ICC president
-
ఐసీసీ అధ్యక్షుడిగా మళ్లీ అతనే.. రేసులో కూడా లేని గంగూలీ
Greg Barclay: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా గ్రెగ్ బార్క్లే (న్యూజిలాండ్) మరోసారి ఎన్నికయ్యాడు. బార్క్లే ఎన్నికను ఐసీసీ బోర్డు ఇవాళ (నవంబర్ 12) అధికారికంగా ప్రకటించింది. అధ్యక్ష రేసులో ఉండిన జింబాబ్వే క్రికెట్ బోర్డు చైర్మన్ డాక్టర్ టవెంగ్వా ముకుహ్లాని ఆఖరి రోజు నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో బార్క్లే ఎన్నిక ఏకగ్రీవమైంది. అంతా అనుకున్నట్లుగానే భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అభ్యర్ధిని నిలబెట్టకపోవడంతో బార్క్లే ఎన్నిక లాంఛనమైంది. బీసీసీఐ.. తొలుత మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని బరిలోకి దింపాలని భావించినప్పటికీ, ఆఖరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుంది. 17 మంది సభ్యులున్న ఐసీసీ బోర్డులో బీసీసీఐ సహా 12 మందికి పైగా సభ్యులు బార్క్లేకు మద్దతు ప్రకటించారు. 2020 నవంబర్‌లో తొలిసారి ఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన బార్క్లే .. ఈ పదవిలో మరో రెండేళ్లు కొనసాగనున్నాడు. మెల్బోర్న్ వేదికగా ఇవాళ జరిగిన ఐసీసీ మీటింగ్‌కు భారత్ తరఫున జై షా హాజరయ్యారు. చదవండి: టీమిండియాను దారుణంగా అవమానించిన గిన్నిస్ రికార్డ్స్ -
బీసీసీఐ అధ్యక్షుడిగా జై షా.. అత్యున్నత పదవి రేసులో గంగూలీ..?
Jay Shah To Become BCCI President Says Reports: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాజ్యాంగంలో సవరణలకు ఆమోదం తెలుపుతూ నిన్న (సెప్టెంబర్ 14) సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రస్తుత పాలకమండలికి మరో విడత పదవులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లైంది. సుప్రీం తాజా తీర్పుతో ఆఫీస్ బేరర్లు వరుసగా 12 ఏళ్ల పాటు (స్టేట్ అసోసియేషన్‌లో ఆరేళ్లు, బీసీసీఐలో ఆరేళ్లు) పదవుల్లో కొనసాగే వెసలుబాటు లభించింది. దీంతో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శిగా జై షా మరో మూడేళ్ల పాటు (వీరి పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది) పదవుల్లో కొనసాగేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇవాళ మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా తదుపరి బీసీసీఐ అధ్యక్షుడు కాబోతున్నాడని, ఆ స్థానంలో ఉన్న గంగూలీ ఐసీసీ అధ్యక్ష రేసులో ఉండబోతున్నాడని పలు ప్రముఖ వెబ్సైట్లు కథనాలను ప్రసారం చేశాయి. జై షాకు బీసీసీఐ పట్టం కట్టేందుకు 15 రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు సంసిద్ధంగా ఉన్నట్లు సదరు వెబ్సైట్లు పేర్కొన్నాయి. మరోవైపు ఐసీసీ చైర్మన్‌గా గ్రెగ్ బార్ల్కే (న్యూజిలాండ్) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుండడంతో ఆ స్థానంలో గంగూలీని కూర్చొబెట్టేందుకు సన్నాహకాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఒకవేళ గంగూలీ ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైతే క్రికెట్లో అత్యున్నత పదవి చేపట్టబోయే 5వ భారతీయుడిగా రికార్డుపుటల్లోకెక్కుతాడు. గతంలో ఐసీసీ చైర్మన్లుగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జగ్మోహన్ దాల్మియా, ఆతరువాత మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ న్యాయవాది శశాంక్ మనోహర్ పని చేశారు. -
'ఇండో-పాక్ క్రికెట్ సిరీస్ కు ఇదే సరైన సమయం'
హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ ల క్రికెట్ సిరీస్ జరగాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఇండియా సిమెంట్స్ -హైదరాబాద్ ఎలెవ్ జట్ల మధ్య జరుగుతున్న మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ ఫైనల్లో భాగంగా ఇక్కడ విచ్చేసిన జహీర్ అబ్బాస్ మీడియాతో మాట్లాడుతూ తన ఆకాంక్షను వెల్లడించారు. భారత-పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ సిరీస్ జరగడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. పొరుగు దేశాలైన ఇండియా-పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ సిరీస్ జరగాలని యావత్ ప్రపంచం కోరుకుంటుందన్నాడు. ' రెండు దేశాల క్రికెట్ సిరీస్ కోసం నాతో పాటు ప్రపంచం కూడా ఎదురుచూస్తోంది. అందుకు భారత్ సంసిద్ధంగా ఉంటే.. ఇదే సరైన సమయం'అని అన్నారు. భారత-పాకిస్థాన్ ల సిరీస్ కోసం ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా ఉన్నట్లు ఐసీసీ సీఈవో తనతో చెప్పినట్లు అబ్బాస్ పేర్కొన్నారు. అందుకోసం తన నుంచి ఏమైనా సాయం కావాల్సి వస్తే తప్పకుండా అందిస్తానని జహీర్ అబ్బాస్ తెలిపారు. ఇప్పటికే ఇరు దేశాల క్రికెట్ సిరీస్ కోసం ఐసీసీ ప్రెసిడెంట్ గా సాయం అందించాలని అబ్బాస్ ను పీసీబీ కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోఅబ్బాస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ ఫైనల్లో భాగంగా విజేతలకు ట్రోఫీలు బహుకరించేందుకు జహీర్ అబ్బాస్ ను హెచ్ సీఏ(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) ఆహ్వానించింది. -
'ఆ పదవికి వేరే వ్యక్తిని ఎంపిక చేయండి'
కరాచీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అధ్యక్ష పదవిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ నజమ్ సేథీ వెనక్కి తగ్గాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో సీనియర్ సభ్యుడిగా ఉన్న నజమ్.. ఐసీసీ అధ్యక్ష పదవికి సంబంధించిన నామినేషన్ ను తాజాగా ఉపసంహరించుకున్నాడు. ఐసీసీ అధ్యక్షునిగా అతని నియామకం దాదాపుగా ఖరారైన తరుణంలో దానిపై నజమ్ విముఖత వ్యక్తం చేశాడు. ఆ పదవికి మరో పాకిస్థాన్ టెస్ట్ క్రికెటర్ ను నామినేట్ చేయాలని పీసీబీకి విన్నవించాడు. ఈ తన అకస్మిక నిర్ణయం ప్రస్తుతానికి ప్రభావం చూపినా.. తన స్థానంలో మరో వ్యక్తిని కూర్చోబెడితే బాగుంటుదని బోర్డుకు స్పష్టం చేశాడు. దీంతో పాటు ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ కూడా నజమ్ సేథీ ఓ లేఖ రాశాడు. తన నిర్ణయాన్ని ఆలస్యంగా చెబుతున్నందుకు క్షమించమని ఐసీసీని అభ్యర్థించాడు.కానీ తాను తీసుకున్న నిర్ణయంపై ఐసీసీ సభ్యులు అంతా ఆమోదిస్తారని భావిస్తున్నట్లు నజమ్ పేర్కొన్నాడు. అంతకుముందు ఐసీసీ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న ముస్తఫా కమల్ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం నజమ్ సేథీ పేరు తెరపైకి వచ్చింది. ఆ పదవికి తన నియామకం దాదాపు పూర్తయిన క్రమంలో నజమ్ నామినేషన్ ను ఉపసంహరించుకున్నాడు. -
ఐసీసీ అధ్యక్షుడి రాజీనామా
ఐసీసీ అధ్యక్షుడు ముస్తఫా కమల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం ఉదయం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు అద్భుతమైన ఫామ్‌ను కనబరిచి క్వార్టర్స్ వరకు వెళ్లింది. అయితే క్వార్టర్స్‌లో టీమిండియా చేతిలో చిత్తయిన విషయం తెలిసిందే. ఐదోసారి విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కు వరల్డ్ కప్ ట్రోఫీని ఎవరు ఇవ్వాలన్న విషయంలో వివాదం రేగింది. తనను కనీసం ఆహ్వానించకపోవడంతో కమల్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. ఐసీసీ రాజ్యాంగాన్ని దారుణంగా ఉల్లంఘించారని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని, ఇందులో రెండో ఆలోచనకు తావులేదని ఆయన మీడియాకు స్పష్టం చేశారు. ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ కు, ముస్తాఫా కమల్ కు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. మెల్ బోర్న్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసన్ తానే స్వయంగా ట్రోఫీని ఆస్ట్రేలియా కెప్టెన్ కు అందించారు. భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో అంపైరింగ్ లోపాల వల్లే బంగ్లా ఓడిందన్న వ్యాఖ్యలు కూడా కమల్ చేసినట్లు వినవచ్చింది. దాంతో ఆగ్రహించిన శ్రీనివాసన్.. నిబంధనలను తోసిరాజని.. ట్రోఫీని అందించే కార్యక్రమానికి తానే వెళ్లారు. ఇదే ముస్తఫా కమల్ మనస్తాపానికి కారణమైందని చెబుతున్నారు.