pink ball
-
పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘోర ఓటమి..
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ డే అండ్ నైట్ టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. భారత్ విధించిన 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ వికెట్ నష్టపోకుండా చేధించింది.కాగా ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లలోనూ భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. 128/5 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో కేవలం 175 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో నితీశ్ కుమార్ రెడ్డి(42) మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు శుబ్‌మన్ గిల్(28), రిషబ్ పంత్(28) పరుగులతో రాణించారు. మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 5 వికెట్లతో సత్తాచాటగా.. బోలాండ్ 3, స్టార్క్ రెండు వికెట్లు సాధించారు.హెడ్ విధ్వంసం..అంతకుముందు ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్(140) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు మార్నస్ లబుషేన్(64) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ తలా నాలుగు వికెట్లు పడగొట్టారు.ఆరేసిన స్టార్క్.. కాగా భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో కూడా దారుణ ప్రదర్శన కనబరిచింది. మొదటి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 180 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు.భారత బ్యాటర్లలో నితీశ్ కుమార్(42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో ఆసీస్ సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: సిరాజ్ కాస్త తగ్గించుకో.. అతడొక లోకల్ హీరో: సునీల్ గవాస్కర్ -
‘గులాబీ’ బంతితో సాధనకు సిద్ధం
కాన్బెర్రా: నాలుగేళ్ల క్రితం ఆ్రస్టేలియాపై టెస్టు సిరీస్ గెలిచినా... ‘పింక్ బాల్’తో జరిగిన తొలి టెస్టులో 36కు ఆలౌట్ కావడం భారత్‌ను ఎప్పటికీ వెంటాడుతుంది. అదే అడిలైడ్‌లో డిసెంబర్ 6 నుంచి ఆసీస్‌తో టీమిండియా రెండో టెస్టులో తలపడనుంది. దానికి ముందే గులాబీ బంతితో సాధన చేసేందుకు భారత్ సన్నద్ధమైంది. నేడు, రేపు మనుకా ఓవల్ మైదానంలో ప్రైమ్ మినిస్టర్ (పీఎం) ఎలెవన్‌తో జరిగే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బృందం బరిలోకి దిగనుంది. రెండు రోజుల మ్యాచే కాబట్టి ప్రధానంగా బ్యాటింగ్‌పైనే జట్టు దృష్టి పెట్టింది. తొలి టెస్టు ముగిసిన తర్వాత పెర్త్‌లోనే గులాబీ బంతితో సాధన మొదలు పెట్టిన కెపె్టన్ రోహిత్ శనివారం మ్యాచ్ అవకాశాన్ని పూర్తిగా వాడుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. తుది జట్టు సమస్య లేదు కాబట్టి దాదాపు అందరూ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే గత సిరీస్‌లో అడిలైడ్ టెస్టుకంటే ముందు ఉన్న పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు టీమిండియా అమితోత్సాహంతో ఉంది. పెర్త్ టెస్టులో ఘన విజయం తర్వాత ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ‘పింక్ బంతి’ పెద్ద సమస్య కాకపోవచ్చు. మరోవైపు టెస్టు క్రికెటర్లు మాట్ రెన్షా, స్కాట్ బోలండ్ పీఎం ఎలెవన్ జట్టులో సభ్యులుగా ఉన్నారు. కెప్టెన్ జేక్ ఎడ్వర్డ్స్ మరో కీలక ఆటగాడు కాగా... అండర్–19 స్థాయి క్రికెటర్లు ఎక్కువ మంది టీమ్ తరఫున బరిలోకి దిగనున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వర్ష సూచన ఉంది. తొలి రోజు పూర్తిగా రద్దయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు! నెట్స్‌లో జోరుగా... ప్రాక్టీస్ మ్యాచ్ జరగడంపై సందేహంతో కాబోలు... మ్యాచ్‌కు ముందే శుక్రవారం భారత జట్టు ఆటగాళ్లు పింక్ బాల్‌తో ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టారు. నెట్స్‌లో సుదీర్ఘ సమయం క్రికెటర్లు శ్రమించారు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకుంటున్న శుబ్‌మన్ గిల్ ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడం సానుకూలాంశం. పలు చక్కటి షాట్లతో అతను ఆకట్టుకున్నాడు. పూర్తి ఫిట్‌గా మారితే గిల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతాడు.‘పింక్ బాల్ కాస్త భిన్నంగా స్పందిస్తుందనేది వాస్తవం. అయితే అది పెద్ద సమస్య కాదు. దానికి అనుగుణంగానే సాధన చేస్తున్నాం. రెండో టెస్టుకు ముందు ఎనిమిది రోజుల విరామం ఉండటం మాకు మేలు చేస్తుంది’ అని భారత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ చెప్పాడు. విరాట్ కోహ్లి కూడా భారత బౌలర్లను ఎదుర్కొంటూ చాలా సమయం ప్రాక్టీస్ చేశాడు. భారత్ సాధన చూసేందుకు గ్రౌండ్‌కు వచ్చిన అభిమానులకు కోహ్లి మంచి వినోదం అందించాడు. పంత్, రాహుల్ బ్యాటింగ్‌కంటే ఫిట్నెస్ డ్రిల్స్పైనే ఎక్కువగా దృష్టి పెట్టగా... బ్యాటింగ్ సాధన తర్వాత యశస్వి జైస్వాల్ సరదాగా ‘పింక్ బాల్’తో మీడియం పేస్ బౌలింగ్ సాధన చేశాడు. -
Ind Vs Sl 2nd Test: విహారికి ఛాన్స్.. మరి సిరాజ్?
India Vs Sri Lanka 2nd Test- బెంగళూరు: మూడు రోజుల్లోపే తొలి టెస్టులో శ్రీలంక ఆట ముగించిన భారత్ ఇప్పుడు అదే ప్రదర్శనను పునరావృతం చేసేందుకు సిద్ధమైంది. నేటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. తాజా ఫామ్, బలాబలాల దృష్ట్యా ప్రత్యర్థికంటే ఎంతో పటిష్టంగా ఉన్న టీమిండియాకు ఇక్కడా అడ్డు ఉండకపోవచ్చు. తొలి పోరులో ఘోర వైఫల్యం తర్వాత రెండో టెస్టులో లంక ఏమాత్రం పోటీనిస్తుందనేది చూడాలి. ఫ్లడ్ లైట్ల వెలుగులో ‘డే అండ్ నైట్’గా గులాబీ బంతితో జరగనున్న ఈ మ్యాచ్‌కు మైదానంలో ప్రేక్షకులను 100 శాతం అనుమతిస్తుండటం చెప్పుకోదగ్గ విశేషం. సిరాజ్‌కు అవకాశం ఇస్తారా! మొహాలీలో భారత జట్టు ప్రదర్శన చూసిన తర్వాత సహజంగానే తుది జట్టులో మార్పులకు అవకాశం కనిపించదు. రోహిత్‌తో పాటు సొంతగడ్డపై మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. మూడో స్థానంలో హనుమ విహారికి మళ్లీ అవకాశం ఖాయం కాగా... కోహ్లి ఈ మ్యాచ్‌లోనైనా సెంచరీ సాధించి సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతాడా చూడాలి. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాలతో మిడిలార్డర్ పటిష్టంగా ఉండగా ఆ తర్వాత అశ్విన్ కూడా సత్తా చాటగలడు. బుమ్రా, షమీ ఖాయం కాగా... మూడో స్పిన్నర్‌గా జయంత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆడించడంపై టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. అయితే ‘పింక్ బంతి’ బాగా స్వింగ్ అయ్యే అవకాశం ఉండటంతో దాదాపు సొంత మైదానంలాంటి చిన్నస్వామిలో మూడో పేసర్‌గా హైదరాబాద్ బౌలర్ సిరాజ్‌కు చాన్స్ లభిస్తుందేమో చూడాలి. తుది జట్టులో ఎవరు? మొదట టి20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయి తొలి టెస్టులోనూ ఓడిన శ్రీలంక ఇప్పుడు రెండో మ్యాచ్ కోసం తుది జట్టును సిద్ధం చేసుకోవడమే కష్టంగా మారింది. గత మ్యాచ్‌లో ఆడిన కుమార, నిసాంకా గాయాలతో దూరం కాగా, ఆడే అవకాశం ఉన్న చమీరా కూడా గాయపడ్డాడు. కుశాల్ మెండిస్ కోలుకోవడం ఆ జట్టుకు ఊరట. అసలంక స్థానంలో చండిమాల్‌కు అవకాశం దక్కవచ్చు. మరోసారి టీమ్ బ్యాటింగ్ సీనియర్లు కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్లపైనే ఆధారపడి ఉంది. ఎంబుల్డెనియాతో పాటు కొత్తగా వస్తున్న చమిక కరుణరత్నే భారత్‌ను ఏమాత్రం కట్టడి చేయగలరో చూడాలి. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న సురంగ లక్మల్ ఆటపై అందరి దృష్టీ ఉంది. 4:భారత్‌కు ఇది నాలుగో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్... స్వదేశంలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లపై గెలిచిన భారత్ ఆస్ట్రేలియా గడ్డపై ఓడింది. 400: మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్‌కిది 400వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. #TeamIndia vice-captain @Jaspritbumrah93 on the mental changes that need to be made for a Pink Ball Test.@Paytm #INDvSL pic.twitter.com/PCfrY6sJe7 — BCCI (@BCCI) March 11, 2022 -
‘గులాబీ’ గుచ్చుకుంది..
