![ఆట విషయంలో కుంబ్లే నిక్కచ్చిగా ఉంటాడు: భజ్జీ](/styles/webp/s3/article_images/2017/09/5/51496255125_625x300.jpg.webp?itok=QFl6jIOm)
ఆట విషయంలో కుంబ్లే నిక్కచ్చిగా ఉంటాడు: భజ్జీ
భారత కోచ్ కుంబ్లే ముక్కుసూటి మనిషి అని, ఆట విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాడని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, దిగ్గజ బౌలర్‌ను వెనకేసుకొచ్చాడు. ప్రతిభ కంటే కూడా కష్టపడే మనస్తత్వానికే విలువిస్తాడని చెప్పాడు. కోచ్‌గా ఆయన ఘనతను చూపించేందుకు గత ఏడాది భారత్ సాధించిన విజయాలే నిదర్శనమన్నాడు. కోచ్, కెప్టెన్ కోహ్లిల ఉదంతంపై స్పందిస్తూ... కుంబ్లే ఒకరితో తగవు పెట్టుకునే రకం కాదని, ఎవరికైనా సాయపడే గుణమున్నవాడని కితాబిచ్చాడు.