Greg Barclay: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా గ్రెగ్ బార్క్లే (న్యూజిలాండ్) మరోసారి ఎన్నికయ్యాడు. బార్క్లే ఎన్నికను ఐసీసీ బోర్డు ఇవాళ (నవంబర్ 12) అధికారికంగా ప్రకటించింది. అధ్యక్ష రేసులో ఉండిన జింబాబ్వే క్రికెట్ బోర్డు చైర్మన్ డాక్టర్ టవెంగ్వా ముకుహ్లాని ఆఖరి రోజు నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో బార్క్లే ఎన్నిక ఏకగ్రీవమైంది. అంతా అనుకున్నట్లుగానే భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అభ్యర్ధిని నిలబెట్టకపోవడంతో బార్క్లే ఎన్నిక లాంఛనమైంది.
బీసీసీఐ.. తొలుత మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని బరిలోకి దింపాలని భావించినప్పటికీ, ఆఖరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుంది. 17 మంది సభ్యులున్న ఐసీసీ బోర్డులో బీసీసీఐ సహా 12 మందికి పైగా సభ్యులు బార్క్లేకు మద్దతు ప్రకటించారు. 2020 నవంబర్‌లో తొలిసారి ఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన బార్క్లే .. ఈ పదవిలో మరో రెండేళ్లు కొనసాగనున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా ఇవాళ జరిగిన ఐసీసీ మీటింగ్‌కు భారత్ తరఫున జై షా హాజరయ్యారు.
చదవండి: టీమిండియాను దారుణంగా అవమానించిన గిన్నిస్ రికార్డ్స్
Comments
Please login to add a commentAdd a comment