున్న బీసీసీఐ ముంబై: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ మరోసారి కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించనుంది. వాస్తవానికి మే 31తోనే ఈ గడువు ముగిసినా... తాజాగా కుంబ్లే నిష్క్రమణ అనంతరం ఆసక్తిగల వారి నుంచి మళ్లీ అప్లికేషన్లు తీసుకుంటే బాగుం టుందని బోర్డు భావిస్తోంది. దరఖాస్తు పంపేందుకు వారం నుంచి పది రోజుల గడువు ఇచ్చే అవకాశం ఉంది. ‘మేం ఇంతకు ముందు దరఖాస్తులు తీసుకున్న సమయంలో కుంబ్లే కూడా బరిలో ఉన్నారు. అతని రికార్డు వల్ల మళ్లీ కుంబ్లేనే కొనసాగే అవకాశం ఉందని, పోటీ పడినా ఫలితం లేదని చాలా మంది భావించి ఆగిపోయారు. ఇప్పుడు కుంబ్లే లేకపోవడంతో పరిస్థితులు మారిపోయాయి. ఈ సమయంలో మరికొందరు ఆసక్తిగా ముందుకు వస్తున్నారు’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం సెహ్వాగ్, మూడీ, రాజ్‌పుత్, పైబస్, దొడ్డ గణేశ్ దరఖాస్తులు మాత్రమే బీసీసీఐ వద్ద ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే ముందే రవిశాస్త్రి కోచ్‌గా ఉంటే బాగుంటుందంటూ కోహ్లి సూచించినట్లు వార్తలు వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కోహ్లి మాట చెల్లుబాటయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. మరోవైపు కుంబ్లే, కోహ్లి విభేదాలకు సంబంధించిన పరిణామాలపై తమకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రిని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ కోరారు. మెతకగా ఉండే కోచ్‌ను ఆటగాళ్లు కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఇవాళ మీరు బాగా అలసిపోయారు కాబట్టి ప్రాక్టీస్ అవసరం లేదు. సెలవు తీసుకోండి లేదా షాపింగ్‌కు వెళ్లండి అని చెప్పే కోచ్ వారికి కావాలేమో. తీవ్రంగా సాధన చేయించి ఫలితాలు రాబట్టే కోచ్ వారికి అవసరం లేదు. నిజంగా కోచ్ గురించి ఏ ఆటగాళ్లయినా ఫిర్యాదు చేస్తే వారిని జట్టులోంచి తీసేయాలి. – సునీల్ గావస్కర్ -
కోహ్లి.. సర్దుకుపోతేనే మంచిది!
న్యూఢిల్లీ:భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇటీవల బీసీసీఐ ప్రకటన విడుదల చేసినప్పటికీ, ప్రస్తుతానికి కోచ్ ను మార్చే యోచనలో లేనట్లే కనబడుతోంది. చాంపియన్స్ ట్రోఫీ తరువాత భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ వస్తాడని ఆశించినా, కొంతకాలం పాటు అనిల్ కుంబ్లేనే ఆ పదవిలో కొనసాగించాలని బోర్డు చూస్తోంది. దీనిలో భాగంగానే ఈ నెల చివర్లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టుకు కుంబ్లేనే కోచ్ గా ఉండనున్నాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో విభేదాల కారణంగానే కుంబ్లే పదవి పొడిగింపుపై పెద్దగా ఆసక్తికనబరచని బీసీసీఐ.. ఆ మేరకు కోచ్ పదవికి ఆప్లికేషన్స్ ను కూడా ఆహ్వానించింది. అయితే మరికొంత కాలం కుంబ్లే కొనసాగింపుకు బీసీసీఐ మొగ్గుచూపుతోంది. దీనిలో భాగంగా కోహ్లిని సముదాయించినట్లు తెలుస్తోంది. 'చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే కొత్త కోచ్ ను నియమించాలని బీసీసీఐ క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) భావించడం లేదు. వెస్టిండీస్ పర్యటనకు కుంబ్లే వెళ్లనున్నాడు. అది చిన్న పర్యటన కావడంతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కుంబ్లే కొనసాగింపుపై బీసీసీఐ సీఈవోకు సీఏసీ ఇప్పటికే స్పష్టం చేసింది. మరొకవైపు కుంబ్లే-కోహ్లిలతో కూడా సమావేశమైంది. ఆ సమయంలోనే కుంబ్లేతో సర్దుకోవాలని కోహ్లికి ముగ్గురు సభ్యులతో కూడిన సీఏసీ తెలిపింది' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
కుంబ్లే కూడా దరఖాస్తు ద్వారానే...
కెప్టెన్ కోహ్లితో విభేదాలు... తన వ్యవహార శైలి నచ్చడం లేదంటూ జట్టు సభ్యుల ఫిర్యాదులు... బీసీసీఐ పెద్దల అసంతృప్తి... ఇవేవీ అనిల్ కుంబ్లే మరోసారి కోచ్ పదవిని ఆశించేందుకు అడ్డు రాలేదు. కోచ్ పదవిని ఆశిస్తూ కుంబ్లే కూడా మళ్లీ అప్లికేషన్ ఇచ్చేశాడు. ప్రస్తుత కోచ్ హోదాలో కుంబ్లే ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, నేరుగా ఇంటర్వూ్యకు హాజరు కావచ్చని కూడా బీసీసీఐ సడలింపు ఇచ్చింది. అయితే దిగ్గజ స్పిన్నర్ మాత్రం దీనిని పట్టించుకోకుండా అందరిలాగే తాను కూడా అంటూ అప్లై చేశాడు. అంతే కాదు... తన పూర్తి బయోడేటాతో పాటు గత ఏడాదిలాగే భారత క్రికెట్ భవిష్యత్తు గురించి తాను ఏమేం చేయాలని భావిస్తున్నాడో స్పష్టంగా రోడ్‌మ్యాప్‌ను కూడా దానికి జత చేశాడు. విభేదాలవంటి కారణాలతో బాధ పడి తాను తప్పుకునేది లేదని, మరోసారి కోచ్ అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కూడా కుంబ్లే పరోక్షంగా ఈ దరఖాస్తుతో తన సందేశాన్ని పంపించాడు. మరో వైపు ఇంటర్వూ్య ప్రక్రియ, తేదీలను ఖరారు చేసేందుకు క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ త్వరలోనే సమావేశం కానున్నారు. ఆసీస్ మాజీ పేసర్ క్రెయిగ్ మెక్‌డెర్మాట్ కూడా కోచ్ పదవి కోసం దరఖాస్తు చేశాడు. అయితే నిర్ణీత గడువు మే 31 దాటిన తర్వాత ఆ అప్లికేషన్ వచ్చింది. అతని దరఖాస్తును చూసిన తర్వాత సీఏసీ చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. -
ప్రాక్టీస్‌లో అంతా బాగుంది!
కోచ్, కెప్టెన్ కలిసి సన్నద్ధం బర్మింగ్‌హామ్: కెప్టెన్ కోహ్లి, కోచ్ కుంబ్లే మధ్య విభేదాల గురించి బయట ఎన్ని వార్తలు ప్రచారంలో ఉన్నా... అసలైన ఆట సమయంలో మాత్రం వారిద్దరు ఎలాంటి సమస్య లేకుండా పని చేస్తున్నారు. శుక్రవారం భారత జట్టు నెట్స్‌లో ఇది బాగా కనిపించింది. ప్రాక్టీస్‌లో భాగంగా కోహ్లికి దాదాపు 20 నిమిషాల పాటు కుంబ్లే త్రో డౌన్స్ విసిరారు. ముందుగా డ్రైవ్ చేసిన కోహ్లి, ఆ తర్వాత కొన్ని బంతులను షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. మనసులో ఏమున్నా తమ శారీరక భాషలో మాత్రం దానిని వారు కనపడనీయలేదు. అనారోగ్యంతో రెండు వార్మప్ మ్యాచ్‌లకు దూరమైన యువరాజ్ సింగ్, సుదీర్ఘ సమయం పాటు సాధన చేశాడు. మరోవైపు ముందుగా అనుకున్నట్లుగా మాజీ కెప్టెన్ గంగూలీ భారత ఆటగాళ్లు ఎవరితోనూ సమావేశం కాలేదు. -
కోచ్ రేసులో నిలిచిన సెహ్వాగ్
-
కోచ్ రేసులో నిలిచిన సెహ్వాగ్
న్యూఢిల్లీ: భారత్ క్రికెట్ జట్టు కోచ్ పదవికి భారత మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దరఖాస్తు చేసుకున్నాడు. గత కొద్దీ రోజులుగా సెహ్వాగ్ కోచ్ పదవి రేసులో ఉన్నాడంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని నిజం చేస్తూ వీరు నేడు ( గురువారం) కోచ్ పదవికి దరఖాస్తు చేశాడు. చాంపియన్స్ ట్రోఫితో ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే పదవికాలం ముగుస్తుండటంతో బీసీసీఐ కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే కుంబ్లే పదవి కాలాన్ని పొడిగిస్తారని భావించినా.. కెప్టెన్ కోహ్లీ, కోచ్ కుంబ్లేకు పడటం లేదని వార్తలు రావడంతో బీసీసీఐ అనిల్ కుంబ్లేకు ఉద్వాసన పలకే అవకాశం ఉంది. అయితే బీసీసీఐ నుంచి ఓ అధికారి సెహ్వాగ్‌ను కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను సెహ్వాగ్ ఖండించాడు. తాజాగా కోచ్ పదవికి సెహ్వాగ్ దరఖాస్తు చేసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసీజన్ ఐపీఎల్ లో కింగ్స్ పంజాబ్‌కు కోచ్‌గా మినహా గతంలో పనిచేసిన అనుభవం సెహ్వాగ్ కు లేదు. ఇప్పటికే అనిల్ కుంబ్లే డైరెక్ట్‌గా కోచ్ పదవి రేసులో ఉండగా, ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ టామ్ మూడీ, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రిచర్డ్ పైబస్లు కూడా కోచ్ పదవి రేసులో పోటిపడుతున్నారు. గతంలో టామ్ మూడీ శ్రీలంక కోచ్‌గా, రిచర్డ్ పైబస్ పాక్ కోచ్‌గా వ్యవహరించారు. ఇక మరో ఇద్దరు భారత మాజీ ఆటగాళ్లు కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. మాజీ బౌలర్ దొడ్డ గణేష్, భారత మాజీ కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు రేసులో పోటిపడుతున్నారు. టామ్ మూడీ, రాజ్ పుత్‌లు గత సంవత్సరం కూడా కోచ్ పదవికి పోటిపడ్డారు. ఇక కోచ్ నియామకంలో బీసీసీఐ సలహా కమిటీ, గంగూలి, లక్ష్మణ్‌లు ఇంటర్వ్యూలు చేయనున్నారు. గతేడాది రవిశాస్త్రి, కుంబ్లేకు పోటి నెలకొనగా సలహా కమిటీ కుంబ్లే వైపే మొగ్గు చూపింది. అయితే ఈ సారి మాత్రం బీసీసీఐ సెహ్వాగ్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తోందని తెలుస్తుంది.. -
ఆట విషయంలో కుంబ్లే నిక్కచ్చిగా ఉంటాడు: భజ్జీ
భారత కోచ్ కుంబ్లే ముక్కుసూటి మనిషి అని, ఆట విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాడని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, దిగ్గజ బౌలర్‌ను వెనకేసుకొచ్చాడు. ప్రతిభ కంటే కూడా కష్టపడే మనస్తత్వానికే విలువిస్తాడని చెప్పాడు. కోచ్‌గా ఆయన ఘనతను చూపించేందుకు గత ఏడాది భారత్ సాధించిన విజయాలే నిదర్శనమన్నాడు. కోచ్, కెప్టెన్ కోహ్లిల ఉదంతంపై స్పందిస్తూ... కుంబ్లే ఒకరితో తగవు పెట్టుకునే రకం కాదని, ఎవరికైనా సాయపడే గుణమున్నవాడని కితాబిచ్చాడు. -
టీమిండియాలో ముసలం?
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ కోచ్ అనిల్ కుంబ్లేపై కెప్టెన్ కోహ్లి, కొందరు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారా?. తాజా రిపోర్టులు ఈ విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి. కోహ్లికి దగ్గరి వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. కుంబ్లే టీంను గైడ్ చేసే పద్దతిపై కెప్టెన్ కోహ్లితో పాటు కొందరు సినీయర్లు గుర్రుగా ఉన్నారని చెప్పారు. దీంతో ప్లేయర్లను శాంతిపజేసేందుకు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లు రంగంలోకి దిగినట్లు వెల్లడించారు. కుంబ్లే వర్కింగ్ స్టైల్ కంటే రవిశాస్త్రి వర్కింగ్ స్టైల్‌ను ప్లేయర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు సమాచారం. కోచ్‌పై ఆటగాళ్ల అసంతృప్తి గురించి సీఓఏ వినోద్‌రాయ్ ముగ్గురు సభ్యుల కమిటీతో చర్చించనున్నట్లు తెలిసింది. అయితే, కుంబ్లేకు ఆటగాళ్లకు మధ్య సమస్య ఇంకా గాలివానగా మారలేదు. దీంతో సమస్యను పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం ఈ సమస్యపై గంగూలీతో కోహ్లీ మాట్లాడినట్లు తెలిసింది. వాస్తవానికి కుంబ్లేను కోచ్‌గా కొనసాగించాలని బీసీసీఐ భావించినా.. కోహ్లీ అందుకు నిరాకరించినట్లు సమాచారం. చాంపియన్స్ ట్రోపి ముగిసిన అనంతరం కుంబ్లే కాంట్రాక్టు పూర్తవనుంది. కొత్త టీమిండియా కోచ్‌కు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, కొత్త కోచ్ ఎంపిక జరిగే వరకూ కుంబ్లేను బీసీసీఐ కోచ్‌గా కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సీఓఏ ప్రత్యక్షంగా టీంను పర్యవేక్షించలేదు కాబట్టి కొత్త కోచ్‌ను ముగ్గురు సభ్యుల కమిటీనే ఎన్నుకుంటుందని సమాచారం. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని సెహ్వాగ్‌ను కొందరు కోరగా, వీరూ అందుకు నిరాకరించినట్లు తెలిసింది. రవిశాస్త్రి కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి కనబరచలేదు. ఆస్ట్రేలియా ప్లేయర్ టామ్ మూడీ కోచ్ పదవికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రిమూర్తుల్లో ఒకరైన రాహుల్ ద్రవిడ్ కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కీలక చాంపియన్స్ ట్రోఫి ముందు ఆటగాళ్లు, కోచ్ మధ్య విభేదాలు తలెత్తయనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
మళ్లీ మొదలు పెట్టేశారు...
కోహ్లి, కుంబ్లేలపై విషం కక్కిన ఆస్ట్రేలియా మీడియా మెల్బోర్న్: ఒకవైపు డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ వివాదాన్ని మరచి ఆటపై దృష్టి పెడదామంటూ క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ సిద్ధ పడగా, మరోవైపు ఆసీస్ మీడియా మాత్రం తమ బుద్ధిని పోనిచ్చుకోలేదు. రివ్యూపై రగడ సాగుతున్న సమయంలోనే దానికి పోటీగానా అన్నట్లు ఒక వివాదాస్పద కథనాన్ని ప్రచురించింది. ఇందులో భారత కెప్టెన్ కోహ్లి, కోచ్ కుంబ్లేలపై తీవ్ర ఆరోపణలు చేసింది. ‘డెయిలీ టెలిగ్రాఫ్ ఆస్ట్రేలియా’ పత్రిక రాసిన కథనంలో (ఇది ఆసీస్ ఆటగాళ్లపై భారత్ ఐసీసీకి చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోక ముందు ప్రచురితమైంది) నేరుగా ఆసీస్ బోర్డుకు, ఆటగాళ్లకు సంబంధం లేకపోయినా దీని ఆధారంగా వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యలతో మరోసారి క్రికెట్ వాతావరణాన్ని చెడగొట్టేందుకు మాత్రం అవకాశముంది. ఈ కథనం ప్రకారం... టెస్టు మ్యాచ్‌లో ఒక దశలో కోహ్లి అసహనంతో ఓ ఆస్ట్రేలియా అధికారిపై ఎనర్జీ డ్రింక్ బాటిల్ విసిరేశాడు. ‘ఆసీస్ జట్టు గౌరవాన్ని దెబ్బ తీసే పనిలో కూడా కోహ్లి ముందుండి జట్టును నడిపిస్తున్నాడు సరే. ఆస్ట్రేలియా అధికారి ఒకరిపై ఆరెంజ్ గెటరాడ్ బాటిల్‌ను పడేయడం కూడా అలాంటిదేనా’ అని ఆ కథనంలో రాశారు. పైగా కోహ్లి మైదానం వదిలే సమయంలో ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ బూతులు తిట్టాడని, గొంతు కోస్తా అన్నట్లుగా హ్యాండ్స్కోంబ్ వైపు సైగ చేశాడని కూడా ఈ కథనంలో ఉంది. ‘ఇప్పుడు కోహ్లి చెబుతున్న క్రీడాస్ఫూర్తి అనేది ఈ మ్యాచ్‌లో ఎప్పుడో అతని చేతుల్లో నే చచ్చిపోయింది. ఒక అంతర్జాతీయ జట్టు కెప్టెన్ ఇంత ఘోరంగా విలన్ తరహాలో వ్యవహరించడం అర్జున రణతుంగ తర్వాత ఇదే మొదటిసారి’ అని ఈ పత్రిక పేర్కొంది. కోచ్ కుంబ్లేను కూడా టెలిగ్రాఫ్ వదిలి పెట్టలేదు. ఆయన్ని ‘మంకీ గేట్ సూత్రధారి’గా అభివర్ణించిన ఆ పత్రిక... కుంబ్లేనే తెర వెనక ఉండి అన్నీ నడిపిస్తున్నారని విమర్శించింది. ‘రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి అవుట్‌పై కుంబ్లేకు కోపం వచ్చింది. అంతే... నిబంధనలను పట్టించుకోకుండా అతను మ్యాచ్ అఫీషియల్స్ బాక్స్‌లోకి దూసుకెళ్లి వివరణ కోరడం విచిత్రం’ అని ఈ కథనంలో పత్రిక ఆరోపించింది. -
కోహ్లి, కుంబ్లేలపై సంచలన ఆరోపణలు
రాంచీ: భారత్- ఆస్ట్రేలియాల మధ్య డీఆర్ఎస్ వివాదం ఇంకా ముగియలేదు. ఇప్పటికే ఈ వివాదంలో ఆసీస్ ఆటగాళ్లపై ఐసీసీ ఏలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఆస్ట్రేలియన్ ది టెలిగ్రాఫ్ దిన పత్రికలో భారత్ కెప్టెన్ కోహ్లీ, కోచ్ కుంబ్లేలపై వివాదస్పద కథనాలు వచ్చాయి. బెంగళూరు టెస్టులో కోహ్లి ఏనర్జిడ్రింక్ బాటిల్‌ను ఆసీస్ అధికారులపైకి విసిరి అసహనం వ్యక్తం చేశాడని, అదే తీరుగా కోచ్ కుంబ్లే అంపైర్లపై అరిచాడని ఆరోపించింది. ఇదంతా 2008 ఆసీస్ పర్యటనలో హర్భజన్ సింగ్, సైమండ్స్‌ల మధ్య జరిగిన మంకీ గేట్ వివాదం ప్రతీకారంగానే జరిగిందని తెలిపింది. ఆ సమయంలో కుంబ్లే ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాడని అందువల్లే ఇలా వ్యవహరిస్తున్నాడని ప్రచురించింది. ఇంతే కాకుండా కోహ్లి, ఆసీస్ బ్యాట్స్‌మన్ పీటర్ హ్యండ్స్కోంబ్పై నోరు పారేసుకున్నాడని, అవుటైనపుడు డ్రెస్సింగ్ రూంలో అసహనంతో ఎదురుగా కూర్చున్న ఆసీస్ అధికారులపై బాటిల్ విసిరాడని పేర్కొంది. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి అవుటయినప్పుడు కుంబ్లే సహనం కోల్పోయి అంపైర్లపై అరిచాడని, టీవీ రిప్లులే చూస్తే ఆ బాటిల్ ఆసీస్ అధికారుల కాళ్ల దగ్గర పడ్డట్లు తెలుస్తుందని వెల్లడించింది. కోహ్లితో సహా కోచ్ అనిల్ కుంబ్లేలు క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించింది. -
‘నంబర్‌వన్ బిచ్చగాడిని’ అయ్యేవాడిని!
