ప్రాక్టీస్‌లో అంతా బాగుంది! | Virat Kohli, Anil Kumble 'unhappy' with Edgbaston practice facility | Sakshi
Sakshi News home page

ప్రాక్టీస్‌లో అంతా బాగుంది!

Published Sat, Jun 3 2017 1:35 AM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM

ప్రాక్టీస్‌లో అంతా బాగుంది!

ప్రాక్టీస్‌లో అంతా బాగుంది!

కోచ్, కెప్టెన్‌ కలిసి సన్నద్ధం
బర్మింగ్‌హామ్‌: కెప్టెన్‌ కోహ్లి, కోచ్‌ కుంబ్లే మధ్య విభేదాల గురించి బయట ఎన్ని వార్తలు ప్రచారంలో ఉన్నా... అసలైన ఆట సమయంలో మాత్రం వారిద్దరు ఎలాంటి సమస్య లేకుండా పని చేస్తున్నారు. శుక్రవారం భారత జట్టు నెట్స్‌లో ఇది బాగా కనిపించింది. ప్రాక్టీస్‌లో భాగంగా కోహ్లికి దాదాపు 20 నిమిషాల పాటు కుంబ్లే త్రో డౌన్స్‌ విసిరారు.

ముందుగా డ్రైవ్‌ చేసిన కోహ్లి, ఆ తర్వాత కొన్ని బంతులను షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. మనసులో ఏమున్నా తమ శారీరక భాషలో మాత్రం దానిని వారు కనపడనీయలేదు. అనారోగ్యంతో రెండు వార్మప్‌ మ్యాచ్‌లకు దూరమైన యువరాజ్‌ సింగ్, సుదీర్ఘ సమయం పాటు సాధన చేశాడు. మరోవైపు ముందుగా అనుకున్నట్లుగా మాజీ కెప్టెన్‌ గంగూలీ భారత ఆటగాళ్లు ఎవరితోనూ సమావేశం కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement