కోల్‌కతా: భారత కోచ్ పదవి నుంచి తప్పుకోవడం అనిల్ కుంబ్లే వ్యక్తిగతమని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ‘చివరి నిమిషంలో ఆయన రాజీనామా చేశారు. అది తన వ్యక్తిగత నిర్ణయం. ఈ విషయంలో నేను మాట్లాడాల్సిందేమీ లేదు’ అని దాదా తేల్చి చెప్పారు. కోహ్లి, కుంబ్లే విభేదాల గురించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.