అత్యుత్తమ ప్రదర్శనపై అశ్విన్ సరదా వ్యాఖ్య కుంబ్లే రికార్డును చేరుకుంటే చాలన్న స్పిన్నర్ చెన్నై: రవిచంద్రన్ అశ్విన్ అంటే పరిపూర్ణతకు పక్కా చిరునామా. తన బౌలింగ్‌కు ఇంజినీరింగ్ మేధస్సును జోడించి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కుప్పకూలుస్తున్న అశ్విన్ ఇప్పుడు కెరీర్లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. పట్టుదల, పోరాటతత్వం ఉన్న ఈ ఆఫ్ స్పిన్నర్ అగ్ర స్థానానికి చేరినా ఇంకా నేర్చుకునేందుకు, కష్టపడేందుకు సిద్ధమని చెబుతాడు. ఎంచుకున్న రంగంలో ఎప్పుడైనా తానే నంబర్‌వన్‌గా ఉండాలనేది తన లక్ష్యమంటూ అతను ఒక సరదా వ్యాఖ్య చేశాడు. ‘నేను జట్టులోకి వచ్చిన దగ్గరి నుంచి భారత్ ప్రతీ విజయాల్లో ఎంతో కొంత పాత్ర పోషించాను. ఇది పొగరుతో చెప్పడం లేదు. దానిని సాధించేందుకు నేను ఎంతో కష్ట పడ్డాను. నేను ఎక్కడికి వెళ్లినా నాదైన ముద్ర ఉండాలని తపించే వ్యక్తిని. ఒకవేళ నేను బిచ్చగాడిగా పుట్టి ఉన్నట్లయితే అప్పుడు కూడా చెన్నై నగరంలో నేనే నంబర్‌వన్ బిచ్చగాడిని అయ్యేవాడినేమో. అక్కడ అగ్రస్థానానికి చేరాక దేశంలోనే నంబర్‌వన్ బిచ్చగాడినయ్యేందుకు కృషి చేసేవాడిని’ అంటూ చెప్పుకున్నాడు. మురళీధరన్ 800 వికెట్ల మైలురాయిని అందుకోవడం తనలాంటి మానవమాత్రులకు సాధ్యం కాదని, అయితే కుంబ్లే వికెట్ల రికార్డు (619)ను చేరుకుంటే చాలని అశ్విన్ అన్నాడు. ‘మురళీ సాధించిన ఘనత చాలా పెద్దది. నేను ఆలస్యంగా టెస్టులు ఆడటం ప్రారంభించాను. మధ్యలో ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సి వచ్చింది. ఇలాంటి స్థితిలో కుంబ్లే రికార్డును చేరుకోవడమే గౌరవంగా భావిస్తున్నా. అంతకంటే ఒక్క వికెట్ కూడా ఎక్కువ ఆశించడం లేదు’ అని అతను చెప్పాడు. మరోవైపు భారత జట్టులో ప్రధాన సభ్యుడిగా ఎదిగినా అశ్విన్‌కు వైస్ కెప్టెన్సీ అవకాశం రాలేదు. దీనిపై వ్యాఖ్యానిస్తూ ‘నేను అలాంటివాటి గురించి ఆలోచించే దశను దాటిపోయానని భావిస్తున్నా. వైస్ కెప్టెన్ కావడం అనేది నా చేతుల్లో లేదు. క్రికెట్లో ప్రతీదానికి కొన్ని లెక్కలు ఉంటాయి. అలాంటివాటిని నేను మార్చలేనని అర్థమైంది. దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోదల్చుకోలేదు. అయినా అలాంటి పేరు, హోదా ఏమీ లేకుండా కూడా విజయాల్లో కీలక పాత్ర పోషించి నేను జట్టును నడిపించాననే నమ్ముతున్నా’ అని అశ్విన్ తన మనసులో మాట వెల్లడించాడు. -
బౌలర్లు గాడిలో పడతారా!