పింక్ పోరులో టీమిండియా తడబడింది... ఓపెనర్ల వైఫల్యం తర్వాత సీనియర్ల ఆటతో దారిలో పడిన ఇన్నింగ్స్... సూర్యాస్తమయానికి ముందు మళ్లీ గతి తప్పింది... ఫలితంగా అడిలైడ్‌లో తొలి రోజు ఆట చివరకు ఆస్ట్రేలియా వైపు మొగ్గింది. కోహ్లి అర్ధ సెంచరీకి తోడు పుజారా, రహానేల ప్రదర్శన టీమిండియాను ఆదుకుంది. మిగిలిన నాలుగు వికెట్లతో మన జట్టు మరికొన్ని అదనపు పరుగులు జోడిస్తే రెండో రోజు భారత బౌలర్లు శాసించవచ్చు. అడిలైడ్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి బాధ్యతాయుత బ్యాటింగ్, చతేశ్వర్ పుజారా అడ్డుగోడ, అజింక్యా రహానే నిలకడ వెరసి టీమిండియా మొదటి రోజు ఆటను మెరుగైన స్థితిలో ముగించింది. గురువారం టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. కోహ్లి (180 బంతుల్లో 74; 8 ఫోర్లు) భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. పుజారా (160 బంతుల్లో 43; 2 ఫోర్లు), రహానే (92 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. స్టార్క్ 2 వికెట్లు తీయగా... హాజల్‌వుడ్, కమిన్స్, లయన్‌లకు తలా ఒక వికెట్ దక్కింది. వృద్ధిమాన్ సాహా (9 బ్యాటింగ్), అశ్విన్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓపెనింగ్ బౌల్డ్ ఆట ఆరంభం కాగానే భారత ఓపెనింగ్ క్లీన్ బౌల్డయ్యింది. యువ ఓపెనర్ పృథ్వీ షా(0)ను స్టార్క్ ఇన్నింగ్స్ రెండో బంతికే బౌల్డ్ చేశాడు. అతని స్టాన్స్, బ్యాట్‌కు ప్యాడ్‌కు మధ్య అతని నిర్లక్ష్యంపై టీవీ వ్యాఖ్యాతల్లో ఒకరైన పాంటింగ్ స్పందించాడు. అతని టెక్నిక్‌లో లోపాలున్నాయని... తేలిగ్గానే క్లీన్‌బౌల్డ్ చేయొచ్చని వ్యాఖ్యానించాడు. రికీ కామెంట్ ముగిసిందో లేదో అన్నట్లుగానే అతని వికెట్ పడింది. ఐపీఎల్లో పృథ్వీ ఉన్న ఢిల్లీ జట్టుకు పాంటింగ్ కోచ్, మెంటార్‌గా వ్యవహరించాడు. అలా పరుగు రాకమునుపే భారత్ వికెట్‌ను సమర్పించుకుంది. తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (40 బంతుల్లో 17; 2 ఫోర్లు)ను కమిన్స్ బౌల్డ్ చేశాడు. దీంతో 32 పరుగులకే 2 వికెట్లు పడ్డాయి. కొత్త బంతి మెరుగును ఆసీస్ పేసర్లు అందిపుచ్చుకున్నారు. రహానేను అవుట్ చేసిన క్షణాన స్టార్క్... పుజారా నిలబడి... భారత్‌కు ఇది రెండో డేనైట్ టెస్టు. విదేశాల్లో మొదటిది. పరిస్థితులకు అనుగుణంగా పుజారా ఆడకపోయివుంటే భారత్ తొలి రోజే ఆలౌటయ్యేది. సంప్రదాయ క్రికెట్ ఆడే అర్హతలన్నీ పుష్కలంగా వున్న పుజారా ముఖ్యంగా పింక్ టెస్టును ఎలా ఆడాలో తన ఆటతీరుతో చాటిచెప్పాడు. మొదట్లో బ్యాట్స్‌మెన్‌కు ఎదురయ్యే ప్రతికూలతలకు ఎదురీదాడు. ప్రత్యర్థి బౌలర్లను గౌరవించాడు. అతను బౌండరీ బాదేందుకు పట్టిన బంతుల్ని చూస్తే అందరికీ ఇట్టే అర్థమవుతుంది. వంద బంతులాడినా ఫోర్ కొట్టని పుజారా 147వ బంతిని బౌండరీకి తరలించాడు. మరుసటి బంతిని అక్కడికే పంపాడు. కెప్టెన్ కోహ్లి క్రీజులో ఉండటం, అతను బాధ్యతగా ఆడటం వల్ల తొలి సెషన్లో మరో వికెట్ తీయడం ఆసీస్ తరం కాలేకపోయింది. కోహ్లి అర్ధసెంచరీ కెప్టెన్ కోహ్లి, పుజారా ఆడిన తీరు తొలిసెషన్ నష్టాన్ని పూడ్చింది. రెండో సెషన్‌ను కూడా దాదాపు కాపాడింది. అందుకే జట్టు స్కోరు 100 పరుగుల దాకా మరో వికెట్ కోల్పోకుండా వీరి భాగస్వామ్యం సాగింది. ఆసీస్ కెప్టెన్ పైన్ అందుబాటులో ఉన్న అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగించాడు. ఆఖరి సెషన్‌కు కాస్త ముందు... ఇన్నింగ్స్ 50వ ఓవర్ వేసిన లయన్ పుజారాను ఔట్ చేశాడు. నిజానికి పుజారాకు ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వలేదు. బ్యాట్, ప్యాడ్లను తాకుతూ వెళ్లిన బంతి ని లెగ్ గల్లీలో ఉన్న లబ్‌షేన్ అందుకున్నాడు. పెద్దగా అప్పీల్ చేసినా అంపైర్ నాటౌట్ అన్నాడు. కానీ ఈ లోపే పుజారా ప్చ్... అని నిట్టూరుస్తూ నిష్క్రమించేందుకు సిద్ధమయ్యాడు. అంపైర్ నిర్ణయంతో మళ్లీ నిలబడ్డాడు. దీన్ని గమనించిన ఆసీస్ ఆటగాళ్లు రివ్యూకు వెళ్లి ఫలితం పొందారు.దీంతో 68 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. రహానే జతయ్యాక 107/3 స్కోరు వద్ద టీ విరామానికెళ్లారు. తర్వాత వీళ్లిద్దరు కూడా కుదురుకోవడంతో ఆసీస్ బౌలర్లకు మళ్లీ అలసట తప్పలేదు. ముఖ్యంగా కోహ్లి పోరాటం తొలిరోజు ఆటకు ప్రాణం పోసింది. 123 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో భారత కెప్టెన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో సెషన్లో కొత్త బంతి భారత్‌ను దెబ్బ తీసింది. తొలి ఓవర్లోనే స్టార్క్ క్రీజులో పాతుకుపోయిన రహానేను ఎల్బీడబ్ల్యూగా పంపించాడు. రహానే రివ్యూ కోరినా లాభం లేకపోయింది. కాసేపటికే హనుమ విహారి (16)ని హాజల్‌వుడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అవుటా..నాటౌటా! కోహ్లిని 16 పరుగుల వద్ద అవుట్ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని ఆస్ట్రేలియా వృథా చేసుకుంది. లయన్ బౌలింగ్‌లో కోహ్లి లెగ్‌సైడ్ ఆడగా బంతి కీపర్ పైన్ చేతుల్లో పడింది. క్యాచ్ అప్పీల్‌కు అంపైర్ స్పందించలేదు. రివ్యూ కోరేందుకు పైన్ ఆసక్తి చూపించినా...లయన్ సహా సహచరులెవరూ మద్దతు ఇవ్వలేదు. దాంతో పైన్ రివ్యూకు వెళ్లలేదు. అయితే రీప్లేలో అది అవుటయ్యే అవకాశం ఉందని తేలింది. హాట్‌స్పాట్‌లో బంతి కోహ్లి గ్లవ్‌ను అలా తాకుతూ వెళ్లటం నమోదైంది. పూర్తి స్పష్టత లేకపోయినా డీఆర్ఎస్ను వాడుకుంటే ఆసీస్‌కు మేలు జరిగేది. సరైందా, కాదా తర్వాతి సంగతి... మూడు రివ్యూలు అందుబాటులో ఉండగా, కోహ్లి కోసం దానిని వాడకపోవడం పైన్ నాయకత్వ వైఫల్యాన్ని చూపిస్తోంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) స్టార్క్ 0; మయాంక్ (బి) కమిన్స్ 17; పుజారా (సి) లబ్‌షేన్ (బి) లయన్ 43; కోహ్లి రనౌట్ 74; రహానే (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టార్క్ 42; విహారి (ఎల్బీడబ్ల్యూ) (బి) హజల్‌వుడ్ 16; సాహా బ్యాటింగ్ 9; అశ్విన్ బ్యాటింగ్ 15; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (89 ఓవర్లలో 6 వికెట్లకు) 233. వికెట్ల పతనం: 1–0, 2–32, 3–100, 4–188, 5–196, 6–206. బౌలింగ్: స్టార్క్ 19–4–49–2; హజల్‌వుడ్ 20–6–47–1, కమిన్స్ 19–7–42–1, గ్రీన్ 9–2–15–0, లయన్ 21–2–68–1, లబ్‌షేన్ 1–0–3–0. తొలి సెషన్ ఓవర్లు: 25, పరుగులు: 41, వికెట్లు: 2 రెండో సెషన్ ఓవర్లు: 30, పరుగులు: 66, వికెట్లు: 1 మూడో సెషన్ ఓవర్లు: 34, పరుగులు: 126, వికెట్లు: 3 అదే మలుపు... కోహ్లి, రహానే మధ్య 88 పరుగుల భాగస్వామ్యం అనూహ్యంగా రనౌట్‌తో ముగిసింది. లయన్ బౌలింగ్‌లో మిడాఫ్ వైపు ఆడిన రహానే పరుగు కోసం కాస్త ముందుకు వచ్చాడు. మరో వైపునుంచి కోహ్లి మాత్రం వేగంగా దూసుకుపోయాడు. బంతి ఫీల్డర్ వద్దకు చేరడంతో పరిస్థితి చూసిన రహానే వెనక్కి తగ్గినా... కోహ్లి అప్పటికే చాలా ముందుకు వచ్చేశాడు. దాంతో లయన్ సునాయాసంగా రనౌట్ చేసేశాడు. ఒక దశలో మేం ప్రత్యర్థిపై ఆధిపత్యంలో ఉన్నామనేది వాస్తవం. అయితే కోహ్లి, రహానే అవుట్ కావడంతో వారిది కాస్త పైచేయిగా మారింది. ఈ రెండూ ఎంతో కీలకమైన వికెట్లు. అయినా సరే మ్యాచ్‌లో ప్రస్తుతం ఇరు జట్ల పరిస్థితి సమానంగానే ఉందనేది నా అభిప్రాయం. సాహా, అశ్విన్‌లు బ్యాటింగ్ చేయగలరు కాబట్టి కనీసం 300 పరుగుల స్కోరు రావచ్చు. లోయర్ ఆర్డర్ కూడా చెలరేగితే 350 కూడా కావచ్చేమో ఎవరు చెప్పగలరు! ఆరంభంలో పరుగులు రాకపోవడం, బాగా నెమ్మదిగా ఆడాల్సి రావడంలో తప్పేమీ లేదు. బంతి బాగా స్వింగ్ అవుతున్న ఆ సమయంలో వేగంగా పరుగులు రాబట్టాలనే వ్యూహం గురించి ఎవరూ ఆలోచించరు. చేతిలో వికెట్లు ఉంటే ఆ తర్వాత ఎలాగైనా పరుగులు సాధించవచ్చు. బౌలర్లకు ఈ రోజు పిచ్ బాగా అనుకూలించింది. వారిని గౌరవిస్తూ ఆడటం ఎంతో ముఖ్యం. రెండు సెషన్లలోనే వికెట్లు కోల్పోతే తొలి రోజే ఆలౌట్ అయ్యే ప్రమాదం ఉండేది కదా’ –చతేశ్వర్ పుజారా, భారత బ్యాట్స్‌మన్ ఇంకా ఎన్ని పరుగులు? మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 250/9... ఈ స్కోరు కాస్త తేడాగా కనిపిస్తోందా! రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఇదే అడిలైడ్ మైదానంలో మొదటి రోజు టీమిండియా సాధించిన స్కోరు ఇది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 15 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించగా... చివరకు టెస్టును 31 పరుగులతో గెలిచిన కోహ్లి సేన సిరీస్‌లో శుభారంభం చేసింది. నాటి ప్రదర్శనలు సరిగ్గా పునరావృతం కాకపోవచ్చు కానీ ఆ మ్యాచ్ ప్రదర్శనతో పోల్చి చూస్తే నేటి 233/6 మెరుగైన స్కోరుగానే చెప్పవచ్చు. విదేశీ గడ్డపై తొలి ‘పింక్ బాల్’ టెస్టు ఆడుతున్న భారత్ పూర్తిగా కుప్పకూలిపోకుండా ఇక్కడి వరకు రాగలిగింది. ఆరంభంలో పుజారా కనబర్చిన పట్టుదలను ఎంత ప్రశంసించినా తక్కువే. గత సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన అతడిని నిరోధించడం ఎంత కష్టమో ఆసీస్‌కు ఈపాటికే అర్థమై ఉంటుంది. ముగ్గురు పేసర్లు చక్కటి క్రమశిక్షణతో, అద్భుతమైన బంతులతో పుజారాను ఎంతగా ఇబ్బంది పెట్టినా అతను సహనం కోల్పోలేదు. ఏకాగ్రత చెదరకుండా సుమారు మూడున్నర గంటల పాటు క్రీజ్‌లో నిలిచి వికెట్ విలువేమిటో చూపించాడు. ఆ పునాదిపైనే కోహ్లి కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాడు. మరి కొద్దిసేపు కోహ్లి ఉండి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. రహానే కూడా ఆత్మవిశ్వాసంతో చూడచక్కటి షాట్లు ఆడాడు. అయితే కోహ్లి రనౌట్‌కు కారణమైన అపరాధ భావం వల్ల కావచ్చు రహానే వెంటనే తడబడ్డాడు. డే అండ్ నైట్ టెస్టుకు సంబంధించి సాయంత్రం సమయంలో కొత్త గులాబీ బంతిని ఎదుర్కోవడంలో ఇబ్బంది కావచ్చంటూ చర్చ సాగగా, ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. రహానే, విహారి అదే సమయంలో వికెట్ల ముందు దొరికిపోయారు. అయితే మరికొంత పట్టుదల కనబరిస్తే ఆ గండం దాటవచ్చని సాహా, అశ్విన్ 43 బంతులు ఆడి నిరూపించారు. వీరిద్దరికి బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది. ఇటీవల అశ్విన్ బ్యాటింగ్ కూడా ఎంతో మెరుగైంది. రెండో రోజు వీరు నిలబడితే భారత్ కనీసం 275–300 మధ్య స్కోరు సాధించగలదు. సాధారణంగా పింక్ టెస్టుల్లో బౌలర్లు ఆధిపత్యం సాగిస్తున్న చోట పరుగుల వరద పారకపోయినా ఇది చెప్పుకోదగ్గ స్కోరు. అడిలైడ్ పిచ్ కూడా కాస్త భిన్నంగా కనిపిస్తోంది. కొంత బౌన్స్ ఉన్నా వేగం కూడా మరీ ఎక్కువేమీ లేదు. చాలా బంతులు బ్యాట్‌ను తాకి స్లిప్స్‌లో ఫీల్డర్ల ముందు పడ్డాయి. బుమ్రా, షమీ రూపంలో అత్యుత్తమ బౌలర్లు మన జట్టులో ఉన్నారు. పైగా ఆఫ్‌స్టంప్‌పై కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తూ కీపర్, స్లిప్స్‌లో క్యాచ్‌లు ఆశించే ఆసీస్ పేసర్లతో పోలిస్తే నేరుగా స్టంప్స్‌పైనే ఎక్కువగా దాడి చేసే మన బౌలర్ల శైలికి ఈ పిచ్ సరిగ్గా సరిపోతుంది. అడిలైడ్‌లో నాలుగు డే అండ్ నైట్ టెస్టులు గెలిచిన రికార్డు ఉన్నా... నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ప్రతీసారి తడబడ్డారనే విషయం గమనార్హం. ఇక లయన్ బంతిని తిప్పిన తీరు చూస్తుంటే సీనియర్ స్పిన్నర్‡ అశ్విన్‌ను ఎదుర్కోవడం ఆసీస్‌కు అంత సులువు కాదు! -
బూమ్ బూమ్ బ్యాటింగ్
బుమ్రా అంటే భారత బౌలింగ్ తురుపుముక్క. పేస్ దళానికి ఏస్ బౌలర్. పదునైన బంతులతో నిప్పులు చెరగడం, యార్కర్లతో వికెట్లను కూల్చడం అతనికి బాగా తెలిసిన పని. మరి బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీ చేయడం మనమెప్పుడు చూడలేదు కదా! ఇప్పుడు ఆ ముచ్చట కూడా చూపించేశాడు. పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్నాడు. తర్వాత తన బౌలింగ్ విన్యాసంతో ఆసీస్ ‘ఎ’ పతనంలో భాగమయ్యాడు. దీంతో తొలి రోజే ఇరు జట్లు ఆలౌట్ అయ్యాయి. సిడ్నీ: డే అండ్ నైట్ టెస్టుకు సన్నాహకంగా నిర్వహిస్తున్న పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా (57 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు; బౌలింగ్‌లో 2 వికెట్లు) అనూహ్యంగా ఆల్‌రౌండర్ అవతారం ఎత్తాడు. బ్యాటింగ్‌లో అజేయంగా రాణించిన అతను భారత ఇన్నింగ్స్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత బౌలింగ్‌లోనూ నిప్పులు చెరిగాడు. మ్యాచ్‌ను వర్షం ఆటంక పరచడంతో సుమార గంటపాటు మ్యాచ్ సాగలేదు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 48.3 ఓవర్లలో 194 పరుగుల వద్ద ఆలౌటైంది. తర్వాత ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 32.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. క్యారీ (32; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. షమీ, సైనీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. బుమ్రా ఆల్‌రౌండ్ ప్రాక్టీస్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (2) ఎక్కువసేపు నిలువలేకపోయినా... పృథ్వీ షా (40; 8 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (43; 6 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను నడిపించారు. రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించాక పృథ్వీ షా పెవిలియన్ చేరాడు. జట్టు స్కోరు 100 పరుగులు దాటాక ఇన్నింగ్స్ గతి తప్పింది. హనుమ విహారి (15), గిల్, కెప్టెన్ అజింక్య రహానే (4), పంత్ (5), సాహా (0), షమీ (0) టపటపా వికెట్లను పారేసుకున్నారు. దీంతో 14 పరుగుల వ్యవధిలోనే భారత్ 6 వికెట్లను కోల్పోయింది. అయితే పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బుమ్రా, సిరాజ్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ముఖ్యంగా బుమ్రా ధాటిగా ఆడాడు. సదర్లాండ్ వేసిన బౌన్సర్‌ను హుక్ షాట్‌తో సిక్సర్‌గా తరలించిన అతను అర్ధ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. ఆఖరి వికెట్‌కు 71 పరుగులు జోడించాక సిరాజ్ అవుటవ్వడంతో 200 పరుగులకు ముందే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ ‘ఎ’ విలవిల భారత్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందం ఆసీస్ ‘ఎ’ జట్టులో ఎంతో సేపు నిలువలేదు. ఓపెనర్ బర్న్స్ (0)ను బుమ్రా... బెన్ మెక్‌డెర్మట్ (0)ను షమీ ఖాతానే తెరవనీయలేదు. మరో ఓపెనర్ హారిస్ (26; 4 ఫోర్లు) కాసేపు, కెప్టెన్ క్యారీ కాసేపు ఆడినా... వాళ్లిద్దరిని అవుట్ చేసేందుకు భారత సీమర్లకు ఎంతో సేపు పట్టలేదు. దీంతో 56 పరుగులకే ఐదు వికెట్లను... వందకంటే ముందే 9 వికెట్లను ఆతిథ్య జట్టు కోల్పోయింది. కోహ్లి దూరం 12 రోజుల వ్యవధిలో ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఊహించిన విధంగానే ఈ మ్యాచ్ బరిలోకి దిగలేదు. మ్యాచ్ ఆడకపోయినా...సిడ్నీ ప్రధాన స్టేడియం బయట నెట్స్‌లో కోహ్లి సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేశాడు. అనూహ్యంగా భారత్ నలుగురు పేసర్లతోనే ఆడింది. అయితే ఇందులో సీనియర్ ఉమేశ్ యాదవ్‌కు మాత్రం అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) సదర్లాండ్ 40; మయాంక్ (సి) బర్న్స్ (బి) అబాట్ 2; శుబ్‌మన్ (సి) క్యారీ (బి) గ్రీన్ 43; విహారి (బి) విల్డర్మత్ 15; రహానే (సి) క్యారీ (బి) విల్డర్మత్ 4; పంత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) విల్డర్మత్ 5; సాహా (సి)సదర్లాండ్ (బి) అబాట్ 0; సైనీ (సి) మ్యాడిన్సన్ (బి) కాన్వే 4; షమీ (సి) క్యారీ (బి) అబాట్ 0; బుమ్రా నాటౌట్ 55; సిరాజ్ (సి) హరిస్ (బి) స్వెప్సన్ 22; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (48.3 ఓవర్లలో ఆలౌట్) 194. వికెట్ల పతనం: 1–9, 2–72, 3–102, 4–102, 5–106, 6–111, 7–111, 8–116, 9–123, 10–194. బౌలింగ్: అబాట్ 12–6–46–3, కాన్వే 11–3–45–1, సదర్లాండ్ 9–0–54–1, గ్రీన్ 6.1–2–20–1, విల్డర్మత్ 8–4–13–3, స్వెప్సన్ 2.2–0–15–1. ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: హారిస్ (సి) శుబ్‌మన్ (బి) షమీ 26; బర్న్స్ (సి) పంత్ (బి) బుమ్రా 0; మ్యాడిన్సన్ (సి) సాహా (బి) సిరాజ్ 19; మెక్‌డెర్మట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 0; క్యారీ (సి) పంత్ (బి) సైనీ 32; అబాట్ (సి) పంత్ (బి) షమీ 0; విల్డర్మత్ (సి) పంత్ (బి) బుమ్రా 12; సదర్లాండ్ (సి) శుబ్‌మన్ (బి) సైనీ 0; ప్యాట్రిక్ నాటౌట్ 7; స్వెప్సన్ (సి) సాహా (బి) సైనీ 1; కాన్వే రనౌట్ 7; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (32.2 ఓవర్లలో ఆలౌట్) 108. వికెట్ల పతనం: 1–6, 2–46, 3–46, 4–52, 5–56, 6–83, 7–84, 8–97, 9–99, 10–108. బౌలింగ్: షమీ 11–4–29–3; బుమ్రా 9–0–33–2, సిరాజ్ 7–1–26–1, సైనీ 5.2–0–19–3. గ్రీన్ దిమ్మదిరిగింది టెస్టు సిరీస్‌కు ముందు అసలే గాయాలతో సతమతమవుతున్న ఆసీస్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. దూకుడుగా బ్యాటింగ్ చేసిన బుమ్రా... ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ బుర్ర బద్దలయ్యే షాట్ ఆడాడు. గ్రీన్ బౌలింగ్‌లో బుమ్రా కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్ బౌలర్ తలకు బలంగా తగిలింది. దీంతో గ్రీన్ ఒక్కసారిగా పిచ్‌పైనే కూలబడ్డాడు. నాన్ స్ట్రయిక్‌లో ఉన్న సిరాజ్ పరుగును, బ్యాట్‌ను పక్కన పడేసి గ్రీన్ వద్దకు పరుగెత్తాడు. ఆసీస్ జట్టు వైద్య సిబ్బంది అతన్ని మైదానం వెలుపలికి తీసుకెళ్లి పరీక్షించింది. అతని స్థానంలో ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’గా బ్యాట్స్‌మన్ ప్యాట్రిక్ రోవ్‌ను బరిలోకి దిగాడు. -
‘పింక్’ పిలుపు...
డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లు మొదలయ్యాక భారత జట్టు గులాబీ బంతితో ఒకే ఒక మ్యాచ్ (2019లో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో) ఆడింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో వచ్చే గురువారం నుంచి మరో ‘పింక్’ పోరులో తలపడాల్సి ఉంది. దానికి సిద్ధమయ్యేందుకు మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా బరిలోకి దిగుతోంది. తొలి టెస్టు వేదిక అయిన అడిలైడ్‌తో పోలిస్తే పిచ్‌లో తేడా ఉన్నా... ఫ్లడ్‌లైట్లలో, పింక్ బాల్‌తో ఆడటం అసలు సమరానికి ముందు సరైన సన్నాహకంగా భావించవచ్చు. సిడ్నీ: టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించిన భారత జట్టు రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తమ వనరులను మరింతగా పరీక్షించుకునే ప్రయత్నంలో ఉంది. ఆస్ట్రేలియా ‘ఎ’తో నేటి నుంచి జరిగే ఈ మూడు రోజుల మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి మినహా భారత టెస్టు జట్టులోని రెగ్యులర్ ఆటగాళ్లంతా ఆడే అవకాశం ఉంది. 12 రోజుల వ్యవధిలో వన్డే, టి20 సిరీస్‌లు ఆడటంతో అలసిపోయినట్లు భావిస్తున్న కెప్టెన్ తొలి టెస్టుకు ముందు తగినంత విశ్రాంతి కోరుకుంటున్నాడు. బరిలోకి విహారి... కోహ్లి జట్టులోకి రావడం మినహా ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడే బృందమే తొలి టెస్టులోనూ బరిలోకి దిగే అవకాశం దాదాపు ఖాయమే. తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడని రెగ్యులర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఇక్కడ తన బ్యాటింగ్ పదును పరీక్షించుకోవాల్సి ఉంది. రెండో ఓపెనర్‌గా యువ ఆటగాళ్లు పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్‌లలో ఒకరికి అవకాశం లభిస్తుందా లేక పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను ప్రయత్నిస్తారా ఇక్కడ తేలిపోతుంది. పుజారా, రహానేలు మరింత ప్రాక్టీస్ ఆశిస్తుండగా ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారిపై కూడా అందరి దృష్టి ఉంది. తొలి టెస్టులో భారత్ నలుగురు రెగ్యులర్ బౌలర్లతోనే ఆడాలని భావిస్తే ఆరో నంబర్ బ్యాట్స్‌మన్‌గా విహారికి అవకాశం దక్కుతుంది. అతనికి ఈ మ్యాచ్ సన్నాహకంగా ఉపయోగపడుతుంది. మరోవైపు ఇద్దరు స్పిన్నర్లను తీసుకుంటే కుల్దీప్ను ఆడించాల్సి ఉంటుంది. డే అండ్ నైట్ మ్యాచ్‌లో కుల్దీప్ వైవిధ్యమైన బౌలింగ్ అదనపు బలంగా మారుతుందనుకుంటే అతనికీ తగినంత ప్రాక్టీస్ అవసరం. ఇషాంత్ లేకపోవడంతో షమీ, బుమ్రాలపై మరింత బాధ్యత పెరిగింది. టి20లకు దూరంగా ఉండి వీరు విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి పింక్ బంతితో ఆసీస్ పిచ్‌పై సాధ్యమైనంత ప్రాక్టీస్‌ను కోరుకుంటున్నారు. వికెట్ కీపర్‌గా సాహా తొలి మ్యాచ్‌లో సత్తా చాటగా... ఇప్పుడు అతడినే కొనసాగిస్తారా లేక రిషభ్ పంత్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం కల్పిస్తారా చూడాలి. సత్తా చాటేందుకు... ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు కూడా మరీ బలహీనంగా ఏమీ లేదు. టెస్టు ఓపెనర్‌గా ఖాయమైన జో బర్న్స్‌తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్‌లో ప్రదర్శనతో టెస్టు తుది జట్టులో స్థానం ఆశిస్తున్న కామెరాన్ గ్రీన్, సీన్ అబాట్, మిషెల్ స్వెప్సన్ జట్టులో ఉన్నారు. ముఖ్యంగా గ్రీన్ ఇక్కడ చెలరేగితే టెస్టు క్రికెటర్‌గా ప్రమోషన్ దక్కవచ్చు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. గతంలో టెస్టులు ఆడిన నిక్ మ్యాడిసన్, మార్కస్ హారిస్ కూడా సొంత మైదానంలో సత్తా చాటగలరు. గాయంతో మోజెస్ హెన్రిక్స్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఫస్ట్ క్లాస్ హోదా ఉంటేనే... సరిగ్గా తొలి టెస్టు ఆడే జట్టుతోనే ప్రాక్టీస్ చేయాలని భారత్ భావిస్తే (కోహ్లి మినహా) ఈ మ్యాచ్‌కు ఫస్ట్ క్లాస్ హోదా ఇవ్వాలని ఆతిథ్య బోర్డును కోరవచ్చు. అప్పుడు మ్యాచ్‌లో తీవ్రత పెరుగుతుంది. పూర్తి స్థాయిలో 11 మంది తుది జట్టునే బరిలోకి దించాల్సి ఉంటుంది. లేదంటే మామూలు టూర్ మ్యాచ్‌లాగానే ఎవరైనా గరిష్టంగా 11 మంది బ్యాటింగ్, 11 మంది బౌలింగ్ చేస్తూ దాదాపు అందరు ఆటగాళ్లను పరీక్షించుకోవచ్చు. సాధారణంగా పర్యాటక జట్టు విజ్ఞప్తి చేస్తేనే ఆతిథ్య బోర్డు స్పందిస్తుంది. -
పింక్‌బాల్.. అడిలైడ్ టూ కోల్‌కతా
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం టీమిండియా- బంగ్లాదేశ్‌ల మధ్య జరిగే రెండో టెస్టుపైనే దృష్టిని కేంద్రీకరించింది.ఎందుకంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదటిసారి పింక్‌బాల్‌తో ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు అభిమానులతో పాటు ఇరుదేశాల క్రికెటర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 22న ప్రారంభం కానున్న డే- నైట్ టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్జెన్స్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.పింక్ బాల్‌కు సంబంధించి మొదటి డై నైట్ టెస్టు మ్యాచ్ 2015లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మధ్య అడిలైడ్‌లో జరిగింది. దీంతో అడిలైడ్‌లో మొదలైన పింక్ బాల్ కథ ఇప్పుడు కోల్‌కతాకి చేరింది. అయితే ఇది ఇండియాలోకి అడుగుపెట్టడానికి మాత్రం నాలుగేళ్లు పట్టింది. అయితే ఐసీసీ 2015లోనే డై నైట్ టెస్టులకు అనుమతినిచ్చినా బీసీసీఐ, టీమిండియా వ్యతిరేకించడంతో ఉపఖండంలో పింక్ బాల్ కల నెరవేరలేదు. తాజాగా సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడంతో మరోసారి డే నైట్ టెస్టు ప్రతిపాదన ముందుకు వచ్చింది. కాగా కోహ్లి- గంగూలీ కలిసిన మొదటి భేటీలోనే గంగూలీ డే నైట్ టెస్టును ప్రతిపాదించడం, కోహ్లి అందుకు ఒప్పుకోవడం చకచకా జరిగిపోయింది. అడిలైడ్ టు కోల్‌కతా ఇప్పటివరకు టెస్టు చరిత్రలో 11 డే నైట్ టెస్టులు జరగగా ఆస్ట్రేలియా అత్యధికంగా 5 డే నైట్ టెస్టులు ఆడింది. తర్వాతి స్థానాల్లో శ్రీలంక(3), వెస్టిండీస్(3), శ్రీలంక (3), ఇంగ్లండ్ (3), పాకిస్తాన్(2), దక్షిణాఫ్రికా ( 2), జింబాబ్వే(1)ఘాడాయి. తాజాగా ఇప్పుడు 12వ డే పైట్ టెస్టు టీమిండియా, బంగ్లాదేశ్‌ల మధ్య జరగనుంది. కాగా, 11 డే నైట్ టెస్టులు జరిగిన వేదికలను ఒకసారి చూస్తే.. అడిలైడ్ , దుబాయ్, అడిలైడ్ , బ్రిస్బేన్, బర్మింగ్ హమ్,దుబాయ్, అడిలైడ్, పోర్ట్ ఎలిజెబెత్(సెంట్ జార్జ్ పార్క్), ఆక్లాండ్, బ్రిడ్జ్‌టౌన్, బ్రిస్బేన్ నగరాలు ఆతిథ్యమిచ్చాయి. ఇప్పుడు 12వ డే నైట్ టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా మ్యాచ్‌కు సంబంధించి పలు విశేషాలు ఉన్నాయి. మ్యాచ్‌లో టాస్కు ముందు ఆర్మీ బలగాలు పారాట్రూపర్స్‌లో వచ్చి ఇరు కెప్టెన్లకు రెండు పింక్ బాల్స్‌ను అందజేయనున్నారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో కలిసి ఈడెన్గార్డెన్లోని సంప్రదాయ బెల్‌ను మోగించి మ్యాచ్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మ్యాచ్‌కు తరలిరానున్న సచిన్ టెండూల్కర్, ఒలింపియన్ అభినవ్ బింద్రా, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, 6 సార్లు మహిళల బాక్సింగ్ చాంపియన్ మేరీకోమ్‌లను ఘనంగా సత్కరించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) సెక్రటరీ అవిషేక్ దాల్మియా తెలిపారు. -
పింక్ బాల్ క్రికెట్: మనోళ్ల సత్తా ఎంత?
