పింక్ బంతితో ఇప్పుడే కాదు | Anil Kumble's Twitter Q&A: Day-Night Tests is the Future But It Can Wait | Sakshi
Sakshi News home page

పింక్ బంతితో ఇప్పుడే కాదు

Published Wed, Jul 6 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

పింక్ బంతితో ఇప్పుడే కాదు

పింక్ బంతితో ఇప్పుడే కాదు

డేనైట్ టెస్టుపై కుంబ్లే
న్యూఢిల్లీ: ఐదు రోజుల ఫార్మాట్‌పై అభిమానుల ఆసక్తిని కొనసాగించాలంటే భవిష్యత్‌లో డేనైట్ టెస్టులు తప్పవని భారత చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశారు. అయితే పింక్ బంతితో నిర్వహించే ఈ మ్యాచ్‌లకు మరింత సమయం పడుతుందన్నారు. ‘మేం పింక్ బంతుల గురించి ఇంకా ఆలోచించలేదు. దీనికి ఇంకా సమయం పడుతుంది. వెస్టిండీస్‌లో మాత్రం మేం రెడ్ డ్యూక్ బంతులతోనే ఆడతాం. డేనైట్ టెస్టులకు నేను కూడా మద్దతిస్తున్నా.

ఏదేమైనా భవిష్యత్‌లో టెస్టు క్రికెట్‌కు ప్రేక్షకాదరణ పెంపొందించాలి. డేనైట్ మ్యాచ్‌లు నిర్వహిస్తే ప్రజలు ఆఫీస్ పని వేళలు ముగించుకుని స్టేడియానికి వస్తారు’ అని కుంబ్లే పేర్కొన్నారు. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుతమైన బ్యాట్స్‌మన్ అని కితాబిచ్చిన కుంబ్లే... అతనితో కలిసి పని చేసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement