కోల్కతా: భారత్లోని పరిస్థితులపై పింక్ బాల్ మనుగడ ఎలా ఉండబోతుందో అనే సందేహాలపై ఫాస్ట్ బౌలర్ మొహ్మద్ షమీ సానుకూల స్పందన తెలియజేశాడు. అనుకూన్న దాని కంటే పింక్ బాల్తో బౌలింగ్ చేయడం చాలా అనుకూలంగా ఉందన్నాడు. ఈడెన్ గార్డెన్ స్టేడియంలో మోహన్ బగాన్, భవానీపూర్ క్లబ్‌ల మధ్య సూపర్ లీగ్ ఫైనల్ ను డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ గా నిర్వహిస్తున్నారు. ఇందులో మోహన్ బగాన్ జట్టు తరుపున ప్రాతినిథ్యం వహించిన షమీ ఐదు వికెట్లతో రాణించాడు. దీనిపై తన స్పందన తెలియజేసిన షమీ.. ఉపఖండ పరిస్థితులకు పింక్ బంతి అనుకూలంగానే ఉంటుందన్నాడు. పింక్ బంతితో బాగా స్వింగ్ రాబట్టినట్లు పేర్కొన్నాడు. ఆ బంతి నుంచి అంత స్వింగ్ ముందుగా ఊహించలేదన్నాడు.
'డే అండ్ నైట్ మ్యాచ్ల్లో తెలుపు బంతైనా, పింక్ బంతైనా కొంత వరకూ దృష్టి సమస్య ఉంటుంది. అయితే పింక్ బాల్కే నా ఓటు. పింక్ బంతి చాలా మెరుగ్గా ఉంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో కూడా స్వింగ్ కావడం అనుకూలాంశం. ఒక బౌలర్ ఇంతకన్నా ఏమీ కోరుకోడు. అటు బ్యాట్స్మెన్, ఇటు బౌలర్ల చాలెంజ్లో పింక్ బంతి ప్రధాన పాత్ర పోషిస్తుంది. రివర్స్ స్వింగ్ కూడా అవుతుంది. నేను రివర్స్ స్వింగ్ చేశా'అని షమీ తెలిపాడు.
పింక్ బాల్కే నా ఓటు..
Published Mon, Jun 20 2016 8:26 PM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement
Advertisement