ప్రస్తుతం ప్రపంచం మొత్తం టీమిండియా-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగే రెండో టెస్టుపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అభిమానులతో పాటు ఇరుదేశాల క్రికెటర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ టెస్టు ప్రారంభానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ తొలి డేనైట్ టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్జెన్స్ ఆతిథ్యమిస్తోంది. డేనైట్ టెస్టు కోసం రెగ్యులర్‌గా వాడే రెడ్ బాల్స్‌కు బదులు పింక్ బాల్స్‌ను వాడతారు. దీంతో ఈ రెండు బంతుల మధ్య తేడా ఏంటి, పింక్ బాల్‌తో మనోళ్లు నెగ్గుకరాగలరా? అనే అంశాలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత టీమిండియా సభ్యుల్లో కొంతమందికి పింక్ బాల్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. సారథి విరాట్ కోహ్లి, వైఎస్ కెప్టెన్ అజింక్యా రహానే, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌లు తొలిసారి పింక్ బాల్ క్రికెట్ ఆడనుండటం విశేషం. అయితే ఇప్పటికే టీమిండియాతో పాటు, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలుత బెంగళూరులో రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. అనంతరం కోల్‌కతాలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే పింక్ బాల్ క్రికెట్ ఆడిన అనుభవం కొంతమందికి ఉండటం టీమిండియాకు లాభించే అంశం. ఎవరు, ఎక్కడ పింక్ బాల్ క్రికెట్ ఆడారో చూద్దాం.. మహ్మద్ షమీ: ప్రతీ ఒక్కరి దృష్టి ఈ మీడియం పేసర్ పైనే ఉంది. ఎందుకంటే పింక్ బాల్ రివర్స్ స్వింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో రివర్స్ స్వింగ్ సుల్తాన్ అయిన షమీ బంగ్లా పని పడతాడని భావిస్తున్నారు. క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) సూపర్ లీగ్ ఫైనల్లో పింక్ బంతులను ఉపయోగించారు. ఈ మ్యాచ్‌లో షమీ రెచ్చి పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. దీంతో ఈ అనుభవంతో బంగ్లాతో జరిగే మ్యాచ్‌లో షమీపైనే అందరి దృష్టి ఉంది. వృద్దిమాన్ సాహా: క్యాబ్ సూపర్ లీగ్ ఫైనల్లో భాగంగా వృద్దిమాన్ సాహా పింక్ బాల్ క్రికెట్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగులు సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రవీంద్ర జడేజా: ప్రస్తుత జట్టులోని సభ్యుల్లో పింక్ బాల్ క్రికెట్లో ఈ ఆల్‌రౌండర్ ప్రధాన ఆయుధంగా కానున్నాడు. దులీప్ ట్రోఫీ-2016లో భాగంగా పింక్ బంతులను వాడారు. ఈ టోర్నీలో రెండు సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా బ్యాటింగ్‌లో 48, 17 పరుగులు సాధించాడు. మయాంక్ అగర్వాల్: పింక్ బాల్ క్రికెట్లో ఇతడు టీమిండియా స్టార్ అనే చెప్పాలి. 92,161,58,57,52 వరుసగా మయాంక్ సాధించిన పరుగులు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 419 పరుగులు సాధించాడు. దీంతో బంగ్లాతో జరిగే మ్యాచ్‌లో మయాంక్ కీలకం కానున్నాడు. రోహిత్ శర్మ: దులీప్ ట్రోఫీ-2016లో భాగంగా ఇండియా బ్లూ తరుపున బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లో 30,32 పరుగులు సాధించాడు. కాన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా రెడ్‌పై 335 పరుగుల తేడాతో ఇండియా బ్లూ ఘన విజయం సాధించింది. చటేశ్వర పుజారా: టెస్టు బ్యాట్స్‌మన్‌గా ప్రసిద్ది గాంచిన చటేశ్వర పుజారా దేశవాళీ పింక్ బాల్ క్రికెట్లో అదరగొట్టాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా రెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా బ్లూ బ్యాట్స్‌మన్ పుజారా ఏకంగా 256 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు పింక్ బాల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్ పుజారానే కావడం విశేషం. దీంతో పుజారా అనుభవం బంగ్లా మ్యాచ్‌లో ఉపయోగపడే అవకాశం ఉంది. ఇషాంత్ శర్మ: దులీప్ ట్రోఫీ-2016లో భాగంగా ఓ మ్యాచ్ ఆడిన ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టాడు. అంతేకాకుండా 9 పరుగులు సాధించాడు. ఇక కుల్దీప్ యాదవ్ దులీప్ ట్రోపీ-2016లో 11 వికెట్లు పడగొట్టి బౌలర్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.కాగా, హనుమ విహారీ, రిషభ్ పంత్‌లు దులీప్ ట్రోఫీ-2017లో ఆడిన ఆనుభవం ఉంది. ఈ టోర్నీలో విహారీ 105 పరుగులు సాధించగా, పంత్ 72 పరుగులు మాత్రమే సాధించాడు. వీరి అనుభవం టీమిండియా డబుల్ ప్లస్ కానుంది. -
పింక్ బాల్‌తో మనోళ్ల ప్రాక్టీస్
ఇండోర్: భారత క్రికెటర్ల ప్రాక్టీస్ ‘రంగు’ మారింది. ఎప్పుడూ ఎరుపు బంతితో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసే ఆటగాళ్లు మంగళవారం గులాబీ బంతితో ఆడుకున్నారు. భారత సారథి కోహ్లి తొలిసారిగా పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశాడని జట్టు వర్గాలు తెలిపాయి. పింక్ బాల్‌తో అతను డిఫెన్స్ ఆడాడు. కోల్‌కతాలో ఈనెల 22 నుంచి జరిగే డేనైట్ టెస్టు కోసం అలవాటు పడేందుకే ఆటగాళ్లు సంప్రదాయ ఎర్ర బంతితో కాకుండా ఈసారి పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశారు. పేసర్లు, స్పిన్నర్ల కోసం మూడు నెట్స్‌లను ఏర్పాటు చేయగా, టీమిండియా విజ్ఞప్తి మేరకు త్రోడౌన్ ప్రాక్టీస్ కోసం మరో చోట టర్ఫ్, బ్లాక్ సైట్‌స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడే అందరికంటే ముందుగా కోహ్లి ప్రాక్టీస్ చేశాక... తర్వాత పుజారా, శుబ్‌మన్ గిల్ కూడా పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశారు. డేనైట్ టెస్టుకు రోజుల వ్యవధే ఉండటంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో ఇటీవల రహానే, మయాంక్ అగర్వాల్, పుజారా, షమీలకు ప్రత్యేకంగా పింక్‌బాల్ ప్రాక్టీస్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసింది. గురువారం నుంచి ఇండోర్‌లో తొలి టెస్టు జరుగుతుంది. పిల్లలతో కోహ్లి గల్లీ క్రికెట్... భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడాడు. ఇక్కడి బిచోలి మర్దానా ప్రాంతంలో సరదాగా పిల్లలతో క్రికెట్ ఆడాడు. ఈ వీడియా, ఫొటో షూట్ నెట్టింట బాగా వైరల్ అయింది. చెక్ షర్ట్, జీన్స్ వేసుకొని కోహ్లి పిల్లలతో చేసిన అల్లరిని నెటిజన్లు తెగ ‘లైక్’ చేశారు. చీకట్లో కాస్త క్లిష్టం కావొచ్చు; పింక్ బాల్‌పై పుజారా వ్యాఖ్య బెంగళూరు: డేనైట్ టెస్టు కోసం ఉపయోగించే గులాబీ బంతితో రాత్రయితే దాన్ని చూడటంలో సమస్య ఎదురవుతుందని భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా అన్నాడు. ‘నేను ఇదివరకే దులీప్ ట్రోఫీలో పింక్‌బాల్‌తో ఆడాను. అది మంచి అనుభవం. దేశవాళీ క్రికెట్లో అలా ఆడిన అనుభవం ఇప్పుడు అక్కరకొస్తుంది. అయితే పగటి సమయంలో పింక్‌బాల్‌తో ఏ సమస్యా ఉండదు. కానీ చీకటి పడినపుడు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బంతిని చూడటం కష్టమవుతుందేమో! అదే జరిగితే మ్యాచ్‌లో ఆ రాత్రి సెషనే కీలకంగా మారొచ్చు’ అని పుజారా అన్నాడు. టీమిండియాలో కెప్టెన్ కోహ్లి సహా చాలా మందికి పింక్‌బాల్‌తో ఆడటం కొత్త. పుజారా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, కుల్దీప్ యాదవ్‌లకు మాత్రం కూకబుర్రా గులాబీ బంతులతో దులీప్ ట్రోఫీ ఆడిన అనుభవం ఉంది. రెడ్‌బాల్ కంటే ఎక్కువ కష్టపడాలి... రెడ్‌బాల్‌తో పోలిస్తే పింక్‌బాల్‌తో ఆడేందుకు కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందని భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే అన్నాడు. ‘నా వరకైతే గులాబీ బంతి ఆటకు నేను కొత్త. ఇది కాస్త భిన్నంగా అనిపించింది. మా దృష్టంతా బంతి స్వింగ్, సీమ్‌పైనే ఉంటుంది. నా అంచనా ప్రకారం బంతిని శరీరానికి దగ్గరగా ఆడాల్సి ఉంటుంది’ అని అన్నాడు. -
అప్పుడు రెండొందలు కొడితే బంతి మార్చేవారు..!
