* న్యూజిలాండ్‌తో సిరీస్ షెడ్యూల్ ప్రకటన
* సెప్టెంబర్ 22 నుంచి సిరీస్ ప్రారంభం
న్యూఢిల్లీ: భారత ఉపఖండంలో తొలిసారిగా గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టును జరపాలని భావిస్తున్న బీసీసీఐ తమ ప్రణాళికలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్ షెడ్యూల్‌ను బోర్డు మంగళవారం విడుదల చేసింది. అయితే దీంట్లో డే అండ్ నైట్ టెస్టు గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు జరిగే తొలి టెస్టుకు కాన్పూర్ ఆతిథ్యమివ్వనుంది.
అలాగే తొలిసారిగా ఇండోర్‌కు టెస్టు హోదా దక్కింది. ఇక్కడ చివరిదైన మూడో టెస్టు జరుగుతుంది. నిజానికి మూడో టెస్టు కోల్‌కతాలో జరగాల్సి ఉన్నా అదే సమయంలో దుర్గా పూజలు ఉండడంతో షెడ్యూల్‌ను మార్చారు. టెస్టు సిరీస్ అనంతరం అక్టోబర్ 16 నుంచి 29 వరకు ఐదు వన్డేల సిరీస్ జరుగుతుంది. తొలిసారిగా షెడ్యూల్‌ను క్రికెటర్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించడం విశేషం.
డే నైట్ టెస్టు లేనట్లే!
Published Wed, Jun 29 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM
Advertisement