కోల్ కతా: డే అండ్ నైట్ టెస్టులకు ఉపయోగించే పింక్ బంతుల పట్ల ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ డీన్ జోన్స్ హర్షం వ్యక్తం చేశాడు. టెస్టు క్రికెట్ను కాపాడుకోవడానికి పింక్ బంతి ఓ ఉత్ర్పేరకంగా ఉపయోగడపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.టెస్టు క్రికెట్ కు ఆదరణ తగ్గిపోతున్న దశలో పింక్ బంతులతో డే అండ్ నైట్ టెస్టులకు శ్రీకారం చుట్టడం నిజంగా అభినందనీయమన్నాడు.
పింక్ బాల్ అనేది టెస్టు క్రికెట్ను రక్షించడమే కాదు.. టెస్టు క్రికెట్కు ఒక ఉత్రేరకంగా కూడా పని చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని డీన్ జోన్స్ పేర్కొన్నాడు. గతేడాది నవంబర్లో అడిలైడ్లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ల మధ్య జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ ఒక అద్భుతమైన ప్రయోగమన్నాడు. తొలుత డే అండ్ నైట్ వన్డేలు ప్రవేశపెట్టినప్పుడు కూడా పింక్ బాల్ ప్రయోగం ఫలించదనే అభిప్రాయం ఉండేదని, ఆ తరువాత అది తప్పని నిరూపితమైందని డీన్ జోన్స్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.