సిడ్నీ: భారత్ తొలి డే అండ్ నైట్ టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. నవంబర్ 22 నుంచి భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టుకు మంచు ప్రభావం చూపే అవకాశం ఉందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంచు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ ఓ సలహా ఇచ్చాడు. గులాబి బంతి తడిస్తే కొత్తది తీసుకుంటే సరిపోతుందని చెప్పాడు. ఈ సందర్భంగా డీన్ జోన్స్ మాట్లాడుతూ ..‘డే అండ్ నైట్ టెస్టు గొప్ప ముందడుగు. మంచు ప్రభావం గురించి తప్పక ఆలోచించాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ బంతి తడిస్తే కొత్త బంతిని తీసుకోండి. ఆట నిబంధనలు మారుతున్నాయి. ఉదాహరణకు బ్రాడ్‌మన్ కాలంలో ఒక జట్టు 200 పరుగులు చేస్తే రెండో కొత్త బంతి ఇచ్చేవారు. మనం రాత్రిపూట ఆడుతున్నాం. ఒకవేళ బంతి తడిస్తే మార్చేయండి. నా దృష్టిలోనైతే ఇది తేలికైన పని. సౌరవ్ గంగూలీ టెస్టు క్రికెట్‌తో పాటు రాత్రిపూట క్రికెట్‌కు అభిమాని అని తెలుసు’ అని డీన్ జోన్స్ వెల్లడించాడు. ‘రాబోయే రోజుల్లో భవిష్యత్తు అంతా గులాబి టెస్టులదే. ప్రస్తుతం ప్రజలు బిజీగా గడుపుతున్నారు. గులాబి టెస్టులకు ఆస్ట్రేలియాలో రేటింగ్స్ బాగున్నాయి. సంప్రదాయ టెస్టులతో పోలిస్తే ఎంత భారీస్థాయిలో ఉన్నాయో చెప్పలేను. బిజీగా ఉండటంతో పగటి పూట టెస్టు క్రికెట్ చూడటం జనాలకు కష్టమవుతోంది. గులాబి బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుంది. అలవాటు పడితే సులభంగానే ఉంటుంది’ అని జోన్స్ అన్నాడు.(ఇక్కడ చదవండి: ‘పింక్ బాల్’ ఎందుకు గుచ్చుకుంటోంది! ) -
ఈ సీజన్లో డే అండ్ నైట్ టెస్టు ఉండదు
బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ న్యూఢిల్లీ: గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టును జరపాలనే ఆలోచనను బీసీసీఐ తాత్కాలికంగా పక్కన పెట్టింది. వచ్చే ఏడాది మార్చి వరకు స్వదేశంలో భారత్‌కు సుదీర్ఘ టెస్టు సీజన్ ఉండడంతో ఏదో ఓ మ్యాచ్‌లో ఈ ప్రయోగాన్ని అమలు చేస్తారనే ఊహాగానాలకు బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెర దించారు. ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే పింక్ బాల్ టెస్టు ఆడేసినా.. ఇక్కడ కార్యరూపం దాల్చేందుకు ప్రయోగాత్మకంగా మరిన్ని దేశవాళీ మ్యాచ్‌లను ఆడించాల్సి ఉంటుందని ఠాకూర్ స్పష్టం చేశారు. ఇటీవలి దులీప్ ట్రోఫీ డే అండ్ నైట్‌లోనే జరిగింది. అరుుతే పలువురు ఆటగాళ్లు దీనిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘గులాబీ టెస్టు గురించి ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడించిన దులీప్ ట్రోఫీ విజయవంతమైంది. అరుుతే తుది నిర్ణయం తీసుకునే ముందు శాస్త్రీయ తరహాలో అన్ని విషయాలూ పరిగణలోకి తీసుకోవాలి. ఎరుపు బంతి 20-25 ఓవర్ల అనంతరం రివర్స్ స్వింగ్ అవుతుంది. కానీ పింక్ బాల్ నుంచి అది ఆశించలేం’ అని ఠాకూర్ వివరించారు. ‘సుప్రీం కోర్టుకు నివేదిస్తాం’ తాము సూచించిన ప్రతిపాదనల అమల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న బీసీసీఐపై జస్టిస్ లోధా ప్యానెల్ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. తాజా పరిస్థితిపై సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించాలని భావిస్తోంది. ఈనేపథ్యంలో సోమవారం ప్యానెల్ అంతర్గత సమావేశం జరిగింది. ‘ఈనెల 21న జరిగిన బోర్డు ఏజీఎంలో వారు తీసుకున్న నిర్ణయాలపైనే కాకుండా నిబంధనల అతిక్రమణ, కార్యదర్శి ఎన్నిక, ఐదుగురితో కూడిన సెలక్షన్ కమిటీ ఎంపిక గురించి చర్చ జరిగింది. ఇది పూర్తిగా మేం సూచించిన సంస్కరణలకు విరుద్ధం. అందుకే పూర్తి వివరాలతో సుప్రీం కోర్టుకు నివేదిక పంపాలని నిర్ణరుుంచాం’ అని ఆర్ఎం లోధా తెలిపారు. -
ఆదిలోనే అవాంతరం!
రెండుసార్లు ఆగిన ఫ్లడ్‌లైట్లు * దులీప్ ట్రోఫీ ‘పింక్‌బాల్’ మ్యాచ్ * తొలి రోజు బౌలర్ల ఆధిపత్యం గ్రేటర్ నోయిడా: బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా పింక్ బంతితో తొలిసారి నిర్వహించిన డే అండ్ నైట్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కు మొదటి రోజే అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇండియా రెడ్, ఇండియా గ్రీన్ జట్ల మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో మంగళవారం రెండు సార్లు ఫ్లడ్ లైట్లు ఆరిపోయాయి. దాంతో గంటకు పైగా ఆటకు అంతరాయం కలిగింది. ఇండియా గ్రీన్ ఇన్నింగ్స్ సందర్భంగా మూడు ఓవర్ల తర్వాత డిన్నర్బ్రేక్ సమయంలో లైట్లు ఆగడంతో 17 నిమిషాలు ఆట ఆలస్యమైంది. ఆ తర్వాత 9.3 ఓవర్ల తర్వాత మళ్లీ చీకటి కమ్మేసింది. దాంతో లైట్లను పునరుద్ధరించేందుకు దాదాపు గంట సమయం పట్టింది. పింక్‌బాల్‌తో తొలి మ్యాచ్‌ను పేరున్న స్టేడియంలో కాకుండా కొత్తగా ఏర్పాటు చేసిన గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించడంతో బోర్డుకు భంగపాటు ఎదురైంది. ఈ గ్రౌండ్లో ఇదే తొలి డే అండ్ నైట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో పింక్ బంతి పేస్ బౌలర్లకు బాగా సహకరించింది. ఒక్క రోజులోనే మొత్తం 17 వికెట్లు పడ్డాయి. గ్రీన్ ఆటగాడు సందీప్ శర్మ (4/62) చెలరేగడంతో ఇండియా రెడ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 48.2 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. ముకుంద్ (77) రాణించగా, యువరాజ్ (4) సహా అంతా విఫలమయ్యారు. అనంతరం గ్రీన్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేయగలిగింది. రైనా (35)దే అత్యధిక స్కోరు. ప్రస్తుతం గ్రీన్ మరో 45 పరుగులు వెనుకబడి ఉంది. నాథూ సింగ్, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. -
పింక్ బంతితో ఇప్పుడే కాదు
డేనైట్ టెస్టుపై కుంబ్లే న్యూఢిల్లీ: ఐదు రోజుల ఫార్మాట్‌పై అభిమానుల ఆసక్తిని కొనసాగించాలంటే భవిష్యత్‌లో డేనైట్ టెస్టులు తప్పవని భారత చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశారు. అయితే పింక్ బంతితో నిర్వహించే ఈ మ్యాచ్‌లకు మరింత సమయం పడుతుందన్నారు. ‘మేం పింక్ బంతుల గురించి ఇంకా ఆలోచించలేదు. దీనికి ఇంకా సమయం పడుతుంది. వెస్టిండీస్‌లో మాత్రం మేం రెడ్ డ్యూక్ బంతులతోనే ఆడతాం. డేనైట్ టెస్టులకు నేను కూడా మద్దతిస్తున్నా. ఏదేమైనా భవిష్యత్‌లో టెస్టు క్రికెట్‌కు ప్రేక్షకాదరణ పెంపొందించాలి. డేనైట్ మ్యాచ్‌లు నిర్వహిస్తే ప్రజలు ఆఫీస్ పని వేళలు ముగించుకుని స్టేడియానికి వస్తారు’ అని కుంబ్లే పేర్కొన్నారు. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుతమైన బ్యాట్స్‌మన్ అని కితాబిచ్చిన కుంబ్లే... అతనితో కలిసి పని చేసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు. -
డే నైట్ టెస్టు లేనట్లే!
* న్యూజిలాండ్‌తో సిరీస్ షెడ్యూల్ ప్రకటన * సెప్టెంబర్ 22 నుంచి సిరీస్ ప్రారంభం న్యూఢిల్లీ: భారత ఉపఖండంలో తొలిసారిగా గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టును జరపాలని భావిస్తున్న బీసీసీఐ తమ ప్రణాళికలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్ షెడ్యూల్‌ను బోర్డు మంగళవారం విడుదల చేసింది. అయితే దీంట్లో డే అండ్ నైట్ టెస్టు గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు జరిగే తొలి టెస్టుకు కాన్పూర్ ఆతిథ్యమివ్వనుంది. అలాగే తొలిసారిగా ఇండోర్‌కు టెస్టు హోదా దక్కింది. ఇక్కడ చివరిదైన మూడో టెస్టు జరుగుతుంది. నిజానికి మూడో టెస్టు కోల్‌కతాలో జరగాల్సి ఉన్నా అదే సమయంలో దుర్గా పూజలు ఉండడంతో షెడ్యూల్‌ను మార్చారు. టెస్టు సిరీస్ అనంతరం అక్టోబర్ 16 నుంచి 29 వరకు ఐదు వన్డేల సిరీస్ జరుగుతుంది. తొలిసారిగా షెడ్యూల్‌ను క్రికెటర్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించడం విశేషం. -
పింక్ బంతి ఓకే
కోల్‌కతా: భారత్‌లో డేనైట్ టెస్టులకు సన్నాహకంగా ప్రయోగాత్మకంగా పింక్ బంతితో నిర్వహించిన మ్యాచ్ ముగిసింది. ఆడిన ఆటగాళ్లంతా సంతృప్తి వ్యక్తం చేయడంతో అక్టోబరులో న్యూజిలాండ్‌తో ఈడెన్‌గార్డెన్స్‌లో డేనైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించే అవకాశాలు మెరుగయ్యాయి. బెంగాల్ క్రికెట్ సంఘం తమ సూపర్‌లీగ్ ఫైనల్‌ను పింక్‌బంతితో డేనైట్‌గా నిర్వహించింది. ఇందులో భవానీపూర్ క్లబ్‌పై 296 పరుగులతో మోహన్‌బగాన్ విజయం సాధించింది. భారత బౌలర్ షమీ ఈ మ్యాచ్‌లో ఆడి ఏడు వికెట్లు తీశాడు. -
పింక్ బాల్కే నా ఓటు..
కోల్‌కతా: భారత్‌లోని పరిస్థితులపై పింక్ బాల్ మనుగడ ఎలా ఉండబోతుందో అనే సందేహాలపై ఫాస్ట్ బౌలర్ మొహ్మద్ షమీ సానుకూల స్పందన తెలియజేశాడు. అనుకూన్న దాని కంటే పింక్ బాల్‌తో బౌలింగ్ చేయడం చాలా అనుకూలంగా ఉందన్నాడు. ఈడెన్ గార్డెన్ స్టేడియంలో మోహన్ బగాన్, భవానీపూర్ క్లబ్‌ల మధ్య సూపర్ లీగ్ ఫైనల్ ను డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ గా నిర్వహిస్తున్నారు. ఇందులో మోహన్ బగాన్ జట్టు తరుపున ప్రాతినిథ్యం వహించిన షమీ ఐదు వికెట్లతో రాణించాడు. దీనిపై తన స్పందన తెలియజేసిన షమీ.. ఉపఖండ పరిస్థితులకు పింక్ బంతి అనుకూలంగానే ఉంటుందన్నాడు. పింక్ బంతితో బాగా స్వింగ్ రాబట్టినట్లు పేర్కొన్నాడు. ఆ బంతి నుంచి అంత స్వింగ్ ముందుగా ఊహించలేదన్నాడు. 'డే అండ్ నైట్ మ్యాచ్‌ల్లో తెలుపు బంతైనా, పింక్ బంతైనా కొంత వరకూ దృష్టి సమస్య ఉంటుంది. అయితే పింక్ బాల్కే నా ఓటు. పింక్ బంతి చాలా మెరుగ్గా ఉంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో కూడా స్వింగ్ కావడం అనుకూలాంశం. ఒక బౌలర్ ఇంతకన్నా ఏమీ కోరుకోడు. అటు బ్యాట్స్‌మెన్, ఇటు బౌలర్ల చాలెంజ్‌లో పింక్ బంతి ప్రధాన పాత్ర పోషిస్తుంది. రివర్స్ స్వింగ్ కూడా అవుతుంది. నేను రివర్స్ స్వింగ్ చేశా'అని షమీ తెలిపాడు. -
' టెస్టు మ్యాచ్ లకు పింక్ బాల్ ఓ ఉత్ర్పేరకం'
కోల్ కతా: డే అండ్ నైట్ టెస్టులకు ఉపయోగించే పింక్ బంతుల పట్ల ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ డీన్ జోన్స్ హర్షం వ్యక్తం చేశాడు. టెస్టు క్రికెట్‌ను కాపాడుకోవడానికి పింక్ బంతి ఓ ఉత్ర్పేరకంగా ఉపయోగడపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.టెస్టు క్రికెట్ కు ఆదరణ తగ్గిపోతున్న దశలో పింక్ బంతులతో డే అండ్ నైట్ టెస్టులకు శ్రీకారం చుట్టడం నిజంగా అభినందనీయమన్నాడు. పింక్ బాల్ అనేది టెస్టు క్రికెట్‌ను రక్షించడమే కాదు.. టెస్టు క్రికెట్‌కు ఒక ఉత్రేరకంగా కూడా పని చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని డీన్ జోన్స్ పేర్కొన్నాడు. గతేడాది నవంబర్‌లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ల మధ్య జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ ఒక అద్భుతమైన ప్రయోగమన్నాడు. తొలుత డే అండ్ నైట్ వన్డేలు ప్రవేశపెట్టినప్పుడు కూడా పింక్ బాల్ ప్రయోగం ఫలించదనే అభిప్రాయం ఉండేదని, ఆ తరువాత అది తప్పని నిరూపితమైందని డీన్ జోన్స్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
పింక్ బంతుల కోసం బీసీసీఐ చర్చలు
న్యూఢిల్లీ: డే నైట్ టెస్టులకు వినియోగించే పింక్ బంతుల సరఫరా కోసం బీసీసీఐ... ప్రముఖ బ్రిటిష్ కంపెనీ ‘డ్యూక్’తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఏడాది చివర్లో భారత్.. న్యూజిలాండ్‌తో జరగనున్న డేనైట్ టెస్టుకు వీటిని ఉపయోగిస్తామని బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే తెలిపారు. అయితే బంతి ఉపయోగం, మన్నిక వంటి చాలా అంశాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయన్నారు. భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు ఎక్కువగా ‘ఎస్జీ టెస్టు’ బంతులను వాడుతుండగా, ఇంగ్లండ్‌లో ‘డ్యూక్’, విండీస్‌తో పాటు ఇతర దేశాల్లో ‘కూకాబురా’ బాల్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే కూకాబురాతో పోలిస్తే డ్యూక్ బంతుల్లో సీమ్ కాస్త మందంగా ఉండటం భారత బౌలర్లకు బాగా లాభిస్తుందని బీసీసీఐ సాంకేతి కమిటీ చైర్మన్ సౌరవ్ గంగూలీ చెప్పడంతో బోర్డు దీనిపై దృష్టిపెట్టింది. మరోవైపు భారత్‌తో డేనైట్ టెస్టు ఆడేందుకు కివీస్ సుముఖంగా లేదని వస్తున్న వార్తలను షిర్కే తోసిపుచ్చారు. కోచ్ రేసులో 21 మంది.. భారత జట్టు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న 57 మందిలో 21 మందిని షార్ట్‌లిస్ట్ చేసినట్లు షిర్కే తెలిపారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన సలహా కమిటీకి వారి జాబితాను పంపుతామని, తుది నిర్ణయంపై కమిటీ సూచనలిస్తుందన్నారు. ఈనెల 22లోపు కమిటీ రిపోర్ట్‌ను అనురాగ్ ఠాకూర్ సమర్పిస్తుంది. కమిటీ మాజీ సెలక్టర్ సంజయ్ జగ్దలే సహకారాలు అందించనున్నారు. -
ఈడెన్‌లో ‘గులాబి’ మ్యాచ్
కోల్‌కతా: గులాబి బంతితో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో దేశంలో తొలిసారి గులాబీ బంతితో ఆడే మ్యాచ్‌కు ఈడెన్ గార్డెన్ సిద్ధమవుతోంది. ఈనెల 17 నుంచి 20 వరకు క్యాబ్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరిగే సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌ను ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహించనున్నారు. ఈ ప్రయోగం సమీప భవిష్యత్‌లో డే అండ్ నైట్ టెస్టు నిర్వహణకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్టు గంగూలీ తెలిపారు. బోర్డు సాంకేతిక కమిటీ అధ్యక్షుడిగానూ దాదా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. -
పింక్ బంతిపై క్రికెటర్ల ఆందోళన
కాన్ బెర్రా: సంప్రదాయ టెస్టు క్రికెట్ లో తొలిసారి ఉపయోగించబోయే పింక్ బంతిపై క్రికెటర్లు మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలిసారి అంతర్జాతీయంగా జరగబోతున్నడే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కు న్యూజిలాండ్ -ఆస్ట్రేలియాల సిద్ధమవుతున్న తరుణంలో పింక్ బాల్ రగడ మరోసారి చోటు చేసుకుంది. ఇరుజట్ల మధ్య అడిలైడ్ ఓవల్‌లో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకూ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే కొన్ని దేశవాళీ టోర్నీలలో ప్రయోగాత్మకంగా డే అండ్ నైట్ టెస్టులు జరిగినా అంతర్జాతీయంగా తొలి మ్యాచ్ జరగడానికి రంగం సిద్ధమైంది. అంత వరకూ బాగానే ఉన్నా అందులో ఉపయోగించబోయే పింక్ రంగు బంతి ఇప్పుడు వివాదాలకు దారితీస్తోంది. ఇప్పటికే సన్నాహక మ్యాచ్ లో భాగంగా న్యూజిలాండ్-ప్రైమ్ మినిస్టర్స్ ఎలివన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పింక్ బంతిని ఉపయోగించారు. కాగా, ఆ బంతి సరైన ఫలితానివ్వలేదని ఆస్ట్రేలియన్ ఆటగాడు ఆడమ్ వోజస్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. టెస్టు మ్యాచ్ లో రోజుకు కనీసం 80 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. తాము 95.0 ఓవర్లు ఆడిన మ్యాచ్ లో పింక్ బంతి సత్ఫలితాన్ని ఇవ్వలేదన్నాడు. 30 ఓవర్లకే పింక్ బంతిపై ఉన్న కోటింగ్ పోయి సరిగా కనిపించట్లేనప్పుడు టెస్టు మ్యాచ్ లకు ఆ బంతి ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించాడు. తాము ఆడిన మ్యాచ్ లో పింక్ బంతి తొలుత బాగానే కనిపించినా.. రానురాను ఆ బంతి మెత్తబడిపోతుందన్నాడు. పింక్ బంతి ఆరంభ కార్యక్రమంలో భాగంగా ప్రైమ్ మినిస్టర్స్ బౌలర్ ఆస్టోన్ ఆగన్ వేసిన బంతిని న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్తిల్ మిడ్ వికెట్ మీదుగా షార్ట్ ఆడితే ఆ బంతి ఎటువైపు వెళ్లిందో కూడా తెలియదని వోజస్ ఆందోళన వ్యక్తం చేశాడు. డే అండ్ టెస్టు మ్యాచ్ కు మరో 34 రోజుల మాత్రమే ఉన్నందున దీనిపై మ్యాచ్ అధికారులు, ఆటగాళ్లు చర్చించాల్సిన అవసరం ఉందన్నాడు. పింక్ రంగు బంతితో క్రికెటర్ల సమస్య ఏమిటి? ఫీల్డింగ్ చేసే సమయంలో పింక్ బంతి సరిగ్గా కనిపించదనేది క్రికెటర్ల వాదన. దీనిపై ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్లతో పాటు, న్యూజిలాండ్ క్రికెటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీల్డర్‌కు కనిపించనప్పుడు చూసే అభిమానులు దాన్ని ఎలా గుర్తించగలుగుతారనేది మరో ప్రశ్న. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఫీల్డింగ్ సమయంలో పింక్ బంతులు సరిగ్గా కనిపించే అవకాశాలు తక్కువ. అలాగే బౌలింగ్ చేసే సమయంలో బంతి స్వింగ్ అయ్యే దానిపై కూడా అనేక అనుమానాలు. త్వరగా మెరుపు కోల్పోతుంది. దాంతో పేసర్లకు ఇబ్బందిగా మారుతుంది. రివర్స్ స్వింగ్ చేయడం కూడా కష్టం. కచ్చితంగా ఎర్ర బంతితో పోలిస్తే పింక్ బాల్ చాలా వైవిధ్యంగా ఉంటుందని క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. నిజానికి టెస్టుల్లో ఎరుపు రంగు బంతుల్ని వాడతారు. రాత్రి సమయాల్లో జరిగే మ్యాచ్ ల్లో ఫడ్లైట్ల వెలుతురులో ఆడాల్సి ఉంటుంది. అందుకే ఎరుపు కంటే ఇంకా స్పష్టంగా కనిపించేందుకు పింక్ రంగు బంతులని వాడాలని ఐసీసీ నిర్ణయించింది. పింక్ బంతులు ప్రముఖ సంస్థ కుకుబుర్రా తయారుచేస్తోంది. గత నాలుగు సంవత్సరాల నుంచి పింక్ బంతి తయారీకి సంబంధించి మెరుగులు దిద్దుతున్న కుకుబుర్రాకు క్రికెటర్ల ఆందోళనతో మరోసారి నిరాశ ఎదురయ్యిందనే చెప్పవచ్చు. -
పింక్ బంతిపై స్టార్క్ అనుమానం
సంప్రదాయన్నే కొనసాగించాలంటున్న మరికొందరు టీ20 రాకతో క్రికెట్లో మరో శకం మొదలైంది. అప్పటికే టెస్టులకు ఆదరణ తగ్గుతున్న సమయంలో టీ20లు రావడంతో వాటిని చూసే వారి సంఖ్య పడిపోయింది. టెస్టులను కూడా జనరంజకంగా చేయాలని భావించిన ఐసీసీ డే/నైట్ టెస్టులు నిర్వహించాలని 2000లోనే వచ్చిన ఆలోచనను మళ్లీ తెరపైకి వచ్చింది. ఇన్నేళ్లకు తొలిసారి ఒక అంతర్జాతీయ డే/నైట్ టెస్టు మ్యాచ్ జరగబోతోంది. అంతా బాగానే ఉన్నా అందులో ఉపయోగించబోయే పింక్ రంగు బంతి ఇప్పుడు వివాదాలకు దారితీస్తోంది. ఇంతకు పింక్ రంగు బంతిలో సమస్య ఏమిటి.. ఫీల్డింగ్ చేసే సమయంలో పింక్ బంతి సరిగ్గా కనిపించదు. ఫీల్డర్‌కు కనిపించనప్పుడు చూసే అభిమానులు దాన్ని ఎలా గుర్తించగలుగుతారు. తాజాగా ఆస్ట్రేలియా పేస్ స్టార్ మిచెల్ స్టార్క్ అడిగిన ప్రశ్న ఇది. టెస్టు మ్యాచ్‌లు సంప్రదాయ క్రికెట్లో భాగం.. సంప్రదాయాన్ని అలా కొనసాగిస్తేనే బాగుంటుంది.. ఇది కొంతమంది సీనియర్ న్యూజిలాండ్ ఆటగాళ్ల వాదన. డే/నైట్ టెస్టులతో క్రికెట్లో మరో విప్లవం రానుంది. ఇప్పటికే కొన్ని దేశవాళీ టోర్నీలలో ప్రయోగాత్మకంగా డే/నైట్ టెస్టులు జరిగినా ఈ ఏడాది చివర్లో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు ఆ చరిత్రాత్మక మ్యాచ్‌లో తలపడనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్న ఆ మ్యాచ్‌పై ఇరు దేశాల క్రికెటర్లు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బంతితోనే అసలు సమస్య ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో ఇప్పటికే డే/నైట్ టెస్టు మ్యాచ్‌లు మొదలయ్యాయి. ఆ మ్యాచ్‌ల్లో ఆడిన స్టార్క్ పింక్ బంతులపై అనుమానం వ్యక్తం చేశాడు. ‘‘ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఫీల్డింగ్ సమయంలో పింక్ బంతులు సరిగ్గా కనిపించవు. అలాగే బౌలింగ్ చేసే సమయంలో బంతి స్వింగ్ కాదు. త్వరగా మెరుపు కోల్పోతుంది. దాంతో పేసర్లకు ఇబ్బందిగా మారుతుంది. రివర్స్ స్వింగ్ చేయడం కూడా కష్టం. కచ్చితంగా ఎర్ర బంతితో పోలిస్తే పింక్ బాల్ చాలా వైవిధ్యమైంది’’ అని చెప్పుకొచ్చాడు. పైగా కొందరికి పింక్ కలర్ కనిపించని లోపం కూడా ఉంటుందని, దానికి తన సహచరుడు క్రిస్ రోజర్స్‌ను ఉదహరించాడు. డే/నైట్ టెస్టులకు వేరేగా స్టాట్స్ ఏర్పాటు చేయాలని చెప్పుకొచ్చాడు. అయితే మ్యాచ్‌లు నిర్వహించేది క్రికెట్‌కు క్రేజ్ పెంచేందుకే కాబట్టి మనం గౌరవించాలని చివరి మాటగా అన్నాడు. సంప్రదాయాన్ని మార్చకూడదు వన్డేల్లో మార్పులు తెచ్చినా సరేకానీ టెస్టుల్లో చెస్తే క్రికెట్ విలువ తగ్గించినట్లు అవుతుందని కొందరి అభిప్రాయం. టెస్టు ఫార్మాట్ సంప్రదాయ క్రికెట్ అని దానిలో ఎక్కువ మార్పులు చేస్తే బాగుండదని న్యూజిలాండ్ క్రికెటర్లు అంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని మరో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ కూడా వ్యక్తపరిచాడు. ఎప్పుడో 1877లో ప్రారంభమైన టెస్టుల్లో ఇప్పటివరకు చాలా మార్పులు వచ్చాయని, ప్రస్తుతం కొత్త విప్లవం రాబోతుం దని కివీస్ బోర్డు అధ్యక్షుడు డేవిడ్ వైట్ చెప్పాడు. అయితే ఇప్పటికిప్పుడు డే/నైట్ టెస్టులు ఎక్కువగా జరిగే అవకాశం లేదని ప్రస్తుతం ఇంకా ప్రయోగ దశలోనే ఉందన్నాడు. నిజానికి టెస్టుల్లో రెడ్ (ఎరుపు) రంగు బంతుల్ని వాడతారు. డే/నైట్ మ్యాచ్‌లో రాత్రి సమయంలో ఫడ్లైట్ల వెలుతురులో ఆడాల్సి ఉంటుంది. అందుకే ఎరుపు కంటే ఇంకా స్పష్టంగా కనిపించేందుకు పింక్ రంగు బంతులని వాడాలని ఐసీసీ నిర్ణయించింది. పింక్ బంతులు ప్రముఖ సంస్థ కుకుబుర్రా తయారుచేస్తోంది. ఎర్ర బంతి కంటే పింక్ బంతి స్పష్టంగా కనిపిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. డే/నైట్ టెస్టు మ్యాచ్ విశేషాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య అడిలైడ్ ఓవల్‌లో నవంబర్ 27 - డిసెంబర్ 1 మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ మధ్యహ ్నం గం. 2.30 నుంచి రాత్రి గం. 9.30 వరకు జరుగుతుంది. తొలి, రెండో సెషన్ మధ్య 20 నిమిషాల బ్రేక్ సమయాన్ని ‘టీ’గా; రెండు, మూడో సెషన్ మధ్య 40 నిమిషాల బ్రేక్‌ను ‘డిన్నర్’గా పరిగణిస్తారు. ఆస్ట్రేలియాతో క్రికెట్ సంబంధాలు మెరుగుపరచుకోవడానికి న్యూజిలాండ్ ఈ సిరీస్‌కు ఒప్పుకుంది. ఎందుకంటే ఈ రెండు జట్ల మధ్య 2011 తర్వాత టెస్టు మ్యాచ్ జరగలేదు. మ్యాచ్ ఆడే పింక్ బంతిపై ఆసీస్ క్రికెటర్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయక టెస్టుల్లో మార్పులు మంచిది కాదని న్యూజిలాండ్ క్రికెటర్ల అభిప్రాయం. -మన్నె కిశోర్.