
ఈడెన్‌లో ‘గులాబి’ మ్యాచ్
కోల్‌కతా: గులాబి బంతితో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో దేశంలో తొలిసారి గులాబీ బంతితో ఆడే మ్యాచ్‌కు ఈడెన్ గార్డెన్ సిద్ధమవుతోంది. ఈనెల 17 నుంచి 20 వరకు క్యాబ్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరిగే సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌ను ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహించనున్నారు.
ఈ ప్రయోగం సమీప భవిష్యత్‌లో డే అండ్ నైట్ టెస్టు నిర్వహణకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్టు గంగూలీ తెలిపారు. బోర్డు సాంకేతిక కమిటీ అధ్యక్షుడిగానూ దాదా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.