BCCI Clarify on Indian Cricket Team New Diet Plan in Controversy: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో నవంబర్ గురువారం నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్ట్‌కు టీమిండియా సిద్దం అవుతోంది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్ల ఫుడ్ మెనూలో మార్పులు చేస్తూ.. కొత్త డైట్ రూల్‌ను బీసీసీఐ జారీ చేసిందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. పోర్క్, బీఫ్‌ను నిషేధించారంటూ వదంతులు వ్యాపించాయి. అంతేకాకుండా కేవలం హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే తీసుకోవాలని కూడా ఈ డైట్ రూల్‌లో చేర్చినట్టు ఆ వార్తలు గుప్పుమన్నాయి.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తగా... వివాదంపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ మంగళవారం స్పందించారు. హలాల్' మీట్ డైట్ ప్లాన్ గురించి వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఆటగాళ్లకు లేదా సహాయక సిబ్బందికి బీసీసీఐ నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని సృష్టం చేశారు. భారత ఆటగాళ్లు తమకు నచ్చిన ఆహారం తినేందుకు స్వేచ్ఛనిచ్చామని ధుమాల్ పేర్కొన్నారు.
“ఆటగాళ్లకు లేదా జట్టు సిబ్బందికి ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే దానిపై బీసీసీఐ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఈ వార్తలన్నీ నిరాధారమైనవి. ఈ డైట్ ప్లాన్ గురించి మేము ఎప్పుడూ చర్చించలేదు. ఆటగాళ్లకు తమకు నచ్చిన ఆహారాన్ని తినే స్వేచ్ఛను ఇచ్చాం" అని ధుమాల్ రూమర్లకు చెక్ పెట్టారు.
చదవండి: 1st IND vs NZ Test: భారత ఓపెనర్ల కంటే ఆ ఇద్దరు బాగా ఆడుతారు.. టీమిండియా గెలుపు ఖాయం
Comments
Please login to add a commentAdd a comment