
మంగళవారం భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే 47వ పుట్టిన రోజు. చాలా మంది భారత క్రికెటర్లలాగే బీసీసీఐ కూడా ట్విట్టర్ ద్వారా కుంబ్లేకు శుభాకాంక్షలు తెలిపింది. ‘భారత మాజీ బౌలర్ కుంబ్లే’ అని మాత్రమే ఇందులో ప్రస్తావించింది. అంతే...సోషల్ మీడియాలో అభిమానులు చెలరేగిపోయారు.
కుంబ్లే మాజీ ఆటగాడు మాత్రమేనా, అతనికి ఎలాంటి ప్రత్యేకత లేదా, భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అని కూడా మరిచారా అంటూ వారంతా విమర్శించారు. దాంతో కొద్దిసేపటికే బీసీసీఐ తమ తప్పును సరిదిద్దుకుంది. ఈ సారి కుంబ్లే ఫొటోను కూడా మార్చి ‘భారత మాజీ కెప్టెన్, దిగ్గజం అనిల్ కుంబ్లేకు జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment