ఈ సీజన్లో డే అండ్ నైట్ టెస్టు ఉండదు
బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టును జరపాలనే ఆలోచనను బీసీసీఐ తాత్కాలికంగా పక్కన పెట్టింది. వచ్చే ఏడాది మార్చి వరకు స్వదేశంలో భారత్‌కు సుదీర్ఘ టెస్టు సీజన్ ఉండడంతో ఏదో ఓ మ్యాచ్‌లో ఈ ప్రయోగాన్ని అమలు చేస్తారనే ఊహాగానాలకు బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెర దించారు. ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే పింక్ బాల్ టెస్టు ఆడేసినా.. ఇక్కడ కార్యరూపం దాల్చేందుకు ప్రయోగాత్మకంగా మరిన్ని దేశవాళీ మ్యాచ్‌లను ఆడించాల్సి ఉంటుందని ఠాకూర్ స్పష్టం చేశారు.
ఇటీవలి దులీప్ ట్రోఫీ డే అండ్ నైట్‌లోనే జరిగింది. అరుుతే పలువురు ఆటగాళ్లు దీనిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘గులాబీ టెస్టు గురించి ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడించిన దులీప్ ట్రోఫీ విజయవంతమైంది. అరుుతే తుది నిర్ణయం తీసుకునే ముందు శాస్త్రీయ తరహాలో అన్ని విషయాలూ పరిగణలోకి తీసుకోవాలి. ఎరుపు బంతి 20-25 ఓవర్ల అనంతరం రివర్స్ స్వింగ్ అవుతుంది. కానీ పింక్ బాల్ నుంచి అది ఆశించలేం’ అని ఠాకూర్ వివరించారు.
‘సుప్రీం కోర్టుకు నివేదిస్తాం’
తాము సూచించిన ప్రతిపాదనల అమల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న బీసీసీఐపై జస్టిస్ లోధా ప్యానెల్ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. తాజా పరిస్థితిపై సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించాలని భావిస్తోంది. ఈనేపథ్యంలో సోమవారం ప్యానెల్ అంతర్గత సమావేశం జరిగింది. ‘ఈనెల 21న జరిగిన బోర్డు ఏజీఎంలో వారు తీసుకున్న నిర్ణయాలపైనే కాకుండా నిబంధనల అతిక్రమణ, కార్యదర్శి ఎన్నిక, ఐదుగురితో కూడిన సెలక్షన్ కమిటీ ఎంపిక గురించి చర్చ జరిగింది. ఇది పూర్తిగా మేం సూచించిన సంస్కరణలకు విరుద్ధం. అందుకే పూర్తి వివరాలతో సుప్రీం కోర్టుకు నివేదిక పంపాలని నిర్ణరుుంచాం’ అని ఆర్‌ఎం లోధా తెలిపారు.