నేటి నుంచి విండీస్ బోర్డు ఎలెవన్‌తో రెండో వార్మప్ మ్యాచ్ తుది జట్టు ఎంపికపైనే భారత్ దృష్టి బసెటర్రీ (సెయింట్ కిట్స్): వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌కు ముందు భారత్ తన అస్త్రాలను మరోసారి పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతోంది. తొలి వార్మప్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ అంచనాలను అందుకున్నా.. బౌలర్లు నిరాశపర్చారు. ఈ నేపథ్యంలో నేటి (గురువారం) నుంచి మూడు రోజుల పాటు జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా... విండీస్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈనెల 21 నుంచి జరిగే తొలి టెస్టుకు తుది జట్టును ఎంపిక చేసేందుకు ఈ మ్యాచ్‌ను వేదికగా చేసుకోవాలని కోచ్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లి భావిస్తున్నారు. దీంతో ప్రతి బౌలర్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని యోచిస్తున్నారు. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌లో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన పేసర్ షమీ, భువనేశ్వర్ కుమార్ ఆరంభంలో ఫర్వాలేదనిపించినా తర్వాత పూర్తిగా విఫలమయ్యారు. కోహ్లి గేమ్ ప్లాన్‌లో కీలకమైన ఇషాంత్, ఉమేశ్‌లు కూడా అంచనాలకు అందుకోలేకపోవడంతో ముంబై పేసర్ శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం ఇవ్వాలని కోచ్ భావిస్తున్నారు. అయితే పేసర్లు విఫలమైన చోట స్పిన్నర్ అమిత్ మిశ్రా మాత్రం బాగా ఆకట్టుకున్నాడు. ప్రధాన స్పిన్నర్ అశ్విన్, జడేజాలను కూడా ఈ మ్యాచ్‌లో బరిలోకి దించాలని ప్రణాళికలు వేస్తున్నారు. బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ రాణించడం భారత్‌కు శుభసూచకం. ఓపెనర్లు రాహుల్, ధావన్‌లు అర్ధసెంచరీలు చేయడంతో మిడిలార్డర్‌పై ఒత్తిడి తగ్గింది. అయితే ఓపెనింగ్‌లో మురళీ విజయ్‌కు తోడుగా ఈ ఇద్దరిలో ఎవర్ని దించాలనేది ఈ మ్యాచ్‌తో తేలిపోతుంది. కోహ్లి, రహానే తమ ఫామ్‌ను మరోసారి సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. -
పింక్ బంతితో ఇప్పుడే కాదు
డేనైట్ టెస్టుపై కుంబ్లే న్యూఢిల్లీ: ఐదు రోజుల ఫార్మాట్‌పై అభిమానుల ఆసక్తిని కొనసాగించాలంటే భవిష్యత్‌లో డేనైట్ టెస్టులు తప్పవని భారత చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశారు. అయితే పింక్ బంతితో నిర్వహించే ఈ మ్యాచ్‌లకు మరింత సమయం పడుతుందన్నారు. ‘మేం పింక్ బంతుల గురించి ఇంకా ఆలోచించలేదు. దీనికి ఇంకా సమయం పడుతుంది. వెస్టిండీస్‌లో మాత్రం మేం రెడ్ డ్యూక్ బంతులతోనే ఆడతాం. డేనైట్ టెస్టులకు నేను కూడా మద్దతిస్తున్నా. ఏదేమైనా భవిష్యత్‌లో టెస్టు క్రికెట్‌కు ప్రేక్షకాదరణ పెంపొందించాలి. డేనైట్ మ్యాచ్‌లు నిర్వహిస్తే ప్రజలు ఆఫీస్ పని వేళలు ముగించుకుని స్టేడియానికి వస్తారు’ అని కుంబ్లే పేర్కొన్నారు. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుతమైన బ్యాట్స్‌మన్ అని కితాబిచ్చిన కుంబ్లే... అతనితో కలిసి పని చేసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు. -
కేఎస్‌సీఏ నుంచి కుంబ్లే, శ్రీనాథ్ వాకౌట్
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) వార్షిక సభ్య సమావేశం గందరగోళంగా మారింది. ఆదివారం జరిగిన ఈ సమావేశం నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ వాకౌట్ చేశారు. నిధులు దుర్వినియోగం చేశారని వారు మండిపడ్డారు. క్రికెట్ కోసం ఖర్చు చేయాల్సిన వంద కోట్ల రూపాయిల నిధులను క్లబ్ హౌస్‌ల కోసం వినియోగించాలని క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకుందని కుంబ్లే ఆరోపించాడు. క్రికెట్ అభివృద్ధి కోసం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించాడు. 2010లో మూడేళ్లకాలానికి గాను కేఎస్‌సీఏ అధ్యక్షుడిగా కుంబ్లే ఎన్నికయ్యాడు. మాజీ పేసర్లు వెంకటేశ్ ప్రసాద్, శ్రీనాథ్ కూడా కేఎస్‌సీఏ పాలక మండలికి ఎన్నికయ్యారు.